కుడికన్ను కొట్టగానే
చిత్రం : దేవత (1982)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
కుడికన్ను కొట్టగానే కుర్రాణ్ణి...
ఎడం కన్ను కొట్టగానే ఎర్రోణ్ణి
కుడికన్ను కొట్టగానే కుర్రాణ్ణి...
ఎడం కన్ను కొట్టగానే ఎర్రోణ్ణి
ఆ రెండు కళ్ళు కొట్టరాదా...
నన్ను రెచ్చగొట్టి చూడరాదా
వంకాయ్.. హోయ్.. హోయ్
కుడికన్ను కొట్టగానే కుర్రోడా...
ఎడంకన్ను కొట్టుకుంది పిల్లోడా
కుడికన్ను కొట్టగానే కుర్రోడా...
ఎడంకన్ను కొట్టుకుంది పిల్లోడా
ఆ రెండుకళ్ళు కొట్టనేలా...
ఈ గుండె తలుపు తట్టనేలా
వంకాయ్.. హోయ్.. హోయ్...
కుడికన్ను కొట్టగానే కుర్రాణ్ణి...
ఎడంకన్ను కొట్టుకుంది పిల్లోడా
చరణం 1 :
గుమ్మా ముద్దుగుమ్మా...
ముద్దు గుమ్మాలు దాటింది లెమ్మంటా
అరే... అమ్మో.. ఎవడి సొమ్మో...
దాచుకోకమ్మో... దోచాలి రమ్మంటా
జోరుగా.. నీరునారుగా పచ్చపైరల్లే
ఉర్రూతలూగాలంటా
ఊగాలా... తత్తరపడి విచ్చలవిడి ఉయ్యాలా...
నిద్దరచెడి ముద్దరపడి పొద్దుల గురి తప్పాలా
ముద్దుల ముడి విప్పాలా... అల్లరి పడి సందేలా
మల్లెలతో చెప్పాలా...
వంకాయ్.. హోయ్.. హోయ్
కుడికన్ను కొట్టగానే కుర్రోడా...
ఎడంకన్ను కొట్టుకుంది పిల్లోడా
ఆ రెండు కళ్ళు కొట్టరాదా...
నన్ను రెచ్చగొట్టి చూడరాదా
చరణం 2 :
బుగ్గో..పూతమొగ్గో...
కొత్తబేరాలు కోరింది రమ్మంటా
అహ.. సిగ్గో చిలిపి ముగ్గో
పట్టపగ్గాలు లేవంది తెమ్మంటా
జోడుగా ఏరు నీరుగా
పల్లెసీమల్లో ఊరేగి పోవాలంటా
రేగాలా.. బెత్తర చెలి చూపులు సుడి రేగాలా
నడిరాతిరి కొన ఊపిరి చక్కలిగిలి కావాలా
దిక్కులు చలికూగాలా ...
చుక్కలు దిగి రావాలా
మొక్కుబడులు చెయ్యాలా....
వంకాయ్... హోయ్.. హోయ్
కుడికన్ను కొట్టగానే కుర్రాణ్ణి...
ఎడం కన్ను కొట్టగానే ఎర్రోణ్ణి
కుడికన్ను కొట్టగానే కుర్రాణ్ణి...
ఎడం కన్ను కొట్టగానే ఎర్రోణ్ణి
ఆ రెండు కళ్ళు కొట్టరాదా...
నన్ను రెచ్చగొట్టి చూడరాదా
వంకాయ్.. హోయ్.. హోయ్... హోయ్...
కుడికన్ను కొట్టగానే కుర్రోడా...
ఎడంకన్ను కొట్టుకుంది పిల్లోడా
కుడికన్ను కొట్టగానే కుర్రోడా...
ఎడంకన్ను కొట్టుకుంది పిల్లోడా
ఆ రెండుకళ్ళు కొట్టనేలా...
ఈ గుండె తలుపు తట్టనేలా
పాటల ధనుస్సు