RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

29, ఫిబ్రవరి 2024, గురువారం

అంతట నీ రూపం నన్నే చూడనీ | Anthata nee roopam | Song Lyrics | Pooja (1975)

అంతట నీ రూపం నన్నే చూడనీ



చిత్రం :  పూజ (1975)

సంగీతం :  రాజన్-నాగేంద్ర

గీతరచయిత :  దాశరథి

నేపధ్య గానం :  బాలు


పల్లవి:


ఆహా...హా...ఏహే..హే...లాలా ...లా...లాలా..లా..

అంతట నీ రూపం నన్నే చూడనీ..

ఆశలు పండించే నిన్నే చేరనీ...

నీకోసమే నా జీవితం.. నాకోసమే నీ జీవితం ...


అంతట నీరూపం నన్నే చూడనీ..

ఆశలు పండించే నిన్నే చేరనీ...


చరణం 1:


నీవే లేని వేళ... ఈ పూచే పూవులేల

వీచే గాలి.. వేసే ఈల.. ఇంకా ఏలనే


కోయిల పాటలతో ..పిలిచే నా చెలీ..

ఆకుల గలగలలో నడిచే కోమలీ..


అంతట నీ రూపం నన్నే చూడనీ..

ఆశలు పండించే నిన్నే చేరనీ...


చరణం 2:


నాలో ఉన్న కలలు.. మరి నీలో ఉన్న కలలూ

అన్నీ నేడు నిజమౌ వేళ రానే వచ్చెనే..


తీయని తేనెలకై తిరిగే తుమ్మెదా

నీ చిరునవ్వులకై వెతికే నా ఎదా


అంతట నీ రూపం నన్నే చూడనీ..

ఆశలు పండించే నిన్నే చేరనీ..

ఆహా..హా...ఓహో..ఓ..లాలాలా...ఏహే..హే...


పాటల ధనుస్సు 


28, ఫిబ్రవరి 2024, బుధవారం

ఎన్నెన్నో జన్మల బంధం | Ennenno Janmala Bandham | Song Lyrics | Pooja (1975)

ఎన్నెన్నో జన్మల బంధం



చిత్రం :  పూజ (1975)

సంగీతం :  రాజన్-నాగేంద్ర

గీతరచయిత :  దాశరథి

నేపథ్య గానం :  బాలు, వాణీ జయరాం 


పల్లవి :


ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ

ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ

ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను

ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను


ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ

ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ


చరణం 1 :


పున్నమి వెన్నెలలోనా పొంగును కడలి

నిన్నే చూసిన వేళ నిండును చెలిమి


ఓహో హో హో ..నువ్వు కడలివైతే

నే నదిగ మారి చిందులు వేసి వేసి నిన్ను

చేరనా…  చేరనా... చేరనా…


ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ

ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ


చరణం 2 :


విరిసిన కుసుమము నీవై కురిపించేవు

జాబిలి నేనై నిన్ను పెనవేసేను


ఓహో హో హో మేఘము నీవై 

నెమలిని నేనై

ఆశతో నిన్ను చూసి చూసి

ఆడనా.. పాడనా.. ఆడనా…


ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ

ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ


చరణం 3 :


కోటి జన్మలకైనా కోరేదొకటే

నాలో సగమై ఎపుడూ .. నేనుండాలి


ఓహో హో హో నీ ఉన్నవేళా…  

ఆ స్వర్గమేలా

ఈ పొందు ఎల్ల వేళలందు

ఉండనీ. ఉండనీ.. ఉండనీ..


ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ

ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ

ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను

అహాహ హాహా.. ఓహోహోహోహో...


పాటల ధనుస్సు 

27, ఫిబ్రవరి 2024, మంగళవారం

నింగీ నేలా ఒకటాయెలే | Ningi Nela Okatayele | Song Lyrics | Pooja (1975)

నింగీ నేలా ఒకటాయెలే



చిత్రం : పూజ (1975)

సంగీతం : రాజన్-నాగేంద్ర

గీతరచయిత : దాశరథి

నేపధ్య గానం : బాలు, వాణీ జయరాం


పల్లవి:


నింగీ నేలా ఒకటాయెలే

మమతలూ వలపులూ పూలై విరిసెలే

మమతలూ వలపులూ పూలై విరిసెలే


నింగీ నేలా ఒకటాయెలే...


చరణం 1:


హో హోహోహో...


ఇన్నాళ్ళ ఏడబాటు నేడే తీరెలే

నా వెంట నీవుంటే ఎంతో హాయిలే

ఆహాహా లాలాలా... ఆహాహా లాలాలా

హృదయాలు జత జేరి ఊగే వేళలో

దూరాలు భారాలు లేనే లేవులే

నీవే నేను లే ...నేనే నీవు లే

లలలలలా... లాలాల లాలాల...


నింగీ నేలా ఒకటాయెలే


చరణం 2:


రేయైనా పగలైనా నీపై ధ్యానము 

పలికింది నాలోన వీణా గానము

ఆహాహా లాలాలా... ఓహోహో లాలాలా

అధరాల కదిలింది నీదే నామము

కనులందు మెదిలింది నీదే రూపము

నీదే రూపమూ ... నీవే రూపము

లలలలలా... లాలాల లాలాల...


నింగీ నేలా ఒకటాయెలే

మమతలూ వలపులూ పూలై విరిసెలే...


పాటల ధనుస్సు 


నీ దయ రాదా రామ | Nee Daya Raadaa Rama | Song Lyrics | Pooja (1975)

నీ దయ రాదా రామ



చిత్రం : పూజ (1975)

సంగీతం : రాజన్-నాగేంద్ర

గీతరచయిత : త్యాగయ్య

నేపధ్య గానం : సుశీల


పల్లవి:


శ్రీరామ రామ రామేతి

రమే రామే మనోరమే

సహస్రనామ తత్ తుళ్యం

రామ నామం వరాననే 


నీ దయ రాదా రామ! నీ దయ రాదా

నీ దయ రాదా నీ దయ రాదా రామా 


కాదనే వారెవరూ..ఊ..ఊ

కాదనే వారెవరూ కల్యాణ రామ

కాదనే వారెవరూ కల్యాణ రామ

నీ దయ రాదానీ దయ రాదా 

నీ దయ రాదా రామా


చరణం 1:


నన్ను బ్రోచెవాడవని నాడే తెలియ

నన్ను బ్రోచెవాడవని నాడే తెలియ

ఇనవంశతిలక..ఆ..ఆ...

ఇనవంశతిలక ఇంతా తామసమా

ఇనవంశతిలక ఇంతా తామసమా


చరణం 2:


రామ రామ రామ రామా 

త్యాగరాజ హృత్ సదనా

రామ రామ రామ రామా 

త్యాగరాజ హృత్ సదనా


నా మది తల్లడిల్లెగా..

నా మది తల్లడిల్లెగా న్యాయమా రామా

నా మది తల్లడిల్లెగా న్యాయమా వేగమే

నీ దయ రాదా నీ దయ రాదా 

నీ దయ రాదా రామా


పాటల ధనుస్సు 


25, ఫిబ్రవరి 2024, ఆదివారం

మల్లెతీగ వాడిపోగా | Malleteega vaadi poga | Song Lyrics | Pooja (1975)

మల్లెతీగ వాడిపోగా



చిత్రం :  పూజ (1975)

సంగీతం :  రాజన్-నాగేంద్ర

గీతరచయిత :  దాశరథి

నేపధ్య గానం : బాలు 


పల్లవి :


మల్లెతీగ వాడిపోగా మరల పూలు పూయునా

తీగ తెగిన హృదయవీణ తిరిగి పాట పాడునా

మనసులోని మమతలన్ని మాసిపోయి 

కుములు వేళ మిగిలింది ఆవేదన

మల్లెతీగ వాడిపోగా మరల పూలు పూయునా 


చరణం 1 :


నిప్పు రగిలి రేగు జ్వాల నీళ్ళ వలన ఆరును

నిప్పు రగిలి రేగు జ్వాల నీళ్ళ వలన ఆరును

నీళ్ళలోనే జ్వాల రేగ మంటలెటుల ఆరును

నీళ్ళలోనే జ్వాల రేగ మంటలెటుల ఆరును


మల్లెతీగ వాడిపోగా మరల పూలు పూయునా

మనసులోని మమతలన్ని మాసిపోయి 

కుములు వేళ మిగిలింది ఆవేదన

తీగ తెగిన హృదయవీణ తిరిగి పాట పాడునా


చరణం 2 :


కడలిలోన మునుగు వేళ పడవమనకు తోడురా

కడలిలోన మునుగు వేళ పడవమనకు తోడురా

పడవ సుడిని మునుగు వేళ ఎవరు మనకు తోడురా

పడవ సుడిని మునుగు వేళ ఎవరు మనకు తోడురా


ఆటగాణి కోరికేమో తెలియలేని జీవులం

జీవితాల ఆటలోన మనమంతా పావులం


పాటల ధనుస్సు 


24, ఫిబ్రవరి 2024, శనివారం

లలిత ప్రియ కమలం విరిసినదీ | Lalitha Priya Kamalam | Song Lyrics | Rudraveena (1988)

లలిత ప్రియ కమలం విరిసినదీ



చిత్రం : రుద్రవీణ (1988)

సంగీతం : ఇళయరాజా

గీతరచయిత : సిరివెన్నెల

నేపథ్య గానం : చిత్ర,  ఏసుదాసు   



పల్లవి :


లలిత ప్రియ కమలం విరిసినదీ

లలిత ప్రియ కమలం విరిసినదీ

కన్నుల కొలనిని ఆ... ఆ... ఆ... ఆ...


ఉదయ రవికిరణం మెరిసినదీ 

ఊహల జగతిని ఆ... ఆ... ఆ... ఆ...

ఉదయ రవికిరణం మెరిసినదీ


అమృత కలశముగా ప్రతినిమిషం

అమృత కలశముగా ప్రతినిమిషం


కలిమికి దొరకని చెలిమిని 

కురిసిన అరుదగు వరమిది

లలిత ప్రియ కమలం విరిసినదీ


చరణం 1 :


రేయి పవలు కలిపే సూత్రం సాంధ్యరాగం

కాదా నీలో నాలో పొంగే ప్రణయం

నేల నింగి కలిపే బంధం ఇంద్ర చాపం

కాదా మన స్నేహం ముడివేసే పరువం


కలల విరుల వనం మన హృదయం

కలల విరుల వనం మన హృదయం

వలచిన ఆమని కూరిమి 

మీరగ చేరిన తరుణం


కోటి తలపుల చివురులు తొడిగెను.. 

తేటి స్వరముల మధువులు చిలికెను

తీపి పలుకుల చిలకల కిలకిల.. 

తీగ సొగసులు తొణికిన మిలమిల

పాడుతున్నది యదమురళీ..  

రాగ చరితర గల మృదురవళి

తూగుతున్నది మరులవనీ.. 

లేత విరి కులుకుల నటనగని

వేల మధుమాసముల పూల 

దరహాసముల మనసులు మురిసెను


లలిత ప్రియ కమలం విరిసినదీ

కన్నుల కొలనిని ఆ... ఆ... ఆ... ఆ...

ఉదయ రవికిరణం మెరిసినదీ


చరణం 2 : 


కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగ 

కాదా నీకై మ్రోగే ప్రాణం ప్రణవం

తీసే శ్వాసే ధూపం చూసే చూపే దీపం 

కాదా మమకారం నీ పూజా కుసుమం


మనసు హిమగిరిగా మారినదీ

మనసు హిమగిరిగా మారినదీ

కలసిన మమతల స్వరజతి 

పశుపతి పదగతి కాగా


మేని మలుపుల చెలువపు గమనము.. 

వీణ పలికిన జిలిబిలి గమకము

కాలి మువ్వగ నిలిచెను కాలము.. 

పూల పవనము వేసెను తాళము

గేయమైనది తొలి ప్రాయం.. 

రాయమని మాయని మధుకావ్యం

స్వాగతించెను ప్రేమ పథం.. 

సాగినది ఇరువురి బ్రతుకురథం

కోరికల తారకల సీమలకు 

చేరుకొనె వడి వడి పరువిడి


ఉదయ రవికిరణం మెరిసినది 

ఊహల జగతిని ఆ ఆ ఆ ఆ ఆ ఆ

లలిత ప్రియ కమలం విరిసినదీ


కన్నుల కొలనిని ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

లలిత ప్రియ కమలం విరిసినదీ


పాటల ధనుస్సు 

12, ఫిబ్రవరి 2024, సోమవారం

రాయిని ఆడది చేసిన రాముడివా | Rayini Adadi Chesina Ramudiva | Song Lyrics | Trishulam (1982)

రాయిని ఆడది చేసిన రాముడివా


చిత్రం: త్రిశూలం (1982)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం: బాలు, సుశీల



పల్లవి:


రాయిని ఆడది చేసిన రాముడివా

గంగను తలపై మోసే శివుడివా

రాయిని ఆడది చేసిన రాముడివా

గంగను తలపై మోసే శివుడివా

ఏమనుకోనూ నిన్నేమనుకోనూ

ఏమనుకోనూ నిన్నేమనుకోనూ


నువు రాయివి కావూ గంగవు కావూ

నే రాముడు శివుడూ కానే కానూ

నువు రాయివి కావూ గంగవు కావూ

నే రాముడు శివుడూ కానే కానూ

తోడనుకో నీ వాడనుకో

తోడనుకో నీ వాడనుకో


చరణం 1:


నేనేంటి?? నాకింతటి విలువేంటి??

నీ అంతటి మనిషితోటి పెళ్ళేంటి??

నీకేంటి?? నువు చేసిన తప్పేంటి??

ముల్లునొదిలి అరిటాకుకు శిక్షేంటి??


తప్పు నాది కాదంటే లోకమొప్పుతుందా

నిప్పు లాంటి సీతనైన తప్పు చెప్పకుందా

తప్పు నాది కాదంటే లోకమొప్పుతుందా

నిప్పు లాంటి సీతనైన తప్పు చెప్పకుందా


అది కధే కదా మన కధ నిజం కాదా

అది కధే కదా మన కధ నిజం కాదా


రాయిని ఆడది చేసిన రాముడివా

గంగను తలపై మోసే శివుడివా

ఏమనుకోనూ నిన్నేమనుకోనూ

తోడనుకో నీ వాడనుకో


చరణం 2:


ఈ ఇల్లు తోడొచ్చిన నీ కాళ్ళు

నాకెన్నెన్నో జన్మలకూ కోవెల్లు

కోవెల్లు కోవెలలో దివ్వెల్లు

కన్నీళ్ళతో వెలిగించే హృదయాలు


హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు

ఆ దేవుడికి వారసుడు మామూలు మానవుడు

హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు

ఆ దేవుడికి వారసుడు మామూలు మానవుడూ


అది నువ్వే కదా నేను నువ్వే కదా

అది నువ్వే కదా నేను నువ్వే కదా


నువు రాయివి కావూ గంగవు కావూ

నే రాముడు శివుడూ కానే కానూ

ఏమనుకోనూ నిన్నేమనుకోనూ

తోడనుకో నీ వాడనుకో


పాటల ధనుస్సు 


ము ము ముద్దంటే చేదా | Mu Mu Muddante Cheda | Song Lyrics | Adrustavantulu (1969)

ము..ము.. ముద్దంటే చేదా



చిత్రం : అదృష్టవంతులు (1969)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆరుద్ర

నేపధ్య గానం : ఘంటసాల, సుశీల 



పల్లవి :


ము..ము...ము..ము.. ముద్దంటే చేదా... 

నీకావుద్దేశం లేదా?

ఇప్పుడొద్దనావంటే చిన్నవాడా... 

రేపు ఇమ్మన్నా ఇస్తానా వెర్రివాడా

ము..ము...ము..ము.. ముద్దంటే చేదా... 

నీకావుద్దేశం లేదా?

ఇప్పుడొద్దనావంటే చిన్నవాడా... 

రేపు ఇమ్మన్నా ఇస్తానా వెర్రివాడా



ము..ము..ము..ము.. ముద్దంటే మోజే... 

ఇప్పుడావుద్దేశం లేదే

నిను ముద్దాడాలంటే కుర్రదానా... 

అసలు మనసంటూ ఉండాలి వెర్రిదానా 

ము..ము...ము.. ముద్దంటే చేదా... 

నీకావుద్దేశం లేదా?



చరణం 1 :


పెదవులు రెండూ కలగలిపినచో... 

తేనెలు కురిసే ముద్దు

మనసులు రెండూ పెనవేసినచో... 

మమతకు లేదు హద్దు

పెదవులు రెండూ కలగలిపినచో... 

తేనెలు కురిసే ముద్దు

మనసులు రెండూ పెనవేసినచో... 

మమతకు లేదు హద్దు


చూడు ఉబలాటం... ఆడు చెలగాటం

చూడు ఉబలాటం... ఆడు చెలగాటం

పెడమోమైనా విడువను నిన్ను 

వద్దుర మొగమాటం


ము..ము...ము..ము.. ముద్దంటే చేదా... 

నీకావుద్దేశం లేదా?

నిను ముద్దాడాలంటే కుర్రదానా... 

అసలు మనసంటూ ఉండాలి వెర్రిదానా

ము..ము...ము..ము.. ముద్దంటే చేదా... 

నీకావుద్దేశం లేదా?


చరణం 2 : 


ఆడదాని ముద్దులో వేడి ఉన్నదోయ్...

ఆ వేడికే వెన్నలా కరిగిపోతావోయ్

ఆడదాని ముద్దులో వేడి ఉన్నదోయ్...

ఆ వేడికే వెన్నలా కరిగిపోతావోయ్



మోజు పడకుంటే మొగవాడెకాదోయ్...

మోజు పడకుంటే మొగవాడెకాదోయ్...

గడసరి బిగువు సడలించనిచో... 

జవరాలే కాదు


ము..ము...ము..ము.. ముద్దంటే చేదా... 

నీకావుద్దేశం లేదా?

ఇప్పుడొద్దనావంటే చిన్నవాడా... 

రేపు ఇమ్మన్నా ఇస్తానా వెర్రివాడా


ము..ము..ము..ము.. ముద్దంటే మోజే... 

ఇప్పుడావుద్దేశం లేదే

నిను ముద్దాడాలంటే కుర్రదానా... 

అసలు మనసంటూ ఉండాలి వెర్రిదానా 

ము..ము...ము.. ముద్దంటే చేదా... 

నీకావుద్దేశం లేదా?


పాటల ధనుస్సు 


నా మనసే గోదారి నీ వయసే కావేరి | Na manase Godari | Song Lyrics | Adrustavantulu (1969)

నా మనసే గోదారి నీ వయసే కావేరి



చిత్రం: అదృష్టవంతులు (1969)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: ఆరుద్ర

నేపధ్య గానం: ఘంటసాల, సుశీల


పల్లవి:


నా మనసే గోదారి నీ వయసే కావేరి

నా మనసే గోదారి నీ వయసే కావేరి

బోల్‍ రాధా బోల్‍ రెండూ కలిసేనా లేదా

అరే బోల్‍ రాధా బోల్‍ జోడీ కుదిరేనా లేదా


నా మనసే గోదారి నీ వయసే కావేరి

బోల్‍ రాధా బోల్‍ రెండూ కలిసేనా లేదా

అరే బోల్‍ రాధా బోల్‍ జోడీ కుదిరేనా లేదా


నేనేం చేసేదయ్యో దద్దమ్మవు దొరికావు

అరే ఏం చెప్పేదయ్యో శుద్ధ మొద్దువి దొరికావు

నేనేం చేసేదయ్యో దద్దమ్మవు దొరికావు

అరే ఏం చెప్పేదయ్యో శుద్ధ మొద్దువి దొరికావు

దద్దమ్మవు దొరికావు...శుద్ధ మొద్దువి దొరికావు


చరణం 1:


కృష్ణుడు నేనే రుక్మిణి నీవే రాతిరి ఎత్తుకు పోతాను

లారీ మెల్లగా తోలుకువస్తా చల్లగ లేచిపోదాము


మీ అమ్మే యమగండం మా తల్లే సుడిగుండం

బోల్‍ రాధా బోల్‍ గండం తప్పేనా లేదా

అరే బోల్‍ రాధా బోల్‍ జోడీ కుదిరేనా లేదా


చరణం 2:


లావొక్కింతయు లేదు ధైర్యం విలోలంబయ్యె

ప్రాణంబులా ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చె

మనసే ఠారెత్తె మా ప్రేమయే జావై పోయెను

గుండెలే పగిలి చద్దామింక దిక్కెవ్వరో....

పోవే శాకినీ ఢాకినీ కదులు పో పో వెళ్ళిపో లంకిణీ...


చరణం 3:


బోల్ అమ్మా బోల్‍ జోడీ కలిసిందా లేదా

బోల్ అత్తా బోల్‍ రోగం కుదిరిందా లేదా

బోల్ అమ్మా బోల్‍ జోడీ కలిసిందా లేదా

బోల్ అత్తా బోల్‍ రోగం కుదిరిందా లేదా

బోల్ అమ్మా బోల్‍ జోడీ కలిసిందా లేదా

బోల్ అత్తా బోల్‍ రోగం కుదిరిందా లేదా....

రోగం కుదిరిందా లేదా....


పాటల ధనుస్సు 

పడిన ముద్ర చెరిగిపోదురోయ్ | Padinamudra cherigipoduroy | Song Lyrics | Adrustavantulu (1969)

పడిన ముద్ర చెరిగిపోదురోయ్ వన్నెకాడ



చిత్రం: అదృష్టవంతులు (1969) 

సంగీతం: కె.వి. మహదేవన్ 

గీతరచయిత: సినారె 

నేపధ్య గానం: సుశీల 



పల్లవి: 


హొ..హొ..హొ..హొహ్హొ.. 

హొ..హొ..హొ..హొహ్హొ.. 

పడిన ముద్ర చెరిగిపోదురోయ్ వన్నెకాడ 

పడుచు గుండె విడిచి పోదురోయ్ 

పెరటి చెట్టు పారిపోదురోయ్ సోగ్గాడా 

పిల్ల మనసు మారిపోదురోయ్... 


పడిన ముద్ర చెరిగిపోదురోయ్ వన్నెకాడ 

పడుచు గుండె విడిచి పోదురోయ్.. 

పెరటి చెట్టు పారిపోదురోయ్ సోగ్గాడా 

పిల్ల మనసు మారిపోదురోయ్... 


చరణం 1: 


మచ్చికైన పాల పిట్టను...

ఓ.. రాజా.. నా... రాజా 

మచ్చికైన పాల పిట్టను ... 

వలపంతా ఇచ్చుకున్న కన్నెపిల్లనోయ్ 

మచ్చికైన పాల పిట్టను ... 

వలపంతా ఇచ్చుకున్న కన్నెపిల్లనోయ్ 


నీ జబ్బ మీద పచ్చబొట్టునోయ్... 

నీ జబ్బ మీద పచ్చబొట్టునోయ్... 

ఔరౌరా... నీ రొమ్ము మీద పుట్టుమచ్చనోయ్... 


హొ..హొ..హొ..హ్హొ...హొ..హొ..హొ..హొ 

పడిన ముద్ర చెరిగిపోదురోయ్ వన్నెకాడ 

పడుచు గుండె విడిచి పోదురోయ్ 

పెరటి చెట్టు పారిపోదురోయ్ సోగ్గాడా 

పిల్ల మనసు మారిపోదురోయ్... 


చరణం 2: 


డేగలాగా ఎగిరిపోతివోయ్... 

నిన్ను నేను తీగలాగ చుట్టుకొంటినోయ్... 

డేగలాగా ఎగిరిపోతివోయ్... 

నిన్ను నేను తీగలాగ చుట్టుకొంటినోయ్... 


పాలలోన తేనె కలిసెనోయ్.....

ఓ..రాజా..నా..రాజా 

పాలలోన తేనె కలిసెనోయ్... 

నేడే మన పరువానికి పండుగైనదోయ్... 


హొ..హొ..హొ..హొహ్హొ..హొ..హొ..హొ..హొ 

పడిన ముద్ర చెరిగిపోదురోయ్ వన్నెకాడ 

పడుచు గుండె విడిచి పోదురోయ్ 


పడిన ముద్ర చెరిగిపోదురోయ్... సోగ్గాడా... 

పడిన ముద్ర చెరిగిపోదురోయ్... సోగ్గాడా.. 

పడిన ముద్ర చెరిగిపోదురోయ్... సోగ్గాడా... 

పడిన ముద్ర చెరిగిపోదురోయ్...


పాటల ధనుస్సు 


మొక్కజొన్న తోటలో | Mokkajonna thotalo | Song Lyrics | Adrustavantulu (1969)

మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలలో 



చిత్రం: అదృష్టవంతులు (1969) 

సంగీతం: కె.వి. మహదేవన్ 

గీతరచయిత: కొనకళ్ల వెంటకరత్నం 

నేపధ్య గానం: సుశీల 



పల్లవి: 


మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలలో 

మంచెకాడ కలుసుకో మరువకు మావయ్య 

నువ్వు మరువకు మరువకు మవయ్య 


మొక్కజొన్న తోటలో ముసిరిన సీకట్లలలో 

మంచెకాడ కలుసుకో మరువకు మావయ్య 

నువ్వు మరువకు మరువకు మవయ్య 


చరణం 1: 


చుక్కలన్ని కొండమీద సోకు చేసుకొనే వేళ 

చల్లగాలి తోటసంత చక్కిలిగిలి పెట్టువేళ 

చుక్కలన్ని కొండమీద సోకు చేసుకొనే వేళ 

చల్లగాలి తోటసంత చక్కిలిగిలి పెట్టువేళ 

పొద్దువాలినంతనే సద్దుమణగనిచ్చిరా 

పొద్దువాలినంతనే సద్దుమణగనిచ్చిరా 


వేళదాటి వస్తివా వెనక్కి తిరిగి పోతివా 

తంటా మన ఇద్దరికి తప్పదు మావయ్య 

తప్పదు తప్పదు మావయ్య 


చరణం 2: 


మొన్న రేతిరి జాతరలో కన్ను గీటినప్పుడు 

వంగ తోట మలుపుకాడ కొంగు లాగినపుడు 

అ... 

అ...ఊ.. 

మొన్న రేతిరి జాతరలో కన్ను గీటినప్పుడు 

వంగ తోట మలుపుకాడ కొంగు లాగినపుడు 


కసిరి తిట్టినానని విసిరి కొట్టినానని 

కసిరి తిట్టినానని విసిరి కొట్టినానని 

నలుగురిలో చిన్న బోయినానని 

నవ్వుల పాలైతివా 

తంటా మన ఇద్దరికి తప్పదు మావయ్య 

తప్పదు తప్పదు మావయ్య 


చరణం 3: 


గడ్డిబళ్ళ ఎనకాతల గమ్మత్తుగ నక్కిరా 

ఊర చెరువు రెల్లుపక్క ఒంగి ఒంగి నడిచిరా 

గడ్డిబళ్ళ ఎనకాతల గమ్మత్తుగ నక్కిరా 

ఊర చెరువు రెల్లుపక్క ఒంగి ఒంగి నడిచిరా 


ఐనవాళ్ళ కళ్ళ బడకు అల్లరి పాలౌతాను 

ఐనవాళ్ళ కళ్ళ బడకు అల్లరి పాలౌతాను 

గుట్టు బయట పెడితివా గోలగాని చేస్తివా 

తంటా మన ఇద్దరికి తప్పదు మావయ్య 

తప్పదు తప్పదు మావయ్య


పాటల ధనుస్సు 

చింత చెట్టు చిగురు చూడు | Chinta chettu chiguru chudu | Song Lyrics | Adrustavantulu (1969)

చింత చెట్టు చిగురు చూడు



చిత్రం: అదృష్టవంతులు (1969)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: ఆరుద్ర

నేపధ్య గానం: ఘంటసాల, సుశీల



పల్లవి:


చింత చెట్టు చిగురు చూడు.. 

చిన్నదాని పొగరు చూడు

చింత చిగురు పుల్లగున్నాదోయ్

నా సామిరంగా.. 

చిన్నదేమో తియ్యగున్నాదోయ్

నా సామిరంగా.. 

చిన్నదేమో తియ్యగున్నాదోయ్


చింత చెట్టు చిగురు చూడు.. 

చిన్నవాడి బెదురు చూడు

చింత చెట్టు కాపుకొచ్చిందోయ్..

నా సామిరంగా.. 

చిన్నదేమో దాపుకొచ్చిందోయ్

నా సామిరంగా.. 

చిన్నదేమో దాపుకొచ్చిందోయ్


చరణం 1:


పాలవయసు పొందుకోరి పొంగుతున్నది

నా పైట కూడ వాడి పేరె పలవరిస్తది

పాలవయసు పొందుకోరి పొంగుతున్నది

నా పైట కూడ వాడి పేరె పలవరిస్తది

వగలమారి వాలుచూపు వొర్రగున్నది

అది వెంటపడితె ఏదేదో వెర్రిగున్నది


చింత చెట్టు చిగురు చూడు.. 

చిన్నదాని పొగరు చూడు

చింత చెట్టు కాపుకొచ్చిందోయ్

నా సామిరంగా.. 

చిన్నదేమో దాపుకొచ్చిందోయ్

నా సామిరంగా.. 

చిన్నదేమో తియ్యగున్నాదోయ్


చరణం 2:


పగ్గమేస్తే పెంకెతనం తగ్గనన్నది

సిగ్గు దోస్తే చిటికెలోన మొగ్గుతున్నదీ ఈ ఈ..

పగ్గమేస్తే పెంకెతనం తగ్గనన్నది

సిగ్గు దోస్తే చిటికెలోన మొగ్గుతున్నదీ


జబర్దస్తీ చేస్తుంది జబ్బ మీద వాలుతుంది

అబ్బో ఆ పడుచుదనం తబ్బిబ్బు చేస్తుంది

జబర్దస్తీ చేస్తుంది జబ్బ మీద వాలుతుంది

అబ్బో ఆ పడుచుదనం తబ్బిబ్బు చేస్తుంది


చింత చెట్టు చిగురు చూడు.. 

చిన్నదాని పొగరు చూడు

చింత చెట్టు కాపుకొచ్చిందోయ్..

నా సామిరంగా.. 

చిన్నదేమో దాపుకొచ్చిందోయ్

నా సామిరంగా.. 

చిన్నదేమో తియ్యగున్నాదోయ్


చరణం 3:


వన్నె మీద చిన్నవాడి కన్ను పడ్డది

అది వన్నె విడిచి నన్ను విడిచి మళ్ళనన్నది

వన్నె మీద చిన్నవాడి కన్ను పడ్డది

అది వన్నె విడిచి నన్ను విడిచి మళ్ళనన్నది


ఇంతలేసి కన్నులతో మంతరిస్తది...

ఇంతలేసి కన్నులతో మంతరిస్తది...

అహ ఎంత దోచినా కొంత మిగులుతుంటది


చింత చెట్టు చిగురు చూడు.. 

చిన్నదాని పొగరు చూడు

చింత చిగురు పుల్లగున్నాదోయ్ 

నా సామిరంగా..

చిన్నదేమో తియ్యగున్నాదోయ్

నా సామిరంగా... 

చిన్నదేమో తియ్యగున్నాదోయ్


చింత చెట్టు చిగురు చూడు.. 

చిన్నవాడి బెదురు చూడు

చింత చెట్టు కాపుకొచ్చిందోయ్

నా సామిరంగా.. 

చిన్నదేమో దాపుకొచ్చిందోయ్

నా సామిరంగా.. 

చిన్నదేమో దాపుకొచ్చిందోయ్...


పాటల ధనుస్సు 

కోడి కూసే జాము దాకా | Kodi Kuse jamudaaka | Song Lyrics | Adrustavantulu (1969)

కోడి కూసే జాము దాకా



చిత్రం: అదృష్టవంతులు (1969) 

సంగీతం: కె.వి. మహదేవన్ 

గీతరచయిత: సినారె 

నేపధ్య గానం: ఘంటసాల, సుశీల 



పల్లవి: 


కోడి కూసే జాము దాకా 

తోడురారా చందురూడా 

కోడె కారు కొత్త కోర్కెలు 

తరుముతున్నవి అందగాడా 


కోడి కూసే జాము దాకా 

తోడురారా చందురూడా 

కోడె కారు కొత్త కోర్కెలు 

తరుముతున్నవి అందగాడా 

కోడి కూసే జాము దాకా 

తోడురారా చందురూడా 


చరణం 1: 


కన్నె బుగ్గకు సిగ్గు కమ్మెను 

కళ్ళు చూస్తె కైపులెక్కెను 

కన్నె బుగ్గకు సిగ్గు కమ్మెను 

కళ్ళు చూస్తె కైపులెక్కెను 

కాపురానికి కొత్తవాళ్ళం 

కాడిమోయని కుర్రవాళ్ళం 

కలలు తెలిసిన చిలిపివాడా 

కలుపరా మము కలువరేడా 


కోడి కూసే జాము దాకా 

తోడురారా చందురూడా 

కోడె కారు కొత్త కోర్కెలు 

తరుముతున్నవి అందగాడా 


చరణం 2: 


కంటికింపౌ జంటలంటే 

వెంట పడతావంట నువ్వు 

కంటికింపౌ జంటలంటే 

వెంట పడతావంట నువ్వు 


తెల్లవార్లూ చల్ల చల్లని 

వెన్నెలలతో వేపుతావట 

తెల్లవార్లూ చల్ల చల్లని 

వెన్నెలలతో వేపుతావట 

మత్తు తెలిసిన చందురూడా...

మసక వెలుగే చాలు లేరా 


కోడి కూసే జాము దాకా 

తోడురారా చందురూడా 

కోడె కారు కొత్త కోర్కెలు 

తరుముతున్నవి అందగాడా 


చరణం 3: 


అల్లుకున్న మనసులున్నవి 

అలసిపోని బంధమున్నది 

అల్లుకున్న మనసులున్నవి 

అలసిపోని బంధమున్నది 


చెలిమి నాటిన చిన్న ఇంట 

ఎదగనీ మా వలపు పంట 

చెలిమి నాటిన చిన్న ఇంట 

ఎదగనీ మా వలపు పంట 

తీపి మాపుల చందురూడా... 

కాపువై నువ్వుండి పోరా 


కోడి కూసే జాము దాకా 

తోడురారా చందురూడా 

కోడె కారు కొత్త కోర్కెలు 

తరుముతున్నవి అందగాడా 


కోడి కూసే జాము దాకా 

తోడురారా చందురూడా 

కోడె కారు కొత్త కోర్కెలు 

తరుముతున్నవి అందగాడా


పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు