RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

31, జనవరి 2022, సోమవారం

ఇలాగే ఇలాగే సరాగమాడితే | Ilage Ilage Saragamadithe | Song Lyrics | Vayasu Pilichindi (1978)

 ఇలాగే.. ఇలాగే.. సరాగమాడితే


చిత్రం :  వయసు పిలిచింది (1978)

సంగీతం :  ఇళయరాజా

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  బాలు, సుశీల 



పల్లవి :


ఇలాగే.. ఇలాగే.. సరాగమాడితే...

వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే..


ఇలాగే.. ఇలాగే.. సరాగమాడితే..

వయ్యారం.. ఈ యవ్వనం ఊయలూగునే... 


చరణం 1 :


వయసులో వేడుంది... మనసులో మమతుంది

వయసులో వేడుంది... మనసులో మమతుంది


మమతలేవో సుధామయం..మాటలేమో మనోహరం..

మదిలో మెదిలే మైకమేమో...


ఇలాగే.. ఇలాగే.. సరాగమాడితే..

వయ్యారం.. ఈ యవ్వనం ఊయలూగునే... 


చరణం 2 :


కంటిలో కదిలేవు... జంటగా కలిశావు

కంటిలో కదిలేవు... జంటగా కలిశావు..


నీవు నేను సగం సగం...కలిసిపోతే సుఖం సుఖం

తనువూ మనసు తనివి రేపునే...


ఇలాగే.. ఇలాగే.. సరాగమాడితే..

వయ్యారం.. ఈ యవ్వనం ఊయలూగునే... 



చరణం 3 :


రరరర లలలల రరరర లలలల


భావమే నేనైతే... పల్లవే నీవైతే..

భావమే నేనైతే... పల్లవే నీవైతే...

ఎదలోన ఒకే స్వరం... కలలేమో నిజం నిజం..

పగలు రేయి ఏదో హాయి...


ఇలాగే.. ఇలాగే.. సరాగమాడితే..

వయ్యారం.. ఈ యవ్వనం ఊయలూగునే...

ఊయలూగునే... హాహ... హాహహా...


- పాటల ధనుస్సు 

30, జనవరి 2022, ఆదివారం

చక చక సాగే చక్కని బుల్లెమ్మా | Chaka Chaka sage | Song Lyrics | MallePoovu (1978)

 చక చక సాగే చక్కని బుల్లెమ్మా


చిత్రం :  మల్లెపువ్వు (1978)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  ఆరుద్ర 

నేపథ్య గానం :  బాలు,  సుశీల 


పల్లవి:


చక చక సాగే చక్కని బుల్లెమ్మా

మిస మిస లాడే వన్నెల చిలకమ్మ

నీ పేరేమిటో .. నీ ఊరేమిటో

నీ పేరేమిటో .. నీ ఊరేమిటో


గలగల పారే ఏరే నా పేరూ

పొంగులు వారే వలపే నా ఊరూ

చినదాననూ..నే చినదాననూ

చినదాననూ..నే చినదాననూ


చరణం 1:


కన్నులు చెదిరే.. వన్నెల చిలకా..నీ వయసే ఎంతా?

కన్నులు చెదిరే.. వన్నెల చిలకా..నీ వయసే ఎంతా?

చూపే కనులకు రాసే కవులకు ఊహకు రానంతా..

ఊహకు రానంత..


అందీ అందక ఊరించే నీ మనసు లోతెంతా..హా !

మమతే ఉంటే.. ఏ ఏ.. దూరమెంతో లేదూ

నా మనసే నీ వెంటే నీడల్లే ఉంటుంది


కసి కసి చూపులు చూసే సోగ్గాడా

ముసి ముసి నవ్వులు విసిరే మొనగాడా

నీ పేరేమిటో .. నీ ఊరేమిటో

నీ పేరేమిటో .. నీ ఊరేమిటో


పదమును పాడే వేణువు నా పేరూ

మధువులు చిందే కవితే నా ఊరూ

చినవాడనూ..నే నీవాడనూ

చినవాడనూ..నే నీవాడనూ


చరణం 2:


వరసలు కలిపే.. ఓ చినవాడా..నీ వలపే ఎంతా?

విలువే లేనిది..వెలకే రానిది..వలపే కొండంత..

నా వలపే జీవితమంత

నిన్నే కోరిన కన్నెబ్రతుకులో వెన్నెలా ఎపుడంటా..హో

గుండెల గుడిలో దేవివి నీవంటా..

సయ్యంటే ఈ నాడే నీకూ నాకూ పెళ్ళంటా


చల్లని గాలీ సన్నాయి ఊదిందీ

పచ్చిక వెచ్చని పానుపు వేసిందీ

కల నిజమైనదీ.. ప్రేమ ఋజువైనదీ

కల నిజమైనదీ.. ప్రేమ ఋజువైనదీ


- పాటల ధనుస్సు 

ఓహో లలితా నా ప్రేమ కవితా | Oho Lalitha Naa prema kavitha | Song Lyrics | Mallepoovu (1978)

ఓహో..ఓహో..లలితా..నా ప్రేమ కవితా



చిత్రం :  మల్లెపువ్వు (1978)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  ఆరుద్ర 

నేపధ్య గానం :  బాలు, సుశీల 


పల్లవి:


ఓహో..ఓహో..లలితా..నా ప్రేమ కవితా


గగనవీణ సరిగమలు పాడగా..

ఆ ఆ ఆ ఆఆ

నీ జఘనసీమ స్వరజతులనాడగా..

ఆ ఆ ఆ ఆఅ ఆ ఆ

తళత్తళలతో తరుణ కిరణ సంచలిత లలిత 

శృంగార తటిల్లత కదలగా

కనులు చెదరగా..

కదలిరా..కవితలా..వలపుకే..వరదలా...

ఓహో..హో..హో..లలితా.. నా ప్రేమ కవితా..


చరణం 1:


మల్లెపూవులు మధువు పొంగులా వెల్లువైన కవితా..

నీ కన్నెవయసు నా ఇంద్రధనుస్సుగా 

కదలిరావే నా లలితా


గున్నమావిలా కన్నెమోవి సన్నాయి పాట వినిపించగా

కవి మనస్సులో తొలి ఉషస్సు నా నుదుట తిలకమే ఉంచగా


నీ అందాలే మకరందాలై మల్లె సుగంధం నాలో విరిసే

సిగమల్లె పిలుపులో అందుకో

సిరిమల్లె తీగవై అల్లుకో


ఈ మల్లెపూవే నీ సొంతము


కదలిరా.. కవితలా..వలపుకే వరదలా


ఓహో హోహో లలితా నా ప్రేమకవితా 

నాప్రేమ కవితా



చరణం 2:


వయసు తోటలో మనసు పాటలా వెల్లివిరిసెలే నీ కథా

నా అణువు అణువు నీ వలపు వేణువై ఝుల్లుమన్నదీ నా ఎదా


తెలుగు పాటలే జిలుగు పైటలై పరువాలే పలికించగా

పూల ౠతువు నీ లేత పెదవిలో పున్నమలై పులకించగా


నీ ఊహలలో నే ఊర్వశినై నీ కౌగిలికి నే జాబిలినై


నీ కాలిమువ్వ నా కవితగా నా దారిదివ్వె నీ మమతగా


ఈ మల్లెపూవే నా లలితగా

కదలిరా కవితలా వలుపుకే వరదలా


ఓహో హోహో లలితా నా ప్రేమకవితా నాప్రేమ కవితా


- పాటల ధనుస్సు 

29, జనవరి 2022, శనివారం

బుల్లిపిట్ట బుజ్జిపిట్ట | Bulli Pitta Bujji Pitta (Happy) | Song Lyrics | Chinna Rayudu (1992)

బుల్లిపిట్ట బుజ్జిపిట్ట



చిత్రం: చినరాయుడు (1992) 

సంగీతం: ఇళయరాజా 

గీతరచయిత: భువనచంద్ర 

నేపధ్య గానం: బాలు, జానకి 


పల్లవి: 


బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట 

వెంట వెంట వచ్చే వారి పేరు చెప్పవే 

ఎవరే ఎవరే పిలిచేది నేనెట్టా ఎట్టా పలికేది 


బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట 

నక్కి నక్కి దాగేవారి పేరు చెప్పవే 

ఎవరో ఎవరో తెలియందే 

నేనెట్టా ఎట్టా పిలిచేది... 


బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట 

వెంట వెంట వచ్చే వారి పేరు చెప్పవే 


బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట 

నక్కి నక్కి దాగేవారి పేరు చెప్పవే 


చరణం 1: 


కొంటె కోణంగి ఈడు కొట్టే కేరింత చూడు 

ఏదో గమ్మత్తుగుంది మావా 


లేనే లేదంటు హద్దు ముద్దుముద్దుకి పద్దు 

రాస్తే ఎట్టా సత్యభామా 


బంగారు గిన్నెలోని పరువాల పాయసాలు 

నీకే వుంచా నేను పోకిరి 


చక్కంగ ముందుకొచ్చి సందేళ విందులిచ్చి 

కాదంటానా జత రా మరి 


వారం వర్జ్యం చూడాలి 

ఆపైన నీతో ఓడాలి 


చరణం 2: 


ఇంటి తాళాలు దాచి గంట మోగించమంటే 

ఎట్టాగమ్మో గౌరమ్మో 


జంట బాణాలు చూసి ఇట్టా రెట్టిస్తే నన్ను 

వేగేదెట్టా మావయ్యో 


గోరింక గూటిముందు చిలకమ్మ చిందులేసి 

ఆడిందంటే అర్ధమేమిటో 


మందారపువ్వు మీద మురిపాల తుమ్మెదొచ్చి 

వాలిందంటే మరి దేనికో 


నీలో నేనే దాగాలి 

చెలరేగే తాపం తీరాలి


పాటల ధనుస్సు

28, జనవరి 2022, శుక్రవారం

ఎంత కులుకు ఎంతో ఉలుకు | Entha kuluku entho | Song Lyrics | Katakatala Rudrayya (1978)

ఎంత కులుకు ఎంతో ఉలుకు


చిత్రం: కటకటాల రుద్రయ్య (1978)

సంగీతం: జె.వి. రాఘవులు

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: బాలు, సుశీల


పల్లవి :

ఎంత కులుకు ఎంతో ఉలుకు

తొలి మోజులు తీరే వరకు

ఎంత కులుకు ఎంతో ఉలుకు

తొలి మోజులు తీరే వరకు


ఎంత ఉడుగు... ఎంతో దుడుకు... 

హొయ్.. హొయ్.. హొయ్

చిరుగాజులు చిట్లే వరకు... 

హొయ్.. హొయ్.. హొయ్


ఎంత కులుకు ఎంతో ఉలుకు

తొలి మోజులు తీరే వరకు

లలల్లా.. లలల్లా

చరణం 1 :


చలికాలం వచ్చిందంటే... 

చెలి కౌగిలి ఇచ్చిందంటే

మనసనేది సొద పెడుతుంటే... 

వయసు సొగసు ముడిపడుతుంటే



విడి విడిగా ఉండలేక... 

తడబడుతూ సాగలేక

విడి విడిగా ఉండలేక... 

తడబడుతూ సాగలేక


ఒకరిలోన ఒకరొదిగి అతికి బ్రతికి పోతుంటే

లలల్లలల్లా... హోయ్.. లలల్లలలా

ఎంత కులుకు...  ఎంతో ఉలుకు

తొలి మోజులు తీరే వరకు


చరణం 2 :

ముసురసలే పడితే గిడితే... 

కసిగా కోరిక బుసకొడితే

పడుచు పైట గొడుగే పడితే... 

ఆ గొడుగులోన ఇరుకున పడితే


తహతహలో ఆగలేక...  

తడిగాలికి సాగ లేక

గొడుగు గాలికికెగిరిపోయి... 

గొడవ  ముదిరిపోతుంటే

లలలలల్లా... లలలలల్లా


ఎంత కులుకు...  ఎంతో ఉలుకు

తొలి మోజులు తీరే వరకు

ఎంత ఉడుగు... ఎంత దుడుకు

చిరుగాజులు చిట్లే వరకు

ఎంత కులుకు...  ఎంతో ఉలుకు

తొలి మోజులు తీరే వరకు

లలల్లా.. లలల్లా


 - పాటల ధనుస్సు 

పాలకంకి మీదుంది పైరు | Palakanki Meedundi | Song Lyrics | Katakatala Rudrayya (1978)

 పాలకంకి మీదుంది పైరు 


చిత్రం : కటకటాల రుద్రయ్య (1978)

రచన : వేటూరి

సంగీతం : జె వి రాఘవులు 

పాడినవారు : బాలు, సుశీల 


పల్లవి :


పాలకంకి మీదుంది పైరు 

అబ్బాబ్బాబ్బ పడలేనమ్మా పిట్టల పోరు 

ఒడిసి పట్టి కొట్టబోతే  గడుసు పిట్టరో

కన్నుకొట్టి తుర్రు మంది కన్నె మోజు పిట్టరో 

కటకటాల రుద్దరయ్యో ఈ కిటికిటీలు వద్దురయ్యో 

పాలకంకి మీదుందా  పైరు

అరెరే పడలేవా ఈ పిట్టల పోరు 

ఒడుపు చూసి పట్టబోతే గడుసు పిట్టరో 

కన్ను కొట్టి తుర్రు మంది కన్నె కౌజు పిట్టరో 

పడుచు బళ్ళో పంతులమ్మో పావు సేరు మెంతులమ్మో 

ఎహె ...

చరణం 1 :

మొదని  కన్ను గింజనుకొని  కులికింది పికిలి పిట్టా 

పెదవి దొండ పండనుకొని చిదిమింది చికిలి పిట్టా 

పిట్ట కథలు ఎన్నని నే చెప్పుకొనమ్మో 

పొదుపు కథలు ఎట్టా  నే విప్పుకోనమ్మా

ఆడ గొట్టే ఈడ గొట్టే వున్నా గుట్టే బైట పెట్టె 


చరణం 2 :

నీలాంటి రేవు కాడ తెల్లారి పొద్దు కాడ 

ఏమైందటా...

ఒడ్డుమీద ముక్కు పుడక పట్టుకెళ్ళే పాడు పిట్ట 

వెరీ వెరీ గుడ్డు ...

ఆరేసుకున్న కొక కాజేయ లేక నిన్న

ఎక్కించుకున్న రైక ఎత్తుకెళ్లే పడుచు పిట్ట  

బావుంది బావుంది 

ఈ పిట్ట కథలు ఎన్నని నే చెప్పుకొనమ్మో 

ఆ పొడుపు కథలు ఎట్టా  నే విప్పుకోనమ్మా

ఆడ గొట్టే ఈడ గొట్టే వున్నా గుట్టే బైట పెట్టె 


పాలకంకి మీదుంది పైరు 

అబ్బాబ్బాబ్బ పడలేనమ్మా పిట్టల పోరు 

ఒడుపు చూసి పట్టబోతే గడుసు పిట్టరో 

కన్ను కొట్టి తుర్రు మంది కన్నె కౌజు పిట్టరో 

కటకటాల రుద్దరయ్యో ఈ కిటికిటీలు వద్దురయ్యో 

పడుచు బళ్ళో పంతులమ్మో పావు సేరు మెంతులమ్మో


 - పాటల ధనుస్సు 

27, జనవరి 2022, గురువారం

నీ కౌగిలిలో తల దాచి | Nee Kougililo thala dachi | Song Lyrics | Karthika Deepam (1979)

 నీ కౌగిలిలో తల దాచి



చిత్రం: కార్తీక దీపం (1979)
సంగీతం: సత్యం
గీతరచయిత: మైలవరపు గోపి
నేపధ్య గానం: బాలు, జానకి


పల్లవి:

నీ కౌగిలిలో తల దాచి నీ చేతులలో కను మూసి
జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందనీ
నీ కౌగిలిలో తల దాచి నీ చేతులలో కను మూసి
జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందనీ
నీ కౌగిలిలో తల దాచి...

చరణం 1:

చల్లగ కాసే పాల వెన్నెల నా మనసేదో వివరించు
అల్లరి చేసే ఓ చిరుగాలి నా కోరికలే వినిపించు
నా కోవెలలో స్వామివి నీవై వలపే దివ్వెగ వెలిగించు
నీ కౌగిలిలో తల దాచి నీ చేతులలో కను మూసి
జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందనీ
నీ కౌగిలిలో తల దాచి...

చరణం 2:

నింగి సాక్షి.. నేల సాక్షి.. నిను వలచిన నా మనసే సాక్షి
మనసులోన మనుగడలోన నాలో నీవే సగపాలు
వేడుకలోను.. వేదనలోను... పాలు తేనెగ ఉందాము
నీ కౌగిలిలో తల దాచి... నీ చేతులలో కను మూసి
జన్మ జన్మకు జతగా మసలే... వరమే నన్ను పొందనీ
నీ కౌగిలిలో తల దాచి...



- పాటల ధనుస్సు 


ఆడది కోరుకునే వరాలు | Aadadi Korukune Varalu | Song Lyrics | Radhamma Pelli (1974)

 ఆడది కోరుకునే వరాలు రెండే రెండు

చిత్రం  :  రాధమ్మ పెళ్ళి (1974)
సంగీతం  :  రమేశ్ నాయుడు
గీతరచయిత  :  సినారె
నేపధ్య గానం  : జానకి


పల్లవి :

ఆడది కోరుకునే వరాలు రెండే రెండు
చల్లని సంసారం..  చక్కని సంతానం
ఆడది కోరుకునే వరాలు రెండే రెండు
చల్లని సంసారం.. చక్కని సంతానం

చరణం 1 :

కాపురమే ఒక మందిరమై.. పతియే తన దైవమై
కాపురమే ఒక మందిరమై.. పతియే తన దైవమై
అతని సేవలో తన బ్రతుకే హారతి యైపోతే
అంతకుమించిన సౌభాగ్యం ఆడదానికేముంది..  

ఆడదానికింకేముంది
ఆడది కోరుకునే వరాలు రెండే రెండు
చల్లని సంసారం..  చక్కని సంతానం

చరణం 2 :

ఇల్లాలే ఒక తల్లియై..  చల్లని మమతల పాలవెల్లియై
తన పాప లాలనలో.. తాను కరిగిపోతే
ఇల్లాలే ఒక తల్లియై.. చల్లని మమతల పాలవెల్లియై
తన పాప లాలనలో.. తాను కరిగిపోతే
అంతకు మించిన ఆనందం ఆ తల్లికేముంది.. 

ఆ తల్లికింకేముంది   
ఆడది కోరుకునే వరాలు రెండే రెండు
చల్లని సంసారం..  చక్కని సంతానం
ఆడది కోరుకునే వరాలు రెండే రెండు
చల్లని సంసారం.. చక్కని సంతానం


- పాటల ధనుస్సు 

ఎక్కడో చూసినట్టు ఉన్నాది నాకు | Ekkado chusinattu | Song Lyrics | Prema Mandiram (1981)

 ఎక్కడో చూసినట్టు ఉన్నాది నాకు



చిత్రం : ప్రేమ మందిరం (1981)

సంగీతం : కె.వి. మహదేవన్ గీతరచయిత : దాసరి నేపధ్య గానం : బాలు, సుశీల


పల్లవి: ఎక్కడో.. ఓ ఓ ఓ......ఎప్పుడో.. ఓ ఓ ఓ... ఎక్కడో చూసినట్టు ఉన్నాది నాకు ఎప్పుడో కలిసినట్టు ఉన్నాది నాకు బాలరాజువా.. దేవదాసువా.. బాటసారివా.. కాళిదాసువా ఎప్పుడో.. ఓ ఓ ఓ... ఎక్కడో.. ఓ ఓ ఓ... ఎప్పుడో చూసినట్టు ఉన్నాది నాకు ఎక్కడో కలిసినట్టు ఉన్నాది నాకు చంద్రలేఖవా.. శశిరేఖవా.. భద్రకాళివా.. చండీప్రియవా చరణం 1: మొదటి సారి కలుసుకున్నదర్ధరాత్రిరీ చూసుకున్న చూపులన్ని అదో మాదిరి మొదటి సారి కలుసుకున్నదర్ధరాత్రిరీ చూసుకున్న చూపులన్ని అదో మాదిరి ఆపై ప్రతిరాతిరి కలల రాతిరి అవి చెదరగానే కలత రాతిరి ఆపై ప్రతిరాతిరి కలల రాతిరి అవి చెదరగానే కలత రాతిరి కలల రాతిరీ.. కథల రాతిరి.. ప్రేమ కథల రాతిరి కలత రాతిరీ.. బరువు రాతిరి.. గుండె బరువు రాతిరి ఎప్పుడో.. ఓ ఓ ఓ... ఎక్కడో.. ఓ ఓ ఓ... ఎప్పుడో చూసినట్టు ఉన్నాది నాకు ఎక్కడో కలిసినట్టు ఉన్నాది నాకు చంద్రలేఖవా.. శశిరేఖవా..బాటసారివా..కాళిదాసువా చరణం 2: ఆహాహా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆహాహా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ మొట్ట మొదటి పరిచయం మరుపురానిదీ రోజు రోజు కదీ మరీ దగ్గరవుతది మొట్ట మొదటి పరిచయం మరుపురానిదీ రోజు రోజు కదీ మరీ దగ్గరవుతది ఆపై ప్రతి రోజు అది గట్టి పడతదీ నువ్వు ఊరుకుంటే మీద పడతది ఆపై ప్రతి రోజు అది గట్టి పడతదీ నువ్వు ఊరుకుంటే మీద పడతది మీద పడతదీ.. మోజుపడతదీ.. పెళ్ళి మోజు పడతది గట్టి పడతదీ.. కట్టమంటది.. తాళి కట్టమంటది ఎక్కడో.. ఓ ఓ ఓ......ఎప్పుడో.. ఓ ఓ ఓ... ఎక్కడో చూసినట్టు ఉన్నాది నాకు ఎప్పుడో కలిసినట్టు ఉన్నాది నాకు బాలరాజువా.. దేవదాసువా.. భద్రకాళివా.. చండీప్రియవా పాటల ధనుస్సు ఎక్కడో.. ఓ ఓ ఓ......ఎప్పుడో.. ఓ ఓ ఓ...


- పాటల ధనుస్సు

ఎదురుగా నీవుంటే | Eduruga Nee Vunte | Song Lyrics | Mahatmudu (1976)

ఎదురుగా నీవుంటే ఎన్నెన్ని రాగాలో




చిత్రం :  మహాత్ముడు (1976)
సంగీతం :  టి.చలపతిరావు
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  రామకృష్ణ, సుశీల


పల్లవి :


ఎదురుగా నీవుంటే 
ఎన్నెన్ని రాగాలో
చల్లని నీ మదిలో 
ఏ శ్రావణ మేఘాలో.. 
ఎదురుగా నీవుంటే

చరణం 1 :

నీవాలు కన్నులలోన 
నీలాల రాగాలెన్నో
నీవాలు కన్నులలోన 
నీలాల రాగాలెన్నో

నీ చిగురు మోవిపైన 
సిరికెంపుల రాగాలెన్నో
నీ చిగురు మోవిపైన 
సిరికెంపుల రాగాలెన్నో

నిత్యవసంతుడు 
నీడగవుంటే..
నిత్యవసంతుడు 
నీడగవుంటే.. 
చిత్రవర్ణ రాగాలెన్నో  

ఎదురుగా నీవుంటే 
ఎన్నెన్ని రాగాలో
చల్లని నీ మదిలో 
ఏ శ్రావణ మేఘాలో.. 
ఎదురుగా నీవుంటే..

చరణం 2 :

కమల రమణి విరమూయునులే 
అరుణోదయ వేళలో..
కలువ చెలువ తెరతీయునులే 
చంద్రోదయ వేళలో

కమల రమణి విరమూయునులే 
అరుణోదయ వేళలో..
కలువ చెలువ తెరతీయునులే 
చంద్రోదయ వేళలో

వలచిన హృదయం 
పులకించునులే..
వలచిన హృదయం 
పులకించునులే.. 
చెలి వలపుల జోలలో    

ఎదురుగా నీవుంటే 
ఎన్నెన్ని రాగాలో
చల్లని నీ మదిలో 
ఏ శ్రావణ మేఘాలో.. 
ఎదురుగా నీవుంటే

చరణం 3 :


మనసైన పందిరి కోసం 
మరుమల్లె తీగసాగె

మనసైన పందిరి కోసం 
మరుమల్లె తీగసాగె

సెలయేటి కలయిక కోసం 
కడలిరేడు తానెదురేగె
సెలయేటి కలయిక కోసం 
కడలిరేడు తానెదురేగె 

ఆ అల్లికలో ఆ కలయికలో
ఆ అల్లికలో ఆ కలయికలో..  
అనురాగ వీణ మ్రోగె         
 
ఎదురుగా నీవుంటే 
ఎన్నెన్ని రాగాలో
చల్లని నీ మదిలో 
ఏ శ్రావణ మేఘాలో.. 
ఎదురుగా నీవుంటే


- పాటల ధనుస్సు 



గాలిలో పైర గాలిలో | Galilo Paira Galilo | Song Lyrics | Ganga Manga (1973)

గాలిలో పైర గాలిలో




చిత్రం : గంగ - మంగ (1973)

సంగీతం : రమేశ్ నాయుడు

గీతరచయిత : దాశరథి

నేపధ్య గానం : రామకృష్ణ, సుశీల 


పల్లవి :



అలా అలా అలా అలా గాలిలో ... పైర గాలిలో

సాగి పోదామా తెలిమబ్బు జంటలై ... వలపు పంటలై

పొదామా...  సాగి పోదామా...

పొదామా...  సాగి పోదామా 


అలా అలా అలా అలా నింగిలో....  నీలి నింగిలో

ఎగిరిపోదామా....  అందాల హంసలై ...  రాజ హంసలై....

పోదామా ... ఎగిరి పోదామా

పోదామా ... ఎగిరి పోదామా 



చరణం 1 :



వెనుదిరిగి చూసే పనిలేదు మనకు

దూరాలు తీరాలు చేరాలి మనము

వెనుదిరిగి చూసే పనిలేదు మనకు

దూరాలు తీరాలు చేరాలి మనము 


జతచేరి దూకే సేలయేళ్లలాగా ... లేల్లలాగా

మునుముందుకేగాలి మనము

జతచేరి దూకే సేలయేళ్లలాగా ... లేల్లలాగా

మునుముందుకేగాలి మనము

నీకు నేను తోడుగా

నేను నీకు నీడగా

ఈ బాట మన బ్రతుకు బాటగా

పూల బాటగా...  హాయిగా సాగి పోదామా


అలా అలా అలా అలా గాలిలో

పైర గాలిలో పోదామా...  ఎగిరి పోదామా       



చరణం 2 :



అనురాగ లతలే పెనవేసె మనను

ఏనాడు విడిపోదు మన ప్రేమబంధం

అనురాగ లతలే పెనవేసె మనను

ఏనాడు విడిపోదు మన ప్రేమబంధం 

అందాలు చిందే నీ లేతమోము

నీ కంటి పాపలో నిలవాలి నిరతం

అందాలు చిందే నీ లేతమోము

నా కంటి పాపలో నిలవాలి నిరతం


చేయి చేయి చేరగా ... మేను హాయి కోరగా

నీ మాట నా మనసు మాటగా

వలపు బాటగా...  జంటగా సాగి పోదామా 


అలా అలా అలా అలా గాలిలో

పైర గాలిలో పోదామా ఎగిరి పోదామా

పోదామా ఎగిరి పోదామా


పాటల ధనుస్సు 

ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు | Eenadu kattukunna | Song Lyrics | Pandanti Kapuram (1972)

ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు


చిత్రం:  పండంటి కాపురం (1972)

సంగీతం:  కోదండపాణి

గీతరచయిత:  సి నారాయణరెడ్డి 

నేపధ్య గానం:  బాలు, సుశీల


పల్లవి:


    ఈనాడు కట్టుకున్న 

బొమ్మరిల్లు..ఊ..

    కావాలి ముందు ముందు 

పొదరిల్లు.. పొదరిల్లు

    ఊ.. ఊ.. ఊ.. ఓ.. ఓహోహో.. 

ఆహహా..


    ఈనాడు కట్టుకున్న.. 

బొమ్మరిల్లు..ఊ..

    కావాలి ముందు ముందు 

పొదరిల్లు.. పొదరిల్లు


చరణం 1:


    ఆశలే తీవెలుగా  ఉహూ..

    ఊసులే పూవులుగా ఉహూ..

    వలపులే తావులుగా.. 

అలరారు ఆ పొదరిల్లు


    ఆ..ఆ..ఆ..

    ఆశలే తీవెలుగా  ఉహూ..

    ఊసులే పూవులుగా ఉహూ..

    వలపులే తావులుగా.. 

అలరారు ఆ పొదరిల్లు


    పగలైనా రేయైనా.. 

ఏ ఋతువులోనైనా

    పగలైనా రేయైనా.. 

ఏ ఋతువులోనైనా

    కురిపించును తేనెజల్లు.. 

పరువాల ఆ పొదరిల్లు


    ఈనాడు కట్టుకున్న.. 

బొమ్మరిల్లు..ఊ..

    కావాలి ముందు ముందు 

పొదరిల్లు.. పొదరిల్లు


చరణం 2:


    కళ్ళలో కళ్ళుంచీ  ఉహూ..

    కాలమే కరిగించే   ఉహూ..

    అనురాగం పండించే.. 

ఆ బ్రతుకే హరివిల్లు


    ఆ..ఆ..ఆ..

    కళ్ళలో కళ్ళుంచీ  ఉహూ..

    కాలమే కరిగించే  ఉహూ..

    అనురాగం పండించే.. 

ఆ బ్రతుకే హరివిల్లు


    నా దేవివి నీవైతే.. 

నీ స్వామిని నేనైతే

    నా దేవివి నీవైతే.. 

నీ స్వామిని నేనైతే

    పచ్చని మన కాపురమే.. 

పరిమళాలు వెదజల్లు


    ఈనాడు కట్టుకున్న.. 

బొమ్మరిల్లు..ఊ..

    కావాలి ముందు ముందు 

పొదరిల్లు.. పొదరిల్లు


    ఊఁహూఁహూఁ.. ఊఁహూఁహూఁ.. 

ఊఁహూఁహూఁ..

    ఊఁహూఁహూఁ.. ఊఁహూఁహూఁ.. 

ఊఁహూఁహూఁ..


పాటల ధనుస్సు 

26, జనవరి 2022, బుధవారం

అమ్మా అమ్మా అని పిలిచావు Amma Amma ani | Song Lyrics | Vichitra Bandham (1972)

 అమ్మా.. అమ్మా అని పిలిచావు


చిత్రం :  విచిత్ర బంధం (1972)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  సుశీల  





పల్లవి :


అమ్మా.. అమ్మా.. అని పిలిచావు.. ఆ కమ్మనైన పిలుపుతో కట్టేశావు

ఏ తల్లి కన్న బాబువో.. నా కాళ్ళకు బంధం అయినావు


అమ్మా.. అమ్మా.. అని పిలిచావు.. ఆ కమ్మనైన పిలుపుతో కట్టేశావు

ఏ తల్లి కన్న బాబువో.. నా కాళ్ళకు బంధం అయినావు     



చరణం 1 :



ఎవరికీ మనసివ్వని దానను..  ఏ మమతకూ నోచుకోని బీడును

ఎవరికీ మనసివ్వని దానను..  ఏ మమతకూ నోచుకోని బీడును 


మోడులా యీ బ్రతుకును మోశాను..

మోడులా ఈ బ్రతుకును మోశాను..

నీ ముద్దుమోము చూచి మరల మొలకెత్తాను  

అమ్మా..  అమ్మా అని పిలిచావు.. ఆ కమ్మనైన పిలుపుతో కట్టేశావు

ఏ తల్లి కన్న బాబువో.. నా కాళ్ళకు బంధం అయినావు 



చరణం 2 :



కన్నతల్లి ఎవ్వరో ఎరుగవు నువ్వు.. కడుపు తీపి తీరని తల్లిని నేను

కన్నతల్లి ఎవ్వరో ఎరుగవు నువ్వు.. కడుపు తీపి తీరని తల్లిని నేను 


కాలమే ఇద్దరినీ కలిపింది ఎందుకో..

కాలమే ఇద్దరినీ కలిపింది ఎందుకో..

ఒకరి కొరత నింకొకరు తీర్చుకునేటందుకో 


అమ్మా.. అమ్మా అని పిలిచావు.. ఆ కమ్మనైన పిలుపుతో కట్టేశావు

ఏ తల్లి కన్న బాబువో... నా కాళ్ళకు బంధం అయినావు

అమ్మా.. అమ్మా అని పిలిచావు .. 


- పాటల ధనుస్సు 

25, జనవరి 2022, మంగళవారం

నమ్మ జాలరే యశోదా తనయుని | Nammajalare Yashoda | Song Lyrics | Brindavanam | RKSS Creations

 నమ్మ జాలరే యశోదా తనయుని



రచన : రామకృష్ణ దువ్వు,

కంపోజింగ్ : Dr Y బాల గణేష్,

గానం : మూల శ్రీలత,

రికార్డింగ్ : శ్రీ మాత డిజిటల్ రికార్డింగ్, విశాఖపట్నం. 

ప్రొడ్యూసర్స్ : RKSS Creations 


పల్లవి:  

నమ్మ జాలరే యశోదా తనయుని

మహిమలెన్నని అచ్చెరవొందగ

    నిక్కమదియె జగతి నందు

    ఇతని సాటి  లేనే లేరు

 

చరణం 1: 

పాలు త్రాగే ప్రాయము లో  రక్కసి పూతను చంపే

బుడి బుడి అడుగులు వేస్తూ బండి చక్రమందు

ఆ అసురుని నరకముకే సాగనంపే

  వ్రేపల్లె నందు వెలుగు నింపే

 

చరణం2: 

మన్ను తిన్న నోటి తోనె తల్లికి జగములు జూపె

వెన్న దొంగను అదుపు చేయగా రోటికీ కట్టగా

శాపవిమోచనము చేసే చెట్లను కూల్చీ

విస్మయ పరచే గోకులమంతా ..

 

చరణం 3:

సుడిగాలై కమ్ముకు వచ్చిన తృణావర్తుని

ప్రాణములను అవలీలగ హరించినాడే

యమునా నదిలో విషమును చిమ్మే

కాళీయుని పడగలు మర్ధించి నటించి నాడే

బృందావనమున కనువిందు వాడే

 

చరణం 5:

దిక్కుల పాలించే వాడి దర్పమణచగ 

వేలి కొనతో గోవర్ధన గిరినెత్తినాడే

  జీవులందరిని తానై కాచినాడే

      బాలుడీతడు నందుని ఇంట

      వెలసియున్న హరి.. గోవిందుడు..

 

- రామకృష్ణ దువ్వు

RKSS Creations...


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు