RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

23, జూన్ 2023, శుక్రవారం

చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా | Chusuko Padilanga | Song Lyrics | Anuraga Devatha (1982)

చూసుకో పదిలంగా  హృదయాన్ని అద్దంలా



చిత్రం: అనురాగ దేవత (1982)

సంగీతం: చక్రవర్తి

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: సుశీల



పల్లవి:


ఆ..ఆ..ఆ..ఆఅ..ఆ.ఆఅ..

ఆ హో... ఆ హో...


చూసుకో పదిలంగా... హృదయాన్ని అద్దంలా

చూసుకో పదిలంగా... హృదయాన్ని అద్దంలా


పగిలేది గాయం ఏదైనా.. రగిలేను నీలో వేదన

చూసుకో పదిలంగా..ఆ..ఆ


చరణం 1:


వికసించే పూలు ముళ్ళు.. విధి రాతకు ఆనవాళ్ళూ


వికసించే పూలోకంలో.. విధి రాతకు ఆనవాళ్ళూ

ఒకరి కంట పన్నీరైనా..ఒకరి కంట కన్నీళ్ళు

ఒకరి కంట పన్నీరైనా..ఆ..ఆ ఒకరి కంట కన్నీళ్ళు


ఎండమావి నీరు తాగి.. గుండె మంటలార్చుకోకు

ఎండమావి నీరు తాగి.. గుండె మంటలార్చుకోకు

ఆశ పెంచుకోకు నేస్తం.. అది నిరాశ స్వాగత హస్తం


చూసుకో పది లంగా... హృదయాన్ని అద్దంలా

పగిలేది గాయం ఏదైనా.. రగిలేను నీలో వేదన

చూసుకో పదిలంగా..ఆ..ఆ


చరణం 2:


కాలమనే నదిలో కదిలే.. కర్మమనే నావ మీద


కాలమనే నదిలో కదిలే.. కర్మమనే నావ మీద

ఎవరి తోడు ఎన్నాళ్ళున్నా.. చివరి తోడు నువ్వేలే

ఎవరి తోడు ఎన్నాళ్ళున్నా.. చివరి తోడు నువ్వేలే


సాగుతున్న బాటసారి.. ఆగి చూడు ఒక్కసారి

సాగుతున్న బాటసారి.. ఆగి చూడు ఒక్కసారి

కలుసుకోనీ ఇరు తీరాలూ..

కనిపించని సుడిగుండాలు


చూసుకో పదిలంగా.. హృదయాన్ని అద్దంలా

పగిలేది గాయం ఏదైనా.. రగిలేను నీలో వేదన

చూసుకో పదిలంగా..ఆ..ఆ


పాటల ధనుస్సు  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

కౌగిలిలో ఉయ్యాలా | Kougililo Vuyyala | Song Lyrics | Annadammula Anubandham (1975)

కౌగిలిలో ఉయ్యాలా కన్నులలో జంపాలా  చిత్రం :  అన్నదమ్ముల అనుబంధం (1975) సంగీతం :  చక్రవర్తి గీతరచయిత :  దాశరథి నేపధ్య గానం :  బాలు, జానకి  పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు