RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

24, జనవరి 2022, సోమవారం

చెంగావి రంగు చీర | Chengavi Rangu Cheera | Song Lyrics | Bangaru Babu (1973)

చెంగావి రంగు చీర



చిత్రం : బంగారు బాబు (1973)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : ఘంటసాల, సుశీల


పల్లవి :


ఛీ . . ఛీ . . ఛీ . . ఛీ . . ఛీ . . ఛీ

ఛా . . ఛా . . ఛా . . ఛా . . ఛా . . ఛా


చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నది

దాని జిమ్మదియ్య... దాని జిమ్మదియ్య.. 

అందమంతా చీరలోనే వున్నది


చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నది

దాని జిమ్మదియ్య.. దాని జిమ్మదియ్య..

కొంగు కొంగూ కలిపి చూడమన్నది


చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నది..

దాని జిమ్మదియ్య.. అందమంతా చీరలోనే వున్నది

చరణం 1 :

మెరుపల్లె వచ్చిందీ నా ఇంటికి..  నన్ను మెల్లంగా దించిందీ ముగ్గులోనికి

మెరుపల్లె వచ్చిందీ నా ఇంటికి..  నన్ను మెల్లంగా దించిందీ ముగ్గులోనికి

తలదాచుకొమ్మని తావిస్తివీ..

తలదాచుకొమ్మని తావిస్తివీ.. పిల్ల దొరికింది చాలనీ ఇల్లాల్ని చేస్తివి . . . .   

చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నది..

దాని జిమ్మదియ్య.. అందమంతా చీరలోనే వున్నది

చరణం 2 :


ప్రేమంటే నేర్పింది పిచ్చివాడికి..

దాంతో.. వెర్రెత్తిపోయింది కుర్రవాడికి

ప్రేమంటే నేర్పింది పిచ్చివాడికి..

దాంతో... వెర్రెత్తిపోయింది కుర్రవాడికి  


పిచ్చివాడనే పేరుచాటున మాటు వేసినావూ..

పిచ్చివాడనే పేరుచాటున మాటువేసినావూ

పిల్లదాని పెదవిమీద కాటు వేసినావూ...  


సరి... సరి.. సరి.. సరి.. సరి.. సరి.. సరి.. సరి 

చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నది..

దాని జిమ్మదియ్య.. కొంగు కొంగూ కలిపి చూడమన్నది


చరణం 3 :

సరసంలో పడ్డాడు ఇన్నాళ్ళకి..

అబ్బో.. సంగీతం వచ్చిందీ బుజ్జిబాబుకీ

సరసంలో పడ్డాడు ఇన్నాళ్ళకి..

అబ్బో..  సంగీతం వచ్చిందీ బుజ్జిబాబుకీ


తెరచాటు తొలిగింది పరువానికి..

తెరచాటు తొలిగింది పరువానికి..

అది పరవళ్ళు తొక్కుతూ పాడింది నేటికి . . .    

సరి... సరి.. సరి.. సరి.. సరి.. సరి.. సరి.. సరి

చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నది..

దాని జిమ్మదియ్య.. కొంగు కొంగూ కలిపి చూడమన్నది


చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నది..

దాని జిమ్మదియ్య.. అందమంతా చీరలోనే వున్నది

సరి... సరి.. సరి.. సరి.. సరి.. సరి.. సరి.. సరి


- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

కౌగిలిలో ఉయ్యాలా | Kougililo Vuyyala | Song Lyrics | Annadammula Anubandham (1975)

కౌగిలిలో ఉయ్యాలా కన్నులలో జంపాలా  చిత్రం :  అన్నదమ్ముల అనుబంధం (1975) సంగీతం :  చక్రవర్తి గీతరచయిత :  దాశరథి నేపధ్య గానం :  బాలు, జానకి  పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు