RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

1, అక్టోబర్ 2025, బుధవారం

ఉన్నదిలే దాగున్నదిలే | Unnadile Dagunnadile | Song Lyrics | Rahashyam (1967)

ఉన్నదిలే దాగున్నదిలే



చిత్రం : రహస్యం (1967)

సంగీతం : ఘంటసాల

గీతరచయిత : మల్లాది రామకృష్ణ శాస్త్రి 

నేపధ్య గానం : ఘంటసాల,  సుశీల


పల్లవి :


ఉన్నదిలే... దాగున్నదిలే...

నీ కన్నుల ఏదో ఉన్నదిలే...

అది నన్నే కోరుతున్నదిలే

ఈ వెన్నెలలో సై అన్నదిలే


ఉన్నదిలే... దాగున్నదిలే

నీ కన్నుల ఏదో ఉన్నదిలే...

అది నన్నే కోరుతున్నదిలే

ఈ వెన్నెలలో సై అన్నదిలే


చరణం 1 :


కన్నెపూల వన్నెలేవో... 

కన్ను గీటుతున్నవీ

కన్నెపూల వన్నెలేవో ... 

కన్ను గీటు తున్నవి

మేనిలోన ఊహలేవో... 

వీణ మీటుచున్నవి...

వీణ మీటుచున్నవి

 

ఉన్నదిలే ... దాగున్నదిలే...

నీ కన్నుల ఏదో ఉన్నదిలే... 

అది నన్నే కోరుతున్నదిలే

ఈ వెన్నెలలో  సై  అన్నదిలే


చరణం 2 :


గుండెలోన కోరికలేవో...

దండలల్లుకున్నవి...ఈ...ఈ..

గుండెలోన కోరికలేవో...

దండలల్లుకున్నవి...

అందరాని పోంగులేవో..

తొందరించుచున్నవి

..తొందరించుచున్నవి


ఉన్నదిలే... దాగున్నదిలే...

నీ కన్నుల ఏదో ఉన్నదిలే... 

అది నన్నే కోరుతున్నదిలే

ఈ వెన్నెలలో సై అన్నదిలే


చరణం 3 :


ఇన్నినాళ్ళ పుణ్యమంతా ... 

ఎదుటనిలిచి ఉన్నది

ఇన్నినాళ్ళ పుణ్యమంతా ... 

ఎదుటనిలిచి ఉన్నది

యుగయుగాల ప్రేమగాధ... 

చిగురువేయుచున్నది...

చిగురువేయుచున్నది...


ఉన్నదిలే... దాగున్నదిలే...

నీ కన్నుల ఏదో ఉన్నదిలే... 

అది నన్నే కోరుతున్నదిలే

ఈ వెన్నెలలో సై అన్నదిలే...


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చక్కని చుక్క సరసకు రావే | Chakkani Chukka | Song Lyrics | Iddaru Mitrulu (1961)

చక్కని చుక్క సరసకు రావే చిత్రం: ఇద్దరు మిత్రులు (1961) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: ఆరుద్ర నేపధ్య గానం: పి. బి. శ్రీనివాస్, సుశీల పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు