RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

4, ఫిబ్రవరి 2024, ఆదివారం

నేనొక ప్రేమ పిపాసిని | Nenoka Prema Pipasini | Song Lyrics | Indhra Dhanussu (1978)

నేనొక ప్రేమ పిపాసిని 



చిత్రం: ఇంద్ర ధనుస్సు (1978)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం: బాలు



పల్లవి:


నేనొక ప్రేమ పిపాసిని 

నీవొక ఆశ్రమ వాసివి

నా దాహం తీరనిది 

నీ హృదయం కదలనిది

నేనొక ప్రేమ పిపాసిని 

నీవొక ఆశ్రమ వాసివి

నా దాహం తీరనిది 

నీ హృదయం కదలనిది

నేనొక ప్రేమ పిపాసిని....


చరణం 1:


తలుపు మూసిన తలవాకిటనే 

పగలు రేయి నిలుచున్నా

పిలిచి పిలిచి బదులేరాక 

అలసి తిరిగి వెళుతున్నా

తలుపు మూసిన తలవాకిటనే 

పగలు రేయి నిలుచున్నా

పిలిచి పిలిచి బదులేరాక 

అలసి తిరిగి వెళుతున్నా


నా దాహం తీరనిది 

నీ హృదయం కరగనిది

నేనొక ప్రేమ పిపాసిని...


చరణం 2:


పూట పూట నీ పూజ కోసమని 

పువ్వులు తెచ్చాను

ప్రేమ భిక్షనూ పెట్టగలవని 

దోసిలి ఒగ్గాను

నీ అడుగులకు మడుగులోత్తగా 

ఎడదను పరిచాను

నీవు రాకనే అడుగు పడకనే 

నలిగిపోయాను


నేనొక ప్రేమ పిపాసిని...


చరణం 3:


పగటికి రేయి .. రేయికి పగలు.. 

పలికే వీడ్కోలు

సెగ రేగిన గుండెకు చెబుతున్నా 

నీ చెవిన పడితే చాలునని

నీ జ్ఞాపకాల నీడలలో 

నన్నేపుడో చూస్తావు

నను వలచావని తెలిపేలోగా 

నివురైపోతాను


పాటల ధనుస్సు  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చక్కని చుక్క సరసకు రావే | Chakkani Chukka | Song Lyrics | Iddaru Mitrulu (1961)

చక్కని చుక్క సరసకు రావే చిత్రం: ఇద్దరు మిత్రులు (1961) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: ఆరుద్ర నేపధ్య గానం: పి. బి. శ్రీనివాస్, సుశీల పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు