తగిలిందయ్యో తగిలింది పైరగాలి
చిత్రం : బంగారు బాబు (1973)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : పి సుశీల
పల్లవి :
తగిలిందయ్యో తగిలింది పైరగాలి..
ఎగిరిందమ్మో ఎగిరింది పైటకొంగు
తగిలింది.. ఎగిరింది..
య్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యో
మనసే ఉరకలు వేసింది..
నా మనసే ఉరకలు వేసింది . .
తగిలిందయ్యో తగిలింది పైరగాలి..
ఎగిరిందమ్మో ఎగిరింది పైటకొంగు
తగిలింది.. ఎగిరింది..
య్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యో
మనసే ఉరకలు వేసింది . .
నా మనసే ఉరకలు వేసింది..
చరణం 1 :
కొమ్మ కొమ్మనా జంటలు చూస్తే..
పువ్వు పువ్వునా తుమ్మెదలుంటే
కొమ్మ కొమ్మనా జంటలు చూస్తే..
పువ్వు పువ్వునా తుమ్మెదలుంటే
గువ్వల గుసగుస వింటుంటే..
గుండెలు రెపరెపమంటుంటే
అమ్మమ్మమ్మమ్మమ్మో..
వయసే బుసబుస పొంగిందీ..
నా మనసే ఉరకలు వేసింది..
తగిలిందయ్యో తగిలింది పైరగాలి..
ఎగిరిందమ్మో ఎగిరింది పైటకొంగు
తగిలింది.. ఎగిరింది..
య్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యో
మనసే ఉరకలు వేసింది . .
నా మనసే ఉరకలు వేసింది . .
చరణం 2 :
మబ్బును మబ్బు ముద్దులాడితే..
సిగ్గున నింగి ఎర్రబారితే
మబ్బును మబ్బు ముద్దులాడితే..
సిగ్గున నింగి ఎర్రబారితే
ఎన్నడు చూడని అందాలూ..
చూశానమ్మా ఈనాడు
అమ్మమ్మమ్మమ్మమ్మో..
వయసు మనసూ ఒకటై
నా ఉసురు పోసుకున్నాయి..
నా ఉసురు పోసుకున్నాయి . .
తగిలిందయ్యో తగిలింది పైరగాలి..
ఎగిరిందమ్మో ఎగిరింది పైటకొంగు
తగిలింది . . ఎగిరింది
య్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యో
మనసే ఉరకలు వేసింది . .
నా మనసే ఉరకలు వేసింది . .
- పాటల ధనుస్సు

 
 
 
 
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి