నీవే కదా నా అందాలరాశి
చిత్రం : అందాల రాశి (1980)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : బాలు, శైలజ
పల్లవి:
నీవే కదా నా అందాలరాశి..
నీవే కదా నా అందాలరాశి..
నా జీవనాధారా లావణ్య సరసి..
నా జీవనాధారా లావణ్య సరసి..
నీ హృదయ గగనాన వెలిగే శశి..
నీ హృదయ గగనాన వెలిగే శశి..
నిను కోరి దరి జేరే నీ ప్రేయసి..
నిను కోరి దరి జేరే నీ ప్రేయసి..
నీవే కదా నా అందాలరాశి..
నీవే కదా నా అందాలరాశి..
చరణం 1 :
వేయి కనులతో వెతికేను నీ రూపమే...
వేయి కనులతో వెతికేను నీ రూపమే...
కోటి గొంతులతో పలికేను నీ గీతమే..
కోటి గొంతులతో పలికేను నీ గీతమే..
కలలన్నీ కర్పూర శిలలైన చోటా..
కలలన్నీ కర్పూర శిలలైన చోటా..
కలసినది మన విడిపోని జంట...
నీవే కదా నా అందాలరాశి..
నిను కోరి దరి జేరే నీ ప్రేయసి
నీవే కదా నా అందాలరాశి..
చరణం 2 :
ఎన్ని జన్మల చెలిమి ఎనలేని అనురాగము...
ఎన్ని జన్మల చెలిమి ఎనలేని అనురాగము...
ఎన్ని నోముల కలిమి నీ ప్రణయ సౌభాగ్యము..
ఎన్ని నోముల కలిమి నీ ప్రణయ సౌభాగ్యము..
నీ వలపు నా ఇంట నెలకొన్న తులసి..
నీ వలపు నా ఇంట నెలకొన్న తులసి..
నా మనసు ప్రియ చరణాల దాసి..
నా మనసు ప్రియ చరణాల దాసి..
నీవే కదా నా అందాలరాశి..
నీవే కదా నా అందాలరాశి..
నా జీవనాధారా లావణ్య సరసి..
నా జీవనాధారా లావణ్య సరసి..
నీ హృదయ గగనాన వెలిగే శశి..
నీ హృదయ గగనాన వెలిగే శశి..
నిను కోరి దరి జేరే నీ ప్రేయసి
నిను కోరి దరి జేరే నీ ప్రేయసి
నీవే కదా నా అందాలరాశి..
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి