RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

28, ఫిబ్రవరి 2023, మంగళవారం

శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం | Srilakshmi Pelliki | Song Lyrics | Justice Chowdary (1982)

శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం



చిత్రం : జస్టిస్ చౌదరి (1982)

రచన : వేటూరి,

సంగీతం : చక్రవర్తి

గానం : బాలు, సుశీల, శైలజ



పల్లవి:

శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం

శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం

మాలక్ష్మి పెళ్లికి మమతే పేరంటం

చిగురులేసే సిగ్గు చీనాంబరాలు

తడిసి కురిసే కళ్లు నీ తలంబ్రాలు


శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం

మాలక్ష్మి పెళ్లికి మమతే పేరంటం


 చరణం 1:

కనుబొమ్మల నడుమ విరిగింది శివధనుసు

కన్నుల్లో మెరిసింది కన్నె సీత మనసు

కనుబొమ్మల నడుమ విరిగింది శివధనుసు

కన్నుల్లో మెరిసింది కన్నె సీత మనసు


ఆ రామచంద్రుడు నెలవంకలిస్తాడని

ఆ రామచంద్రుడు నెలవంకలిస్తాడని

పొడిచింది ఓ చుక్క బుగ్గలో ఇప్పుడు

అందాలకెందుకు గంధాల పూతలు

అందాలకెందుకు గంధాల పూతలు

కళ్లకే వెలుతురు మా పెళ్లికూతురు

ఈ పెళ్లికూతురు...


శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం

మాలక్ష్మి పెళ్లికి మమతే పేరంటం


 

చరణం 2:

అడగలేదు అమ్మనైనా ఏనాడు ఆకలని

అలుసు చేయవద్దు మీరు తానేమి అడగదని

ఆడగబోదు సిరిసంపదలు ఏనాడూ పెనిమిటిని

అడిగేదొక ప్రేమ అనే పెన్నిధిని

చెప్పలేని మూగబాధ చెప్పకనే తెలుసుకో

మాటలకే అందని మనసు.. 

చూపులతో తెలుసుకో..

రెప్పవలే కాచుకో..


శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం

మాలక్ష్మి పెళ్లికి మమతే పేరంటం

చిగురులేసే సిగ్గు చీనాంబరాలు

తడిసి కురిసే కళ్లు నీ తలంబ్రాలు


శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం

మాలక్ష్మి పెళ్లికి మమతే పేరంటం


పాటల ధనుస్సు  




27, ఫిబ్రవరి 2023, సోమవారం

అబ్బా ముసురేసింది | Abba Musuresindi | Song Lyrics | Justice Chowdary (1982)

అబ్బా ముసురేసింది ...



చిత్రం: జస్టీస్ చౌదరి (1982)

సంగీతం: చక్రవర్తి

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: బాలు, సుశీల 


పల్లవి:

అబ్బ ముసురేసింది అయ్యో చలి వేసింది

అబ్బ ముసురేసింది అయ్యో చలి వేసింది

గుండెల్లో ఎండేసే శీతాకాలంలో

నీ సాయం కావాలి సాయంకాలంలో


అబ్బ ముసురేసింది అయ్యో చలి వేసింది

అబ్బ ముసురేసింది అయ్యో చలి వేసింది

సాయంగా రావాలి సాయంకాలంలో

నీతోడే కావాలి శీతాకాలంలో


చరణం: 1

పెనుగులాడి పెనవేసుకొనే 

ఆకలౌతా చలికాబోలు

హత్తుకున్న వత్తిడిలోని 

హాయి పేరే చలికాబోలు

ఏమిటో మరి ఎందుకోచలి

ప్రేమలో రుచి పెంచుతున్నది

కౌగిలింతల ఉరివేసుకున్న

భోగిమంటల ఎద కాచుకున్నా

పగలు రేయి సెగలు రేపి

దుప్పటిలోనే తప్పెటగుళ్ళు మోగించేసింది


అబ్బ ముసురేసింది

అయ్యో చలి వేసింది

అబ్బ ముసురేసింది

అయ్యో చలి వేసింది

సాయంగా రావాలి సాయంకాలంలో

నీతోడే కావాలి శీతాకాలంలో


చరణం: 2

చేతికందని చెలగాటాలకు 

బీడు కలుపే చలికాబోలు

నిదురపోయిన నిన్నటి వలపుల 

మేలుకొలుపే చలికాబోలు

వాడుకో చలి వేడిగా మరి

ఈడుకే ఇది కొత్త ఊపిరి

నిన్ను నాలో కలిపేసుకున్నా

కలిసి ముద్దుల గడి ఏసుకున్నా

పెర పెరలనే సరిగమలతో

గుప్పిటిలోనే గుజ్జన గుళ్ళు ఆడించేసింది


అబ్బ ముసురేసింది అయ్యో చలి వేసింది

అబ్బ ముసురేసింది అయ్యో చలి వేసింది

సాయంగా రావాలి సాయంకాలంలో

నీతోడే కావాలి శీతాకాలంలో


అబ్బ ముసురేసింది అయ్యో చలి వేసింది

అబ్బ ముసురేసింది అయ్యో చలి వేసింది

గుండెల్లో ఎండేసే శీతాకాలంలో

నీ సాయం కావాలి సాయంకాలంలో


పాటల ధనుస్సు  


పరిమళించు పున్నమిలో | Parimalinchu Punnamilo | Song Lyrics | Puli Bebbuli (1983)

పరిమళించు పున్నమిలో



చిత్రం :  పులి-బెబ్బులి (1983)

సంగీతం :  రాజన్-నాగేంద్ర

గీతరచయిత :  వీటూరి

నేపధ్య గానం :  బాలు, సుశీల



పల్లవి :


పరిమళించు పున్నమిలో..  ప్రణయ వీణ పలికింది

పరిమళించు పున్నమిలో..  ప్రణయ వీణ పలికింది

పరిమళించు పున్నమిలో..  ప్రణయ వీణ పలికింది

మౌనమే.. గానమై.. మధుమాసవేళలో

మౌనమే.. గానమై.. మధుమాసవేళలో

ఆ..... ఆ.... ఆ....

పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది

పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది


మౌనమే.. గానమై... మధుమాసవేళలో

మౌనమే.. గానమై.. మధుమాసవేళలో


ఆ ఆ ఆ పరిమళించు పున్నమిలో... 

ప్రణయ వీణ పలికింది


చరణం 1 :


నవ్వగనే.. నవయవ్వనమే పువ్వులు రువ్విందిలే

తానె విరితేనై తానాలు ఆడిందిలే

నిన్ను గని.. ఎద కోయిలగ రాగాలు తీసిందిలే

నాలో ఎలమావి ఉయ్యలలూగిందిలే

చేలిమికిదే చైత్రమనీ.. 

నా ఆశ పూసింది.. అందాల బృందావిహారాలలో


పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది

పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది



చరణం 2 :


అందమిదే.. మకరందమిదే.. నా జీవితానందమే

నాలో కెరటాలై ఉప్పొంగి పోయిందిలే

బంధమిదే.. సుమగంధమిదే.. ఏ జన్మ సంబంధమో

నాలో విరితావి వెదజల్లిపోయిందిలే

జాబిలిగా.. వెన్నెలగా.. 

ఈ జంట కలిసింది కార్తిక పూర్ణిండు హాసాలలో


పరిమళించు పున్నమిలో..  ప్రణయ వీణ పలికింది

పరిమళించు పున్నమిలో..  ప్రణయ వీణ పలికింది

మౌనమే.. గానమై.. మధుమాసవేళలో

మౌనమే.. గానమై.. మధుమాసవేళలో


పాటల ధనుస్సు 



26, ఫిబ్రవరి 2023, ఆదివారం

కన్నెల మనసులు దోచుకు పోయిన కన్నయ్య ఏడమ్మా | Brindavanam Song | RKSS Creations

కన్నెల మనసులు దోచుకు పోయిన కన్నయ్య ఏడమ్మా



గీత రచన : రామకృష్ణ దువ్వు 

స్వరకల్పన : కోట కృష్ణవేణి,

గానం : మూల శ్రీలత, టి కృష్ణారావు 

రికార్డింగ్ : శ్రీమాత డిజిటల్ రికార్డింగ్, విశాఖపట్నం 

ప్రొడక్షన్ : RKSS Creations



పల్లవి: 

(గోపికలు):

కన్నెల మనసులు దోచుకు పోయిన

 కన్నయ్య ఏడమ్మా

 పున్నమి జాబిలి చిన్నబోయిన

 వన్నెల కాడమ్మా

 మురళీ గానము మధురిమలో మేము

కన్నులు మూయంగా

అల్లరి కృష్ణుడు అందాల కృష్ణుడు 

చెంగున మరుగాయె


చరణం:  

కృష్ణయ్య లేని తనువులు మేము

మోయంగ లేమమ్మా

ఆతని వేణువు మాధుర్యమే మా

ఊపిరి నిలుపమ్మా

ఆ కాలి మువ్వల సవ్వడులే మాకు

చేతన మిచ్చేది

ఆతడు లేని అరక్షణమైన

జీవించ లేమమ్మా


చరణం: 

ఓ భూమాతా నీ వైన మా స్వామి జాడ

పరికించి తెలుపమ్మా

ఓ పున్నాగ, కదంబ, మారేడు, మామిడి

మీరైనా చెప్పండి

ఓ మల్లీ జాజీ సంపెంగ పూలారా

వనమంతా వెదకండి

ఓ వన మయూరమా శిఖిపింఛ మౌళిని

వెదకి తేవమ్మా


చరణం: (కృష్ణుడు...) 


ప్రతి తరవు నందు నిలిచింది నేనేగా నేనేగా…

ప్రతి పులుగు నందు చేతనము నేనేగా.. నేనేగా..

ప్రతి పూవు నందు పరిమళము నేనేగా… నేనేగా…

 భువిలోన దివిలోన ప్రతి అణువులోన నేనేగా… నేనేగా…

ఓ చెలులారా మీ హృదయాలలో

నేనెపుడూ బందీగా వుంటాను


కన్నెల మనసున నిలచి పోయిన

కన్నయ్య వీడమ్మా

పున్నమి జాబిలకీ కన్నెల సొగసుల

చందము ఏదమ్మా


- రామకృష్ణ దువ్వు

25, ఫిబ్రవరి 2023, శనివారం

చట్టానికి న్యాయానికి | Chattaniki Nyayaniki | Song Lyrics | Justice Chowdary (1982)

చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో


చిత్రం: జస్టీస్ చౌదరి (1982)

సంగీతం: చక్రవర్తి

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: బాలు


పల్లవి:


చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో..

ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో..

కడుపు తీపికి కట్టుబడని తీర్పూ..

కన్నీటికి కరిపోనిదీ తీర్పూ..

ఇది ఆ దైవమే..ఏ..ఏ.. ఇచ్చిన తీర్పూ

తప్పా.. తప్పా.. తప్పా.. నెవ్వర్..


I am in the hands of law..

Any thing happens.. it's not my flaw.. 


చరణం 1:


కఠినమయినది ధర్మం.. కన్ను లేనిది న్యాయం

మనసు లేనిది చట్టం.. మనిషి జన్మకిది ఖర్మం..


కఠినమయినది ధర్మం.. కన్ను లేనిది న్యాయం

మనసు లేనిది చట్టం.. మనిషి జన్మకిది ఖర్మం..


న్యాయమూర్తిగా నేనున్నప్పుడు.. 

న్యాయస్థానమే నాదయినప్పుడు

నాకు మీరు లేరూ..ఊ..ఊ..

నేను నేను కాను..ఊ.. నేను నేను కానూ..

ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు...

తప్పా.. తప్పా.. తప్పా.. నో..


చరణం 2:


సత్యం కోసం.. హరిశ్చంద్రుడు 

సతీసతులనెడబాసినదీ..ఈ..ఈ

గర్భవతిని సీతమ్మను రాముడు.. 

కారడవికి పంపించినదీ..ఈ..ఈ

కన్న తల్లినే కాదని కర్ణుడు.. 

రాజత్యాగము చేసినదీ..ఈ

కన్న కొడుకునే కాదని నేనీ 

కన్నీటిని దిగమింగుతున్నది..

ఎందుకోసం.. ఆ.. ఎందుకోసం.. ఆ..

దహించినా అది ధర్మం కనుకా.. 

సహించాలి అది సత్యం కనుకా..ఆ..

కృశించినా.. నే నశించినా..ఆ.. 

అది న్యాయం కనుక..ఆ..ఆ

ఆ ఆ..న్యాయమే.. నా ధైవం కనుకా..ఆ..ఆ..


చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో..

ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో..

కడుపు తీపికి కట్టుబడని తీర్పూ..ఊ..ఊ

కన్నీటికి కరిపోనిదీ తీర్పూ..

ఇది ఆ దైవమే..ఏ..ఏ.. ఇచ్చిన తీర్పూ..


పాటల ధనుస్సు  


21, ఫిబ్రవరి 2023, మంగళవారం

ఇదే పాటా ప్రతీ చోటా | Ide paata prati chota | Song Lyrics | Puttinillu Mettinillu (1973)

ఇదే పాటా ప్రతీ చోటా


చిత్రం: పుట్టినిల్లు - మెట్టినిల్లు (1973)

సంగీతం: సత్యం

గీతరచయిత: సినారె

నేపధ్య గానం: బాలు


పల్లవి:


ఇదే పాటా ప్రతీ చోటా ఇలాగే పాడుకుంటాను

పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను 


ఇదే పాటా ప్రతీ చోటా ఇలాగే పాడుకుంటాను 

పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను 


చరణం 1:


నా పాట విని మురిశావు ఆ పైన నను వలచావు

నా పాట విని మురిశావు ఆ పైన నను వలచావు

కలలాగ నను కలిశావు లతలాగ నను పెనవేశావు

ఒక గానమై ఒకప్రాణమై జతగూడి మనమున్నాము

ఉన్నాము ఉన్నాము


ఇదే పాటా ప్రతీ చోటా ఇలాగే పాడుకుంటాను

పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను 


చరణం 2:


నాడేమి ఉందని భ్రమశేవు నేడేమి లేదని విడిచేవు

నాడేమి ఉందని భ్రమశేవు నేడేమి లేదని విడిచేవు

ఆ మూడుముళ్లని మరిచేవు నా పాల మనసుని విరిచేవు

ఈనాడు నను విడనాడినా ఏనాటికైనా కలిసేవు నువు

కలిసేవు నను కలిసేవూ


ఇదే పాటా ప్రతీ చోటా ఇలాగే పాడుకుంటాను

పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను 


పాటల ధనుస్సు 


19, ఫిబ్రవరి 2023, ఆదివారం

బోల్తా పడ్డావే పిల్లాదానా | Bolta paddave pilladana | Song Lyrics | Puttinillu Mettinillu (1973)

బోల్తా పడ్డావే పిల్లాదానా



చిత్రం : పుట్టినిల్లు - మెట్టినిల్లు (1973)

సంగీతం : సత్యం

గీతరచయిత : సినారె

నేపధ్య గానం : బాలు 



పల్లవి :


హెహె హో హో హేహే ఆహా..

బోల్తా పడ్డావే పిల్లాదానా.. 

చెమ్కి తిన్నావే చిన్నదానా

ఆహా.. బోల్తా పడ్డావే పిల్లాదానా.. 

చెమ్కి తిన్నావే చిన్నదానా


ఇలా చూడు బలే జోడు 

కోరినోడు కూడినాడు

బోల్తా పడ్డావే పిల్లాదానా.. 

చెమ్కి తిన్నావే చిన్నదానా



చరణం 1 :


నీ మీదే నా పంచప్రాణాలూ .. 

ఇక చేదామా సరి గంగ స్నానాలూ ఓ..

నీ మీదే నా పంచప్రాణాలూ .. 

ఇక చేదామా సరి గంగ స్నానాలూ


ఏమి అలకా ? రామచిలకా.. 

ఉలికి పడకే వలపు మొలకా


బోల్తా పడ్డావే పిల్లాదానా 

చెమ్కి తిన్నావే చిన్నదానా

ఆహా  బోల్తా పడ్డావే పిల్లాదానా 

చెమ్కి తిన్నావే చిన్నదానా



చరణం 2 :


అందాల నీ నడుమూ ఊగింది..  

అమ్మమ్మొ నా గుండె ఆగింది

అందాల నీ నడుమూ ఊగింది..  

అమ్మమ్మొ నా గుండె ఆగింది 


హల్లో హల్లో.. పడుచు పిల్లో..  

పెళ్లి గుళ్లో.. తాళి మెళ్లో

డు డు పి పి రి పి పి డుం డుం పి పి రి పి


బోల్తా పడ్డావే పిల్లాదానా.. 

చెమ్కి తిన్నావే చిన్నదానా

 ఇలా చూడు.. బలే జోడు.. 

కోరినోడు.. కూడినాడు


పాటల ధనుస్సు  


శివ శివ శంకర | Siva Siva Sankara | Song Lyrics | Bhakta Kannappa (1976)

శివ శివ శంకర



చిత్రం :  భక్త కన్నప్ప (1976)

సంగీతం :  ఆదినారాయణరావు/సత్యం

గీతరచయిత : ఆరుద్ర

నేపధ్య గానం : రామకృష్ణ


పల్లవి:


శివ శివ శంకర.....భక్తవశంకర.....

శంభో హర హర నమో నమో.......

శివ శివ శంకర.....భక్తవశంకర.....

శంభో హర హర ..నమో నమో...


చరణం 1:


పున్నెము పాపము యెరుగని నేను...

పూజలు సేవలు తెలియని నేను..

పున్నెము పాపము యెరుగని నేను...

పూజలు సేవలు తెలియని నేను..

యే పూలు తేవాలి నీ పూజకు....

యే పూలు తేవాలి నీ పూజకు....

యే లీల చేయాలి నీ సేవలూ........


శివ శివ శంకర.....భక్తవశంకర.....

శంభో హర హర నమో నమో.......


చరణం 2:


మా ఱేడు నీవని యేరేరి తేనా....

మారేడు దళములు నీ పూజకు..

మా ఱేడు నీవని యేరేరి తేనా....

మారేడు దళములు నీ పూజకు..

గంగమ్మ మెచ్చిన జంగమయ్యవనీ....

గంగమ్మ మెచ్చిన జంగమయ్యవనీ....

గంగను తేనా నీ సేవకూ......


పాటల ధనుస్సు  




13, ఫిబ్రవరి 2023, సోమవారం

బోల్తా పడ్డావు బుజ్జి నాయనా | Bolta Paddavu Bujji nayana | Song Lyrics | Puttinillu Mettinillu (1973)

బోల్తా పడ్డావు బుజ్జి నాయనా


చిత్రం  :  పుట్టినిల్లు - మెట్టినిల్లు (1973)

సంగీతం  :  సత్యం

గీతరచయిత  :  సినారె

నేపధ్య గానం  :  ఎల్. ఆర్. ఈశ్వరి 



పల్లవి :


హెహె ఆహా  హేహే

ఆహా  బోల్తా పడ్డావు బుజ్జి నాయనా..  

చెమ్కి తిన్నావు చిన్ని నాయనా

ఆహా  బోల్తా పడ్డావు బుజ్జి నాయనా..  

చెమ్కి తిన్నావు చిన్ని నాయనా

ఏమిసిగ్గా ? కందెబుగ్గా 

తుళ్ళి పడకోయ్ మల్లెమొగ్గా

బోల్తా పడ్డావు బుజ్జి నాయనా..  

చెమ్కి తిన్నావు చిన్ని నాయనా 


చరణం 1 :


ఏటుగాడి వనుకున్నా వోరబ్బా 

కన్నెజింక చేత తిన్నావు దెబ్బ

ఏటుగాడి వనుకున్నా వోరబ్బా 

కన్నెజింక చేత తిన్నావు దెబ్బ

కోపమొద్దూ తాపమొద్దూ 

ఉన్నమాటే ఉలకవద్దూ 


బోల్తా పడ్డావు బుజ్జి నాయనా..  

చెమ్కి తిన్నావు చిన్ని నాయనా..  ఓహో

బోల్తా పడ్డావు బుజ్జి నాయనా..  

చెమ్కి తిన్నావు చిన్ని నాయనా 


చరణం 2 :


సరదాగా అన్నాను చిన్నోడా 

కలకాలం కావాలి నీ నీడ

సరదాగా అన్నాను చిన్నోడా 

కలకాలం కావాలి నీ నీడ

కలుపుచేయీ కలుగుహాయీ 

పోరునష్టం పొందులాభం


బోల్తా పడ్డావు బుజ్జి నాయనా 

చెమ్కి తిన్నావు చిన్ని నాయనా ఓహో

బోల్తా పడ్డావు బుజ్జి నాయనా 

చెమ్కి తిన్నావు చిన్ని నాయనా

ఏమిసిగ్గా ? కందెబుగ్గా 

తుళ్ళి పడకోయ్ మల్లెమొగ్గా


పాటల ధనుస్సు  


11, ఫిబ్రవరి 2023, శనివారం

చిన్నారి కన్నయ్యా నా ఆశ నీవయ్యా | Chinnari Kannayya | Song Lyrics | Puttinillu Mettinillu (1973)

చిన్నారి కన్నయ్యా నా ఆశ నీవయ్యా



చిత్రం  :  పుట్టినిల్లు - మెట్టినిల్లు (1973)

సంగీతం  :  సత్యం

గీతరచయిత  :  సినారె

నేపధ్య గానం  :  సుశీల



పల్లవి :


చిన్నారి కన్నయ్యా..  నా ఆశ నీవయ్యా

తొలగాలీ మా కలతలు.. 

నీవే కలపాలీ మా మనసులు 


చిన్నారి కన్నయ్యా..  నా ఆశ నీవయ్యా

తొలగాలీ మా కలతలు.. 

నీవే కలపాలీ మా మనసులు 


చరణం 1 :


మెట్టినింట నిందలపాలై పుట్టి నింట చేరాను

మెట్టినింట నిందలపాలై పుట్టి నింట చేరాను

కట్టుకున్న పతికే బరువై కన్నీరై కరిగేను 

ఎంత కాలమో... ఈ వియోగము

ఇంతేనా ఈ జీవితం... బాబూ.. 

పంతాలా పాలాయెనా


చిన్నారి కన్నయ్యా...  నా ఆశ నీవయ్యా

తొలగాలీ మా కలతలు.. 

నీవే కలపాలీ మా మనసులు  



చరణం 2 :


రామయ్యకు దూరమైన సీతలాగ వున్నాను

రామయ్యకు దూరమైన సీతలాగ వున్నాను

చిక్కు ప్రశ్నలెన్నోవేసి చిక్కులలో చిక్కాను

బోసినవ్వుతో బుంగమూతితో 

మార్చాలీ మీ మామను

బాబూ చేర్చాలి...  మీ నాన్నను


చిన్నారి కన్నయ్యా.. నా ఆశ నీవయ్యా

తొలగాలీ మా కలతలు..

నీవే కలపాలీ మా మనసులు


పాటల ధనుస్సు  


7, ఫిబ్రవరి 2023, మంగళవారం

గోదారి గట్టంట వయ్యారి పిట్టంట | Godari gattanta | Song Lyrics | Gopalakrishnudu (1982)

గోదారి గట్టంట వయ్యారి పిట్టంట



చిత్రం :  గోపాల కృష్ణుడు  (1982)

సంగీతం :  చక్రవర్తి

సాహిత్యం: వేటూరి సుందరరామ్మూర్తి

నేపధ్య గానం :  బాలు, సుశీల 



పల్లవి :


అరే...గోదారి గట్టంట.. వయ్యారి పిట్టంట

రివ్వుమంటే జివ్వుమంది నాకు మక్కువ

గోదారి గట్టంట వయ్యారి పిట్టంట

రివ్వుమంటే జివ్వుమంది నాకు మక్కువ

ఉయ్యాల జంపాల ఊగేటి వన్నెల్లో

చీరకొక్క మూర తప్ప ఏమి తక్కువ

అబ్బ.. ఏం వయసో... ఏం సొగసో..

అహ..ఏం సొగసో.. ఏం వయసో..  


గోదారి గట్టంట నా దారినెళుతుంటే

పూల బేరమాడేనమ్మ పూలరంగడు

గోదారి గట్టంట నా దారినెళుతుంటే

పూల బేరమాడేనమ్మ పూలరంగడు

రాదారి పడవల్లో రాగాలు తీస్తుంటే

దొండపండు దోచెనమ్మ దొంగరాముడు


అబ్బ... ఏం మడిసో.. ఎంత గడుసో..

అహా.. ఎంత గడుసో..ఏం మడిసో.. 



చరణం : 1


బేరమాడ వచ్చానే ఓలమ్మీ.. 

బెంగపడిపోయానే ఓలమ్మీ

బేరమాడ వచ్చానే ఓలమ్మీ.. 

బెంగపడిపోయానే ఓలమ్మీ

ముద్దు నాకు ముదిరెనే... 

నిద్దరంత కరిగెనే...


రాత కొద్ది దొరికినాడే.. 

రాతి గుండె కదిపినాడే

పూటపూటకు పూతకొచ్చిన 

పులకరింత గిల్లినాడే 


అబ్బ... ఏం మడిసో... ఏం వరసో..

అహా.. ఏం వరసో...ఏం మడిసో.. 


అహ..గోదారి గట్టంట వయ్యారి పిట్టంట

రివ్వుమంటే జివ్వుమంది నాకు మక్కువ

రాదారి పడవల్లో రాగాలు తీస్తుంటే

దొండపండు దోచెనమ్మ దొంగరాముడు

అబ్బ.. ఏం వయసో... ఏం సొగసో..

అహ.. ఎంత గడుసో..ఏం మడిసో.. 


చరణం : 2


పుట్టుమచ్చలాంటివోడే నా సామీ

పచ్చబొట్టులాంటి వోడె నా సామీ..

పుట్టుమచ్చలాంటివోడే నా సామీ

పచ్చబొట్టులాంటి వోడె నా సామీ..


పట్టుకుంటే వదలడే... 

చెరుపుకుంటే చెదరడే..

వయసులాగా వచ్చినోన్నే.. 

వన్నెలెన్నో తెచ్చినోన్నే

ఈల వేసిన గోల పాపల 

కోలకళ్ళకు మొక్కినాన్నే...


అబ్బ.. ఏం వయసో... ఏం సొగసో..

అహా...ఏం సొగసో..ఏం వయసో..


గోదారి గట్టంట నా దారినెళుతుంటే

పూల బేరమాడేనమ్మ పూలరంగడు

రాదారి పడవల్లో రాగాలు తీస్తుంటే

దొండపండు దోచెనమ్మ దొంగరాముడు


అబ్బ... ఏం మడిసో.. ఎంత గడుసో..

అబ్బ.. ఎంత గడుసో..ఏం మడిసో..


గోదారి గట్టంట వయ్యారి పిట్టంట

రివ్వుమంటే జివ్వుమంది నాకు మక్కువ

ఉయ్యాల జంపాల ఊగేటి వన్నెల్లో

చీరకొక్క మూర తప్ప ఏమి తక్కువ

అబ్బ.. ఏం వయసో... ఏం సొగసో..

అహా..ఏం సొగసో.. ఏం వయసో..


పాటల ధనుస్సు  


6, ఫిబ్రవరి 2023, సోమవారం

జ్ఞాపకం ఉన్నదా | Jnapakam vunnada | Song Lyrics | Gopalakrishnudu (1982)

జ్ఞాపకం ఉన్నదా



చిత్రం :  గోపాల కృష్ణుడు  (1982)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత : వేటూరి ,

నేపధ్య గానం :  బాలు, సుశీల 


పల్లవి  :



జ్ఞాపకం ఉన్నదా... ఆ తీయని తొలి రేయి

జ్ఞాపకం ఉన్నదా...

జ్ఞాపకం ఉన్నదా...

ఆ తీయని తొలి రేయి... 

తొలి జాముకు తరువాయి

మల్లెని పిల్లని మాయనే చేసినా సంగతి... 



జ్ఞాపకం ఉందిలే...

జ్ఞాపకం ఉందిలే...

ఆ తీయని తొలి రేయి... 

తొలి జాముకు తరువాయి

తప్పని అన్ననీ ... తప్పని చెప్పనీ శ్రీమతి



చరణం 1 :


కిటికీలో చందమామా...  

చిటికడంత నవ్వుతు ఉంటే

గదిలో వయ్యారి భామ...  

పులకరింత రువ్వుతు ఉంటే


పంచుకునే పాల మీద... 

వణికే మురిపాల మీద

మిసిమి మీగడలు కొసరి అడిగితే... 

కసరు చూపుతో కానుకలిచ్చిన నా చెలి

నీ చలి నా గిలి తీరినా తీరనీ కౌగిలీ....


జ్ఞాపకం ఉన్నదా...

జ్ఞాపకం ఉందిలే...

ఆ తీయని తొలి రేయి... 

తొలి జాముకు తరువాయి



చరణం 2 :


లేత నడుము చేతికి తగిలి... 

ఉన్న కథను చల్లగ చెబితే

ఉలికి పడ్డ ఉలిపిరి కోక 

ఉండి కూడా లేనంటుంటే


పంచుకునే పానుపు మీద...  

పరిచే పరువాల మీద

అగరు పొగలలో..  పొగరు వగలతో...  

సగము సగముగా జతకు చేరినా రాతిరీ...

ఇద్దరి సందడి...  వినబడి నవ్వినా జాబిలీ...



జ్ఞాపకం ఉన్నదా...

జ్ఞాపకం ఉన్నదా...

ఆ తీయని తొలి రేయి... 

తొలి జాముకు తరువాయి

మల్లెని పిల్లని మాయనే చేసినా సంగతి



జ్ఞాపకం ఉందిలే...

జ్ఞాపకం ఉందిలే...

ఆ తీయని తొలి రేయి... 

తొలి జాముకు తరువాయి

తప్పని అన్ననీ ... తప్పని చెప్పనీ శ్రీమతి


పాటల ధనుస్సు  


4, ఫిబ్రవరి 2023, శనివారం

అందాల రాధికా నా కంటి దీపికా | Andala Radhika | Song Lyrics | Gopalakrishnudu (1982)

అందాల రాధికా.. నా కంటి దీపికా



చిత్రం :  గోపాల కృష్ణుడు  (1982)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  బాలు, సుశీల 


పల్లవి :


అందాల రాధికా.. నా కంటి దీపికా

నాకున్న కోరికా.. నువ్వేనే బాలికా

చందామామ పోలికా.. అందమివ్వు కానుకా

చందామామ పోలికా.. అందమివ్వు కానుకా 


గోపాలకృష్ణుడా.. గోపెమ్మకిష్టుడా

వ్రేపల్లే వీధిలో వెంటాడే కిష్టుడా

వెన్నెలమ్మ చాటుగా.. వేణూవైన బాలుడా

వెన్నెలమ్మ చాటుగా.. వేణూవైన బాలుడా


చరణం 1 :


వయసు వేయదు వాయిదాలను.. 

వలపు కలపక తప్పదులే

అసలు తీరదు ఇతర పనులకు.. 

ముసురుకున్నది మనసేలే

కనులకు మాటొచ్చి కౌగిలి ఇమ్మంటే..

కౌగిలిలో గాలి.. వడగాలౌతోంటే

కలవమన్నవి.. కలవరింతలు

విచ్చలవిడిగా వెచ్చని ఒడిలో.. 

ఈ ప్రేమ గుడిలో.. పరువాల సడిలో...


అందాల రాధికా..అహహ..హా

నా కంటి దీపికా..అహహ..హా


వ్రేపల్లే వీధిలో వెంటాడే కిషుడా

వెన్నెలమ్మ చాటుగా.. వేణూవైన బాలుడా 


చందామామ పోలికా.. అందమివ్వు కానుకా



చరణం 2 :


ఎండ వెన్నెల దండలల్లెను... 

గుబురేగిన గుండెలలో..

అక్కడక్కడ చుక్క పొడిచెను... 

మసక కమ్మిన మనసులలో

సనసన జాజులలో.. సణిగిన మోజులలో

కలబడు చూపులలో... వినబడు ఊసులలో

పలుకుతున్నవి చిలక పాపలు

చిక్కని చలిలో చక్కిలిగిలిగా.. 

ఈ తీపి సొదలే.. ఈనాటి కథగా


గోపాలకృష్ణుడా.. గోపెమ్మకిష్టుడా

వ్రేపల్లే వీధిలో.. వెంటాడే కిష్టుడా

వెన్నెలమ్మ చాటుగా.. వేణూవైన బాలుడా

వెన్నెలమ్మ చాటుగా.. వేణూవైన బాలుడా


అందాల రాధికా.. నా కంటి దీపికా

నాకున్న కోరికా.. నువ్వేనే బాలికా

చందామామ పోలికా.. అందమివ్వు కానుకా

చందామామ పోలికా.. అందమివ్వు కానుకా


పాటల ధనుస్సు  


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు