RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

26, సెప్టెంబర్ 2023, మంగళవారం

కొత్తకొత్తగా ఉన్నది | Kotha Kothaga Vunnadi | Song Lyrics | Coolie No 1 (1991)

కొత్తకొత్తగా ఉన్నది



చిత్రం: కూలి నెం. 1  (1991)

సంగీతం: ఇళయరాజా

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: బాలు, చిత్ర 


పల్లవి :


కొత్తకొత్తగా ఉన్నది 

స్వర్గమిక్కడే అన్నది

కోటి తారలే పూల ఏరులై

కోటి తారలే 

పూల ఏరులై నేల చేరగానె


కొత్తకొత్తగా ఉన్నది 

స్వర్గమిక్కడే అన్నది...



చరణం 1 :


నా కన్ను ముద్దాడితే 

కన్నె కులుకాయె కనకాంబరం

నా చింత సంపెంగలో 

కెంపు రంగాయె తొలి సంబరం


ఎన్ని పొంగులో కుమారి కొంగులో

ఎన్ని రంగులో సుమాల వాగులో

ఎన్ని పొంగులో కుమారి కొంగులో

ఎన్ని రంగులో సుమాల వాగులో


ఉద్యోగమిప్పించవా 

సోకు ఉద్యాన వనమాలిగా

జీతమీయగా లేత 

వన్నెలే చెల్లించుకోనా


కొత్తకొత్తగా ఉన్నది 

స్వర్గమిక్కడే అన్నది

కోటి తారలే పూల ఏరులై

కోటి తారలే 

పూల ఏరులై నేల చేరగానె

కొత్తకొత్తగా ఉన్నది 

స్వర్గమిక్కడే అన్నది...


చరణం 2 :


నీ నవ్వు ముద్దాడితే 

మల్లెపువ్వాయె నా యవ్వనం

నాజూకు మందారమే 

ముళ్ళ రోజాగ మారే క్షణం


మొగలి పరిమళం మగాడి కౌగిళి

మగువ పరవశం సుఖాల లోగిలి

మొగలి పరిమళం మగాడి కౌగిళి

మగువ పరవశం సుఖాల లోగిలి


కండల్లొ వైశాఖమా 

కైపు ఎండల్లొ కరిగించుమా

తీగమల్లికీ నరాల 

పందిరీ అందించుకోనా


కొత్తకొత్తగా ఉన్నది 

స్వర్గమిక్కడే అన్నది

కోటి తారలే పూల ఏరులై

కోటి తారలే 

పూల ఏరులై నేల చేరగానె


కొత్తకొత్తగా ఉన్నది 

స్వర్గమిక్కడే అన్నది...


పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చక్కని చుక్క సరసకు రావే | Chakkani Chukka | Song Lyrics | Iddaru Mitrulu (1961)

చక్కని చుక్క సరసకు రావే చిత్రం: ఇద్దరు మిత్రులు (1961) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: ఆరుద్ర నేపధ్య గానం: పి. బి. శ్రీనివాస్, సుశీల పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు