నెలరాజా పరుగిడకు
చిత్రం: అమర గీతం (1982)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు
పల్లవి:
నెలరాజా పరుగిడకు.. చెలి వేచే నాకొరకు
ఒక్కమారు పోయి.. చెలినిగాంచుమా
నివేదించుమా... విరహమే
నెలరాజా పరుగిడకు.. చెలి వేచే నాకొరకు
చరణం 1:
మబ్బులలో తళుకుమనే మెరుపేలే చెలి అందం
ముచ్చటగా ముత్యం లా మెరిసిపడే సఖి అందం
మబ్బులలో తళుకుమనే మెరుపేలే చెలి అందం
ముచ్చటగా ముత్యం లా మెరిసిపడే సఖి అందం
వాడిపోనిదీ వనిత యవ్వనం
ఆడిపాడితే కనుల నందనం
అణువణువు విరిసేలే లావణ్యం
నెలరాజా పరుగిడకు.. చెలి వేచే నాకొరకు
చరణం 2:
ముంగిటనే రాచిలుకా పలికేనూ స్వాగతము
మురిపెముగా తమ రాకా నా చెలితో తెలిపేనూ
ముంగిటనే రాచిలుకా పలికేనూ స్వాగతము
మురిపెముగా తమ రాకా నా చెలితో తెలిపేనూ
కొండవాగులా.. మల్లెతీగలా
పులకరించినా.. సన్నజాజిలా
విరహిణిలా.. వేచేను జవరాలే
నెలరాజా పరుగిడకు.. చెలి వేచే నా కొరకు..
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి