RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

28, ఫిబ్రవరి 2025, శుక్రవారం

ఎప్పుడూ మీ పాఠాలంటే | Eppudu mee pathalante | Song Lyrics | Amma Maata (1972)

ఎప్పుడూ మీ పాఠాలంటే



చిత్రం :  అమ్మ మాట (1972)

సంగీతం :  రమేశ్ నాయుడు

గీతరచయిత :  సి నారాయణ రెడ్డి  

నేపథ్య గానం :  సుశీల


పల్లవి:


సర్..సర్..సార్..


ఎప్పుడూ మీ పాఠాలంటే.. 

ఎలాగండి సార్

ఈరోజు నే చెపుతాను.. 

హియర్ మీ డియర్ సార్


చరణం 1:


ఒకటీ ఒకటీ కలిపితే రెండు..

అది గణితం

మనసూ మనసూ కూడితే..ఒకటే... 

ఇది జీవితం

గిరిగీసుకొని ఉండాలంటాయిగ్రంథాలు..

గిరిగీసుకొని ఉండాలంటాయి గ్రంథాలు..

పురివిప్పుకొని ఎగరాలంటాయి అందాలు...


ఎప్పుడూ మీ పాఠాలంటే.. 

ఎలాగండి సార్

ఈరోజు నే చెపుతాను.. 

హియర్ మీ డియర్ సార్


చరణం 2:


కళ్ళల్లో చూడండీ.. 

కనిపించును నీలాలు

పెదవుల్లో చూడండీ.. 

అగుపించును పగడాలు

దోసిలినిండా దొరుకుతాయి.. 

దోరనవ్వుల ముత్యాలు

కన్నెమేనిలో.. ఉన్నాయి..

కన్నెమేనిలో.. ఉన్నాయి

ఏ గనిలో దొరకని రతనాలు..మ్మ్..


ఎప్పుడూ మీ పాఠాలంటే..

ఎలాగండి సార్

ఈరోజు నే చెపుతాను..

హియర్ మీ డియర్ సార్


చరణం 3:


రాధా మాధవ రాగజీవనం.. 

ఒక బంధం

కలువా జాబిలి వింతకలయికే.. 

అనుబంధం

యుగయుగాలకూ మిగిలేదొకటే.. 

అనురాగం

యుగయుగాలకూ మిగిలేదొకటే.. 

అనురాగం

చెలి మనసెరిగిన చినవానిదేలే.. 

ఆనందం


ఎప్పుడూ మీ పాఠాలంటే..

ఎలాగండి సార్

ఈ రోజు నే చెపుతాను..

హియర్ మీ డియర్ సార్


- పాటల ధనుస్సు 


మాయదారి సిన్నోడు | Mayadari Sinnodu | Song Lyrics | Amma Maata (1972)

మాయదారి సిన్నోడు



చిత్రం:  అమ్మ మాట (1972)

సంగీతం:  రమేశ్ నాయుడు

గీతరచయిత:  సి నారాయణ రెడ్డి  

నేపథ్య గానం:  ఎల్.ఆర్. ఈశ్వరి


పల్లవి:


మాయదారి సిన్నోడు 

మనసేలాగేసిండు

నా మనసే లాగేసిండు.. 

లగ్గమెప్పుడురా.. మాఁవా .. అంటే

మాఘమాసం ఎల్లేదాకా 

మంచిరోజు లేదన్నాడే


ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా

ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా

కాఁవమ్మ సెప్పవే..  రాఁవమ్మ సెప్పవే

రత్తమ్మ సెప్పవే..  అత్తమ్మ సెప్పవే

ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా


మాయదారి సిన్నోడు 

మనసే లాగేసిండు

మాయదారి సిన్నోడు 

నా మనసే లాగేసిండు

మాఘమాసం ఎల్లేదాకా 

మంచిరోజు లేదన్నాడే

ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా


చరణం 1:


సింతసెట్టెక్కీ సిగురులు కోస్తుంటే..

సిట్టి సిట్టి గాజుల్లో తాళం ఏస్తుంటే..

సింతసెట్టెక్కీ సిగురులు కోస్తుంటే..

సిట్టి సిట్టి గాజుల్లో తాళం ఏస్తుంటే..


సిగరుల్లో..  సిగురుల్లో..

సిగురుల్లో.. మాటేసి కన్నుగీటిండే

జివ్వున పానాలు తోడేసిండే..

ఎప్పుడ్రా మాఁవా అంటే..

సంకురాతిరి పొయ్యేదాకా.. 

మంచి గడియే లేదన్నాడే...


ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా

ఎల్లమ్మ సెప్పవే.. మల్లమ్మ సెప్పవే

పుల్లమ్మ సెప్పవే.. బుల్లెమ్మ సెప్పవే

ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా..


చరణం 2:


ఊరి సెరువులో నే నీదులాడుతుంటే

నీటి నురుగుల్లో తేలి తేలి పోతుంటే

ఊరి సెరువులో నేనీదులాడుతుంటే

నీటి నురుగుల్లో తేలి తేలి పోతుంటే...


బుడుంగున...  బుడుంగున

బుడుంగున మీదికి తేలిండే

నా తడికొంగు పట్టుకుని లాగిండే...

ఎప్పుడురా మాఁవా అంటే...

శివరాతిరి ఎల్లేదాకా 

సుబలగ్గం లేదన్నాడే...


ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా

పున్నమ్మ సెప్పవే.. గున్నమ్మ సెప్పవే

కన్నమ్మ సెప్పవే.. సిన్నమ్మ సెప్పవే

ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా


చరణం 3:


కందిసేలల్లో కావలి కాసేసి

సందెకాడ ఒంటరిగా 

డొంకదారినొస్తుంటే

కందిసేలల్లో కావలి కాసేసి

సందెకాడ ఒంటరిగా 

డొంకదారినొస్తుంటే..


గబుక్కున గుబుక్కున

గబుక్కున కళ్లు రెండు మూసిండే

రివ్వున వాటేసి నవ్వేసిండే

ఏందిరా మాఁవా అంటే

కోడికూసి కూయంగానే 

తాళి కడతానన్నాడే..


ఆగేదెట్టాగా ఈ రాతిరి ఏగేదెట్టాగా

అమ్మమ్మ సెప్పవే.. అయ్యమ్మ సెప్పవే

పెద్దమ్మ సెప్పవే.. పిన్నమ్మ సెప్పవే

ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా..


మాయదారి సిన్నోడు 

నా మనసే లాగేసిండు

కోడి కూసి కురియంగానే 

తాళి కడతానన్నాడే

ఆగేదెట్టాగా ఈ రాతిరి ఏగేదెట్టాగా

ఆగేదెట్టాగా ఈ రాతిరి ఏగేదెట్టాగా..


- పాటల ధనుస్సు 

సద్దుమణగ నీయవోయ్ | Saddumanaganeeyavoyi | Song Lyrics | Amma Maata (1972)

సద్దుమణగ నీయవోయ్



చిత్రం :  అమ్మ మాట (1972)

సంగీతం :  రమేశ్ నాయుడు

గీతరచయిత :  దేవులపల్లి

నేపథ్య గానం :  జానకి


పల్లవి:


హూష్ష్...సద్దుమణగ నీయవోయ్..

చందురూడా

ముద్దుతీరుతుందిలే.. అందగాడా

కుదిరింది ఇద్దరికీ భలే జత..

ముందుంది చూడవోయ్ 

అసలు కథ


సద్దుమణగ నీయవోయ్..

చందురూడా

ముద్దుతీరు తుందిలే..

అందగాడా

కుదిరింది ఇద్దరికీ భలే జత

ముందుంది చూడవోయ్ 

అసలుకథ

సద్దుమణగ నీయవోయ్..

చందురూడా


చరణం 1:


మల్లెపూలు మరికాస్త విచ్చుకోనీ

మామగారు మరికాస్త.. పుచ్చుకోనీ

మల్లెపూలు మరికాస్త విచ్చుకోనీ

మామగారు మరికాస్త.. పుచ్చుకోనీ

మల్లెపూలు ... విచ్చుకోనీ.. 

మామగారు...పుచ్చుకోనీ


అందాక ఆగితే.. 

మరో ఘడియ దాటితే

అనుకొన్నది చేద్దాము.. 

అంతు చూసుకోందాము..


సద్దుమణగ నీయవోయ్..

చందురూడా

ముద్దుతీరు తుందిలే..

అందగాడా

కుదిరింది ఇద్దరికీ భలే జత

ముందుంది చూడవోయ్ 

అసలు కథ...

సద్దుమణగ నీయవోయ్..

చందురూడా


చరణం 2:


పుట్టినిల్లు విడిచి.. ఈ పుట్ట చేరుకొంటి

పుట్టినిల్లు విడిచి.. ఈ పుట్ట చేరుకొంటి

పుట్టడాశతో.. నిన్నే చేపట్టాలనుకొంటి

పుట్టడాశతో.. నిన్నే చేపట్టాలనుకొంటి


పట్టుచిక్కువరకూ..ఫలం దక్కువరకూ

పట్టుచిక్కువరకూ..ఫలం దక్కువరకూ

ఓ పట్టాన....వదలననీ..ఒట్టేసుకోంటి...


హూష్ష్... సద్దుమణగ నీయవోయ్..

చందురూడా

ముద్దుతీరు తుందిలే..

అందగాడా

కుదిరింది ఇద్దరికీ భలే జత

ముందుంది చూడవోయ్ 

అసలు కథ...

సద్దుమణగ నీయవోయ్..

చందురూడా...


- పాటల ధనుస్సు 


25, ఫిబ్రవరి 2025, మంగళవారం

ఇలాగ వచ్చి అలాగ తెచ్చి | Ilaga Vachi Alaga Techi | Song Lyrics | Gorintaku (1979)

ఇలాగ వచ్చి అలాగ తెచ్చి



చిత్రం: గోరింటాకు (1979) 

సంగీతం: కె.వి. మహదేవన్ 

గీతరచయిత: శ్రీశ్రీ 

నేపధ్య గానం: బాలు, సుశీల 


పల్లవి: 


ఇలాగ వచ్చి అలాగ తెచ్చి 

ఎన్నో వరాల మాలలు గుచ్చి 

నా మెడ నిండా వేశావు 

నన్నో మనిషిని చేశావు 

ఎలాగా తీరాలి 

నీ ఋణమెలాగ తీరాలి 


తీరాలంటే దారులు లేవా 

కడలి కూడా తీరం లేదా 

అడిగినవన్నీ ఇవ్వాలీ 

అడిగినప్పుడే ఇవ్వాలీ 

అలాగ తీరాలీ 

నా ఋణమలాగ తీరాలి 


చరణం 1: 


అడిగినప్పుడే వరమిస్తారు.. 

ఆకాశంలో దేవతలు 

అడగముందే అన్నీ ఇచ్చే.. 

నిన్నే పేరున పిలవాలీ 

నిన్నే తీరున.. కొలవాలీ 


అసలు పేరుతో నను పిలవద్దు 

అసలు కన్నా వడ్డీ ముద్దు 

ముద్దు ముద్దుగా ముచ్చట తీర 

పిలవాలీ.. నను కొలవాలీ 


అలాగ తీరాలీ.. 

నా ఋణమలాగ తీరాలీ 


చరణం 2: 


కన్నులకెన్నడూ కనగరానిది 

కానుకగా నేనడిగేదీ 


అరుదైనది నీవడిగేది 

అది నిరుపేదకెలా దొరికేది 

ఈ నిరుపేదకెలా దొరికేది 


నీలో ఉన్నది.. నీకే తెలియదు 

నీ మనసే నే కోరుకున్నది 


అది నీకెపుడో ఇచ్చేశానే 

నీ మదిలో అది చేరుకున్నదీ 


ఇంకేం?... 

ఇలాగ తీరిందీ.. 

మన ఋణమిలాగ తీరింది 

ఇలాగ తీరిందీ.. 

మన ఋణమిలాగ తీరింది


- పాటల ధనుస్సు 


కొమ్మ కొమ్మకో సన్నాయి | Komma Kommako Sannayi | Song Lyrics | Gorintaku (1979)

కొమ్మ కొమ్మకో సన్నాయి



చిత్రం: గోరింటాకు (1979)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: వేటూరి

నేపథ్య గానం: బాలు, సుశీల


పల్లవి :


కొమ్మ కొమ్మకో సన్నాయి

కోటి రాగాలు ఉన్నాయి

ఏమిటీ మౌనం…  ఎందుకీ ధ్యానం

ఏమిటీ మౌనం…  ఎందుకీ ధ్యానం


కొమ్మ కొమ్మకో సన్నాయి

కోటి రాగాలు ఉన్నాయి

మనసులో ధ్యానం…  మాటలో మౌనం

మనసులో ధ్యానం…  మాటలో మౌనం


చరణం 1 :


మనసుమాటకందని నాడు 

మధురమైన పాటవుతుంది

మధురమైన వేదనలోనే 

పాటకు పల్లవి పుడుతుంది


మనసుమాటకందని నాడు 

మధురమైన పాటవుతుంది

మధురమైన వేదనలోనే 

పాటకు పల్లవి పుడుతుంది


పల్లవించు పడుచుదనం 

పరుచుకున్న మమతలు చూడు

పల్లవించు పడుచుదనం 

పరుచుకున్న మమతలు చూడు


పసితనాల తొలివేకువలో 

ముసురుకున్న మబ్బులు చూడు

అందుకే ధ్యానం అందుకే మౌనం

అందుకే ధ్యానం అందుకే మౌనం


కొమ్మ కొమ్మకో సన్నాయి


చరణం 2:


కొంటెవయసు కోరికలాగా 

గోదారి ఉరకలు చూడు

ఉరకలేక ఊగిసలాడే 

పడవకున్న బంధం చూడు


కొంటెవయసు కోరికలాగా 

గోదారి ఉరకలు చూడు

ఉరకలేక ఊగిసలాడే 

పడవకున్న బంధం చూడు


ఒడ్డుతోనో నీటితోనో పడవ 

ముడిపడి ఉండాలి

ఒడ్డుతోనో నీటితోనో పడవ 

ముడిపడి ఉండాలి


ఎప్పుడే ముడి ఎవరితో పడి 

పడవ పయనం సాగునో మరి


అందుకే ధ్యానం అందుకే మౌనం.. 

అందుకే ధ్యానం అందుకే మౌనం


కొమ్మ కొమ్మకో సన్నాయి

కోటి రాగాలు ఉన్నాయి

ఏమిటీ మౌనం…  ఎందుకీ ధ్యానం

మనసులో ధ్యానం…  మాటలో మౌనం


కొమ్మ కొమ్మకో సన్నాయి


- పాటల ధనుస్సు 


గోరింట పూచింది కొమ్మలేకుండా | Gorinta Poochindi Kommalekunda | Song Lyrics | Gorintaku (1979)

గోరింట పూచింది కొమ్మలేకుండా



చిత్రం: గోరింటాకు (1979) 

సంగీతం: కె.వి. మహదేవన్ 

గీతరచయిత: దేవులపల్లి 

నేపధ్య గానం: సుశీల 


పల్లవి: 


గోరింట పూచింది కొమ్మలేకుండా 

మురిపాల అరచేత మొగ్గ తొడిగింది 

గోరింట పూచింది కొమ్మలేకుండా 

మురిపాల అరచేత మొగ్గ తొడిగింది 

ఎంచక్కా పండిన ఎర్రని చుక్క 

చిట్టీపేరంటానికి కలకాలం రక్ష 


చరణం 1: 


మామిడీ చిగురెరుపు మంకెన పువ్వెరుపు 

మణులన్నింటిలోన మాణిక్యం ఎరుపు 

మామిడీ చిగురెరుపు మంకెన పువ్వెరుపు 

మణులన్నింటిలోన మాణిక్యం ఎరుపు 

సందే వన్నెల్లోన సాగే మబ్బెరుపు 

తానెరుపు అమ్మాయి తనవారిలోన.. 


గోరింట పూచింది కొమ్మలేకుండా 

మురిపాల అరచేత మొగ్గ తొడిగింది 


చరణం 2: 


మందారంలా పూస్తే 

మంచి మొగుడొస్తాడు 

గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు 

మందారంలా పూస్తే 

మంచి మొగుడొస్తాడు 

గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు 

సింధూరంలా పూస్తే చిట్టి చేయంతా 

అందాల చందమామ 

అతనే దిగివస్తాడు 


చరణం 3: 


పడకూడదమ్మా పాపాయి మీద 

పాపిష్టి కళ్ళు కోపిష్టి కళ్ళు 

పాపిష్టి కళ్ళల్లో పచ్చాకామెర్లు 

కోపిష్టి కళ్ళల్లో కొరివిమంటల్లు 


గోరింట పూచింది కొమ్మలేకుండా 

మురిపాల అరచేత మొగ్గ తొడిగింది


- పాటల ధనుస్సు 


చెప్పనా సిగ్గు విడిచి చెప్పరానివీ | Cheppana Sigguvidichi | Song Lyrics | Gorintaku (1979)

చెప్పనా సిగ్గు విడిచి చెప్పరానివీ



చిత్రం: గోరింటాకు (1979) 

సంగీతం: కె.వి. మహదేవన్ 

గీతరచయిత: దేవులపల్లి 

నేపధ్య గానం: బాలు, సుశీల 


పల్లవి: 


చెప్పనా...సిగ్గు విడిచి చెప్పరానివీ... 

చెప్పకుంటే నీకు నీవే తెలుసుకోనివి... 

చెప్పనా...చెప్పనా...చెప్పనా.... 


అడగనా...నోరు తెరిచి అడగరానివి...ఈ.. 

అడకుంటే నీకు నీవే ఇవ్వలేనివీ...ఈ.. 

అడగనా...అడగనా...అడగనా.... 


చెప్పనా...సిగ్గు విడిచి చెప్పరానివి.... 

అడగనా...నోరు తెరిచి అడగరానివి.... 


చరణం 1: 


చెప్పమనీ...చెప్పకుంటే ఒప్పననీ... 

చెప్పి చెప్పి నా చేత చెప్పించుకున్నవి 

చెప్పనా? 


అడగమనీ...అడగకుంటే జగడమనీ... 

అడిగి అడిగి నా చేత అడిగించుకున్నవి 

అడగనా? 


అడుగు మరి...చెప్పు మరి... 

అడుగు మరి...చెప్పు మరి... 


చెప్పితే అల్లరి... అడిగితే తుంటరి... 

చెప్పనా...సిగ్గు విడిచి చెప్పరానివి... 

అడగనా...నోరు తెరిచి అడగరానివి... 


చరణం 2: 


నిన్న రాత్రి వచ్చి...సన్న దీప మార్పి... 

పక్క చేరి నిదురపోవు సోయగాన్ని... 

వీపుతట్టి రెచ్చగొట్టి కలలాగ వెళ్లిపోతే... 

పిల్ల గతి...కన్నెపిల్ల గతి ఏమిటో...

చెప్పనా... 


పగటి వేళ వచ్చి పరాచకలాడి... 

ఊరుకొన్న పడుచువాణ్ణి ఉసిగొలిపి... 

పెదవి చాపి.. పిచ్చి రేపి ఇస్తానని ఊరిస్తే... 

ఇవ్వమనీ...ఇచ్చి చూడమని 

ముద్దులే అడగనా... 


వద్దని...హద్దు దాట వద్దనీ... 

అన్న కొద్ది ముద్దు చేసి కొసరి తీసుకున్నవి 

చెప్పనా... 


నేననీ..వేరనేది లేదనీ...అనీ అనీ...

ఆగమని.. 

ఆపుతున్నదెందుకని అడగనా.... 


అడుగు మరి...చెప్పు మరి... 

అడుగు మరి...చెప్పు మరి... 


చెప్పితే అల్లరి... అడిగితే తుంటరి... 

అడగనా...అడగనా...అడగనా.... 

చెప్పనా... సిగ్గు విడిచి చెప్పరానివి... 

అడగనా... నోరు తెరిచి అడగరానివి...


- పాటల ధనుస్సు 


పాడితే శిలలైన కరగాలి | Paadithe Silalaina Karagali | Song Lyrics | Gorintaku (1979)

పాడితే శిలలైన కరగాలి



చిత్రం : గోరింటాకు (1979)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  సుశీల  


పల్లవి : 


పాడితే శిలలైన కరగాలి

పాడితే శిలలైన కరగాలి... 

జీవిత గతులైన మారాలి


నా పాటకు ఆ బలమున్నదో లేదో... 

పాడిన పిదపే తెలియాలి

నా పాటకు ఆ బలమున్నదో లేదో... 

పాడిన పిదపే తెలియాలి

పాడితే శిలలైన కరగాలి


చరణం 1 :


నీ పాటతోటి నే పగిలిపోవలే... 

పాడమన్నది హృదయం

నీ పాటతోటి నే పగిలిపోవలే... 

పాడమన్నది హృదయం


పెగలిరాక నా పాట జీరగా... 

పెనుగులాడినది కంఠం

పెగలిరాక నా పాట జీరగా... 

పెనుగులాడినది కంఠం


గొంతుకు గుండెకు ఎంత దూరం...

గొంతుకు గుండెకు ఎంత దూరం... 

ఆశనిరాశకు అంతే దూరం

ఆశనిరాశకు అంతే దూరం... 


పాడితే శిలలైన కరగాలి... 

జీవిత గతులైన మారాలి

నా పాటకు ఆ బలమున్నదో లేదో... 

పాడిన పిదపే తెలియాలి

పాడితే శిలలైన కరగాలి


చరణం 2 :


తాళి కట్టెడి వేళ కోసమే 

వేచి చూసినది విరిమాలా

కట్టే వేళకు కట్టని తాళిని 

కత్తిరించినది విధిలీలా


వేచిన కళ్ళకు కన్నీళ్ళా.... 

వేయని ముడులకు నూరేళ్ళా

నా పాటకు పల్లవి మారేనా... 

ఈ పగిలిన గుండె అతికేనా

ఈ చితికిన బ్రతుకిక బ్రతికేనా..... 


పాటల ధనుస్సు 


24, ఫిబ్రవరి 2025, సోమవారం

అనురాగముతో నిండిన నదిలా | సీతారాముల ప్రేమ కధ | Seetharamula Prema Katha | Song Lyrics | RKSS Creations

అనురాగముతో నిండిన నదిలా



 సీతారాముల ప్రేమ కధ

రచన : రామకృష్ణ దువ్వు 

 

పల్లవి:

 

అనురాగముతో నిండిన నదిలా

కోకిల పాటల కిలకిల రావాలూ


గగనము నిండిన పన్నీటి మొయిలా

ఇలపై ప్రేమకు ఒక ఒరవడిగా


సీతా రాముల ప్రేమ కథ అమరముగా

సీతా రాముల ప్రేమ కథ అమరముగా

 

చరణం 1:

 

రాముని చూపులో వెన్నెల కాంచగా

సీత మనమున పరితపించుగా


బిడియపు మోమును చూడగా

పున్నమి జాబిలి భువిపై నిలచెనా


జానకి చెంతన రాముని భావనా

ప్రేమ వెలుగులు హృదయం నిండగా


 సీతా రాముల ప్రేమ కథ అమరముగా

 సీతా రాముల ప్రేమ కథ అమరముగా


చరణం 2:

 

కోదండమీడి రాముని చేయి మెత్తగా

కోమలి కురులు ముడివేయు ముచ్చటగా


సీతా రాముల అనుబంధం కని పర్ణశాల

తరగని తలపుల తరతరాల సాక్షిగా


జానకి రాముల ప్రేమలు కమనీయం

చైత్ర శుద్ధ నవమికి ప్రతియేటా కళ్యాణం


సీతా రాముల ప్రేమ కథ అమరముగా

సీతా రాముల ప్రేమ కథ అమరముగా


అనురాగముతో నిండిన నదిలా

కోకిల పాటల కిలకిల రావాలూ


గగనము నిండిన పన్నీటి మొయిలా

ఇలపై ప్రేమకు ఒక ఒరవడిగా


సీతా రాముల ప్రేమ కథ అమరముగా

సీతా రాముల ప్రేమ కథ అమరముగా


- RKSS Creations...

కిరాతార్జునీయం | Kiratharjuneeyam | Song Lyrics | Bhakta Kannappa (1976)

కిరాతార్జునీయం



చిత్రం :  భక్త కన్నప్ప (1976)

సంగీతం :  ఆదినారాయణరావు/సత్యం

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం:  బాలు


పల్లవి :


తకిటతక తకతకిట చకిత పదయుగళా

వికట గంగాఝరిత మకుటతట నిగళా

హరిహరాంచిత కళాకలిత నీలగళా

సాంద్రచ్ఛటాపటల నిటల చంద్రకళా

జయజయ మహాదేవ శివశంకరా

హరహర మహాదేవ ఆభయంకరా


అని దేవతలు శివుని కొనియాడ

పరవశమ్మున శివుడు తాండవమ్మాడగా

కంపించెనింతలో కైలాసమావేళ

కనిపించెనంత అకాల ప్రళయ జ్వాలా


జగములేలిన వాని సగము నివ్వెరబోయే

సగము మిగిలిన వాని మొగము నగవైపోయే


చరణం 1 :


" ఓం నమః శివాయ... 

ఓం నమః శివాయ "


అతడే అతడే అర్జునుడు.. 

పాండవ వీర యశోధనుడు

అతడే అతడే అర్జునుడు.. 

పాండవ వీర యశోధనుడు

అనితరసాధ్యము పాశుపతాస్త్రము

కోరి ఇంద్రగిరి చేరి శివునికై

అహోరాత్రములు చేసెను తపస్సు

ఇది సృష్టించెను దివ్య మహస్సు


నెలవంక తలపాగ నెమలి ఈకగ మారే

తలపైని గంగమ్మ తలపులోనికి బారే

నిప్పులుమిసే కన్ను నిదురోయి బొట్టాయే

బూదిపూతకు మారు పులితోలు వలువాయే

ఎరుక గల్గిన శివుడు ఎరుకగా మారగా

తల్లి పార్వతి మారే తానె ఎరుకతగా

ఓంకార ధనువుగా ఒదిగె త్రిశూలమ్ము 

కైలాసమును వీడి కదలి వచ్చెను శివుడు

కైలాసమును వీడి కదలి వచ్చెను శివుడు


చరణం 2:


శివుని ఆనతిని శిరమున దాల్చి

మూకాసురుడను రాక్షసుడు

వరాహ రూపము ధరించి వచ్చెను

ధరాతలమ్మే అదిరిపోవగా..


చిచ్చరపిడుగై వచ్చిన పందిని

రెచ్చిన కోపముతో అర్జునుడు

మట్టుబెట్టగా పట్టె బాణము

ధనువొక చేతను అందుకొని

చూసిన కంటను చూడకనే

గురి చూసినంతనే ... వేసినంతనే ...

తలలు రెండుగా విలవిలలాడుచు 

తనువు కొండగా గిర గిరతిరుగుతూ 

అటు ఇటు తగిలిన రెండు బాణముల 

అసువులు వీడెను వరాహము


'కొట్టితి నేనని ' అర్జునుడు

'పడకొట్టితి నేనని ' శివుడు

పట్టిన పట్టును వదలకనే

తొడకొట్టిన వీరముతో అపుడు


' వేట నాది వేటు నాది 

వేటాడే చోటు నాది

ఏటి తగవు పొమ్మని " 

విలు మీటి పలికె  శివుడు


' చేవ నాది చేతనాది 

చేటెరుగని ఈటె నాది

చేవుంటే రమ్మని ' 

కనుసైగ చేసె  అర్జునుడు


గాండీవ పాండిత్య కళలుగా బాణాలు

కురిపించే అర్జునుడు కానీ...

అపుడతను వేయి చేతుల 

కార్తవీర్యార్జునుడు


ఓంకార ఘన ధనుష్టంకారములతోడ

శరపరంపర కురిసే హరుడు

అయినా నరునికాతడు మనోహరుడు


చరణం 3 :


చిత్రమేమో గురిపెట్టిన 

బాణమ్ములు మాయమాయే

విధివిలాసమేమో పెట్టిన గురి 

వట్టిదాయే

అస్త్రములే విఫలమాయే...

శస్త్రములే వికలమాయే...

సవ్యసాచి కుడియడమై 

సంధించుట మరచిపోయే....


జగతికి సుగతిని సాధించిన తల

దిగంతాల కవతల వెలిగే తల

గంగకు నెలవై... కళాకాదరువై

హరి బ్రహ్మలకు తరగని పరువై

అతి పవిత్రమై ... అఘ లవిత్రమై

శ్రీకరమై... శుభమైన శివుని తల

అదరగా ... సృష్టి చెదరగా


తాడి ఎత్తు గాండీవముతో 

ముత్తాడి ఎత్తుగా

ఎదిగి అర్జునుడు 

చండ కోపమున కొట్టినంతనే.....


తల్లిదండ్రుల చలువ తనువైన దేవుడు

కోరినవరాలిచ్చు కొండంత దేవుడు

ఎదుట నిలిచెను శివుడు ఎదలోని దేవుడు

పదములంటెను నరుడు భక్తి తో అపుడు


"కర చరణ కృతంవా కర్మ వాక్కాయజంవా

శ్రవణ నయనజంవా మానసంవాపరాధం

విహితమ విహితం వా సర్వామే తక్షమస్వ

శివ శివ కరుణాబ్ధే  శ్రీమహాదేవ శంభో

నమస్తే...  నమస్తే.. నమస్తే... నమః"


పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు