RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

5, అక్టోబర్ 2025, ఆదివారం

అన్నయ్య హృదయం దేవాలయం | Annayya Hrudayam Devalayam | P Susheela | Song Lyrics | Bangaru Chellelu (1979)

అన్నయ్య హృదయం దేవాలయం



చిత్రం : బంగారు చెల్లెలు (1979)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  పి సుశీల


పల్లవి:


అన్నయ్య హృదయం దేవాలయం

చెల్లెలే ఆ గుడి మణిదీపం..ఊఁ..ఊఁ..

అన్నయ్య హృదయం దేవాలయం

చెల్లెలే ఆ గుడి మణిదీపం

అనురాగమే కొలువున్న దైవం

అనుబంధమే గోపురం

మా అనుబంధమే గోపురం


అన్నయ్య హృదయం దేవాలయం..

ఊఁ..ఊఁ..


చరణం 1:


పంచుకున్నది ఒకటే రక్తం.. 

పెంచుకున్నది ఒకటే పాశం

పంచుకున్నది ఒకటే రక్తం.. 

పెంచుకున్నది ఒకటే పాశం

బ్రతుకున్నది ఆ పాశం కోసం..

బ్రతుకున్నది ఆ పాశం కోసం.. 

కోరుకునేది ఇద్దరి క్షేమం


అన్నయ్య హృదయం దేవాలయం

చెల్లెలే ఆ గుడి మణిదీపం

అన్నయ్య హృదయం దేవాలయం..


చరణం 2:


ఊయలలూపి జోలలు పాడే 

తల్లినెరగను..ఊ..

మోసుకు తిరిగి ముచ్చట తీర్చే 

తండ్రినెరగను..ఊ..

కళ్ళు తెరిచి నే చూచినదే 

ఈ కరుణామూర్తిని

మాట నేర్చి నే పిలిచినదే 

' అన్నా ' అన్నది


అన్నయ్య హృదయం దేవాలయం..


చరణం 3:


కృష్ణుడు పలికిన  గీతవాక్కు.. 

వేదం అయినా ఎందుకు నాకూ..ఊ..

కృష్ణుడు పలికిన  గీతవాక్కు.. 

వేదం అయినా ఎందుకు నాకు


నా పాలి వేదం అన్నయ్య పలుకు..

నా పాలి వేదం అన్నయ్య పలుకు..

అన్నయ్య నవ్వే నా దారి వెలుగు..ఊ..


అన్నయ్య హృదయం దేవాలయం

చెల్లెలే ఆ గుడి మణిదీపం

అనురాగమే కొలువున్న దైవం

అనుబంధమే గోపురం

మా అనుబంధమే గోపురం


అన్నయ్య హృదయం దేవాలయం..

ఊఁ..ఊఁ..


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

నీలాల నింగిలోన పగడాల పందిరి | Neelala Ningilona | Song Lyrics | Daana Dharmalu (1976)

నీలాల నింగిలోన పగడాల పందిరి చిత్రం : దానధర్మాలు (1976) సంగీతం : మాస్టర్ వేణు గీతరచయిత : కొండిశెట్టి శ్రీ రామా రావ్  నేపధ్య గానం : ఎస్ పి బాల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు