RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

27, జులై 2023, గురువారం

రా దిగిరా దివినుంచి భువికి దిగిరా | Raa digiraa divi nunchi | Song Lyrics | Siri Siri Muvva (1978)

రా దిగిరా దివినుంచి భువికి దిగిరా



చిత్రం :  సిరి సిరి మువ్వ (1978)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  బాలు   


పల్లవి :


కలడందురు దీనుల ఎడ

కలడందురు పరమయోగి గణములపాలన్

కలడందురు అన్ని దిశలను

కలడు కలండను వాడు కలడో? లేడో?



రా దిగిరా దివినుంచి భువికి దిగిరా

రా దిగిరా దివినుంచి భువికి దిగిరా

రామ హరే శ్రీరామ హరే

రామ హరే శ్రీరామ హరే


రాతి బొమ్మకు రవ్వలు పొదిగి 

రామ హరే శ్రీరామ హరే

రాతి బొమ్మకు రవ్వలు పొదిగి 

రామ హరే శ్రీరామ హరే అని

పట్టిన హారతి చూస్తూ 

ఏమీ పట్టనట్టు కూర్చుంటే చాలదు


రా దిగిరా దివినుంచి భువికి దిగిరా

రామ హరే శ్రీరామ హరే

రామ హరే శ్రీరామ హరే 


చరణం 1 :


అలనాటి ఆ సీత ఈనాటి దేవత

శతకోటి సీతల కలబోత ఈ దేవత

రామచంద్రుడా కదలిరా రామాబాణమే వదలరా

ఈ ఘోర కలిని మాపరా ఈ కౄర బలిని ఆపరా 


చరణం 2 :


నటరాజ శత సహ్రస రవితేజా

నటగాయక వైతాళిక మునిజన భోజా

నటరాజ శత సహ్రస రవితేజా

నటగాయక వైతాళిక మునిజన భోజా

దీనావన భవ్య కళా దివ్య పదాంభోజా 

చెరి సగమై రస జగమై చెలరేగిన నీ చెలి ప్రాణము

 బలిపశువై యజ్ఞవాటి వెలి బూడిద అయిన క్షణము...


సతీ వియోగము సహించక

దుర్మతియౌ దక్షుని మదమడంచగ


ఢమ ఢమ ఢమ ఢమ డమరుక ధ్వనుల

నమక చమక యమ గమక లయంకర


సకలలోక జర్జరిత భయంకర 

వికట సటత్పద విస్ఫు లింగముల

విలయ తాండవము సలిపిన నీవే

శిలవే అయితే పగిలిపో

శివుడే అయితే రగిలిపో


పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

కౌగిలిలో ఉయ్యాలా | Kougililo Vuyyala | Song Lyrics | Annadammula Anubandham (1975)

కౌగిలిలో ఉయ్యాలా కన్నులలో జంపాలా  చిత్రం :  అన్నదమ్ముల అనుబంధం (1975) సంగీతం :  చక్రవర్తి గీతరచయిత :  దాశరథి నేపధ్య గానం :  బాలు, జానకి  పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు