RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

17, జూన్ 2025, మంగళవారం

తొలి వలపే తియ్యనిదీ | Tolivalape Tiyyanidi | Song Lyrics | Needaleni Adadi (1974)

తొలి వలపే తియ్యనిదీ



చిత్రం: నీడలేని ఆడది (1974)

సంగీతం: సత్యం

గీతరచయిత :  సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం: బాలు, సుశీల


పల్లవి:


తొలి వలపే..తొలి వలపే

తియ్యనిదీ ...తియ్యనిదీ


మదిలో ఎన్నడు మాయనిది

తొలి వలపే... తియ్యనిదీ...

మదిలో... ఎన్నడు మాయనిది

నీ కొరకే దాచినదీ...

వేరెవరూ దోచనిదీ

తొలి వలపే... తియ్యనిదీ

మదిలో... ఎన్నడు మాయనిది


చరణం 1:


పొగరు సొగసు గల చిన్నది...

బిగి కౌగిలిలో ఒదిగున్నది...

పొగరు...సొగసు గల చిన్నది...

బిగి కౌగిలిలో ఒదిగున్నది..

ఈ విసురూ ఎక్కడిది...

నీ జతలోనే నేర్చినది


తొలివలపే తియ్యనిదీ...

మదిలో ఎన్నడు మాయనిది


చరణం 2:


కనులూ కలలూ కలబోయని...

నీలో సగమై పెనవేయనీ

కనులూ కలలూ కలబోయనీ...

నీలో సగమై పెనవేయనీ

కలకాలం ఈ ప్రణయం...

నిలవాలి మనకోసం


తొలి వలపే తియ్యనిదీ...

మదిలో ఎన్నడు మాయనిది..


- పాటల ధనుస్సు 


14, జూన్ 2025, శనివారం

గోదారికి ఏ ఒడ్డైనా నీరు ఒక్కటే | Godariki Ye oddaina | Song Lyrics | Mana Oori Katha (1976)

గోదారికి ఏ ఒడ్డైనా నీరు ఒక్కటే



చిత్రం :  మన ఊరి కథ (1976)

సంగీతం :  జె.వి. రాఘవులు

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  బాలు, సుశీల 


పల్లవి :


గోదారికి ఏ ఒడ్డైనా...  నీరు ఒక్కటే

గోదారికి ఏ ఒడ్డైనా...  నీరు ఒక్కటే

కుర్రదానికి ఏ వైఫైనా...  అందమొక్కటే

గోదారికి ఏ ఒడ్డైనా...  నీరు ఒక్కటే


కొంగులు రెండూ వేరైనా...  కోక ఒక్కటే

కొంగులు రెండూ వేరైనా...  కోక ఒక్కటే

ఈ కుర్రడికి ఏ పొద్ధూ కోరికోక్కటే

గోదారికి ఏ ఒడ్డైనా....  నీరు ఒక్కటే  


చరణం 1 :


పడవెంత చిన్నదైనా గెడవేసి నడపాలి.. 

పడుచెంత సొ౦తమైనా ముడివేసి అడగాలి

పడవెంత చిన్నదైనా గెడవేసి నడపాలి.. 

పడుచెంత సొ౦తమైనా ముడివేసి అడగాలి


గాలి చూసి వాలు చూసి తెరచాప ఎత్తాలి

గాలి చూసి వాలు చూసి తెరచాప ఎత్తాలి

ఎంత వీలైన వేళైనా తెరచాటు ఉండాలీ


గోదారికి ఏ ఒడ్డైనా నీరు ఒక్కటే


చరణం 2 :


పోటోచ్చిన ఏటికి ఎత్తుపల్ల మొక్కటే

పొంగోచ్చిన వయసుకు పగలు రేయి ఒక్కటే


పగలు రేయి కలుసుకునే హద్దు ఒక్కటే

పలుకరాని పెదవులకి ముద్దు ఒక్కటే 


గోదారికి ఏ ఒడ్డైనా...  నీరు ఒక్కటే

కొంగులు రెండూ వేరైనా...  కోక ఒక్కటే

కొంగులు రెండూ వేరైనా...  కోక ఒక్కటే

ఈ కుర్రడికి ఏ పొద్ధూ...  కోరికోక్కటే


గోదారికి ఏ ఒడ్డైనా...  నీరు ఒక్కటే


- పాటల ధనుస్సు 


వచ్చిందీ కొత్త పెళ్లికూతురు | Vachindi Kotha Pellikuturu | Song Lyrics | Mana Oori Katha (1976)

వచ్చిందీ కొత్త పెళ్లికూతురు



చిత్రం :  మన ఊరి కథ (1976)

సంగీతం :  జె.వి. రాఘవులు

గీతరచయిత :  మైలవరపు గోపి

నేపధ్య గానం :  బాలు, సుశీల 


పల్లవి :


వచ్చిందీ కొత్త పెళ్లికూతురు.. 

మనసుకు తెచ్చింది.. 

కొండంత వెలుతురు

అహ.. హా.. ఆ.. హా.. ఆ..

వచ్చిందీ కొత్త పెళ్లికూతురు.. 

మనసుకు తెచ్చింది.. 

కొండంత వెలుతురు


చరణం 1 :


అహ.. హా.. ఆ.. హా.. ఆ.. ఓహోహో... 

లలలలలాల... లలలలలాల

నడయాడే వెన్నెలలా.. ఆ.. 

చిరుగాలి తెమ్మెరలా.. ఆ

నడయాడే వెన్నెలలా.. 

చిరుగాలి తెమ్మెరలా

ఎలమావి లే చిగురులా.. 

సొగసు విరిబోణిలా 

నిండు తరవాణిలా     

 

వచ్చిందీ కొత్త పెళ్లికూతురు.. 

మనసుకు తెచ్చింది...  

కొండంత వెలుతురు


చరణం 2 :


అహ.. హా.. ఆ.. హా.. ఆ.. ఓహోహో... 

లలలలలాల... లలలలలాల

పరువాలా మిసమిసలు... ఆ..  

చిరునవ్వు దొ౦తరలు.. ఆ..

పరువాలా మిసమిసలు..  

చిరునవ్వు దొ౦తరలు

నడిచేను రాయంచలా.. 

ముద్ద చామంతిలా...  

ముద్దు పూబంతిలా


 వచ్చిందీ కొత్త పెళ్లికూతురు.. 

మనసుకు తెచ్చింది 

కొండంత వెలుతురు


- పాటల ధనుస్సు 


ముక్కుపుడక పెట్టుకో మహలక్ష్మిలా | Mukkupudaka Pettuko | Song Lyrics | Palnati Simham (1985)

ముక్కుపుడక పెట్టుకో మహలక్ష్మిలా



చిత్రం:  పల్నాటి సింహం (1985)

సంగీతం:  చక్రవర్తి

గీతరచయిత:  వేటూరి

నేపధ్య గానం:  బాలు, సుశీల


పల్లవి:


ముక్కుపుడక పెట్టుకో మహలక్ష్మిలా

సిగను పూలు పెట్టుకో శ్రీలక్ష్మిలా

కౌగిలింత.. హుష్..

కౌగిలింత చేరుకో కల్యాణిలా

రేతిరంత మేలుకో రేరాణిలా

ఎన్నడు రాని ఈ మల్లెల రాతిరి హాయిగా


ముక్కుపుడక ఎందుకు మనసుండగా

సిగను పువ్వులెందుకు సొగసుండగా

కౌగిలింతలివ్వనా కట్నాలుగా

పరువమంత పరవనా తొలి పాన్పుగా

ఎన్నడు రాని ఈ మల్లెల రాతిరి హాయిగా


చరణం 1:


మొదటి రాతిరి సిగ్గు మొగలి పువ్వట

గుచ్చుకుంటుంది మొగ్గ విచ్చుకుంటుదట

మోజు ఉండి చెప్పలేని మోమాటం

గాజులున్న చేతికేమో చెలగాటం


కన్నెపిల్ల కాపురానా 

కౌగిలింతతోనె కాలు పెడుతుంటే

సిగ్గుతల్లి ఎర్రముగ్గు 

చీకటింటిలోనె చెరిగిపోతుంటే

ఆపాలు తాపాలు మురిపాలు సలపాలి


ముక్కుపుడక ఎందుకు మనసుండగా

సిగను పువ్వులెందుకు సొగసుండగా


చరణం 2:


చెంప గిల్లితే లేత చందమామలు

చెమ్మ గిల్లితే కొత్త వలపు తేమలు

పువ్వులన్ని అత్తరైన పులకింత

కంటి చూపు కబురులేని కవ్వింత


తెల్లవారి అమ్మగారు 

ఏమి ఎరగనట్టు నన్ను చూస్తుంటే

తెల్లవార్లు జరుపుకున్న 

తేనె విందు తలచి నవ్వులొస్తుంటే

ప్రతి రేయీ మనకింకా తొలిరేయి కావాలి


ముక్కుపుడక పెట్తుకో మహలక్ష్మిలా

సిగను పూలు పెట్టుకో శ్రీలక్ష్మిలా

కౌగిలింతలివ్వనా కట్నాలుగా

పరువమంత పరవనా తొలి పాంపుగా

ఎన్నడు రాని ఈ మల్లెల రాతిరి హాయిగా


ఊహుహుహు హుహు ఊహూహుహూ...


- పాటల ధనుస్సు 


ఈ కుంకుమతో ఈ గాజులతో | Ee Kumkumatho Ee Gajulatho | Song Lyrics | Palnati Simham (1985)

ఈ కుంకుమతో ఈ గాజులతో



చిత్రం :  పల్నాటి సింహం (1985)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి :


ఈ కుంకుమతో.. ఈ గాజులతో.. 

కడతేరిపోనీ స్వామీ..

కనుమూయనీ నన్ను స్వామీ...

ఓ...చెన్నకేశవా.. పసుపు కుంకుమ

జంట కలిశాయి దీవించరా... 

జంట కలిశాయి దీవించరా...

 

చరణం 1 :


పల్నాటి సీమంతా 

పండు మిరప చేలు

పసుపు కుంకాలిచ్చి 

సీమంతాలాడేను

మాంచాల మాదేవి 

మాంగళ్యం మాదేను

పేదైన మగసిరుల 

పేరంటాలాడేను


పౌరుషమున్న బ్రతుకులలోన 

పాశం కన్నా దేశం మిన్న

బ్రతికే ఉన్నా చితిలో ఉన్నా 

అశువులకన్నా పసుపే మిన్న

పచ్చని సీమ పల్నాడంతా 

వైకుంఠమై వెలిగే వేళ

 

ఈ కుంకుమతో... ఈ గాజులతో... 

కడతేరిపోనీ స్వామీ..

 

చరణం 2 :


ఏడడుగులు నడిచాను 

ఏనాడో మీ తోడు

ఏడేడు జన్మలకి 

అవుతాను మీతోడు

జననాలు మరణాలు 

కాలేవు ఎడబాటు

నిండు ముత్తైదువుగా 

ఎదురొచ్చి దీవించు


ఆలిగా నేను అంతిమ జ్వాల 

హారతి పడితే అంతే చాలు

జ్వాలలు కూడా పావనమయ్యే 

జ్యోతివి నువ్వు జోతలు నీకు

మళ్ళీ జన్మ మనకే ఉంటే 

పల్నాటిలోనే పుడుదామంట


ఈ కుంకుమతో... ఈ గాజులతో... 

కడతేరిపోనీ స్వామీ..

కనుమూయనీ నన్ను స్వామీ...


- పాటల ధనుస్సు 


అల్లిబిల్లి అందమంతా | Allibilli Andamantha | Song Lyrics | Bhogi Mantalu (1981)

అల్లిబిల్లి అందమంతా



చిత్రం  :  భోగి మంటలు (1981)

సంగీతం  : రమేశ్ నాయుడు

గీతరచయిత  : వేటూరి

నేపథ్య గానం :  బాలు, శైలజ


పల్లవి :


అల్లిబిల్లి అందమంతా.. 

అల్లుకుంటే సొంతమంటా..

కల్లబొల్లి మాటలంటే.. 

హా.. హా.. హా.. హా..రపప.. పా..

కల్లబొల్లి మాటలంటే...  

ఒల్లనంటా.. వెళ్ళమంటా

హా.. హా.... హా...


అల్లిబిల్లి అందమంతా.. 

అల్లుకుంటే అల్లుడంట

మళ్ళీ మళ్ళీ అందమంటా...

హా.. హా.. హా.. హా..పప.. పా..

మళ్ళీ మళ్ళీ అందమంటా.. 

అందకుంటే.. గిల్లుడంట

ఉమ్మ్. ఉమ్... ఉమ్.. ఉమ్... ఉమ్


చరణం 1 :


చుక్కదీపమెట్టుకున్నాక.. 

దిక్కులన్నీ ఒక్కటయ్యాక..

హే.. హే.. లలలాలాలాలా...

చుక్కదీపమెట్టుకున్నాక.. 

దిక్కులన్నీ ఒక్కటయ్యాక..

ఈ రేయి విందులో.. 

ఆరెయ్యి అందమే...

వెయ్యకుంటే ఒట్టంటా.. 

ఒట్టెయ్యకుంటే ఒట్టంట..


హా.. ఆ..

చందమామ నిద్దరోయాక.. 

సందడంత సద్దుమణిగాక..


చందమామ నిద్దరోయాక.. హాహహా.. 

సందడంత సద్దుమణిగాక..

నచ్చేటివాడితో.. మెచ్చేటి మాటుంది

ఇచ్చినంత ఒట్టంట.. 

ముద్దిచ్చినత ఒట్టంట


అల్లిబిల్లి అందమంతా.. 

అల్లుకుంటే అల్లుడంట

కల్లబొల్లి మాటలంటే.. 

హా.. హా.. రురురురు..

కల్లబొల్లి మాటలంటే...  

ఒల్లనంటా.. వెళ్ళమంటా

హా.. హా.... హా...


చరణం 2 :


అందినంత పుచ్చుకున్నాక... 

అల్లరంత చల్లబడ్డాక

హేహే..జుజుజుజుజు..

అందినత పుచ్చుకున్నాక... 

అల్లరంత చల్లబడ్డాక

ఈ నాటి కౌగిలీ...ఈ.. ఈ.. 

ఈ రాత్రి  జాబిలి..

వదులుకో వద్దంట.. 

నన్నొదులుకో వద్దంట


హ.. ఆ.. అందమంత ఆవిరయ్యాక...  

పిండమబ్బుచిందులయ్యాక... 

హేహేహే.. రరరరరర

అందమంత ఆవిరయ్యాక... 

హహహహా...  

పిండమబ్బుచిందులయ్యాక

వరదంటి వయసుని... 

సరదాల సొగసుని

వలపుగా ఇమ్మంట.. 

నీ వలపుగా ఇమ్మంట


అల్లిబిల్లి అందమంతా.. 

అల్లుకుంటే సొంతమంటా..

మళ్ళీ మళ్ళీ అందమంటా...

హా.. హా.. హా.. హా..పప.. పా..

మళ్ళీ మళ్ళీ అందమంటా.. 

అందకుంటే.. గిల్లుడంట

ఉమ్మ్. ఉమ్... ఉమ్.. ఉమ్... ఉమ్  


- పాటల ధనుస్సు 


అరవైలో ఇరవై వచ్చింది | Aravailo Iravai Vachindi | Song Lyrics | Bhogi Mantalu (1981)

అరవైలో ఇరవై వచ్చింది



చిత్రం  :  భోగి మంటలు (1981)

సంగీతం  : రమేశ్ నాయుడు

గీతరచయిత  : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  బాలు, వాణీ జయరాం 


పల్లవి :


అరవైలో ఇరవై వచ్చింది..

మా అమ్మానాన్నకు 

మళ్ళీ ఒక వసంతమొచ్చింది


అరవైలో ఇరవై వచ్చింది..

మా అమ్మానాన్నకు 

మళ్ళీ ఒక వసంతమొచ్చింది


అరవైలో ఇరవై వచ్చింది..

మా అత్తామామకు 

మళ్ళీ ఒక వసంతమొచ్చింది


అరవైలో ఇరవై వచ్చింది..

మా అత్తామామకు 

మళ్ళీ ఒక వసంతమొచ్చింది


చరణం 1 :


పెళ్ళికూతురుగ చేస్తుంటే 

మళ్ళీ అప్పటి సిగ్గొచ్చింది

పెళ్ళికూతురుగ చేస్తుంటే 

మళ్ళీ అప్పటి సిగ్గొచ్చింది


పెళ్ళి కాని ఈనాటి పిల్లలకు 

ఆడతనం నేర్పింది

పెళ్ళి కాని ఈనాటి పిల్లలకు 

ఆడతనం నేర్పింది


నెరిసీనెరవని మీసాల్లో 

మెరిసే ముసిముసినవ్వులలో

నెరిసీనెరవని మీసాల్లో 

మెరిసే ముసిముసినవ్వులలో


పెళ్ళికొడుకు ఎంత అల్లరివాడో....

పెళ్ళికొడుకు ఎంత అల్లరివాడో.... 

ఇప్పుడే మాకు తెలిసింది

పెళ్ళికొడుకు ఎంత అల్లరివాడో.... 

ఇప్పుడే మాకు తెలిసింది


అరవైలో ఇరవై వచ్చింది..

మా అమ్మానాన్నకు 

మళ్ళీ ఒక వసంతమొచ్చింది


అరవైలో ఇరవై వచ్చింది..

మా అత్తామామకు 

మళ్ళీ ఒక వసంతమొచ్చింది


చరణం 2 :


మనసులు మమతలు 

మారని వాళ్ళే దేవుళ్ళు

మనసులు మమతలు 

మారని వాళ్ళే దేవుళ్ళు

మనకగపడుతున్న దేవుళ్ళే 

అమ్మానాన్నలూ


ఆ దేవుళ్ళకు చేసే పెళ్ళే 

మనకూ దీవెనలూ...

ఆ దేవుళ్ళకు చేసే పెళ్ళే 

మనకూ దీవెనలూ...

ఆ దీవెనలే మన కోరికలైతే 

వీళ్లకు నూరేళ్లు... వీళ్లకు నూరేళ్లు


అరవైలో ఇరవై వచ్చింది..

మా అత్తామామకు 

మళ్ళీ ఒక వసంతమొచ్చింది


అరవైలో ఇరవై వచ్చింది..

మా అమ్మానాన్నకు 

మళ్ళీ ఒక వసంతమొచ్చింది


చరణం 3 :


ఆనాటి శ్రీరఘురాముడే... 

ఈనాటి పట్టాభిరాముడు

జనకుడు లేని కల్యాణాన్నే 

కొడుకులు కలిసి చేస్తున్నారు


చక్కగ గంధం అలగండి... 

చల్లని పన్నీరు చిలకండి

చక్కగ గంధం అలగండి... 

చల్లని పన్నీరు చిలకండి

తాళిని కట్టే వేళయ్యింది.. 

గట్టి మేళం మ్రోగించండి

గట్టి మేళం మ్రోగించండి....


సీతామ్మ పెళ్లికూతురాయనే.. 

మన రామయ్య పెళ్ళికొడుకాయనే

సీతామ్మ పెళ్లికూతురాయనే.. 

మన రామయ్య పెళ్ళికొడుకాయనే


- పాటల ధనుస్సు 


భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో | Bhogullo Bhogullo | Song Lyrics | Bhogi Mantalu (1981)

భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో



చిత్రం  :  భోగి మంటలు (1981)

సంగీతం  : రమేశ్ నాయుడు

గీతరచయిత  : వేటూరి

నేపధ్య గానం :  బాలు,సుశీల


పల్లవి :


భోగుల్లో భోగుల్లో.. 

భోగభాగ్యాల భోగుల్లో

భోగిమంటల.. భోగుల్లో

తెల్లారకుండానె..

పల్లెపల్లంతాను 

ఎర్రని కాంతుల..భోగుల్లో

తెల్లారకుండానె..

పల్లెపల్లంతాను 

ఎర్రని కాంతుల..భోగుల్లో


భోగుల్లో భోగుల్లో..

భోగభాగ్యాల భోగుల్లో

భోగిమంటల..భోగుల్లో

తెల్లారకుండానె..

పల్లెపల్లంతాను 

ఎర్రని కాంతుల..భోగుల్లో


చరణం 1 :


గొబ్బియల్లో గొబ్బియల్లో.. 

గొబ్బెమ్మ కొప్పున గుమ్మడిపూలు

గొబ్బియల్లో గొబ్బియల్లో.. 

గొబ్బెమ్మ కొప్పున గుమ్మడిపూలు 


గుమ్మడంటే గుమ్మడు..

మాయదారి గుమ్మడు

కొప్పులో పూలెట్టి..

తుప్పర్లోకి లాగాడు  


గొబ్బియల్లో గొబ్బియల్లో..

గొబ్బెమ్మ కొప్పున గుమ్మడిపూలు 


కుప్పల్లో ఇల్లున్న 

అల్లుణ్ణే.. కొప్పమ్మ

అత్తింటి కెళదాము 

రమ్మంటే.. తప్పమ్మా?


తప్పొప్పులిప్పుడే.. 

తలబోసుకొందామా

తలలంటుకొన్నాక.. 

కలబోసుకొందామా


గొబ్బియల్లో గొబ్బియల్లో.. 

గొబ్బెమ్మ కొప్పున గుమ్మడిపూలు 


భోగుల్లో భోగుల్లో.. 

భోగభాగ్యాల భోగుల్లో

భోగిమంటల.. భోగుల్లో


తెల్లారకుండానె..

పల్లెపల్లంతాను 

ఎర్రని కాంతుల..భోగుల్లో

తెల్లారకుండానె..

పల్లెపల్లంతాను 

ఎర్రని కాంతుల..భోగుల్లో


చరణం 2 :


హరిలోరంగ హరి..హరిలోరంగ హరి

హరిలోరంగ హరి..హరిలోరంగ హరి

హరిలోరంగ హరి..హరిలోరంగ హరి

హరిలోరంగ హరి..హరిలోరంగ.. 

హరి కోసమైతే.. తపస్సులు.. హరి హరీ

హరిదాసుకైతే.. కాసులు.. హరి హరీ

దాసుని తప్పులు దండంతో సరి..ఈ..

హరిలోరంగ హరి..హరిలోరంగ హరి

హరిలోరంగ హరి..హరిలోరంగ.. ..మ్మ్ 


సరిలో రంగ సరి.. సరిలో రంగ సరి

సరిలో రంగ సరి.. సరిలో రంగ సరి

దండం అంటే రెండర్థాలు..

చేతులు రెండు కలిపేదొకటి.. 

వాతలు నిండుగ వేసేదొకటి

యేయ్..చేతులు రెండు కలిపేదొకటి.. 

వాతలు నిండుగ వేసేదొకటి


సరిలో రంగ సరి.. సరిలో రంగ సరి

సరిలో రంగ సరి.. సరిలో రంగ సరి

సరా హరా.. సరా హరా..

మ్మ్..హు..సరి సరీ

హరిలోరంగ హరీ..


భోగుల్లో భోగుల్లో.. 

భోగభాగ్యాల భోగుల్లో

భోగిమంటల.. భోగుల్లో


తెల్లారకుండానె..

పల్లెపల్లంతాను 

ఎర్రని కాంతుల..భోగుల్లో

తెల్లారకుండానె..

పల్లెపల్లంతాను 

ఎర్రని కాంతుల..భోగుల్లో


చరణం 3 :  


బావలవీపుల తప్పెట్లోయ్.. 

కాగిన కొద్ది చప్పట్లోయ్

బావలవీపుల తప్పెట్లోయ్.. 

కాగిన కొద్ది చప్పట్లోయ్

అవి మోగిన కొద్ది ముచ్చట్లోయ్.. 

మోగిన కొద్ది ముచ్చట్లోయ్


మరదళ్ళు బుగ్గలు బొబ్బట్లోయ్..

కొరికినకొద్ది దిబ్బట్లోయ్

హోయ్..మరదళ్ళు 

బుగ్గలు బొబ్బట్లోయ్..

కొరికినకొద్ది దిబ్బట్లోయ్

అవి దొరికేదాకా ఇక్కట్లోయ్..

దిబ్బట్లోయ్..బొబ్బట్లోయ్


భోగుల్లో భోగుల్లో..

భోగభాగ్యాల భోగుల్లో

భోగిమంటల..భోగుల్లో

తెల్లారకుండానె..

పల్లెపల్లంతాను 

ఎర్రని కాంతుల..భోగుల్లో

తెల్లారకుండానె..

పల్లెపల్లంతాను 

ఎర్రని కాంతుల..భోగుల్లో


- పాటల ధనుస్సు 


ఓ బాటసారి ఇది జీవిత రహదారి | O Batasari Idi Jeevitha Rahadari | Song Lyrics | Illalu (1981)

ఓ బాటసారి ఇది జీవిత రహదారి



చిత్రం :  ఇల్లాలు (1981)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత  : ఆచార్య ఆత్రేయ,

నేపధ్య గానం  : కె.జె.యేసుదాస్, ఎస్ పి శైలజ 


పల్లవి :


ఓ బాటసారి...ఇది జీవిత రహదారి

ఓ బాటసారి...ఇది జీవిత రహదారి 


ఎంత దూరమో... ఏది అంతమో

ఎవరు ఎరుగని దారి ఇది

ఒకరికె సొంతం కాదు ఇది 


ఓ బాటసారి... ఇది జీవిత రహదారి..


చరణం 1 :


ఎవరు ఎవరికి తోడౌతారో.... 

ఎప్పుడెందుకు విడిపోతారో

మమతను కాదని వెళతారో... 

మనసే చాలని ఉంటారు

ఎవ్వరి పయనం ఎందాకో...

అడగదు ఎవ్వరిని... 

బదులే దొరకదని

అడగదు ఎవ్వరిని... 

బదులే దొరకదని


చరణం 2 :


కడుపుతీపికి రుజువేముందీ... 

అంతకు మించిన నిజమేముందీ...

కాయే చెట్టుకు బరువైతే.... 

చెట్టును భూమి మోస్తుందా..

ఇప్పుడు తప్పులు తెలుసుకొనీ... 

జరిగేదేమిటనీ..క్షమించదెవ్వరినీ


చరణం 3 :


తెంచుకుంటివి అనుబంధాన్ని... 

పెంచుకున్నదొక హృదయం దాన్ని..

అమ్మలిద్దరు వుంటారని 

అనుకోలేని పసివాడ్ని

బలవంతాన తెచ్చుకొని... 

తల్లివి కాగలవా? ... 

తనయుడు కాగలడా?


చరణం 4 :


అడ్డ దారిలో వచ్చావమ్మా... 

అనుకోకుండా కలిసావమ్మ

నెత్తురు పంచి ఇచ్చావూ... 

నిప్పును నీవే మింగావూ

ఆడదాని ఐశ్వర్యమేమిటో...

ఇప్పుడు తెలిసింది..

కథ ముగిసేపొయింది

ఇప్పుడు తెలిసింది..

కథ ముగిసేపొయింది 


ఓ..బాటసారీ ఇది జీవిత రహదారీ


- పాటల ధనుస్సు 


నీరెండ దీపాలు నీ కళ్ళలో | Neerenda Deepalu | Song Lyrics | Illalu (1981)

నీరెండ దీపాలు నీ కళ్ళలో



చిత్రం : ఇల్లాలు (1981)

సంగీతం : చక్రవర్తి

గీతరచయిత :వేటూరి

నేపథ్య గానం : బాలు, సుశీల


పల్లవి :


నీరెండ దీపాలు నీ కళ్ళలో...

నా నీడ చూసాను ఎన్నాళ్ళకో....

ఈ కొండకోనల్ల వాకిళ్ళలో.... 

నీదాననైనాను కౌగిళ్ళలో.... 


నీరెండ దీపాలు నీ కళ్ళలో....

నా నీడ చూసాను ఎన్నాళ్ళకో... 


చరణం 1 :


ఈ సంధ్య వెలుగుల్లో నారింజ రంగుల్లో

ఈ సంధ్య వెలుగుల్లో నారింజ రంగుల్లో

నీ అందచందాలు మందారమై

నీ రాగభావాలు శృంగారమై


ఈ కొండగాలుల్లో నా గుండె ఊసుల్లో

నీ మాట అనురాగ సంగీతమై

నీ చూపు ప్రణయాల పేరంటమై

పొద్దెరగని ముద్దులలో 

ముద్దగ తడిసేవేళ


నీరెండ దీపాలు నీ కళ్ళలో.... 

నా నీడ చూసాను ఎన్నాళ్ళకో... 


చరణం 2 :


నా ఆశలీనాడు ఆకాశమే చేరి

నా ఆశలీనాడు ఆకాశమే చేరి

మెరిసేను తారల్ల మణిహారమై

విరిసేను జాబిల్లి మనతీరమై


అందాల హరివిల్లు పొదరిల్లుగా మారి

వరిచేను విరిపానుపు మనకోసమై

కరగాలి జతగూడి మనమేకమై

ముద్దులలో నెలబాలుడి 

నిద్దురపోయిన వేళ


నీరెండ దీపాలు నీ కళ్ళలో.... 

నా నీడ చూసాను ఎన్నాళ్ళకో... 


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు