RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

11, ఫిబ్రవరి 2024, ఆదివారం

అయ్యయ్యో బ్రహ్మయ్యా | Ayyayyo Brahmayya | Song Lyrics | Adrustavantulu (1969)

అయ్యయ్యో బ్రహ్మయ్యా



చిత్రం: అదృష్టవంతులు (1969)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: సినారె

నేపధ్య గానం: ఘంటసాల



పల్లవి:


అయ్యయ్యో బ్రహ్మయ్యా.. 

అన్యాయం చేశావేమయ్యా

ఈ బుల్లోడే బుల్లెమ్మయితే 

ఎంత గుమ్ముగా ఉండేదయ్యా

అయా.. యా.. యా..

అయ్యయ్యో బ్రహ్మయ్యా 

అన్యాయం చేశావేమయ్యా

ఈ బుల్లోడే బుల్లెమ్మయితే 

ఎంత గుమ్ముగా ఉండేదయ్యా

అయా.. యా.. యా..



చరణం 1:


చిక్కని మీగడ తరకల్లాగా 

చక్కనైన చెక్కిళ్ళు

పసి నిమ్మపండు లాగా 

మిసమిసలాడే వొళ్ళు

చిక్కని మీగడ తరకల్లాగా 

చక్కనైన చెక్కిళ్ళు

పసి నిమ్మపండు లాగా 

మిసమిసలాడే వొళ్ళు

బెట్టు చూపి గుట్టు దాచే 

గడసరి సొగసరి కళ్ళు

బెట్టు చూపి గుట్టు దాచే 

గడసరి సొగసరి కళ్ళు

కొంత కోడెతనముంది.. 

మరి కొంత ఆడతనముంది


హోయ్‍.. ...అయ్యయ్యో బ్రహ్మయ్యా 

అన్యాయం చేశావేమయ్యా

ఈ బుల్లోడే బుల్లెమ్మయితే 

ఎంత గుమ్ముగా ఉండేదయ్యా

అయా.. యా.. యా..అయ్యయ్యో బ్రహ్మయ్యా......



చరణం 2:


మూతి చూస్తే మీసమింకా 

మొలిచినట్టు లేదు

బెదురు చూస్తే ఎవ్వరితోను 

కుదిరినట్టు లేదు..

హాయ్..మూతి చూస్తే మీసమింకా 

మొలిచినట్టు లేదు

బెదురు చూస్తే ఎవ్వరితోను 

కుదిరినట్టు లేదు..

ఆ కసరు లోనే అలకనవ్వుల 

విసురు లేక పోలేదు

కొంత చిలిపితనముంది.. 

మరి కొంత కలికితనముంది


హోయ్‍.. అయ్యయ్యో బ్రహ్మయ్యా 

అన్యాయం చేశావేమయ్యా

ఈ బుల్లోడే బుల్లెమ్మయితే 

ఎంత గుమ్ముగా ఉండేదయ్యా

అయా.. యా.. యా..అయ్యయ్యో బ్రహ్మయ్యా......



చరణం 3:


బులిపించే సొగసున్న 

ఓ బుల్లోడా నిను చూస్తుంటే

కొమ్ములు తిరిగిన మగాడికే 

దిమ్మెత్తి పోతుంటే

బులిపించే సొగసున్న 

ఓ బుల్లోడా నిను చూస్తుంటే

కొమ్ములు తిరిగిన మగాడికే 

దిమ్మెత్తి పోతుంటే

కన్నె పిల్లలే చూశారా 

కన్ను గీటక మానేరా

కన్నె పిల్లలే చూశారా 

కన్ను గీటక మానేరా

కవ్వించే కౌగిలిలో.. 

కరగించక వదిలేరా...


హోయ్‍.. అయ్యయ్యో బ్రహ్మయ్యా 

అన్యాయం చేశావేమయ్యా

ఈ బుల్లోడే బుల్లెమ్మయితే 

ఎంత గుమ్ముగా ఉండేదయ్యా

అయా.. యా.. యా..అయ్యయ్యో బ్రహ్మయ్యా ......


పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

కౌగిలిలో ఉయ్యాలా | Kougililo Vuyyala | Song Lyrics | Annadammula Anubandham (1975)

కౌగిలిలో ఉయ్యాలా కన్నులలో జంపాలా  చిత్రం :  అన్నదమ్ముల అనుబంధం (1975) సంగీతం :  చక్రవర్తి గీతరచయిత :  దాశరథి నేపధ్య గానం :  బాలు, జానకి  పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు