గోరింట పూచింది కొమ్మలేకుండా
చిత్రం: గోరింటాకు (1979)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: దేవులపల్లి
నేపధ్య గానం: సుశీల
పల్లవి:
గోరింట పూచింది కొమ్మలేకుండా
మురిపాల అరచేత మొగ్గ తొడిగింది
గోరింట పూచింది కొమ్మలేకుండా
మురిపాల అరచేత మొగ్గ తొడిగింది
ఎంచక్కా పండిన ఎర్రని చుక్క
చిట్టీపేరంటానికి కలకాలం రక్ష
చరణం 1:
మామిడీ చిగురెరుపు మంకెన పువ్వెరుపు
మణులన్నింటిలోన మాణిక్యం ఎరుపు
మామిడీ చిగురెరుపు మంకెన పువ్వెరుపు
మణులన్నింటిలోన మాణిక్యం ఎరుపు
సందే వన్నెల్లోన సాగే మబ్బెరుపు
తానెరుపు అమ్మాయి తనవారిలోన..
గోరింట పూచింది కొమ్మలేకుండా
మురిపాల అరచేత మొగ్గ తొడిగింది
చరణం 2:
మందారంలా పూస్తే
మంచి మొగుడొస్తాడు
గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు
మందారంలా పూస్తే
మంచి మొగుడొస్తాడు
గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు
సింధూరంలా పూస్తే చిట్టి చేయంతా
అందాల చందమామ
అతనే దిగివస్తాడు
చరణం 3:
పడకూడదమ్మా పాపాయి మీద
పాపిష్టి కళ్ళు కోపిష్టి కళ్ళు
పాపిష్టి కళ్ళల్లో పచ్చాకామెర్లు
కోపిష్టి కళ్ళల్లో కొరివిమంటల్లు
గోరింట పూచింది కొమ్మలేకుండా
మురిపాల అరచేత మొగ్గ తొడిగింది
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి