మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులూ
రచన : రాజశ్రీ,
సంగీతం : ఇళయరాజా,
గానం : SP బాలు,
చిత్రం : ఓ పాపా లాలీ (1990)
మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులూ
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలూ
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే వలపు పంటరా
వెన్నెలల్లే పూలు విరిసి తేనెలు చిలికెను
చెంత చేరి ఆదమరిచి ప్రేమను కొసరెను
చందనాలు జల్లు కురిసే చూపులు కలిసెను
చందమామ పట్టపగలే నింగిని పొడిచెను
కన్నెపిల్ల కలలే నాకిక లోకం
సన్నజాజి కళలే మోహన రాగం
చిలకల పలుకులు అలకల ఉలుకులు
నా చెలి సొగసలు నన్నే మరిపించే !
మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులూ
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలూ
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే వలపు పంటరా
ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు
ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు
హరివిల్లు లోని రంగులు నా చెలి సొగసులు
వేకువల మేలు కొలుపే నా చెలి పిలుపులు
సందెవేళ పలికే నాలో పల్లవి
సంతసాల సిరులే నావే అన్నవి
ముసి ముసి తలపులు తరగని వలపులు
నా చెలి సొగసులు అన్నీ ఇక నావే !
మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులూ
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలూ
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే వలపు పంటరా
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి