RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

10, ఫిబ్రవరి 2025, సోమవారం

ఆగనంటుందీ అల్లరి వయసు | Aganantundi Allari vayasu | Song Lyrics | Muttaiduva (1979)

ఆగనంటుందీ అల్లరి వయసు



చిత్రం :  ముత్తైదువ (1979)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  సి నారాయణ రెడ్డి 

నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి:


ఆగనంటుందీ ... అల్లరి వయసు

ఊగిపోతుందీ.. ఊయల మనసు...


ఆ వయసుతో నన్నురకనీ... 

ఆ మనసులో నన్నూగనీ..

గాలిలాగా... కెరటాలలాగా...

గాలిలాగా... కెరటాలలాగా...


ఆగనంటుందీ ... అల్లరి వయసు

ఊగిపోతుందీ... ఊయల మనసు...


ఆ వయసుతో నన్నురకనీ... 

ఆ మనసులో నన్నూగనీ..

గాలిలాగా... కెరటాలలాగా...

గాలిలాగా... కెరటాలలాగా...


చరణం 1:


నా చూపే మాటి మాటికి 

నీ వైపే ఉరుకుతుంది...

తాను చూసిన అందాలన్నీ... 

తనలోనే దాచుకుంది...

నా చూపే మాటి మాటికి 

నీ వైపే ఉరుకుతుంది...

తాను చూసిన అందాలన్నీ... 

తనలోనే దాచుకుంది...


ఎదలో దాచిన ఆ అందాలే ... 

పదిలంగా ఉంటాయి...

ఎదలో దాచిన ఆ అందాలే ... 

పదిలంగా ఉంటాయి...

మనసు చూసిన అనుభవాలే... 

మరీ మరీ విరబూస్తూ ఉంటాయి..

పూలలాగా ... కిరణాలలాగా...

పూలలాగా ... కిరణాలలాగా...


ఆగనంటుందీ ... అల్లరి వయసు..

ఊగిపోతుందీ... ఊయల మనసు...


చరణం 2:


నే వేసే ప్రతి అడుగు ... 

నీ వెంటే సాగుతుంది...

నీ తోడు లేని నాడు 

అది నాతోనే ఆగుటుంది...

నే వేసే ప్రతి అడుగు ... 

నీ వెంటే సాగుతుంది...

నీ తోడు లేని నాడు 

అది నాతోనే ఆగుటుంది...


కలతలెరుగనీ అనురాగాలే ... 

కలలు పండించుకుంటాయి...

కలతలెరుగనీ అనురాగాలే ... 

కలలు పండించుకుంటాయి...

శృతులు వీడని ఆ హృదయాలే... 

జతగా సాగుతూ ఉంటాయి...

నీరులాగా .... సెలయేరులాగా...

నీరులాగా .... సెలయేరులాగా...


ఆగనంటుందీ ... అల్లరి వయసు...

ఊగిపోతుందీ... ఊయల మనసు...


ఆ వయసుతో నన్నురకనీ...

ఆ మనసులో నన్నూగనీ..

గాలిలాగా... కెరటాలలాగా...

గాలిలాగా... కెరటాలలాగా...


ఆగనంటుందీ ...అల్లరి వయసు...

ఊగిపోతుందీ..ఊయల మనసు...


పాటల ధనుస్సు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

కౌగిలిలో ఉయ్యాలా | Kougililo Vuyyala | Song Lyrics | Annadammula Anubandham (1975)

కౌగిలిలో ఉయ్యాలా కన్నులలో జంపాలా  చిత్రం :  అన్నదమ్ముల అనుబంధం (1975) సంగీతం :  చక్రవర్తి గీతరచయిత :  దాశరథి నేపధ్య గానం :  బాలు, జానకి  పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు