RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

17, నవంబర్ 2022, గురువారం

పడిలేచే కెరటం చూడు | Padi Leche Keratam Chudu | Song Lyrics | Gudachari 116 (1966)

పడిలేచే కెరటం చూడు



చిత్రం :  గూఢచారి 116 (1966)

సంగీతం : టి. చలపతిరావు

గీతరచయిత : ఆరుద్ర

నేపధ్య గానం : సుశీల 



పల్లవి : 


పడిలేచే కెరటం చూడు... 

పడుచుపిల్ల  బింకం చూడు

తొంగి చూచు సిగ్గులు చూడు... 

పొంగుతున్న అందం చూడు 


పడిలేచే కెరటం చూడు... 

పడుచుపిల్ల  బింకం చూడు

తొంగి చూచు సిగ్గులు చూడు... 

పొంగుతున్న అందం చూడు  



చరణం 1 :


వెన్నెల విరిసే వేళా... 

వన్నెలు మెరిసే వేళా

చందమామ పరుగులు చూడు... 

చల్లగాలి ఆరడి చూడు

చందమామ పరుగులు చూడు... 

చల్లగాలి ఆరడి చూడు

మిసమిసలా చిన్నలు చూడు... 

ఉసిగొలిపే హృదయం చూడు



పడిలేచే కెరటం చూడు... 

పడుచుపిల్ల  బింకం చూడు 

తొంగి చూచు సిగ్గులు చూడు... 

పొంగుతున్న అందం చూడు  

పడిలేచే కెరటం చూడు...



చరణం 2 :


పరులెవరూలేని చోటా... 

పరువాలు పూచే చోటా

తరుగుతున్న కాలం చూడు... 

పెరుగుతున్న ఆశలు చూడు

తరుగుతున్న కాలం చూడు... 

పెరుగుతున్న ఆశలు చూడు

మరుగులేని మమతలు చూడూ... 

మనసుంటే నన్నే కూడు 



పడిలేచే కెరటం చూడు... 

పడుచుపిల్ల  బింకం చూడు

తొంగి చూచు సిగ్గులు చూడు... 

పొంగుతున్న అందం చూడు

పడిలేచే కెరటం చూడు...


పాటల ధనుస్సు  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

నీలాల నింగిలోన పగడాల పందిరి | Neelala Ningilona | Song Lyrics | Daana Dharmalu (1976)

నీలాల నింగిలోన పగడాల పందిరి చిత్రం : దానధర్మాలు (1976) సంగీతం : మాస్టర్ వేణు గీతరచయిత : కొండిశెట్టి శ్రీ రామా రావ్  నేపధ్య గానం : ఎస్ పి బాల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు