నా కోసమే నీవున్నది
చిత్రం: అన్నదమ్ముల సవాల్ (1978)
సంగీతం: సత్యం
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: బాలు
పల్లవి:
హేయ్.. నా కోసమే నీవున్నది..ది..ది..ది..
ఆకాశమే ...హ...ఔనన్నది..ది...ది...ది..
మౌనం వద్దు... ఒక మాటైన ముద్దు
హాయ్ మతిపోతున్నది..ఈ...ఈ...ఈ...
నా కోసమే నీవున్నది..ది..ది..ది..
ఆకాశమే ...హ...ఔనన్నది..ది...ది...ది..
మౌనం వద్దు... ఒక మాటైన ముద్దు
హాయ్ మతిపోతున్నది..ఈ...ఈ...ఈ...
చరణం 1:
హ..హ్హ..అడుగు వేయకు రాజహంసలే
అదిరిపోయేనులే
తిరిగి చూడకు పడుచుగుండెలే
చెదిరిపోయేనులే
ఆ..హ హ.అడుగు వేయకు రాజ హంసలే
అదిరిపోయేనులే
తిరిగి చూడకు పడుచుగుండెలే
చెదిరిపోయేనులే..
వెచ్చని కోరిక నాలో మెరిసీ ...
విసిరేస్తున్నదీ..ఈ..ఈ...
నా కోసమే నీవున్నది ..ది..ది...ది..
ఆకాశమే ఔనన్నది..ది...ది..ది..
చరణం 2:
మొదట చూపిన మూతి విరుపులు...
తుదకు ఏమాయనే...హ..
అలక తొణకగా చినుకు చినుకుగా...
వలపు జల్లాయనే
మొదట చూపిన మూతి విరుపులు...
తుదకు ఏమాయనే
అలక తొణకగా చినుకు చినుకుగా...
వలపు జల్లాయనే
ఆ జల్లున తడిసిన అల్లరి వయసే...
జత నీవన్నదీ..హ...
నా కోసమే నీవున్నది..ది..ది..ది..
ఆకాశమే ఔనన్నదీ..ది..ది..ది..
మౌనం వద్దు... ఒక మాటైన ముద్దు
హాయ్ మతిపోతున్నదీ...
ఈ..ఈ..ఈ..ఈ..హహ..హా...
పాటల ధనుస్సు