పదహారు కళలకు ప్రాణాలైనా
చిత్రం : అన్నమయ్య (1997)
సంగీతం : ఎం ఎం కీరవాణి
రచన : జె జె భారవి
గానం : మనో
సాకి :
ఓం శ్రీ పద్మావతి భూదేవి సమేతస్య
శ్రీ మధవేంద్ర గానాయకస్య
నిత్యా చోడోపచార పూజంచ కరిష్యే
ఆవాహయామి
పల్లవి :
పదహారు కళలకు ప్రాణాలైనా
నా ప్రణవ ప్రణయ దేవతలకు
ఆవాహనం
ఓం ఆసనం సమర్పయామి
పరువాల హొయలకు పైఎదలైన
నా ఊహల లలనలకు ఉరువులాసనం
ఓం స్నానం సమర్పయామి
చరణం 1 :
చిత్తడి చిరు చెమటల చిందులు చిలికే
పద్మినీ భామినులకు పన్నీటి స్నానం
ఓం గంధం సమర్పయామి
గళం గళల నడల వలన అలసిన
మీ గగన జఘన సొబగులకు శీతల గంధం
ఓం నైవేద్యం సమర్పయామి
చరణం 2 :
రతివేద వెద్యులైన రమణులకు
అనుభవైక వేద్యమైన నైవేద్యం
ఓం తాంబూలం సమర్పయామి
మీ తహతహలకు తపనలకు తాకిళ్లకు
ఈ కొసరు కొసరు తాంబూలం
ఓం సాష్టాంగ వందనం సమర్పయామి
ఆనంద రంగ భంగినులకు
సర్వాంగ చుంబనాలు వందనం
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి