30, ఆగస్టు 2025, శనివారం

ఏం వానో తడుముతున్నదీ | Yem Vano Tadumutunnadi | Song Lyrics | Nari Nari Naduma Murari (1990)

ఏం వానో తడుముతున్నదీ



చిత్రం: నారి నారి నడుమ మురారి (1990)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: సిరివెన్నెల

నేపథ్య గానం: బాలు, సుశీల 


పల్లవి :


ఏం వానో తడుముతున్నదీ

ఇది ఏం గాలో తరుముతున్నదీ

చాటు మాటు దాటి 

అవీ ఇవీ చూసేస్తోందే


ఏం వానో ఉరుకుతున్నదీ

ఇది ఏం గోలో ఉరుముతున్నదీ

ఆట పాట చూపీ 

అటూ ఇటూ లాగేస్తోందే


ఏం వానో తడుముతున్నదీ

ఇది ఏం గాలో తరుముతున్నదీ

ఆ...


చరణం 1 :


చినుకు పడు క్షణమేదో 

చిలిపి సడి చేసిందీ

ఉలికిపడి తలపేదో 

కలల గడి తీసిందీ

వానమ్మా వాటేస్తుంటే 

మేనంతా మీటేస్తుంటే

ఇన్నాళ్ళూ ఆ..ఆ..

ఓరగ దాగెను వయ్యారం 

ఓగున పాడెను శృంగారం

ఏ గాలి కొట్టిందొ నీ దారి పట్టింది


ఏం వానో ఉరుకుతున్నదీ

ఇది ఏం గాలో తరుముతున్నదీ

ఆ...


చరణం 2 :


మనకు గల వరసేదో 

తెలిసి ఎద వలచిందో

మునుపు గల ముడి ఏదో 

బిగిసి జత కలిపిందో

ఏమైందో ఏమోనమ్మా

ఏనాడో రాసుందమ్మా

ఇన్నాళ్ళూ ఆ.. ఆ..

ఉడుకున ఉడికిన బిడియాలు 

ఒడుపుగ ఒలికెను చెలికాడు

నా చూపు నచ్చిందొ 

నాజూకు ఇచ్చింది


ఏం వానో తడుముతున్నదీ

ఇది ఏం గాలో తరుముతున్నదీ

చాటు మాటు దాటి 

అవీ ఇవీ చూసేస్తోందే


ఏం వానో తడుముతున్నదీ

ఇది ఏం గాలో తరుముతున్నదీ

హ్మ్...


- పాటల ధనుస్సు 


పెళ్ళంటూనే వేడెక్కిందే గాలీ | Pellantune Vedekkinde Gali | Song Lyrics | Nari Nari Naduma Murari (1990)

పెళ్ళంటూనే వేడెక్కిందే గాలీ



చిత్రం: నారి నారి నడుమ మురారి (1990) 

సంగీతం: కె.వి. మహదేవన్ 

గీతరచయిత: సిరివెన్నెల

నేపథ్య గానం: బాలు, సుశీల 


పల్లవి : 


పెళ్ళంటూనే వేడెక్కిందే గా...లీ 

మళ్ళీ వింటే ఏమౌతుందో చూడాలీ 

పెళ్ళంటూనే వేడెక్కిందే గా...లీ 

మళ్ళీ వింటే ఏమౌతుందో చూడాలీ 


ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి 

ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి 

ముంచుకొస్తోంది ముహూర్తాల వేళా.. 

కంచె దాటింది ఆత్రాల గోలా... 


పెళ్ళంటూనే వేడెక్కిందే గాలీ 

మళ్ళీ వింటే ఏమౌతుందో చూడాలీ 

ఆ... ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి 

మ్మ్... ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి 


చరణం 1 : 


తరిమే తరుణంతో 

పరువం తడబడుతోంది 

కులికే చెలితాపం 

కుదురుగ నిలబడనంది 

తరిమే తరుణంతో 

పరువం తడబడుతోంది 

కులికే చెలితాపం 

కుదురుగ నిలబడనంది 


మనసే నీకోసం... 

ఏటికి ఎదురీదింది 

మురిపెం తీరందే... 

నిదురను వెలివేస్తుంది 

చెలరేగే చెలి వేగం 

ఉక్కిరి బిక్కిరి చేస్తోంది 

ఆ... ముడులేసే మనువైతే 

మక్కువ మత్తుగ దిగుతుంది 


ఆ... ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి 

ఆ... ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి 


ముంచుకొస్తోంది ముహూర్తాల వేళా.. 

కంచె దాటింది ఆత్రాల గోలా... 


పెళ్ళంటూనే వేడెక్కిందే గాలీ 

మళ్ళీ వింటే ఏమౌతుందో చూడాలీ 

ఆ... ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి 

ఆ... ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి 


చరణం 2 : 


సాయం రమ్మంటూ 

ప్రాయం కబురంపింది 

బిగిసే బంధంలో 

బందీ కమ్మంటోంది 

సాయం రమ్మంటూ 

ప్రాయం కబురంపింది 

బిగిసే బంధంలో 

బందీ కమ్మంటోంది 


వీచే ప్రతిగాలీ... 

వయసును వేధిస్తోంది 

జతగా నువ్వుంటే... 

పైటకు పరువుంటుంది 

మితిమీరె మొగమాటం 

అల్లరి అల్లిక అడిగింది 

ఆ... మదిలోని మమకారం 

మల్లెల పల్లకి తెమ్మంది 


ఆ..... 


ముంచుకొస్తోంది ముహూర్తాల వేళా.. 

కంచె దాటింది ఆత్రాల గోలా... 

పెళ్ళంటూనే వేడెక్కిందే గా...లీ 

మళ్ళీ వింటే ఏమౌతుందో చూడాలీ 

ఆ... ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి 

ఆ... ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి


- పాటల ధనుస్సు 


మనసులోని మర్మమును | Manasuloni Marmamunu | Song Lyrics | Nari Nari Naduma Murari (1990)

మనసులోని మర్మమును



చిత్రం : నారి నారి నడుమ మురారి (1990)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపథ్య గానం : బాలు, సుశీల


పల్లవి:


మనసులోని మర్మమును 

తెలుసుకో...

నా మనసులోని మర్మమును 

తెలుసుకో...

మాన రక్షకా.. మరకతాంగ

మానరక్షకా.. మరకతాంగ


నా మనసులోని మర్మమును 

తెలుసుకో...

నా మనసులోని మర్మమును 

తెలుసుకో...

మదన కీలగ.. మరిగిపోక..

మదనకీలగ...మరిగిపోక..

నా మనసులోని మర్మమును 

తెలుసుకో


చరణం 1:


ఇనకులాబ్ధ.. 

నీవేకాని వేరెవరులేరు

దిక్కెవరు లేరు

ఆనంద హృదయా.. 

మనసులోని మర్మమును 

తెలుసుకో


అనువుగాని ఏకాంతాన.. 

ఏకాంతకైనా

ఆ కాంక్ష తగున.. 

రాకేందు వదనా


మనసులోని మర్మమును 

తెలుసుకో


చరణం 2:


మునుపు ప్రేమగల దొరవై

సదా తనువునేలినది 

గొప్ప కాదయా


మదిని ప్రేమ కథ మొదలై

ఇలా అదుపుదాటినది 

ఆదుకోవయా


కనికరమ్ముతో ఈ వేళ..ఊ..ఊ..ఊ..

కనికరమ్ముతో ఈ వేళ.. 

నా కరముబట్టు.. ఆ..

త్యాగరాజ వినుతా..


మనసులోని మర్మమును 

తెలుసుకో

నా మనసులోని మర్మమును 

తెలుసుకో


చరణం 3:


మరుల వెల్లువల వడినై

ఇలా దరులు దాటితిని 

నిన్ను చేరగా


మసక వెన్నెలలు ఎదురై

ఇలా తెగువ కూడదని 

మందలించవా


కలత ఎందుకిక ఈ వేళా?? 

ఆ..ఆ..ఆ..

కలవరమ్ముతో ఈ వేళ..

నా కరము వణికే..ఆ..ఆ

ఆగాడాల వనితా..


మనసులోని మర్మమును 

తెలుసుకో

మదనకీలగ..మరిగిపోక

మానరక్షక.. మరకతాంగ

నా మనసులోని మర్మమును 

తెలుసుకో


- పాటల ధనుస్సు 



ఇరువురు భామల కౌగిలిలో | Iruvuru Bhamala Kougililo | Song Lyrics | Nari Nari Naduma Murari (1990)

ఇరువురు భామల కౌగిలిలో



చిత్రం: నారి నారి నడుమ మురారి (1990)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ

నేపథ్య గానం: బాలు, సుశీల


సాకి : 


ద్వాపరమంతా సవతుల సంతా 

జ్ఞాపకముందా గోపాలా

కలియుగమందూ ఇద్దరి ముందూ 

శిలవయ్యావే స్త్రీలోలా

కాపురాన ఆపదలని ఈదిన శౌరీ .. 

ఏదీ నాకూ చూపవా ఒక దారీ

నారీ నారీ నడుమ మురారీ .. 

నారీ నారీ నడుమ మురారీ


పల్లవి :


ఇరువురు భామల కౌగిలిలో స్వామీ .. 

ఇరుకున పడి నీవు నలిగితివా

ఇరువురు భామల కౌగిలిలో స్వామీ .. 

ఇరుకున పడి నీవు నలిగితివా

వలపుల వానల జల్లులలో స్వామీ 

తల మునకలుగా తడిసితివా


చిరుబురులాడేటీ శ్రీదేవీ 

నీ శిరసును వంచిన కథ కన్నా

రుసరుస లాడేటీ భూదేవీ 

నీ పరువును తీసినా కథ విన్నా

గోవిందా...ఆ.. గోవిందా...ఆ.. గోవిందా...

సాగిందా జోడు మధ్యల సంగీతం .. 

బాగుందా భామలిద్దరి భాగోతం


చరణం 1 :


ఇంటిలోన పోరంటే ఇంతింత కాదయా .. 

అన్నాడు ఆ యోగి వేమనా

నాతరమా భవసాగర మీదనూ .. 

అన్నాడు కంచెర్ల గోపన్నా

పరమేశా గంగ విడుము 

పార్వతి చాలున్

ఆ మాటలు విని ముంచకు 

స్వామీ గంగన్

ఇంతులిద్దరైనప్పుడు ఇంతే గతిలే .. 

సవతుల సంగ్రామంలో 

పతులది వెనకడుగే

ఇంతులిద్దరైనప్పుడు ఇంతే గతిలే .. 

సవతుల సంగ్రామంలో 

పతులది వెనకడుగే


ఇరువురు భామల కౌగిలిలో స్వామీ .. 

ఇరుకున పడి నీవు నలిగితివా


చరణం 2 :


భామ కాలు తాకిందా కృష్ణుడే గోవిందా .. 

అన్నాడు ఆ నంది తిమ్మనా

ఒక మాట ఒక బాణము ఒక సీత నాదని .. 

అన్నాడు సాకేత రామన్న

ఎదునాథా భామ విడుము 

రుక్మిణి చాలున్

రఘునాథా సీతను గొని 

విడు శూర్పణఖన్

రాసలీలలాడాలని నాకు లేదులే .. 

భయభక్తులు ఉన్న భామ 

ఒకతే చాలులే

రాసలీలలాడాలని నాకు లేదులే .. 

భయభక్తులు ఉన్న భామ 

ఒకతే చాలులే


ఇరువురు భామల కౌగిలిలో స్వామీ .. 

ఇరుకున పడి నీవు నలిగితివా

వలపుల వానల జల్లులలో స్వామీ 

తల మునకలుగా తడిసితివా

గోవిందా...ఆ.. గోవిందా...ఆ.. గోవిందా...


- పాటల ధనుస్సు 


అపురూప రూపసి నీవు | Apuroopa Rupasi neevu | Song Lyrics | Guru Shishyulu (1981)

అపురూప రూపసి నీవు



చిత్రం : గురు శిష్యులు (1981)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : బాలు, సుశీల


పల్లవి :  


అపురూప రూపసి నీవు... 

అతిలోక ప్రేయసి నీవు

కల నీవు... కళ నీవు..

తుది లేని కాంతివి నీవు... 

ఎద నిండు శాంతివి నీవు...  


అపురూప దైవము నీవు... 

అతిలోక ప్రేమవు నీవు

గుడి నీవు... ఒడి నీవు...

ఎదలోని సవ్వడి నీవు... 

ఎనలేని ఒరవడి నీవు...


చరణం 1 :


నిను చూచే చూపులతో... 

కనులైనవి వెన్నెల కలశాలు

నిను తలచే తలపులతో... 

మనసైనది మల్లెల వెల్లువలు


నీ కోరికలే నా వేడుకలు... 

నీ కౌగిళ్ళే వనమాలికలు

నీ నవ్వులే తారకలు... 

నీ ఊహలే డోలికలు


అపురూప రూపసి నీవు... 

అతిలోక ప్రేమవు నీవు

కల నీవు... కళ నీవు..

ఎదలోని సవ్వడి నీవు... 

ఎద నిండు శాంతివి నీవు...  


చరణం 2 :


నే పిలిచిన పిలుపుకు బదులైనావు...

నే తెరచిన ఇంటికి వెలుగైనావు...


నా విడిపూలను ముడి వేసిన 

దారం నీవు

నా ఎద పలికే వేదాలకు 

సారం నీవు

ఓంకార నాదం నీవు...


అపురూప రూపసి నీవు... 

అతిలోక ప్రేమవు నీవు

కల నీవు... కళ నీవు..

ఎదలోని సవ్వడి నీవు... 

ఎద నిండు శాంతివి నీవు...  


చరణం 3 :


నీతోనే నా హృదిలో... 

ఉదయించెను వలపుల కిరణాలు

నీ తపసే నా మనసై... 

తొలగించెను కలతల మేఘాలు


నీ గారాలే... నయగారాలు

నీ లాలనలే...  పరిపాలనలు..

నీ కోసమే పుట్టుకలు... 

నీతోనే అల్లికలు


అపురూప రూపసి నీవు... 

అతిలోక ప్రేమవు నీవు

కల నీవు... కళ నీవు..

ఎదలోని సవ్వడి నీవు... 

ఎద నిండు శాంతివి నీవు...


- పాటల ధనుస్సు 


ఉందిలే మంచి కాలం | Undile Manchikalam | Song Lyrics | Ramudu Bheemudu (1964)

ఉందిలే మంచి కాలం



చిత్రం :  రాముడు-భీముడు (1964)

సంగీతం :  పెండ్యాల

గీతరచయిత :  శ్రీశ్రీ

నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల


పల్లవి :


అహా హ హా అహా హ హ 

అహా హ హా అహా హ హ

ఉందిలే మంచి కాలం 

ముందు ముందూనా

అందరూ సుఖపడాలి 

నందనందాన..ఆ..ఆ

ఉందిలే మంచి కాలం 

ముందు ముందూనా

అందరూ సుఖపడాలి 

నందనందాన..ఆ..ఆ


ఉందిలే మంచి కాలం 

ముందు ముందూనా

అందరూ సుఖపడాలి 

నందనందాన..ఉందిలే... 


చరణం 1 :


ఆఆ..ఆఆఆ.ఆఆఆ..ఆఆ..ఆఆఆఆ..

ఎందుకో.. సందేహమెందుకో.. 

రానున్న విందులో.. 

నీ వంతు అందుకో

ఎందుకో.. సందేహమెందుకో.. 

రానున్న విందులో.. 

నీ వంతు అందుకో

ఆ రోజు అదిగో కలదూ 

నీ యెదుటా..ఆ...ఆ... 

నీవే రాజువట..ఆ..ఆ


ఉందిలే మంచి కాలం 

ముందు ముందూనా

అందరూ సుఖపడాలి 

నందనందాన..ఉందిలే

ఏమిటేమిటేమిటే.. 

మంచి కాలం అంటున్నావ్?

ఎలాగుంటుందో ఇశితంగా చెప్పూ.. 


చరణం 2 :


దేశ సంపద పెరిగే రోజు.. 

మనిషి మనిషిగా బ్రతికే రోజు..

దేశ సంపద పెరిగే రోజు... 

మనిషి మనిషిగా బ్రతికే రోజు..

గాంధీ మహాత్ముడు కలగన్న రోజు.. 

నెహ్రూ అమాత్యుడు నెలకొల్పు రోజు

ఆ రోజెంతో దూరం లేదోరన్నయ్యో..ఓ..ఓ.. 

అదిగో చూడు రేపే నేడు చిన్నయ్యో ..

ఆ రోజెంతో దూరం లేదోరన్నయ్యో..ఓ..ఓ..

అదిగో చూడు రేపే నేడు చిన్నయ్యో


భలే భలే..బాగా చెప్పావ్..

కాని.. అందుకు మనమేం చెయ్యాలో 

అది కూడా నువ్వే చెప్పు


చరణం 3 :


అందరి కోసం ఒక్కడు నిలిచి.. 

ఒక్కనికోసం అందరూ కలిసి

అందరి కోసం ఒక్కడు నిలిచి.. 

ఒక్కనికోసం అందరూ కలిసి

సహకారమే మన వైఖరియైతే.. 

ఉపకారమే మన ఊపిరి ఐతే..

పేదాగొప్పా భేదం పోయి అందరూ..ఊ..ఊ.. 

నీదినాదని వాదం మాని ఉందురూ..ఊ..

ఆ రోజెంతో దూరంలేదోరన్నయ్యో..ఓ..ఓ.. 

అదిగో చూడు రేపేనేడు చిన్నయ్యో

ఆ రోజెంతో దూరంలేదోరన్నయ్యో..ఓ..ఓ.. 

అదిగో చూడు రేపేనేడు చిన్నయ్యో


ఆఆ..ఆఆఆ.ఆఆఆ..ఆఆ..ఆఆఆఆ..

తీయగా బ్రతుకంతా మారగా

కష్టాలు తీరగా.. సుఖశాంతులూరగా...

ఆకాశవీధుల ఎదురేలేకుండా ..ఆ..ఆ...

ఎగురును మన జెండా..ఆ..ఆ


ఉందిలే మంచి కాలం 

ముందు ముందూనా ..

అందరూ సుఖపడాలి 

నందనందాన..ఆ..

ఉందిలే మంచి కాలం 

ముందు ముందూనా ..

అందరూ సుఖపడాలి 

నందనందానా..ఆ.. 

ఉందిలే..


- పాటల ధనుస్సు 


తెలిసిందిలే తెలిసిందిలే | Telisindile Telisindile | Song Lyrics | Ramudu Bheemudu (1964)

తెలిసిందిలే తెలిసిందిలే



చిత్రం :  రాముడు-భీముడు (1964)

సంగీతం :  పెండ్యాల

గీతరచయిత :  సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల


పల్లవి :


తెలిసిందిలే తెలిసిందిలే.. 

నెలరాజ నీ రూపు తెలిసిందిలే

తెలిసిందిలే తెలిసిందిలే.. 

నెలరాజ నీ రూపు తెలిసిందిలే 


చరణం 1 :


చలిగాలి రమ్మంచు పిలిచింది లే.. 

చెలి చూపు నీ పైన నిలిచింది లే

చలిగాలి రమ్మంచు పిలిచింది లే.. 

చెలి చూపు నీ పైన నిలిచింది లే


ఏముందిలే .. ఇపుడేముందిలే

ఏముందిలే .. ఇపుడేముందిలే

మురిపించు కాలమ్ము ముందుంది లే.. 

నీ ముందుంది లే  

తెలిసిందిలే తెలిసిందిలే.. 

నెలరాజ నీ రూపు తెలిసిందిలే


చరణం 2 :


వరహాల చిరునవ్వు కురిపించవా.. 

పరువాల రాగాలు పలికించవా

ఆ .. ఆ .. ఓ .. ఓ ..ఆ....

వరహాల చిరునవ్వు కురిపించవా.. 

పరువాల రాగాలు పలికించవా


అవునందునా.. కాదందునా

అవునందునా కాదందునా

అయ్యారే విధి లీల అనుకొందునా ..

అనుకొందునా  

తెలిసిందిలే తెలిసిందిలే.. 

నెలరాజ నీ రూపు తెలిసిందిలే


చరణం 3 :


సొగసైన కనులేమో నాకున్నవి.. 

చురుకైన మనసేమో నీకున్నది

సొగసైన కనులేమో నాకున్నవి.. 

చురుకైన మనసేమో నీకున్నది


కనులేమిటో.. ఈ కథ ఏమిటో

కనులేమిటో ఈ కథ ఏమిటో

శృతి మించి రాగాన పడనున్నది.. 

పడుతున్నది


ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ........ 

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ


తెలిసిందిలే తెలిసిందిలే 

నెలరాజ నీ రూపు తెలిసిందిలే


- పాటల ధనుస్సు 



దేశమ్ము మారిందోయ్ | Deshammu Marindoy | Song Lyrics | Ramudu Bheemudu (1964)

దేశమ్ము మారిందోయ్



చిత్రం :  రాముడు-భీముడు (1964)

సంగీతం :  పెండ్యాల

గీతరచయిత :  కొసరాజు 

నేపథ్య గానం :  ఘంటసాల, సుశీల


పల్లవి :


దేశమ్ము మారిందోయ్.. 

కాలమ్ము మారిందోయ్

దేశమ్ము మారిందోయ్.. 

కాలమ్ము మారిందోయ్

కష్టాలు తీరేనోయ్.. 

సుఖాలు నీవేనోయ్

కష్టాలు తీరేనోయ్.. 

సుఖాలు నీవేనోయ్

దేశమ్ము మారిందోయ్.. 

కాలమ్ము మారిందోయ్


చరణం 1 :


కొండలు కొట్టి.. కొట్టి

డ్యాములు కట్టీ.. కట్టి

నీళ్ళను మలిపి... మలిపి

చేలను తడిపి... తడిపి

కురిసే చక్కని రోజు 

మనకు వస్తుందోయ్… వస్తుంది


దేశమ్ము మారిందోయ్... 

కాలమ్ము మారిందోయ్

దేశమ్ము మారిందోయ్... 

కాలమ్ము మారిందోయ్


చరణం 2 :


కండల్ని కరగదీయి... 

బండల్ని విసరివెయ్యి ...  

నీదేలె పైచేయి

కండల్ని కరగదీయి... 

బండల్ని విసరివెయ్యి ...  

నీదేలె పైచేయి

భాగ్యాలు పండునోయి... 

వాకళ్ళు నిండునోయి

సిరులు చిందునోయి... 

ఆశలు అందునోయి

సిరులు చిందునోయి... 

ఆశలు అందునోయి

చేయి చేయి కలపాలి 

రావయా...  బావయ్యా

దేశమ్ము మారిందోయ్ .. 

కాలమ్ము మారిందోయ్

దేశమ్ము మారిందోయ్ .. 

కాలమ్ము మారిందోయ్


చరణం 3 :


గ్రామాల బాగుచెయ్యి... 

దీపాల వెలుగునియ్యి ... 

జేజేలు నీకోయి …

గ్రామాల బాగుచెయ్యి... 

దీపాల వెలుగునియ్యి... 

జేజేలు నీకోయి …

చిట్టి చీమలన్ని 

పెద్ద పుట్ట పెట్టు హలా హల

ఎందరో తమ రక్తాన్ని 

చిందించిరి హలా హల


ఆక్రమాలకు అసూయలకు 

ఆనకట్ట ఇదే ఇదే

త్యాగమంటె ఇదే ఇదే .. 

ఇదే ఇదే ఇదే ఇదే

ఐకమత్యమిదే ఇదే .. 

ఇదే ఇదే ఇదే ఇదే

అనుభవమ్ము నీదేనోయి...  

ఆనందం నీదేనోయి

అనుభవమ్ము నీదేనోయి...  

ఆనందం నీదేనోయి

నిజమౌ శ్రమజీవివంటే...  

నీవెనోయ్ నీవోనోయ్


దేశమ్ము మారిందోయ్... 

కాలమ్ము మారిందోయ్

దేశమ్ము మారిందోయ్... 

దేశమ్ము మారిందోయ్

దేశమ్ము మారిందోయ్... 

దేశమ్ము మారిందోయ్

దేశమ్ము మారిందోయ్… 

దేశమ్ము మారిందోయ్


- పాటల ధనుస్సు 


29, ఆగస్టు 2025, శుక్రవారం

తళుకు తళుకుమని | Taluku Talukumani | Song Lyrics | Ramudu Bheemudu (1964)

తళుకు తళుకుమని



చిత్రం :  రాముడు-భీముడు (1964)

సంగీతం :  పెండ్యాల

గీతరచయిత :  సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల  


పల్లవి :


హోయ్ తళుకు తళుకుమని 

గలగల సాగే..ఏ..ఏ..

హోయ్ తళుకు తళుకుమని 

గలగల సాగే...  తరుణీ ఇటు రావేమే

హోయ్ చమకు చమకుమని 

చిన్నారి నడకల చేరుకోవేమే

హోయ్ తళుకు తళుకుమని 

గలగల సాగే తరుణీ...


రమ్మనకు హోయ్ రమ్మనకు... 

ఇపుడే నను రా రమ్మనకు

విరిమొగ్గలు చూచే వేళ...  

చిరు సిగ్గులు పూచే వేళ

రమ్మనకు హొయ్ రమ్మనకు  


చరణం 1 :


చీకటి ముసిరే దెన్నడు 

నా చేతికి అందే దెన్నడు

హోయ్ సిగ్గులు తొలిగే దెన్నడు 

నీ బుగ్గలు పిలిచే దెన్నడు

హోయ్ కదిలే కన్నులు మూసుకో

హోయ్ కదిలే కన్నులు మూసుకో

మదిలో మగువను చూసుకో


రమ్మనకు... హోయ్ రమ్మనకు 

ఇపుడే నను రా రమ్మనకు


చరణం 2 :


నిన్నటి కలలో మెత్తగా 

నా నిద్దుర దోచితి వెందుకు..

ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ

మొన్నటి కలలో మత్తుగా 

కను సన్నలు చేసితి వెందుకు

అంతకు మొన్నటి రాతిరీ

అంతకు మొన్నటి రాతిరీ... 

గిలిగింతలు మొదలైనందుకు... 


రమ్మనకు హోయ్ ఇపుడే 

నను రా రమ్మనకు

విరిమొగ్గలు చూచే వేళ 

చిరు సిగ్గులు పూచే వేళ

రమ్మనకు హొయ్ రమ్మనకు  


- పాటల ధనుస్సు 


సరదా సరదా సిగిరెట్టు | Sarada Sarada Sigarettu | Song Lyrics | Ramudu Bheemudu (1964)

సరదా సరదా సిగిరెట్టు



చిత్రం :  రాముడు-భీముడు (1964)

సంగీతం :  పెండ్యాల

గీతరచయిత :  కొసరాజు

నేపథ్య గానం :  మాధవపెద్ది , జమునా రాణి 


పల్లవి :


సరదా సరదా సిగిరెట్టూ...  

ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ

సరదా సరదా సిగిరెట్టూ...  

ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ

పట్టుబట్టి ఒక దమ్ము లాగితే...  

స్వర్గానికె యిది తొలి మెట్టు

సరదా సరదా సిగిరెట్టూ...  

ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ


కంపు గొట్టు యీ సిగరెట్టు...  

దీన్ని కాల్చకోయీ నాపై ఒట్టు

కంపు గొట్టు యీ సిగరెట్టు...  

దీన్ని కాల్చకోయీ నాపై ఒట్టు

కడుపు నిండునా కాలు నిండునా...  

వదలి పెట్టవోయ్ నీ పట్టు

కంపు గొట్టు యీ సిగరెట్టు...  

దీన్ని కాల్చకోయీ నాపై ఒట్టు


చరణం 1 :


 ఈ సిగిరెట్టుతో ఆంజనేయుడూ 

లంకా దహనం చేశాడూ

హా.. ఎవడో కోతలు కోశాడూ

ఈ పొగ తోటీ గుప్పు గుప్పున 

మేఘాలు సృష్టించవచ్చూ...

మీసాలు కాల్చుకోవచ్చూ


సరదా సరదా సిగిరెట్టూ...  

ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ


చరణం 2 :


ఊపిరి తిత్తులు క్యాన్సరుకిదియే 

కారణమన్నారు డాక్టర్లూ

కాదన్నారులే పెద్ద యాక్టర్లూ

పసరు బేరుకొని కఫము జేరుకొని 

ఉసురు తీయు పొమ్మన్నారూ

దద్దమ్మలు అది విన్నారూ


కంపు గొట్టు యీ సిగరెట్టు...  

దీన్ని కాల్చకోయీ నాపై ఒట్టు


చరణం 3 :


 ప్రక్కనున్న వాళ్ళీ సువాసనకు

ముక్కు ఎగరేస్తారు...

నీవెరుగవు దీని హుషారు

థియేటర్లలో పొగ త్రాగడమే 

నిషేధించినారందుకే...

కలెక్షన్లు లేవందుకే


సరదా సరదా సిగిరెట్టూ...  

ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ

కంపు గొట్టు యీ సిగరెట్టు...  

దీన్ని కాల్చకోయీ నాపై ఒట్టు


చరణం 4 :


కవిత్వానికి సిగిరెట్టు...  

కాఫీకే యిది తోబుట్టు.

పైత్యానికి యీ సిగిరెట్టు...  

బడాయి క్రిందా జమకట్టూ

ఆనందానికి సిగిరెట్టు...  

ఆలోచనలను గిలకొట్టు

వాహ్...పనిలేకుంటే సిగిరెట్టూ...  

తిని కూర్చుంటే పొగపట్టూ


రవ్వలు రాల్చే రాకెట్టూ...  

రంగు రంగులా ప్యాకెట్టూ

కొంపలు గాల్చే సిగిరెట్టూ...  

దీని గొప్ప చెప్ప చీదర బుట్టూ


సరదా సరదా సిగిరెట్టూ...  

ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ

కంపు గొట్టు యీ సిగరెట్టు...  

దీన్ని కాల్చకోయీ నాపై ఒట్టు


- పాటల ధనుస్సు 


26, ఆగస్టు 2025, మంగళవారం

తగునా ఇది మామా | Taguna Idi Mama | Song Lyrics | Ramudu Bheemudu (1964)

తగునా ఇది మామా



చిత్రం :  రాముడు-భీముడు (1964)

సంగీతం :  పెండ్యాల

గీతరచయిత :  కొసరాజు

నేపథ్య గానం :  ఘంటసాల, మాధవపెద్ది  


పల్లవి :


తగునా ఇది మామా... 

తమరే ఇటు బల్క నగున

తగునా ఇది మామా...

నిగమ మార్గములు తెలిసిన 

నీవే ఇటులనదగునా...

తగునా ఇది మామా


అల్లుడనగనెవడు...  

మీ అమ్మాయికి మగడూ

అల్లుడనగనెవడు...  

మీ అమ్మాయికి మగడూ

నీవు కాళ్ళు కడిగి 

కన్యాదానము చేసిన ఘనుడు

ఆ ఘనుని మీద అలుక బూన 

ఏటికి చీటికి మాటికి


తగునా ఇది మామా... 

తమరే ఇటు బల్క నగున

తగునా ఇది మామా


చరణం 1 :


ఫో.. ఫో... ర...  ఫొమ్మికన్....

ఫోఫోర ఫొమ్మికన్...  

నా గృహమ్మునకు భోజనమ్మునకు

ఇక రా వలదు...  రా తగదు...  

ఛీ పో ఫో.. ఫో.. ర..  ఫొమ్మికన్

అరెరే ఎంతటి మోసగాడవుర...  

నాకే టోపీ వేసినావుర

అరెరే ఎంతటి మోసగాడవుర...  

నాకే టోపీ వేసినావుర


నీ సాహసము పరీహాసము...  

నీ సాహసము పరీహాసము

నిర్భాగ్యుల తోటి సహవాసము

సహించను క్షమించను...  

యోచించను నీ మాటన్

వచ్చిన బాటన్ పట్టుము...  

వేగన్ ఫో.. ఫో... ర ఫొమ్మికన్

ఫోఫోర ఫొమ్మికన్ 

నా గృహమ్మునకు భోజనమ్మునకు

ఇక రా వలదు రా తగదు ఛీ ఫో ఫో


చరణం 2 :


కొడుకులు లేనందుకు 

తల కొరివి బెట్టువాడనే...

నీకు కొరివి బెట్టువాడనే

డైరెక్టుగ స్వర్గానికి 

చీటి నిచ్చువాడనే

తల్లి లేని పిల్ల ఉసురు 

తగలదె ఒంటిగ ఉంచగ 


తగునా ఇది మామా... 

తమరే ఇటు బల్క నగున

తగునా ఇది మామా... 


చరణం 3 :


అరె...  ఊరికెల్ల మొనగాడినే

అరె...  ఊరికెల్ల మొనగాడినే... 

పెద్ద మిల్లు కెల్ల యజమానినే...

నీ డాబూసరి బలే బిత్తరి

నీ డాబూసరి బలే బిత్తరి...  

నిజమేనని నమ్మితి పోకిరి

దురాత్ముడా...  దుష్టాత్ముడా...  

గర్వాత్ముడా...  నీచుడా


ఇపుడె తెలిసెన్ నీ కథ ఎల్లన్...  

ఫో...ఫో... ర ఫొమ్మికన్

ఫోఫోర ఫొమ్మికన్ 

నా గృహమ్మునకు భోజనమ్మునకు

ఇక రా వలదు రా తగదు చీ ఫో ఫో


- పాటల ధనుస్సు