RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

3, ఏప్రిల్ 2026, శుక్రవారం

నీలాల నింగిలోన పగడాల పందిరి | Neelala Ningilona | Song Lyrics | Daana Dharmalu (1976)

నీలాల నింగిలోన పగడాల పందిరి


చిత్రం : దానధర్మాలు (1976)

సంగీతం : మాస్టర్ వేణు

గీతరచయిత : కొండిశెట్టి శ్రీ రామా రావ్ 

నేపధ్య గానం : ఎస్ పి బాలు, పి.సుశీల 

 

పల్లవి :


నీలాల నింగిలోన 

పగడాల పందిరి వేసి

రతనాల రంగులతో.. 

ముత్యాల ముగ్గులు వేద్దామా

ముత్యాల ముగ్గులు వేద్దామా... 


చరణం 1 :


పుష్పరాగములతో.. 

పొదిగిన పచ్చలతో..

పుష్పరాగములతో.. 

పొదిగిన పచ్చలతో..

కెంపులతో సొంపుగనూ

వజ్రాల వంపులు తీర్చిన.. 

ఆ వయ్యారి భామవు నీవే.. 

వరసైన చినదాన  


వరసైనదానిని కాను.. 

ఆ సిసలైన దానిని నేను

సిగ్గు తెర తీసి చెప్పాను నేను 

చేసుకుంటాను నిన్నేననీ

ఒప్పుకుంటే కదా నిన్ను నేను... 

చేశారు ఈ పెళ్ళి మనకు

మూడుముళ్ళు విప్పిన కూడా 

పోలేవు ముందుకు నీవు...

పోలేవు ముందుకు నీవు... 


చరణం 2 :


మనసైన మగువతో 

మాటాడకుండ లేను...

మనసైన మగువతో 

మాటాడకుండ లేను...

నిన్ను విడిచి నిముషమైన 

నిలువలేను ఈ జగాన

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..

ప్రేమగ చూస్తే చాలు 

నీ పాద పూజ చేస్తాను

జన్మజన్మలకైనా 

నిన్నే కోరుకుంటాను... 

నిన్నే కోరుకుంటాను... 


- పాటల ధనుస్సు 


2, ఏప్రిల్ 2026, గురువారం

ఏడూ కొండలవాడా వెంకటేశా | Edukondalavada Venkatesha | Tragedy Song Lyrics | Soggadu (1975)

ఏడూ కొండలవాడా వెంకటేశా


చిత్రం : సోగ్గాడు (1975)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం: ఎస్ పి బాలు,


పల్లవి :


ఏడూ కొండలవాడా వెంకటేశా...

అయ్యా... 

ఎంత పనిచేశావు తిరుమలేశా

చెట్టు మీద కాయను 

సముద్రంలో ఉప్పును

కలిపినట్టే కలిపి వేరు చేశావయ్యా


ఏడూ కొండలవాడా వెంకటేశా...

అయ్యా... 

ఎంత పనిచేశావు తిరుమలేశా

చెట్టు మీద కాయను 

సముద్రంలో ఉప్పును

కలిపినట్టే కలిపి వేరు చేశావయ్యా


చరణం 1 :


నువ్వేసిన ముడిని 

మనిషి తెంచేశాడు

నీ సాక్ష్యం నమ్మనని కొట్టేశాడు


నువ్వేసిన ముడిని 

మనిషి తెంచేశాడు

నీ సాక్ష్యం నమ్మనని కొట్టేశాడు


అన్యాయం అన్యాయం అంటే

వెళ్ళి దేవుడితో చెప్పుకో 

పొమ్మన్నాడు

పో.. పొమ్మన్నాడు  


ఏడూ కొండలవాడా వెంకటేశా

అయ్యా... 

ఎంత పనిచేశావు తిరుమలేశా... 

శ్రీనివాసా


చరణం 2 :


చట్టాన్ని అడిగి తాళి కట్టలేదు

చట్టం ఒప్పుకుని 

ఇద్దరం కలవలేదు


చట్టాన్ని అడిగి తాళి కట్టలేదు

చట్టం ఒప్పుకుని 

ఇద్దరం కలవలేదు


మనిషి చేసింది చట్టము... 

మాకు జరిగింది ద్రోహము

నువ్వే నిలబెట్టాలి 

నీతీ న్యాయమూ...  

లేదా నువ్వే శూన్యము


ఏడూ కొండలవాడా వెంకటేశా...

అయ్యా... 

ఎంత పనిచేశావు తిరుమలేశా... 

శ్రీనివాసా


చరణం 3 :


మాటమీద నిలబడే మనిషినీ

మనసు మార్చుకోను 

చేతకాని వాడినీ


మాటమీద నిలబడే మనిషినీ

మనసు మార్చుకోను 

చేతకాని వాడినీ


చేపట్టి విడువలేను ఆడదానిని

నీ మీద ఒట్టు నేనొంటరివాడ్ని...  

ఒంటరివాడ్ని


ఏడూ కొండలవాడా వెంకటేశా...

అయ్యా... 

ఎంత పనిచేశావు తిరుమలేశా


చెట్టు మీద కాయను 

సముద్రంలో ఉప్పును

కలిపినట్టే కలిపి వేరు చేశావయ్యా

కలిపినట్టే కలిపి వేరు చేశావయ్యా


- పాటల ధనుస్సు 


సోగ్గాడు లేచాడు | Soggadu Lechadu | Song Lyrics | Soggadu (1975)

సోగ్గాడు లేచాడు


చిత్రం : సోగ్గాడు (1975)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం: బాలు, సుశీల


పల్లవి :


సోగ్గాడు లేచాడు చూచి చూచి.. 

నీ దుమ్ము లేపుతాడు అహ

సోగ్గాడు లేచాడు 

చూచి చూచి నీ దుమ్ము లేపుతాడు

పట్టణాని కొచ్చాడు 

పల్లెటూరి సోగ్గాడు

బిక్కమొహం వేశాడు 

బొక్క బోర్ల పడ్డాడు డు డు డు డు

సోగ్గాడు అహ లేచాడు యహై.. 

చూచి చూచి నీ దుమ్ము లేపుతాడు


చరణం 1 :


మీసాలు దువ్వుతాడు 

మీది మీది కొస్తాడు

మిడిగుడ్లు వేసుకుని 

చూస్తాడు పిచ్చోడు

గరిడిసాము చేసినోడు 

బిరుసైన కండలోడు.. 

కర్రెత్తినాడంటే ఆగబోడు తిక్కోడు 

 

మీసాలు దువ్వుతాడు 

మీది మీది కొస్తాడు

మిడిగుడ్లు వేసుకుని 

చూస్తాడు పిచ్చోడు

గరిడిసాము చేసినోడు 

బిరుసైన కండలోడు

కర్రెత్తినాడంటే ఆగబోడు తిక్కోడు


లేస్తేనే కుంటోడు మొనగాడు 

ఏహేయ్ లేస్తేనే కుంటోడు మొనగాడు

పడుకున్న ఏనుగైనా 

గుర్రమెత్తె అంటాడు  డు డు డు డు

సోగ్గాడు అహ లేచాడు.. 

చూచి చూచి నీ దుమ్ము లేపుతాడు


చరణం 2 :


కోక మడత చూశాడు 

రెవిక ముడిని చూశాడు

కొంగుపట్టి పగలంతా 

గుంజాడు వెర్రోడు

కోక మడత చూశాడు 

రెవిక ముడిని చూశాడు

కొంగుపట్టి పగలంతా 

గుంజాడు వెర్రోడు

కోక డాబు తెలిసినోడు 

రవిక సోకు ఎరిగినోడు

కోక డాబు తెలిసినోడు 

రవిక సోకు ఎరిగినోడు

ఆకలేస్తే ఎండుగడ్డి 

తినబోడు గడుసోడు.. 


మరి గడ్డివాము 

చాటుకేల పిలిచాడు

మరి గడ్డివాము 

చాటుకేల పిలిచాడు..

నీకింత గడ్డెట్టి 

గాటిలో కడతాడు డు డు డు డు

సోగ్గాడు అహ లేచాడు.. అరెరెరె.. 

చూచి చూచి నీ దుమ్ము లేపుతాడు


చరణం 3 :


మంచి గుంటావన్నాడు 

మాపు రమ్మన్నాడు 

తెల్లార్లు జాగారమన్నాడు పిల్లోడు

ఇట్టాగే ప్రతి ఏడు 

ఎందర్నో పిలుస్తాడు 

బాగోతం ఆడించి చూస్తాడోయ్‌ సోగ్గాడు

మంచి గుంటావన్నాడు 

మాపు రమ్మన్నాడు 

తెల్లార్లు జాగారమన్నాడు పిల్లోడు


ఇట్టాగే ప్రతి ఏడు 

ఎందర్నో పిలుస్తాడు 

బాగోతం ఆడించి చూస్తాడోయ్‌ సోగ్గాడు

 

నువ్వు సత్తెభామవని  పొగిడాడు.. 

అబ్బా 

నువ్వు సత్తెభామవని  పొగిడాడు

ఈ జన్మ రాముడు 

పై జన్మే కిష్ణుడు డు డు డు డు

సోగ్గాడు అహ లేచాడు.. అరెరెరె.. 

చూచి చూచి నీ దుమ్ము లేపుతాడు

సోగ్గాడు అహహ లేచాడు.. అహహహ.. 

చూచి చూచి నీ దుమ్ము లేపుతాడు   


- పాటల ధనుస్సు 


1, ఏప్రిల్ 2026, బుధవారం

చేనుకు గట్టుంది చెరువుకు గట్టుంది | Chenuku Gattundi | Song Lyrics | Meena (1974)

చేనుకు గట్టుంది చెరువుకు గట్టుంది 


చిత్రం: మీన (1974)

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

సంగీతం: రమేష్ నాయుడు

గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల


సాకి :


చేనుకు గట్టుంది 

ఇంటికి గడపుంది 

కంటికి రెప్పుండి 

కన్నెకు హద్దుంది 

హద్దు మీరిన కాలు జారినా 

అంతా గల్లంతవుతుంది 

గల్లంతవుతుంది 


పల్లవి :


అమ్మమ్మమ్మమ్మో 

అమ్మాయిగారండి 

ఆగండి చూడండి 

ఆపైన వెళ్ళండి 

ఆగండి చూడండి 

ఆపైన వెళ్ళండి వెళ్ళండి 


చరణం 1 :


పల్లే టూరి లో బస్తి నడకలు 

మార్చుకోవాలి 

కళ్ళు కాళ్ళు నేలమీదనే 

ఉంచుకోవాలి 


ముల్లుంటాయి రాళ్లుంటాయి

ముల్లుంటాయి రాళ్లుంటాయి

ఎత్తుపల్లాలుంటాయి 

మొండితనంతో పరుగులు తీస్తే 

ముందరి పళ్లే రాల్తాయి 


అమ్మమ్మమ్మమ్మో 

అమ్మాయిగారండి 

ఆగండి చూడండి 

ఆపైన వెళ్ళండి 

ఆగండి చూడండి 

ఆపైన వెళ్ళండి వెళ్ళండి 


చరణం 2 :


పంజరంలో చిలకకు మల్లే 

పెరిగావిన్నాళ్ళు 

రెక్కలు వచ్చాయనుకుని 

ఎగిరే వచ్చావీనాడు 


పంజరంలో చిలకకు మల్లే 

పెరిగావిన్నాళ్ళు 

రెక్కలు వచ్చాయనుకుని 

ఎగిరే వచ్చావీనాడు 


నువ్వనుకున్నట్టే  

అన్ని జరగవు 

నీకిష్టం లేదని ఏవి ఆగవు 


అమ్మమ్మమ్మమ్మో 

అమ్మాయిగారండి 

ఆగండి చూడండి 

ఆపైన వెళ్ళండి 

ఆగండి చూడండి 

ఆపైన వెళ్ళండి వెళ్ళండి 


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

నీలాల నింగిలోన పగడాల పందిరి | Neelala Ningilona | Song Lyrics | Daana Dharmalu (1976)

నీలాల నింగిలోన పగడాల పందిరి చిత్రం : దానధర్మాలు (1976) సంగీతం : మాస్టర్ వేణు గీతరచయిత : కొండిశెట్టి శ్రీ రామా రావ్  నేపధ్య గానం : ఎస్ పి బాల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు