RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

24, ఫిబ్రవరి 2025, సోమవారం

తల్లీ తండ్రీ నీవేనమ్మా | Thalli Tandri Neevenamma | Song Lyrics | Bhakta Kannappa (1976)

తల్లీ తండ్రీ నీవేనమ్మా



చిత్రం :  భక్త కన్నప్ప (1976)

సంగీతం :  ఆదినారాయణరావు/సత్యం

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : సుశీల


పల్లవి :


తల్లీ తండ్రీ నీవేనమ్మా.. 

చల్లని తల్లీ గౌరమ్మా  

తల్లీ తండ్రీ నీవేనమ్మా.. 

చల్లని తల్లీ గౌరమ్మా     


చరణం 1 :


అమ్మలగన్న అమ్మవు నీవు.. 

ముజ్జగాలకే ముత్తయిదువవు

నిత్యసుమంగళి నీవేనమ్మా.. 

నిత్యసుమంగళి నీవేనమ్మా

నీ తలపే శుభమంగళమమ్మా 


తల్లీ తండ్రీ నీవేనమ్మా.. 

చల్లని తల్లీ గౌరమ్మా  


చరణం 2 :


కలవని కొలచినా శిలవని తలచినా.. 

తలపేదైనా దైవము నీవే

వెన్నేకానని కన్నులు మావి.. 

వెలుగు నీయవే మంగళ గౌరీ 


తల్లీ తండ్రీ నీవేనమ్మా.. 

చల్లని తల్లీ గౌరమ్మా   


చరణం 3 :


దీనజనావని పతితపావనీ.. 

దిక్కు చూపవే తల్లీ

నేరక చేసిన నేరాలెంచక.. 

దరిజేర్చు కల్పవల్లీ

మమ్ముగావమని మహాదేవునికి 

మనవి చేయవే దేవీ

శంకరీ.. శివశంకరీ.. అభయంకరీ.. 

అమ్మా.. ఈశ్వరీ 


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

నీలాల నింగిలోన పగడాల పందిరి | Neelala Ningilona | Song Lyrics | Daana Dharmalu (1976)

నీలాల నింగిలోన పగడాల పందిరి చిత్రం : దానధర్మాలు (1976) సంగీతం : మాస్టర్ వేణు గీతరచయిత : కొండిశెట్టి శ్రీ రామా రావ్  నేపధ్య గానం : ఎస్ పి బాల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు