ఈశా.. మహేశా
చిత్రం : మల్లమ్మ కథ (1973)
సంగీతం : ఎస్. పి. కోదండపాణి
గీతరచయిత : వీటూరి
నేపధ్య గానం : పి. సుశీల
పల్లవి :
ఈశా.. మహేశా..
ఈశా.. మహేశా..
అమ్మను ఒకసారి చూపరాదా
రమ్మని నీవైనా చెప్పరాదా...
పాపను నాపైన జాలిలేదా
ఈశా.. మహేశా..
అమ్మను ఒకసారి చూపరాదా
రమ్మని నీవైనా చెప్పరాదా..
పాపను నాపైన జాలిలేదా
చరణం 1:
అమ్మపాలు తాగలేదూ..
అమ్మ ఒడిని ఊగలేదూ
అమ్మపాలు తాగలేదూ..
అమ్మ ఒడిని ఊగలేదూ
కమ్మనైన అమ్మ మాట
కలనైనా వినలేదూ
కమ్మనైన అమ్మ మాట
కలనైనా వినలేదూ.. అమ్మా...
అమ్మా అమ్మా అని...
ఏంత పిలిచినా రాదూ
ఈశా.. మహేశా..
అమ్మను ఒకసారి చూపరాదా
రమ్మని నీవైనా చెప్పరాదా..
పాపను నాపైన జాలిలేదా
చరణం 2 :
ప్రతి పువ్వుకు రెమ్మఉందీ..
అందరికి అమ్మ వుందీ
ప్రతి పువ్వుకు రెమ్మఉందీ..
అందరికి అమ్మ వుందీ
మురిపాలను తేలడా...
ముద్దు గణపతీ
కొమరయ్యను లాలించగ..
తల్లి పార్వతీ
లేగ పిలుపు వినగానే...
గోమాత ఆగునా?
కన్నబిడ్డగోడు వినీ
తల్లి మనసు దాగునా
ఏ పాపం చేశానని...
ఈ లోపం చేశావూ
ఈశా.. ఈశా.. మహేశా.. మహేశా..
ఈశా.. మహేశా..
- పాటల ధనుస్సు

 
 
 
 
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి