నల్లా నల్లని కళ్ళు
చిత్రం : కలియుగ రావణాసురుడు (1980)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
నల్లా నల్లని కళ్ళు... నవ్వీ నవ్వని కళ్ళు
చుసినట్టే చూసి..
తలుపులు మూసేసుకున్న కళ్ళు
నల్లా నల్లని కళ్ళు
చరణం 1 :
తొలిపొద్దులో..ఓ.. ఓ..తామర..కళ్ళు..మ్మ్ మ్మ్ మ్మ్
మలిసందేలో..ఓ.. ఓ..కలువ కళ్ళు..అహహాహాహా
ఎటిపాయలో..ఓఓఓ..చేపకళ్ళు..ఊ
తోటమలుపులో..ఓ..లేడి కళ్ళు..మ్మ్
ఎన్నాళ్ళు చూసినా..ఆ..
ఎన్నేళ్ళు చూసినా..మ్మ్ మ్మ్ మ్మ్
లోతులందని కళ్ళు.. నా లోకమేలే కళ్ళు
ఏమి చక్కని కళ్ళు.. రామ చక్కని కళ్ళు
చరణం 2 :
సిగ్గును చీరగా కప్పుకుని..మ్మ్..
చిలిపిగా ఓరగా కప్పుకుని..మ్మ్ హు
చిరు చిరు నవ్వులు ..చుర చుర చూపులు
కలియబోసి..ఈఈఈ..ముగ్గులేసి..ఆ హా..
రారమ్మని..ఆహా..పోపొమ్మని..
ఆహా..ఇపుడొద్దని .. సరిలెమ్మని
ఊరించే కళ్ళు..
సరసాలకు శంఖం పూరించే కళ్ళు
ఏమి చక్కని కళ్ళు..రామ చక్కని కళ్ళు
చరణం 3 :
ఆవులించే కళ్ళు..మ్మ్..ఆకలేసిన కళ్ళు..మ్మ్
రైక తొడిగిన కళ్ళు.. పైట తొలగిన కళ్ళు..మ్మ్ హు
కసిరి వల విసిరి.. వలపు కొసరి కొసరి..ఆ ఆ ఆ
మగతను ఎగదోసే కళ్ళు..
మనసును నమిలేసే కళ్ళు
ఆ కళ్ళే..ఏ .. ఏ.. నడివేసవి వడగళ్ళు
ఆ కళ్ళే.. నా కలల పొదరిల్లు..మ్మ్ మ్మ్ మ్మ్
లోతులందని కళ్ళు.. నా లోకమేలే కళ్ళు..మ్మ్
ఏమి చక్కని కళ్ళు.. రామ చక్కని కళ్ళు
పాటల ధనుస్సు