RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

12, ఆగస్టు 2025, మంగళవారం

నువ్విట్ట నేనిట్ట కూకుంటే ఇంకెట్టా | Nuvvitta Nenatta | Song Lyrics | Seethamalakshmi (1978)

నువ్విట్ట నేనిట్ట కూకుంటే ఇంకెట్టా



చిత్రం :  సీతామాలక్ష్మి (1978)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి :


నువ్విట్ట నేనిట్ట కూకుంటే ఇంకెట్టా

తెల్లారిపోయేదెట్టా.. హా.. 

ఈ ఉడుకు చల్లారిపోయేదెట్టా..

నువ్విట్ట నేనిట్ట కూకుంటే ఇంకెట్టా


నీకిట్ట.. నాకిట్టా.. రాసుంటే ఇంకెట్టా

ఈ ఊపు ఆపేదెట్టా..హా.. 

నీ దుడికి కాసేపు ఓపేదెట్టా..

నీకిట్ట.. నాకిట్టా.. రాసుంటే ఇంకెట్టా  


చరణం 1 :


సిటికెంత నవ్వంట.. 

సికిలింత పువ్వంట..

ఆ పువ్వు కోసుకొంటే.. ఏ.. 

ఆపేది ఎవరంట..


చీకట్లో సింగారం.. 

సిటికేసే యవ్వారం..

చీకట్లో సింగారం.. 

సిటికేసే యవ్వారం..

నీ పొగరంత అణిగేదెట్ట.. 

ఈ పొగరాని సెగలే సంత


నువ్విట్ట నేనిట్ట కూకుంటే ఇంకెట్టా

ఈ ఊపు ఆపేదెట్టా..హా.. 

నీ దుడికి కాసేపు ఓపేదెట్టా..

నీకిట్ట.. నాకిట్టా.. రాసుంటే ఇంకెట్టా   


చరణం 2 :


మసకేస్తే మనసంట.. 

మనసైతే వరసంట

ఈ ఘడియా గడిపేదట్ట... 

ఆ గడియా తీసేదెట్ట


ఆ ఘడియా రానీకు 

నన్నిడిసి పోమాకు...

ఆ ఘడియా రానీకు 

నన్నిడిసి పోమాకు...

తొలి పొద్దు పొడిచిదంటే.. 

చలి తీరిపోయేదెట్ట...  ఎట్ట..


నీకిట్ట.. నాకిట్టా.. రాసుంటే ఇంకెట్టా

తెల్లారిపోయేదెట్టా.. హా.. 

ఈ ఉడుకు చల్లారిపోయేదెట్టా..

నువ్విట్ట నేనిట్ట కూకుంటే ఇంకెట్టా


- పాటల ధనుస్సు 


11, ఆగస్టు 2025, సోమవారం

సీతాలు సింగారం మాలచ్చి బంగారం | Seethalu Singaram | Song Lyrics | Seethamalakshmi (1978)

సీతాలు సింగారం మాలచ్చి బంగారం



చిత్రం :  సీతామాలక్ష్మి (1978)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి :


సీతాలు సింగారం.. 

మాలచ్చి బంగారం..

సీతామాలచ్చిమంటే 

శ్రీలచ్చిమవతారం..

సీతాలు సింగారం.. 

మాలచ్చి బంగారం

సీతామాలచ్చిమంటే.. 

శ్రీలచ్చిమవతారం


మనసున్న మందారం.. 

మనిషంతా బంగారం..

బంగారు కొండయ్యంటే.. 

భగవంతుడవతారం

మనసున్న మందారం.. 

మనిషంతా బంగారం..

బంగారు కొండయ్యంటే.. 

భగవంతుడవతారం..


సీతాలు సింగారం..ఊమ్మ్... 


చరణం 1 :


కూసంత నవ్విందంటే 

పున్నమి కావాలా...

ఐతే నవ్వనులే..ఏ..ఏ


కాసంత చూసిందంటే 

కడలే పొంగాలా...

ఇక చూడనులే ..ఏ.. ఏ


కూసంత నవ్విందంటే 

పున్నమి కావాలా..

కాసంత చూసిందంటే 

కడలే పొంగాలా..


ఎండితెర మీద పుత్తడి బొమ్మ 

ఎలగాల ఎదగాలా

ఆ ఎదుగు బొదుగు ఎలుగు 

కన్నుల ఎన్నెల కాయాలా..

నువ్వంటుంటే.. నేవింటుంటే.. 

నూరేళ్ళు నిండాలా... ఆ..


సీతాలు సింగారం.. 

మాలచ్చి బంగారం

బంగారు కొండయ్యంటే ..

భగవంతుడవతారం

మనసున్న మందారం... 


చరణం 2 :


లలల్లలా..లాలాలాలా..లలలాలా..


దాగుడు మూతలు ఆడావంటే 

దగ్గరకే రాను..

ఐతే నేనే వస్తాలే.. ఏ.. ఏ


చక్కలిగింతలు పెట్టావంటే 

చుక్కై పోతాను..

ఎగిరొస్తాలే.. ఏ.. ఏ..


దాగుడు మూతలు ఆడావంటే 

దగ్గరకే రాను

చక్కలిగింతలు పెట్టావంటే 

చుక్కై పోతాను


గుండె గుడిలోన దివ్వెవు నువ్వై 

వెలిగి... వెలిగించాలా

నీ వెలుగుకు నీడై.. బ్రతుకున తోడై.. 

ఉండిపోవాలా

నువ్వంటుంటే.. నేవింటుంటే.. 

వెయ్యేళ్ళూ బ్రతకాలా.. ఆ..


సీతాలు సింగారం.. 

మాలచ్చి బంగారం

బంగారు కొండయ్యంటే.. 

భగవంతుడవతారం..

లలలాల..లలలా..లలలా...


- పాటల ధనుస్సు 


10, ఆగస్టు 2025, ఆదివారం

హాయమ్మ హాయమ్మా హాయమ్మ | Haiamma Haiamma | Song Lyrics | Palnati Simham (1985)

హాయమ్మ హాయమ్మా హాయమ్మ



చిత్రం:  పల్నాటి సింహం (1985)

సంగీతం:  చక్రవర్తి

గీతరచయిత:  వేటూరి

నేపధ్య గానం:  బాలు, సుశీల


పల్లవి :


హాయమ్మ.. హాయమ్మా.. హాయమ్మ.. 

హా... హాయ్

ఒళ్ళంత కేరింత ఏదందమ్మా.. 

హా... హాయ్

మాట.. ఒక్క మాట 

నేను చెప్పాలి నీ కౌగిట

అలలా మంచి కలలా 

సాగిపోవాలి ఈ ముచ్చట... హాయ్

కలలకు పలుకులు రావాలట... 

కన్నుల పండుగ చెయ్యాలట


హాయమ్మ.. హాయమ్మా.. హాయమ్మ.. 

హా... హాయ్

ఒళ్ళంత కేరింత ఏదందమ్మా.. 

హా... హాయ్


చరణం 1 :


సూరీడు రేగేడు చూడు... 

సెలయేరు ఈ నాడు తోడు

చెలిమబ్బు మెరిసేను నేడు...  నీలా


చిగురాకు ఆడెను చూడు.. 

చిరుగాలి పాడెను చూడు

చిలకమ్మ కులికేను నేడు... నీలా


చెంత నేను లేనా... చెలిమి పంచుకోనా

ఆ మాట చాలంట.. ఈ జంట నాదంట


హాయమ్మ.. హాయమ్మా.. హాయమ్మ.. 

హా... హాయ్

ఒళ్ళంత కేరింత ఏదందమ్మా.. 

హా... హాయ్

మాట.. ఒక్క మాట 

నేను చెప్పాలి నీ కౌగిట

అలలా మంచి కలలా 

సాగిపోవాలి ఈ ముచ్చట... హాయ్

కలలకు పలుకులు రావాలట... 

కన్నుల పండుగ చెయ్యాలట


చరణం 2 :


అద్దాల చెక్కిల పైన.. 

ముద్దర్లు వేశాను నిన్న

వద్దన్న విన్నావు కాదు కలలో

సరదాగ నా పక్క చేరి... 

గురి చూసి గుండెల్లో దూరి

నా పేరు రాశావు నీవు మదిలో


ఒకరికొకరు ప్రాణం... ఒకరు ఒకరి లోకం

ఉండాలి నీ వెంట... పండాలి నా పంట


హాయమ్మ.. హాయమ్మా.. హాయమ్మ.. 

హాయ్

ఒళ్ళంత కేరింత ఏదందమ్మా.. 

హాయ్

మాట.. ఒక్క మాట 

నేను చెప్పాలి నీ కౌగిట.. హోయ్

అలలా మంచి కలలా 

సాగిపోవాలి ఈ ముచ్చట.. హా

కలలకు పలుకులు రావాలట... 

కన్నుల పండుగ చెయ్యాలట


హాయమ్మ.. హాయమ్మా.. హాయమ్మ.. 

హాయ్

ఒళ్ళంత కేరింత ఏదందమ్మా.. 

హాయ్


- పాటల ధనుస్సు 

పదహారు కళలకు ప్రాణాలైనా | Padaharu Kalalaku | Song Lyrics | Annamayya (1997)

పదహారు కళలకు ప్రాణాలైనా



చిత్రం : అన్నమయ్య (1997)

సంగీతం : ఎం ఎం కీరవాణి 

రచన : జె జె భారవి 

గానం : మనో 


సాకి :


ఓం శ్రీ పద్మావతి భూదేవి సమేతస్య

శ్రీ మధవేంద్ర గానాయకస్య

నిత్యా చోడోపచార పూజంచ కరిష్యే 

ఆవాహయామి


పల్లవి :


పదహారు కళలకు ప్రాణాలైనా

నా ప్రణవ ప్రణయ దేవతలకు 

ఆవాహనం

ఓం ఆసనం సమర్పయామి


పరువాల హొయలకు పైఎదలైన

నా ఊహల లలనలకు ఉరువులాసనం

ఓం స్నానం సమర్పయామి


చరణం 1 :


చిత్తడి చిరు చెమటల చిందులు చిలికే

పద్మినీ భామినులకు పన్నీటి స్నానం

ఓం గంధం సమర్పయామి


గళం గళల నడల వలన అలసిన

మీ గగన జఘన సొబగులకు శీతల గంధం

ఓం నైవేద్యం సమర్పయామి


చరణం 2 :


రతివేద వెద్యులైన రమణులకు

అనుభవైక వేద్యమైన నైవేద్యం

ఓం తాంబూలం సమర్పయామి


మీ తహతహలకు తపనలకు తాకిళ్లకు

ఈ కొసరు కొసరు తాంబూలం

ఓం సాష్టాంగ వందనం సమర్పయామి


ఆనంద రంగ భంగినులకు

సర్వాంగ చుంబనాలు వందనం


- పాటల ధనుస్సు 


బ్రహ్మ కడిగిన పాదము | Brahma kadigina Padamu | Song Lyrics | Annamayya (1997)

బ్రహ్మ కడిగిన పాదము



చిత్రం : అన్నమయ్య (1997)

సంగీతం : ఎం ఎం కీరవాణి 

రచన : అన్నమాచార్య సంకీర్తనలు 

గానం : కె ఎస్ చిత్ర, సుజాత, పూర్ణ చందర్, 

       అనురాధ పాలకుర్తి, శ్రీరామ్, రాధిక,   


పల్లవి :


బ్రహ్మ కడిగిన పాదము 

బ్రహ్మము తానె నీ పాదము

బ్రహ్మ కడిగిన పాదము 

బ్రహ్మము తానె నీ పాదము

బ్రహ్మ కడిగిన పాదము


చరణం 1 :



చెలగి వసుధ గొలిచిన నీ పాదము 

బలి తల మోపిన పాదము

తలకగా గగనము తన్నిన పాదము

తలకగా గగనము తన్నిన పాదము 

బలారిపు గాచిన పాదము


బ్రహ్మ కడిగిన పాదము 

బ్రహ్మము తానె నీ పాదము

బ్రహ్మ కడిగిన పాదము


చరణం 2 :


పరమయోగులకు పరిపరి విధముల 

పారమొసగెడి నీ పాదము

తిరువెంకటగిరి తిరమని చూపిన 

పరమ పదము నీ పాదము


బ్రహ్మ కడిగిన పాదము 

బ్రహ్మము తానె నీ పాదము

బ్రహ్మ కడిగిన పాదము


- పాటల ధనుస్సు 


7, ఆగస్టు 2025, గురువారం

అంతర్యామి అలసితి సొలసితి | Antaryami Alasiti Solasiti | Song Lyrics | Annamayya (1997)

అంతర్యామి అలసితి సొలసితి 


చిత్రం : అన్నమయ్య (1997)

సంగీతం : ఎం ఎం కీరవాణి 

రచన : అన్నమాచార్య సంకీర్తనలు 

గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఎస్ పి శైలజ 


పల్లవి :


అంతర్యామి అలసితి సొలసితి 

ఇంతటి నీ శారనిదే చొచ్చితిని

అంతర్యామి అలసితి సొలసితి


చరణం 1 :


కోరిన కోర్కెలు కోయని కట్లు 

తీరవు నీవవి తెంచక

కోరిన కోర్కెలు కోయని కట్లు 

తీరవు నీవవి తెంచక

భారపు పగ్గాలు పాపపుణ్యములు

భారపు పగ్గాలు పాపపుణ్యములు 

నెరుపున బోవు నీవు వద్దనక


అంతర్యామి అలసితి సొలసితి 

ఇంతటి నీ శారనిదే చొచ్చితిని

అంతర్యామి


చరణం 2 :


మదిలో చింతలు మయిలాలు 

మణుగులు వదలవు నీవవి వద్దనక

మదిలో చింతలు మయిలాలు 

మణుగులు వదలవు నీవవి వద్దనక


ఎదుటనే శ్రీవెంకటేశ్వర 

వెంకటేశా శ్రీనివాస ప్రభు

ఎదుటనే శ్రీవెంకటేశ్వర నీ వాదీ 

వాదనగాచితివి అట్ఠిట్ఠానక


అంతర్యామి అలసితి సొలసితి 

ఇంతటి నీ శారనిదే చొచ్చితిని

అంతర్యామి అంతర్యామి 

అంతర్యామి అంతర్యామి 

అంతర్యామి

అలసితి


- పాటల ధనుస్సు 


దాచుకో నీ పాదాలకు | Dachuko Neepadalaku | Song Lyrics | Annamayya (1997)

దాచుకో నీ పాదాలకు



చిత్రం : అన్నమయ్య (1997)

సంగీతం : ఎం ఎం కీరవాణి 

రచన : అన్నమాచార్య సంకీర్తనలు 

గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఎస్ పి శైలజ 


సంకీర్తనలు:


దాచుకో నీ పాదాలకు తగ 

నే చేసిన పూజలివి

పూచి నీ కిరీటి రూప 

పుష్పములివేయయ్యా

దాచుకో దాచుకో దాచుకో


జో అచ్యుతానంద 

జోజో ముకుందా

లాలి పరమానంద 

రామ గోవిందా జోజో జోజో


క్షీరాబ్ది కన్యకకు 

శ్రీమహాలక్ష్మీకిని

నీరాజాలయును నీరాజనం 

నీరాజనం నీరాజనం


- పాటల ధనుస్సు 

నానాటి బతుకు నాటకము | Nanati Bratuku Natakamu | Song Lyrics | Annamayya (1997)

నానాటి బతుకు నాటకము 



చిత్రం : అన్నమయ్య (1997)

సంగీతం : ఎం ఎం కీరవాణి 

రచన : అన్నమాచార్య సంకీర్తనలు 

గానం : మనో 


సంకీర్తన :


నానాటి బతుకు నాటకము 

కానక కన్నది కైవల్యము

నానాటి బతుకు నాటకము 

నాటకము


పుట్టుటయు నిజాము 

పోవుటయు నిజాము

నట్టనడిమి పని నాటకము 

యెట్టనెదుట గలది ప్రపంచము

కట్ట కడపటిది కైవల్యము


- పాటల ధనుస్సు 

హరినామమే కడు ఆనందకరము | Harinamame Kadu Anandakaramu | Song Lyrics | Annamayya (1997)

హరినామమే కడు ఆనందకరము 



చిత్రం : అన్నమయ్య (1997)

సంగీతం : ఎం ఎం కీరవాణి 

రచన : అన్నమాచార్య సంకీర్తనలు 

గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఎం ఎం కీరవాణి, 

       అనురాధ పాలకుర్తి, ఆనంద్ భట్టాచార్య  


సంకీర్తనలు:


హరినామమే కడు ఆనందకరము

మరుగవో మరుగవో మరుగవో మనసా

హరినామమే కడు ఆనందకరము

మరుగవో మరుగవో మరుగవో మనసా

హరినామమే కడు ఆనందకరము


రంగ రంగ

రంగ రంగ రంగపతి రంగనాధ

నీ సింగరాలే తరచాయ శ్రీరంగనాధ

రంగ రంగ రంగపతి రంగనాధ

నీ సింగరాలే తరచాయ శ్రీరంగనాధ

రంగనాధ శ్రీరంగనాధ రంగనాధ శ్రీరంగనాధ


వేదములు సూతింపగా 

వేడుకలు దైవారాగా

ఆదరించి దాసులా 

మోహన నరసింహుడు

మోహన నరసింహుడు 

మోహన నరసింహుడు


కట్టెదుర వైకుంఠము 

కాణాచయినా కొండ

తెట్టెలాయే మహీమెలె

తిరుమల కొండ తిరుమల కొండ

కట్టెదుర వైకుంఠము 

కాణాచయినా కొండ

తెట్టెలాయే మహీమెలె

తిరుమల కొండ తిరుమల కొండ


బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే

బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే

పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే


తందనానా ఆహి తందనానాపురె

తందనానా భళా తందనానా

పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే

తందనానా భళా తందనానా


నిండారరాజు నిద్రించు నిద్రయునొకటే

అండనేబంటు నిద్ర ఆదియు నొకటే

మెండైన బ్రాహ్మణుడు మెట్టభూమి ఒకటే

మెండైన బ్రాహ్మణుడు మెట్టభూమి ఒకటే

చండాలుడుండెట్టి సరి భూమి ఒకటే


బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే

పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే


కడిగి ఏనుగు మీద కాయు ఎండొకటే

పుడమి శునకము మీద పొలయు ఎండొకటే


కడుపుణ్యులను పాపకర్ములను సరిగావా

జేడీయు శ్రీవేంకటేశ్వరు నామమొక్కటే

కడుపుణ్యాలను పాపకర్ములను సరిగావా

జేడీయు శ్రీవేంకటేశ్వరు నామమొక్కటే


బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే

పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే

తందనానా ఆహి తందనానాపురె

తందనానా భళా తందనానా


పర బ్రహ్మమొక్కటే భళా తందనాన

పర బ్రహ్మమొక్కటే భళా తందనాన

పర బ్రహ్మమొక్కటే భళా తందనాన


- పాటల ధనుస్సు 


నిగమ నిగమాంత వర్ణిత | Nigama Nigamantha | Song Lyrics | Annamayya (1997)

నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప



చిత్రం : అన్నమయ్య (1997)

సంగీతం : ఎం ఎం కీరవాణి 

రచన : అన్నమాచార్య 

గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం, చిత్ర 


పల్లవి :


నిగమ నిగమాంత వర్ణిత 

మనోహర రూప

నగరాజ ధరుడ శ్రీనారాయణ


నిగమ నిగమాంత వర్ణిత 

మనోహర రూప

నగరాజ ధరుడ శ్రీనారాయణ

నారాయణ శ్రీమన్నారాయణ

నారాయణ వెంకట నారాయణ


చరణం 1 :


దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యంభియా

నోపక కదా నన్ను నొడబరుపుచు

పైపై


పైపైన సంసార బంధముల కట్టేవు

నా పలుకు చెల్లునా నారాయణ

పైపైనే సంసార బంధముల కట్టేవు

నా పలుకు చెల్లునా నారాయణ

నిగమ గమదని సగమగసాని


నిగమ నిగమాంత వర్ణిత 

మనోహర రూప

నగరాజ ధరుడ శ్రీనారాయణ

నారాయణ శ్రీమన్నారాయణ

నారాయణ లక్ష్మి నారాయణ


చరణం 2 :


నీసా గసగసగసగసాగా

దానిసగమగసాగామగా 

సనిదస్స నీసాద

సగమా గామగా మదని 

దానిస మగసనిదమగస


వివిధ నిర్బంధముల

వివిధ నిర్బంధముల

వెడల ద్రోయకనన్ను

భవసాగరముల దడబడజేతురా


దివిజేంద్రవంధ్య 

శ్రీ తిరువేంకటాద్రిస

హరే హరే హరే

దివిజేంద్రవంధ్య 

శ్రీ తిరువేంకటాద్రిస

నవనీతచోరా శ్రీ నారాయణ


నిగమ సగమగసనిదమగాని

నిగమ గసమాగధమనిదస్స


నిగమ నిగమాంత వర్ణిత 

మనోహర రూప

నగరాజ ధరుడ శ్రీనారాయణ

నారాయణ శ్రీమన్నారాయణ 

వేద నారాయణ

వెంకట నారాయణ 

తిరుమల నారాయణ

కలియుగ నారాయణ 

హరి హరి నారాయణ

అది నారాయణ 

లక్ష్మి నారాయణ

శ్రీమన్నారాయణ

శ్రీమన్నారాయణ

శ్రీమన్నారాయణ


హరే హరే హరే హరే హరే


- పాటల ధనుస్సు 


5, ఆగస్టు 2025, మంగళవారం

ఫాలనేత్రాణాల ప్రబల విధ్యుల్లతా | Phalanetranala Prabhala | Song Lyrics | Annamayya (1997)

ఫాలనేత్రాణాల ప్రబల విధ్యుల్లతా కేళి



చిత్రం : అన్నమయ్య (1997)

సంగీతం : ఎం ఎం కీరవాణి 

రచన : వేటూరి సుందరరామమూర్తి 

గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం,


పాట:


ఫాలనేత్రాణాల 

ప్రబల విధ్యుల్లతా కేళి

విహార లక్ష్మీనారసింహ 

లక్ష్మీనారసింహ


ప్రళయ మారుత 

ఘోర భ్రాస్తికా పూత్కార

లలితా నిస్వాస 

డోలారచనాయా

కులశైల కుంభుని

కుముదహిత రవిగగన

చలనానిది నిపుణ 

నిశ్చల నారసింహ

నిశ్చల నారసింహ


దారుణోజ్వల 

ధగద్ధగీట దంష్ట్రనాల

వీ కార స్ఫులింగ 

సంగక్రిడయా

వైరి దానవి ఘోర 

వంశ భస్మీకరణ

కరణ ప్రకట 

వెంకట నారసింహ

వెంకట నారసింహ 

వెంకట నారసింహ


- పాటల ధనుస్సు 



4, ఆగస్టు 2025, సోమవారం

సకల శుభదాయని శ్రీ మహాలక్ష్మి దేవి | శ్రీ మహాలక్ష్మి స్తుతి గీతం | Sakala Shubadayani | Song Lyrics | RKSS Creations

సకల శుభదాయని శ్రీ మహాలక్ష్మి దేవి 



శ్రీ మహాలక్ష్మి స్తుతి గీతం


రచన : రామకృష్ణ దువ్వు

 

పల్లవి:

 

సకల శుభదాయని శ్రీ మహాలక్ష్మి దేవి

పద్మాసని చిద్విలాసిని కల్పవల్లి మాత

మా ఇంట వెలసిన సౌభాగ్య ప్రదాయిని

నిత్య పూజలంది ప్రీతినొంది కొలువుదీరి

కోరకయేకూర్చు అష్ట ఐశ్వర్యాలు తల్లీ …

అభయంకరీ జయ జయ మహా లక్ష్మీ …

 

చరణం 1:

 

అమ్మల గన్న యమ్మ మాయమ్మ శ్రీ లక్ష్మీ

భక్తుల పాలిటి కల్పతరువు నీవమ్మ

ధనధాన్య వృద్ధి సిరిసంపదల తల్లి

మహా విష్ణు వక్ష స్థలిని విడువలేకున్న

అయ్యతోనే మాయింట కొలువుతీరమ్మా

అభయంకరీ జయ జయ మహా లక్ష్మీ …

 

చరణం 2:

 

క్షీరసాగర పుత్రి గజవాహిని ఇందిరా

కమలనేత్రి చంద్ర సహోదరి వైష్ణవీ

పశుపు కుంకుమల సౌభాగ్య ప్రదాయనీ

కొనచూపుతోనే కనకంబు కురిపించు

వైకుంఠ వాసిని కారుణ్య స్వరూపిణి

అభయంకరీ జయ జయ మహా లక్ష్మీ …


- RKSS Creations...

పాటల ధనుస్సు పాపులర్ పాట

నువ్విట్ట నేనిట్ట కూకుంటే ఇంకెట్టా | Nuvvitta Nenatta | Song Lyrics | Seethamalakshmi (1978)

నువ్విట్ట నేనిట్ట కూకుంటే ఇంకెట్టా చిత్రం :  సీతామాలక్ష్మి (1978) సంగీతం :  కె.వి. మహదేవన్ గీతరచయిత :  వేటూరి నేపధ్య గానం :  బాలు, సుశీల పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు