RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

27, జనవరి 2022, గురువారం

ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు | Eenadu kattukunna | Song Lyrics | Pandanti Kapuram (1972)

ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు


చిత్రం:  పండంటి కాపురం (1972)

సంగీతం:  కోదండపాణి

గీతరచయిత:  సి నారాయణరెడ్డి 

నేపధ్య గానం:  బాలు, సుశీల


పల్లవి:


    ఈనాడు కట్టుకున్న 

బొమ్మరిల్లు..ఊ..

    కావాలి ముందు ముందు 

పొదరిల్లు.. పొదరిల్లు

    ఊ.. ఊ.. ఊ.. ఓ.. ఓహోహో.. 

ఆహహా..


    ఈనాడు కట్టుకున్న.. 

బొమ్మరిల్లు..ఊ..

    కావాలి ముందు ముందు 

పొదరిల్లు.. పొదరిల్లు


చరణం 1:


    ఆశలే తీవెలుగా  ఉహూ..

    ఊసులే పూవులుగా ఉహూ..

    వలపులే తావులుగా.. 

అలరారు ఆ పొదరిల్లు


    ఆ..ఆ..ఆ..

    ఆశలే తీవెలుగా  ఉహూ..

    ఊసులే పూవులుగా ఉహూ..

    వలపులే తావులుగా.. 

అలరారు ఆ పొదరిల్లు


    పగలైనా రేయైనా.. 

ఏ ఋతువులోనైనా

    పగలైనా రేయైనా.. 

ఏ ఋతువులోనైనా

    కురిపించును తేనెజల్లు.. 

పరువాల ఆ పొదరిల్లు


    ఈనాడు కట్టుకున్న.. 

బొమ్మరిల్లు..ఊ..

    కావాలి ముందు ముందు 

పొదరిల్లు.. పొదరిల్లు


చరణం 2:


    కళ్ళలో కళ్ళుంచీ  ఉహూ..

    కాలమే కరిగించే   ఉహూ..

    అనురాగం పండించే.. 

ఆ బ్రతుకే హరివిల్లు


    ఆ..ఆ..ఆ..

    కళ్ళలో కళ్ళుంచీ  ఉహూ..

    కాలమే కరిగించే  ఉహూ..

    అనురాగం పండించే.. 

ఆ బ్రతుకే హరివిల్లు


    నా దేవివి నీవైతే.. 

నీ స్వామిని నేనైతే

    నా దేవివి నీవైతే.. 

నీ స్వామిని నేనైతే

    పచ్చని మన కాపురమే.. 

పరిమళాలు వెదజల్లు


    ఈనాడు కట్టుకున్న.. 

బొమ్మరిల్లు..ఊ..

    కావాలి ముందు ముందు 

పొదరిల్లు.. పొదరిల్లు


    ఊఁహూఁహూఁ.. ఊఁహూఁహూఁ.. 

ఊఁహూఁహూఁ..

    ఊఁహూఁహూఁ.. ఊఁహూఁహూఁ.. 

ఊఁహూఁహూఁ..


పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చక్కని చుక్క సరసకు రావే | Chakkani Chukka | Song Lyrics | Iddaru Mitrulu (1961)

చక్కని చుక్క సరసకు రావే చిత్రం: ఇద్దరు మిత్రులు (1961) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: ఆరుద్ర నేపధ్య గానం: పి. బి. శ్రీనివాస్, సుశీల పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు