RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

30, జనవరి 2023, సోమవారం

సాగే అలలపైన ఊగే చందమామ | Sage Alalapaina Ooge chandamama | Song Lyrics | Jaganmohini (1978)

సాగే అలలపైన ఊగే చందమామ



చిత్రం : జగన్మోహిని (1978)

సంగీతం : విజయకృష్ణమూర్తి

గీతరచయిత : సినారె

నేపథ్య గానం : బాలు, సుశీల



పల్లవి :


సాగే అలలపైన... ఊగే చందమామ

సాగే అలలపైన... ఊగే చందమామ

మనసు కలువలో చూడు...  

దాగున్నాడు ఈ చందమామ

మనసు కలువలో చూడు... 

దాగున్నాడు..ఈ చందమామ

సాగే అలలపైన... ఊగే చందమామ


చరణం 1 :


ఎగిసే చినుకులలో...  అర తడిసిన వెన్నెలలో

ఎగిసే చినుకులలో...  అర తడిసిన వెన్నెలలో

ఆ తడిసిన వెన్నెల ముడివేయించిన 

సడలని కౌగిలిలో... చలిలో

నులి వేడి కలలు కందామా

సాగే అలలపైన... ఊగే చందమామ



చరణం 2 :


వలచిన గుండెలలో... వెలికుబికిన పొంగులలో

వలచిన గుండెలలో... వెలికుబికిన పొంగులలో

ఆ ఉబికిన పొంగుల మాటున దాగని

ఊహల అలజడిలో ... జడిలో

చెలరేగి..రేగి పోదామా


సాగే అలలపైన... ఊగే చందమామ

మనసు కలువలో చూడు...  

దాగున్నాడు ఈ చందమామ

సాగే అలలపైన... ఊగే చందమామ


తందానే.. తందానేతందానే 

తందానేతందానేతందానే.. 

తందానేతందానే తందానేతందానే


పాటల ధనుస్సు  


28, జనవరి 2023, శనివారం

ఆనందం అబ్బాయిదైతే | Ananam Abbayaithe | Song Lyrics | Manushulu Chesina Dongalu (1977)

ఆనందం అబ్బాయిదైతే



చిత్రం :  మనుషులు చేసిన దొంగలు (1977)

సంగీతం :  సత్యం

గీతరచయిత  :  ఆరుద్ర

నేపధ్య గానం :  బాలు, సుశీల 


పల్లవి :


ఆనందం అబ్బాయిదైతే.. 

అనురాగం అమ్మాయిదైతే

ఎడబాటు ఉండదు ఏనాటికి.. 

ఇది నిజము ముమ్మాటికి


ఆనందం అబ్బాయిదైతే.. 

అనురాగం అమ్మాయిదైతే

ఎడబాటు ఉండదు ఏనాటికి.. 

ఇది నిజము ముమ్మాటికి

ఆహా..ఆహా..హా... లా..లా....లలలా



చరణం 1 :


నేనే దొంగనైతే... నువ్వు నన్నే దోచినావు..హా

దోచీ దాచుకున్నా.. నేను నీకై వేచి ఉన్నా


నీ కోసమే నేను జీవించుతా

నీ కోసమే నేను జీవించుతా

నీ గుండెలోనే నిదురించుతా 


ఆనందం అబ్బాయిదైతే.. 

అనురాగం అమ్మాయిదైతే

ఎడబాటు ఉండదు ఏనాటికి.. 

ఇది నిజము ముమ్మాటికి



చరణం 2 :


నీవే రాధవైతే... ఇక నాదే రాసలీల

నేనే వేణువైతే... ఇక నీవే రాగమాల

అందాల సీమా బృందావనం

అందాల సీమా బృందావనం

ఆ సీమలోనే మన జీవితం 



ఆనందం అబ్బాయిదైతే.. 

అనురాగం అమ్మాయిదైతే

ఎడబాటు ఉండదు ఏనాటికి.. 

ఇది నిజము ముమ్మాటికి

ఇది నిజము ముమ్మాటికి... 

ఇది నిజము ముమ్మాటికి


పాటల ధనుస్సు  


27, జనవరి 2023, శుక్రవారం

నీవే నీవే ఓ ప్రియా | Neeve neeve O Priya | Song Lyrics | Manushulu Chesina Dongalu (1977)

నీవే.. నీవే.. ఓ ప్రియా




చిత్రం :  మనుషులు చేసిన దొంగలు (1977)

సంగీతం :  సత్యం

గీతరచయిత  :  డా. సినారె 

నేపధ్య గానం :  రామకృష్ణ, సుశీల 



పల్లవి :


నీవే.. నీవే.. ఓ ప్రియా

నా మది పలికిన మోహనగీతివి నీవే సుమా

నేనేలే ప్రియా... నీవేలే సుమా...  నేనేలే ప్రియా... 



చరణం 1 :


అలలై ఊగే ఈ పూలలో... కలలై మూగే ఈ వేళలో

నను పిలిచే కోరిక నీవే...  నను పిలిచే కోరిక నీవే


పగలు  రేయి నా ధ్యానమై... ఏనాడైనా నాదానవై

నను తలచే రాధిక నీవే... నను తలచే రాధిక నీవే

ఆ.. ఆ... ఆ...ఆ...


నీవే.. నీవే.. ఓ ప్రియా

నా మది పలికిన మోహనగీతివి నీవే సుమా

నేనేలే ప్రియా... నీవేలే సుమా...  నేనేలే ప్రియా... 



చరణం 2 :


పావన జీవన తీరాలలో...ఊహల కోయిల రాగలలో

నను కొలిచే దేవివి నీవే... నను కొలిచే దేవివి నీవే


అనురానికి వేదానివై... నా హృదయానికి నాదానివై

నను వలచే దైవము నీవే... నను వలచే దైవము నీవే

ఆ... ఆ.. ఆ ... ఆ... 


నీవే.. నీవే.. ఓ ప్రియా

నా మది పలికిన మోహనగీతివి నీవే సుమా

నేనేలే ప్రియా... నీవేలే సుమా...  నేనేలే ప్రియా...


పాటల ధనుస్సు 


26, జనవరి 2023, గురువారం

తెలుసా నా మదిలో ఉన్నావని | Telusa na madilo vunnavani | Song Lyrics | Manushulu Chesina Dongalu (1977)

తెలుసా... నా మదిలో ఉన్నావని



చిత్రం :  మనుషులు చేసిన దొంగలు (1977)

సంగీతం :  సత్యం

గీతరచయిత  :   రాజశ్రీ

నేపధ్య గానం :  బాలు, సుశీల 


పల్లవి :


తెలుసా... నా మదిలో ఉన్నావని

తెలుసు... నీ మనసే నాదేనని

నీ చెలిమి.. నీ కలిమి.. దోపిడి చేస్తానని...


తెలుసా... నా మదిలో ఉన్నావని

తెలుసు... నీ మనసే నాదేనని  



చరణం 1 :


తీయని తేనెల గనులు.. నీ కనులు.. ఆ.. ఆ

తీరని వలపుల సిరులు ... నీ కురులు.. ఆహా

తీయని తేనెల గనులు.. నీ కనులు.. ఆ.. ఆ

తీరని వలపుల సిరులు ... నీ కురులు.. ఆహా


నీలోని అందాలు అన్నీ నావేనని...ఆ..

ఎలాగుంది మన బ్లేడు.. యమ స్పీడు


తెలుసా... నా మదిలో ఉన్నావని

తెలుసు... నీ మనసే నాదేనని 




చరణం 2 :


తొలకరి ఊహలు సాగే.. చెలరేగే..

గడసరి వయసే ఉరికే.. నీ కొరకై

తొలకరి ఊహలు సాగే.. చెలరేగే..

గడసరి వయసే ఉరికే.. నీ కొరకై


వెచ్చని నీ ఒడిలోనా వేడుక తీరాలనీ... అహా

ఎలాగుంది మన బ్లేడు.. అసలు తెగందే...


తెలుసు... నా మదిలో ఉన్నావని

తెలుసా... నీ మనసే నాదేనని



చరణం 3 :


కమ్మని కలలా నీవూ... వచ్చాను

చెరగని కథలా నాలో... నిలిచాను

కమ్మని కలలా నీవూ... వచ్చావు

చెరగని కథలా నాలో... నిలిచావు



ఏహే..నిలిచాను..వలచాను... 

నిన్నే గెలిచాను..

ఎలాగుంది మన బ్లేడు.. యమ స్పీడు


తెలుసా... నా మదిలో ఉన్నావని

తెలుసు... నీ మనసే నాదేనని


పాటల ధనుస్సు 

 

మనసెందుకో మమతెందుకో | Manishenduko Mamathenduko | Song Lyrics | Manushulu Chesina Dongalu (1977)

మనసెందుకో మమతెందుకో



చిత్రం :  మనుషులు చేసిన దొంగలు (1977)

సంగీతం :  సత్యం

గీతరచయిత  :  ఆరుద్ర

నేపధ్య గానం :  సుశీల 



పల్లవి :


మనసెందుకో... మమతెందుకో.. 

ఓ మోసగాడా.. ఒహో మోసగాడా

మనసే లేని.. మమతే లేని.. 

నీలాంటి మనిషెందుకో..ఓ...

ఓ మోసగాడా.. ఒహో మోసగాడా



చరణం 1 :


మనసార నమ్మానురా... 

నన్నమ్మి పోయావురా

నీ తోడు కోరానురా.. నీ నీడ నిలిచానురా

తోడు నీడ జాడ కూడా లేకుండ చేశావురా 


మనసెందుకో... మమతెందుకో.. 

ఓ మోసగాడా.. ఒహో మోసగాడా 



చరణం 2 :


ఓ... తొలివలపు విలువేమిటో.. 

నీ మనసు ఏమురుగురా

కన్నీటి కథ ఏమిటో... చినదానికే తెలుసురా

కన్నె మనసు గాయ పరచి జ్వాల రేపావురా

కన్నె మనసు గాయ పరచి జ్వాల రేపావురా



మనసెందుకో... మమతెందుకో.. 

ఓ మోసగాడా.. ఒహో మోసగాడా

మనసే లేని మమతే లేని 

నీలాంటి మనిషెందుకో..ఓ...

ఓ మోసగాడా.. ఒహో మోసగాడా... 

ఒహో మోసగాడా


పాటల ధనుస్సు 

 

25, జనవరి 2023, బుధవారం

రథమొస్తున్నది రాణొస్తున్నది | Radhamostunnadi | Song Lyrics | Moodu puvvulu Aru Kayalu (1079)

రథమొస్తున్నది రాణొస్తున్నది



చిత్రం :  మూడు పువ్వులు-ఆరుకాయలు (1979)

సంగీతం : సత్యం

గీతరచయిత : సినారె

నేపధ్య గానం : సుశీల



పల్లవి  :


రథమొస్తున్నది రాణొస్తున్నది... 

తొలగండోయ్ పక్కకు తొలగండోయ్

ఈ ఊరి రాదారి నాదండోయ్... 

ఈ ఊరి రాదారి నాదేనండోయ్ 



రథమొస్తున్నది రాణొస్తున్నది... 

తొలగండోయ్ పక్కకు తొలగండోయ్

ఈ ఊరి రాదారి నాదండోయ్... 

ఈ ఊరి రాదారి నాదేనండోయ్ 


ఛల్నీ... ఛల్నీ 



చరణం 1 : 



నేన్ననది మాట... నేన్నున్నది కోట

నా పెన్నిధి ఒకటే... అది నవ్వుల మూట

నేన్ననది మాట... నేన్నున్నది కోట

నా పెన్నిధి ఒకటే... అది నవ్వుల మూట 



నా నీడపడితే చాలు వేకువ ముందే వెలుగండోయ్

నా నీడపడితే చాలు వేకువ ముందే వెలుగండోయ్


ఈ నేల ఆ నీరు నాదండోయ్

ఈ నేల ఆ నీరు నాదేనండోయ్ 


 

రథమొస్తున్నది రాణొస్తున్నది...  

తొలగండోయ్ పక్కకు తొలగండోయ్

ఈ ఊరి రాదారి నాదండోయ్... 

ఈ ఊరి రాదారి నాదేనండోయ్ 

ఛల్నీ... ఛల్నీ 



చరణం 2 :


నా చూపే వాడి... నా తీరే రౌడి

హే.. నన్నెదిరించే నాథుడు ఏడి?

నా చూపే వాడి... నా తీరే రౌడి

హే.. నన్నెదిరించే నాథుడు ఏడి?



నా పేరు చెబితే చాలు పోకిరిగాళ్ళకు హడలండోయ్

నా పేరు చెబితే చాలు పోకిరిగాళ్ళకు హడలండోయ్


ఉసి అయినా విసురైనా నాదండోయ్

ఉసి అయినా విసురైనా నాదేనండోయ్  




రథమొస్తున్నది రాణొస్తున్నది.. 

తొలగండోయ్ పక్కకు తొలగండోయ్

ఈ ఊరి రాదారి నాదండోయ్... 

ఈ ఊరి రాదారి నాదేనండోయ్



ఛల్నీ... ఛల్నీ ... ఛల్నీ... ఛల్నీ


పాటల ధనుస్సు  


20, జనవరి 2023, శుక్రవారం

చూశాక నిను చూశాక | Chusaka ninu chusaka | Song Lyrics | Ramudu Kadu Krishnudu (1983)

చూశాక నిను చూశాక



చిత్రం :  రాముడు కాదు కృష్ణుడు (1983)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  దాసరి

నేపధ్య గానం :   బాలు, సుశీల 


సాకీ : 


ఒక సంధ్యా సమయాన..దిక్కు తోచక

నే దిక్కులన్నీ చూచుచుండా...

ఉత్తర దిక్కున మెరిసెను ఒక తారక..

అది తారకో...మేనకో...నా అభిసారికో...



పల్లవి :


చూశాక నిను చూశాక...

చూశాక నిను చూశాక

ఆగలేక మనసాపుకోలేక 

రాశాను ఒక లేఖ

అందుకో ఈ ప్రేమలేఖా...

అందించు శుభలేఖ...


చూశాక నిను చూశాక... 


చరణం 1:


అందమంతా ఏర్చి కూర్చి 

అక్షరాలుగ పేర్చినాను

అందమంతా ఏర్చి కూర్చి 

అక్షరాలుగ పేర్చినాను

మనసులోనికి తొంగి చూసి 

భావమంతా కూర్చినాను

మనసులోనికి తొంగి చూసి 

భావమంతా కూర్చినాను


నీ కనులలో నా కనులు కలిపినాను

నీ అడుగులో నేనడుగు వేసినాను

ఈ ఉత్తరం నా జీవితం ...

నీ సంతకం నా జాతకం


చూశాక నిను చూశాక...

చూశాక నిను చూశాక

ఆగలేక మనసాపుకోలేక 

రాశాను ఒక లేఖ

అందుకో ఈ ప్రేమలేఖా...

అందించు శుభలేఖ  



చరణం 2 :


భావమంతా మార్చి మార్చి 

భారతంలా చదువుకున్నా

భావమంతా మార్చి మార్చి 

భారతంలా చదువుకున్నా

బరువు గుండెల రాత చూసి 

బాధనంతా పోల్చుకున్నా

బరువు గుండెల రాత చూసి 

బాధనంతా పోల్చుకున్నా


నీ చూపులో నా రూపు చూసినాను

నా గుండెలో నీ మూర్తి నిలిపినాను

ఈ మాటలే నా ఉత్తరం... 

ఈ పిలుపులే నా సంతకం...


చూశాక నిను చూశాక... 

చూశాక నిను చూశాక

ఆగలేక మనసాపుకోలేక... 

చూశాను నీ లేఖ

చదివాలే చేవ్రాలు దాక... 

పంపిస్తా శుభలేఖ...


చూశాక నిను చూశాక...

ఆగలేక మనసాపుకోలేక..

రాశాను ఒక లేఖ...చూశాను ఆ లేఖ


పాటల ధనుస్సు  


19, జనవరి 2023, గురువారం

ఒక లైలా కోసం తిరిగాను దేశం | Oka Laila kosam | Song Lyrics | Ramudu kadu Krishnudu (1983)

ఒక లైలా కోసం తిరిగాను దేశం



చిత్రం :  రాముడు కాదు కృష్ణుడు (1983)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  దాసరి

నేపధ్య గానం :  బాలు, సుశీల  


పల్లవి :


ఒక లైలా కోసం.. తిరిగాను దేశం

ఒక లైలా కోసం.. తిరిగాను దేశం

ప్రతి రోజూ.. ప్రతి రాత్రీ .. 

ప్రతి పాటా.. ఆమె కోసం

లైలా... లైలా... లైలా


ఒక మజ్ఞూ కోసం వెతికాను లోకం

ఒక మజ్ఞూ కోసం వెతికాను లోకం

ప్రతి పగలూ ప్రతి రాత్రీ 

ప్రతి తలపూ అతని కోసం

మజ్ఞూ... మజ్ఞూ... మజ్ఞూ


ఒక లైలా కోసం తిరిగాను దేశం



చరణం 1 :


ఆకాశానికి నిచ్చెన వేసీ... 

చుక్కల పట్టుకొనడిగానూ

లైలా ఏదనీ.. నా లైలా ఏదనీ...

స్వర్గానికి నే దారులు వెతికీ.. 

ఇంద్రుని పట్టుకొనడిగానూ

లైలా ఏదనీ.. నా లైలా ఏదనీ


దిక్కుల నడుమా నేనుంటే.. 

చుక్కల పట్టుకొనడిగావూ

కన్నుల ముందూ నేనుంటే.. 

కన్నులు మూసుకు వెదికావూ

ప్రతి చూపూ ప్రతి పిలుపూ... 

ప్రతి చోటా నీ కోసం


ఒక మజ్ఞూ కోసం వెతికాను లోకం

ప్రతి పగలూ.. ప్రతి రాత్రీ.. 

ప్రతి తలపూ అతని కోసం

లైలా...లైలా...లైలా

ఒక లైలా కోసం.. తిరిగాను దేశం


చరణం 2 :


పగలూ రేయీ పందెం వేసీ.. 

సృష్టిని పట్టుకు బ్రతిమాలాయి

మజ్ఞూ ఏడనీ.. నా మజ్ఞూ ఏడనీ

రంభా ఊర్వశి ధైర్యం చేసీ.. 

స్వర్గం విడిచీ వచ్చారూ

లైలా నేననీ.. హహహ.. ఆ లైలా నేననీ


ఇల్లూ వాకిలి వదిలొస్తే 

రంభా ఊర్వశి అంటావూ

నీ కోసం నే పుట్టొస్తే.. 

ఎవ్వరి వెంటో పడతావూ

ప్రతి పగలూ.. ప్రతి రాత్రీ.. 

ప్రతి తలపూ నీ కోసం


ఒక మజ్ఞూ కోసం వెతికాను లోకం

ప్రతి పగలూ.. ప్రతి రాత్రీ .. 

ప్రతి తలపూ అతని కోసం

మజ్ఞూ...మజ్ఞూ...మజ్ఞూ

ఒక లైలా కోసం తిరిగాను దేశం

ప్రతి రోజూ.. ప్రతి రాత్రీ.. 

ప్రతి పాటా.. ఆమె కోసం

లైలా...లైలా...లైలా


పాటల ధనుస్సు  


మంచు ముత్యానివో | Manchu Mutyanivo | Song Lyrics | Ramudu Kadu Krishnudu (1983)

మంచు ముత్యానివో



చిత్రం : రాముడు కాదు కృష్ణుడు (1983)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  దాసరి

నేపధ్య గానం :  బాలు


పల్లవి :


మంచు ముత్యానివో..హంపి రతనానివో..ఓ..ఓ..

తెలుగు వాకిట వేసిన ముగ్గువో...

ముగ్గు నడుమన విరిసిన ముద్దబంతి పువ్వువో ..ఓ..

మంచు ముత్యానివో..హంపి రతనానివో..

తెలుగు వాకిట వేసిన ముగ్గువో...

ముగ్గు నడుమన విరిసిన ముద్దబంతి పువ్వువో


మంచు ముత్యానివో..



చరణం 1 :


తెలుగు బడిలో తొలుత చుట్టిన శ్రీకారానివో

జానపదమున తీపి కలిపిన నుడికారానివో

గాలి వాటుకు..ఎండ పోటుకు..

తాళలేని ఆకు చాటు పిందెవో

కూచిపూడి కొమ్మవో...కొండపల్లి బొమ్మవో...

ప్రణయ మూర్తుల రాగ ప్రమిదకు..

ప్రమిద ప్రమిదలో వెలుగు ప్రేమకు

ప్రతిగా.. కృతిగా.. ఆకృతిగా.. నిలిచే సుందరివో


మంచు ముత్యానివో..ఓ..హంపి రతనానివో..ఓ..

తెలుగు వాకిట వేసిన ముగ్గువో

ముగ్గు నడుమన విరిసిన ముద్దబంతి పువ్వువో

మంచు ముత్యానివో..ఓ..   



చరణం 2 :


కాళిదాసుని కావ్యకవితకు ఆకారానివో

దేవరాయని శిల్ప చరితకు ప్రాకారానివో

రెప్ప పాటుకు ..లిప్త చూపుకు..

అందరాని అందమైన మెరుపువో

మెరుపులోని పిలుపువో..పిలుపులోని తలపువో..

విరగబూసిన నిండు పున్నమికి..

తిరగబోసిన పండు వెన్నెలకు

ప్రతిగా.. కృతిగా ..ఆకృతిగా .. నిలిచే సుందరివో


మంచు ముత్యానివో..ఓ..హంపి రతనానివో..ఓ..

తెలుగు వాకిట వేసిన ముగ్గువో..

ముగ్గు నడుమన విరిసిన ముద్దబంతి పువ్వువో..ఓ..

మంచు ముత్యానివో..ఓ..


పాటల ధనుస్సు  


16, జనవరి 2023, సోమవారం

ఏనాటికైన ఈ మూగ వీణా | Enatikaina ee mooga veena | Song Lyrics | Jarigina Katha (1969)

ఏనాటికైన.. ఈ మూగ వీణా



చిత్రం :  జరిగిన కథ (1969)

సంగీతం  :  ఘంటసాల

గీతరచయిత  :  సినారె

నేపధ్య గానం  :  సుశీల 



పల్లవి :


కృష్ణా..ఆ... ఆ..

కృష్ణా..ఆ... ఆ..

కృష్ణా..ఆ... ఆ..

ఏనాటికైన.. ఈ మూగ వీణా

రాగాలు పలికి రాణించునా.. ఆ.. ఆ.. ఆ

రాణించునా.. ఆ.. ఆ..


ఏనాటికైన.. ఈ మూగ వీణా

రాగాలు పలికి రాణించునా.. ఆ.. ఆ.. ఆ

రాణించునా.. ఆ.. ఆ.. 


చరణం 1 :


నిను చేరి నా కథ వినిపించలేను

ఎదలోని వేదన ఎలా తెలుపను

నిను చేరి నా కథ వినిపించలేను

ఎదలోని వేదన ఎలా తెలుపను


మనసేమో తెలిసి మనసార పిలిచి

మనసేమో తెలిసి మనసార పిలిచి

నీలోన నన్నే నిలుపుము స్వామి


ఏనాటికైన.. ఈ మూగ వీణా

రాగాలు పలికి రాణించునా.. ఆ.. ఆ.. ఆ

రాణించునా.. ఆ.. ఆ.. 


చరణం 2 : 


ఏ వన్నె లేని ఈ చిన్ని పూవు

నా స్వామి మెడలో నటియించునా

ఏ వన్నె లేని ఈ చిన్ని పూవు

నా స్వామి మెడలో నటియించునా


ఎలాటి కానుక తేలేదు నేను

ఎలాటి కానుక తేలేదు నేను

కన్నీట పాదాలు కడిగేను స్వామి


ఏనాటికైన.. ఈ మూగ వీణా

రాగాలు పలికి రాణించునా.. ఆ.. ఆ.. ఆ

రాణించునా.. ఆ.. ఆ..


కృష్ణా..ఆ... ఆ..కృష్ణా..ఆ... ఆ.. కృష్ణా..ఆ... ఆ..


పాటల ధనుస్సు  


14, జనవరి 2023, శనివారం

భలే మంచిరోజు పసందైన రోజు | Bhale Manchi Roju | Song Lyrics | Jarigina Katha (1969)

భలే మంచిరోజు పసందైన రోజు



చిత్రం: జరిగిన కథ ( 1969 ) 

సంగీతం: ఘంటసాల 

గీతరచయిత: సినారె 

నేపధ్య గానం: ఘంటసాల 


పల్లవి: 


భలే మంచిరోజు.. పసందైన రోజు.. 

వసంతాలు పూచే నేటిరోజు..ఆ..ఆయ్ 

వసంతాలు పూచే నేటిరోజు 

భలే మంచిరోజు.. పసందైన రోజు.. 

వసంతాలు పూచే నేటిరోజు.. 

వసంతాలు పూచే నేటిరోజు 


చరణం 1: 


గుండెలోని కోరికలన్నీ 

గువ్వలుగా ఎగిసిన రోజు 

గువ్వలైన ఆ కోరికలే 

గూటిలోన చేరిన రోజు 

గుండెలోని కోరికలన్నీ 

గువ్వలుగా ఎగిసిన రోజు 

గువ్వలైన ఆ కోరికలే 

గూటిలోన చేరిన రోజు 


నింగిలోని అందాలన్నీ 

ముంగిటిలోనే నిలిచినరోజు 


చరణం 2: 


చందమామ అందినరోజు 

బృందావని నవ్వినరోజు 

తొలివలపులు చిలికినరోజు 

కులదైవం పలికిన రోజు 

చందమామ అందినరోజు 

బృందావని నవ్వినరోజు 

తొలివలపులు చిలికినరోజు 

కులదైవం పలికిన రోజు 


కన్నతల్లి ఆశలన్నీ 

సన్నజాజులై విరిసినరోజు


పాటల ధనుస్సు  


తోడుగ నీవుంటే నీ నీడగ నేనుంటే | Thoduga neevunte | Song Lyrics | Jarigina Katha (1969)

తోడుగ నీవుంటే నీ నీడగ నేనుంటే



చిత్రం : జరిగిన కథ (1969)

సంగీతం : ఘంటసాల

గీతరచయిత : సినారె

నేపధ్య గానం : ఘంటసాల, సుశీల


పల్లవి :


తోడుగ నీవుంటే..నీ నీడగ నేనుంటే

ప్రతి ఋతువు..అహా..మధుమాసం..ఆ..

ప్రతి రేయీ మనకోసం..ఓ ఓ ఓ ఓ..మనకోసం


తోడుగ నీవుంటే..నీ నీడగ నేనుంటే

ప్రతి ఋతువు..అహా..మధుమాసం..ఆ..

ప్రతి రేయీ మనకోసం..ఓ ఓ ఓ ఓ..మనకోసం

మనకోసం.. 



చరణం 1 :


కదలే పిల్లగాలి..  శ్రీగంధం చిలికిపోతుందీ

కదలే పిల్లగాలి..శ్రీగంధం చిలికిపోతుందీ

విరిసే నిండు జాబిలి.. నునువెన్నెలపానుపు వేస్తుందీ

విరిసే నిండు జాబిలి.. నునువెన్నెలపానుపు వేస్తుందీ

మదిలో కోయిల పాడుతుంది..

మమతల ఊయల ఊగుతుందీ... ఊగుతుంది..


తోడుగ నీవుంటే..నీ నీడగ నేనుంటే

ప్రతి ఋతువు..ఆఆ..మధుమాసం..ఆ..

ప్రతిరేయీ మనకోసం..ఓ ఓ ఓ ఓ..మనకోసం

మనకోసం.. 


చరణం 2 : 


కనులే వేచి వేచి..కమకమ్మగా కలలు కంటాయీ

కనులే వేచి వేచి..కమకమ్మగా కలలు కంటాయీ

కలలే తొంగిచూసి..బిగికౌగిలిలో దాగుంటాయీ

కలలే తొంగిచూసి..బిగికౌగిలిలో దాగుంటాయీ

వలపులనావ సాగుతుందీ..

వెలుగుల తీరం చేరుతుందీ... చేరుతుందీ


తోడుగ నీవుంటే..నీ నీడగ నేనుంటే

ప్రతి ఋతువు..మధుమాసం

ప్రతిరేయీ మనకోసం..ఓ ఓ ఓ ఓ..మనకోసం

మనకోసం..

ఆహహ ఆహా ఆహహా ఆహహ ఆహా ఆహహా


పాటల ధనుస్సు  


10, జనవరి 2023, మంగళవారం

వేళ చూస్తే సందె వేళ | Vela Chuste Sandevela | Song Lyrics | Jagat Kiuladeelu (1969)

వేళ చూస్తే సందె వేళ



చిత్రం: జగత్ కిలాడీలు (1969)

సంగీతం: కోదండపాణి

గీతరచయిత: దేవులపల్లి

నేపధ్య గానం: బాలు, సుశీల


పల్లవి:


వేళ చూస్తే సందె వేళ.. 

గాలి వీస్తే పైరగాలి

వేళ చూస్తే సందె వేళ.. 

గాలి వీస్తే పైరగాలి

ఏల ఒంటరి తోటకడకు

ఎందుకొరకూ..ఊ.. ఎందుకొరకూ


కళ్ళు కప్పే రాత్రి వేళ.. 

ఒళ్ళునిమిరే పిల్ల గాలి

కళ్ళు కప్పే రాత్రి వేళ.. 

ఒళ్ళునిమిరే పిల్ల గాలి

మెల్ల మెల్లన తోట పిలిచే

అందుకొరకే..ఏ.. అందుకొరకే


చరణం 1:


అచ్చంగా వసంతమాసం వచ్చేదాకా

వెచ్చన్ని పూదేనియలు తెచ్చేదాకా

అచ్చంగా వసంతమాసం వచ్చేదాకా

వెచ్చన్ని పూదేనియలు తెచ్చేదాకా

పెదవి పెదవి.. ఎదురై ఎదురై..

పెదవి పెదవి.. ఎదురై ఎదురై..

మధువులు వెదికే వేళా.. 

మగువా అదియే వసంత వేళా


వేళ చూస్తే సందె వేళ.. 

గాలి వీస్తే పైరగాలి

ఏల ఒంటరి తోటకడకు

ఎందుకొరకూ..ఊ.. ఎందుకొరకూ


చరణం 2:


రెప్పల్లో దాగిన చూపులు చెప్పేదేమిటో

గుండెల్లో గుస గుస లాడే కోరిక లేమిటో

రెప్పల్లో దాగిన చూపులు చెప్పేదేమిటో

గుండెల్లో గుస గుస లాడే కోరిక లేమిటో

రారా.. వెంటనే..

రారా వెంటనే పొదరింటికి.. 

ఇక రాదురా నిదుర.. నా కంటికీ


కళ్ళు కప్పే రాత్రి వేళ.. 

ఒళ్ళునిమిరే పిల్ల గాలి

మెల్ల మెల్లన తోట పిలిచే

అందుకొరకే..ఏ.. అందుకొరకే


వేళ చూస్తే సందె వేళ.. 

గాలి వీస్తే పైరగాలి

ఏల ఒంటరి తోటకడకు

ఎందుకొరకూ..ఊ.. ఎందుకొరకూ


పాటల ధనుస్సు  


9, జనవరి 2023, సోమవారం

గట్టుకాడ ఎవరో చెట్టునీడ ఎవరో | Gattukada Evaro | Song Lyrics | Bangaru Panjaram (1969)

గట్టుకాడ ఎవరో చెట్టునీడ ఎవరో



చిత్రం : బంగారు పంజరం (1969)

సంగీతం : ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత : దేవులపల్లి

నేపధ్య గానం : జానకి



పల్లవి :


గట్టుకాడ... ఎవరో... చెట్టునీడ... ఎవరో

నల్లకనుల నాగసొరము ఊదేరు...  ఎవరో


గట్టుకాడ ఎవరో... చెట్టునీడ ఎవరో

నల్లకనుల నాగసొరము ఊదేరు..  ఎవరో



చరణం 1 :


ఓ...ఓ...

పోటుపాటు సూసుకొని ఏరు దాటి రావాలా

ముళ్ళు రాళ్ళు ఏరుకోని మందతోవ నడవాలా

ఆగలేక రాచకొడక సైగ చేసెవెందుకో... సైగెందుకూ...


ఏటిగట్టుకాడ... మావిచెట్టునీడ... ఎవరో... ఎవరో

నల్లకనుల నాగసొరము ఊదేరు..  ఎవరో



చరణం 2 :


ఓ...ఓ..

పైరుగాలి పడుచుపైటా... పడగలేసి ఆడేను

గుండె పైనీ గుళ్ళ పేరు ఉండలేక ఊగేను


తోపు ఎనక రాచకొడక తొంగి చూసేవెందుకో...

నీవెందుకూ... సైగెందుకూ... 


ఏటిగట్టుకాడ... మావిచెట్టునీడ... ఎవరో... ఎవరో

నల్లకనుల నాగసొరము ఊదేరు..  ఎవరో..


పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు