ఎగిరే పావురమా దిగులెరగని పావురమా
చిత్రం: జగత్ కిలాడీలు (1969)
సంగీతం: కోదండపాణి
గీతరచయిత: దేవులపల్లి
నేపధ్య గానం: సుశీల
పల్లవి :
ఎగిరే పావురమా...
ఎగిరే పావురమా... దిగులెరగని పావురమా
దిగిరావా.... ఒక్కసారి....
ప్రతి రాత్రికి పగలుందని వెలుగుందని ఎరుగుదువా
ఓ.... ఓ..... ఓ..... ఓ...
ఎగిరే పావురమా... దిగులెరగని పావురమా
చరణం 1 :
మోముపైని ఏ నీడలు ముసరరాదని
చందమామపైని ఏ మబ్బులు మసలరాదని
ఎరుగుదువా పావురమా....
మా కన్నా నీవు నయం... నీకు తోచదే భయం
మా కన్నా నీవు నయం... నీకు తోచదే భయం
మూసే చీకటుల దారిచేసి పోవాలని... ఎదుగుదువా
ఎగిరే పావురమా... దిగులెరగని పావురమా
చరణం 2 :
అటుపచ్చని తోటుందని... అట వెచ్చని గూడుందని
అటుపచ్చని తోటుందని... అట వెచ్చని గూడుందని
అటూ ఇటూ అడుగడుగున చుక్కదీపముంటుందని
ఎగురుదువా.... పావురమా
ఒక్క గడియగాని... నీ రెక్క ముడవగూడదనీ
ఒక్క గడియగాని... నీ రెక్క ముడవగూడదనీ
దూరాన ధ్రువతారను చేరే తీరాలని.... ఎరుగుదువా..
ఎగిరే పావురమా...
ఎగిరే పావురమా... దిగులెరగని పావురమా
దిగిరావా.... ఒక్కసారి....
ప్రతి రాత్రికి పగలుందని వెలుగుందని ఎరుగుదువా
ఓ.... ఓ..... ఓ..... ఓ...
ఎగిరే పావురమా... దిగులెరగని పావురమా
ఎగిరే పావురమా దిగులెరగని పావురమా
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి