RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

24, ఫిబ్రవరి 2025, సోమవారం

కిరాతార్జునీయం | Kiratharjuneeyam | Song Lyrics | Bhakta Kannappa (1976)

కిరాతార్జునీయం



చిత్రం :  భక్త కన్నప్ప (1976)

సంగీతం :  ఆదినారాయణరావు/సత్యం

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం:  బాలు


పల్లవి :


తకిటతక తకతకిట చకిత పదయుగళా

వికట గంగాఝరిత మకుటతట నిగళా

హరిహరాంచిత కళాకలిత నీలగళా

సాంద్రచ్ఛటాపటల నిటల చంద్రకళా

జయజయ మహాదేవ శివశంకరా

హరహర మహాదేవ ఆభయంకరా


అని దేవతలు శివుని కొనియాడ

పరవశమ్మున శివుడు తాండవమ్మాడగా

కంపించెనింతలో కైలాసమావేళ

కనిపించెనంత అకాల ప్రళయ జ్వాలా


జగములేలిన వాని సగము నివ్వెరబోయే

సగము మిగిలిన వాని మొగము నగవైపోయే


చరణం 1 :


" ఓం నమః శివాయ... 

ఓం నమః శివాయ "


అతడే అతడే అర్జునుడు.. 

పాండవ వీర యశోధనుడు

అతడే అతడే అర్జునుడు.. 

పాండవ వీర యశోధనుడు

అనితరసాధ్యము పాశుపతాస్త్రము

కోరి ఇంద్రగిరి చేరి శివునికై

అహోరాత్రములు చేసెను తపస్సు

ఇది సృష్టించెను దివ్య మహస్సు


నెలవంక తలపాగ నెమలి ఈకగ మారే

తలపైని గంగమ్మ తలపులోనికి బారే

నిప్పులుమిసే కన్ను నిదురోయి బొట్టాయే

బూదిపూతకు మారు పులితోలు వలువాయే

ఎరుక గల్గిన శివుడు ఎరుకగా మారగా

తల్లి పార్వతి మారే తానె ఎరుకతగా

ఓంకార ధనువుగా ఒదిగె త్రిశూలమ్ము 

కైలాసమును వీడి కదలి వచ్చెను శివుడు

కైలాసమును వీడి కదలి వచ్చెను శివుడు


చరణం 2:


శివుని ఆనతిని శిరమున దాల్చి

మూకాసురుడను రాక్షసుడు

వరాహ రూపము ధరించి వచ్చెను

ధరాతలమ్మే అదిరిపోవగా..


చిచ్చరపిడుగై వచ్చిన పందిని

రెచ్చిన కోపముతో అర్జునుడు

మట్టుబెట్టగా పట్టె బాణము

ధనువొక చేతను అందుకొని

చూసిన కంటను చూడకనే

గురి చూసినంతనే ... వేసినంతనే ...

తలలు రెండుగా విలవిలలాడుచు 

తనువు కొండగా గిర గిరతిరుగుతూ 

అటు ఇటు తగిలిన రెండు బాణముల 

అసువులు వీడెను వరాహము


'కొట్టితి నేనని ' అర్జునుడు

'పడకొట్టితి నేనని ' శివుడు

పట్టిన పట్టును వదలకనే

తొడకొట్టిన వీరముతో అపుడు


' వేట నాది వేటు నాది 

వేటాడే చోటు నాది

ఏటి తగవు పొమ్మని " 

విలు మీటి పలికె  శివుడు


' చేవ నాది చేతనాది 

చేటెరుగని ఈటె నాది

చేవుంటే రమ్మని ' 

కనుసైగ చేసె  అర్జునుడు


గాండీవ పాండిత్య కళలుగా బాణాలు

కురిపించే అర్జునుడు కానీ...

అపుడతను వేయి చేతుల 

కార్తవీర్యార్జునుడు


ఓంకార ఘన ధనుష్టంకారములతోడ

శరపరంపర కురిసే హరుడు

అయినా నరునికాతడు మనోహరుడు


చరణం 3 :


చిత్రమేమో గురిపెట్టిన 

బాణమ్ములు మాయమాయే

విధివిలాసమేమో పెట్టిన గురి 

వట్టిదాయే

అస్త్రములే విఫలమాయే...

శస్త్రములే వికలమాయే...

సవ్యసాచి కుడియడమై 

సంధించుట మరచిపోయే....


జగతికి సుగతిని సాధించిన తల

దిగంతాల కవతల వెలిగే తల

గంగకు నెలవై... కళాకాదరువై

హరి బ్రహ్మలకు తరగని పరువై

అతి పవిత్రమై ... అఘ లవిత్రమై

శ్రీకరమై... శుభమైన శివుని తల

అదరగా ... సృష్టి చెదరగా


తాడి ఎత్తు గాండీవముతో 

ముత్తాడి ఎత్తుగా

ఎదిగి అర్జునుడు 

చండ కోపమున కొట్టినంతనే.....


తల్లిదండ్రుల చలువ తనువైన దేవుడు

కోరినవరాలిచ్చు కొండంత దేవుడు

ఎదుట నిలిచెను శివుడు ఎదలోని దేవుడు

పదములంటెను నరుడు భక్తి తో అపుడు


"కర చరణ కృతంవా కర్మ వాక్కాయజంవా

శ్రవణ నయనజంవా మానసంవాపరాధం

విహితమ విహితం వా సర్వామే తక్షమస్వ

శివ శివ కరుణాబ్ధే  శ్రీమహాదేవ శంభో

నమస్తే...  నమస్తే.. నమస్తే... నమః"


పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

కౌగిలిలో ఉయ్యాలా | Kougililo Vuyyala | Song Lyrics | Annadammula Anubandham (1975)

కౌగిలిలో ఉయ్యాలా కన్నులలో జంపాలా  చిత్రం :  అన్నదమ్ముల అనుబంధం (1975) సంగీతం :  చక్రవర్తి గీతరచయిత :  దాశరథి నేపధ్య గానం :  బాలు, జానకి  పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు