RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

26, అక్టోబర్ 2025, ఆదివారం

ఏడడుగుల సంబంధం | Yedadugula Sambandham | Song Lyrics | Bangaru Babu (1973)

ఏడడుగుల సంబంధం



చిత్రం : బంగారు బాబు (1973)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : ఘంటసాల, సుశీల


పల్లవి:


ఏడడుగుల సంబంధం 

ఏనాడో వేసిన బంధం

నిన్ను నన్ను పెనవేసిన బంధం

ఎన్నో జన్మల సంబంధం

ఎన్నెన్నో... జన్మల అనుబంధం


ఏడడుగుల సంబంధం 

ఏనాడో వేసిన బంధం

నిన్ను నన్ను పెనవేసిన బంధం

ఎన్నో జన్మల సంబంధం

ఎన్నెన్నో... జన్మల అనుబంధం


చరణం 1:


ఎన్నో ఊసులు ఎదలో 

మెదిలే తొలిరోజు

అవి మాటలకందక 

మారాం చేసేదీరోజు

ఎన్నో ఊసులు ఎదలో 

మెదిలే తొలిరోజు

అవి మాటలకందక 

మారాం చేసేదీరోజు


ఈ రోజు కోసమే కన్నులు 

కాయలు కాచినవి

ఈ రోజు కోసమే కన్నులు 

కాయలు కాచినవి

ఈ రోజు కోసమే 

కన్నె సొగసులు దాచినది

ఈ రోజు కోసమే 

కన్నె సొగసులు దాచినది


ఇది... ఏడడుగుల సంబంధం 

ఏనాడో వేసిన బంధం

నిన్ను నన్ను పెనవేసిన బంధం

ఎన్నో జన్మల సంబంధం

ఎన్నెన్నో... జన్మల అనుబంధం


చరణం 2:


మోజులు పెరగాలి వాటిని 

చేతలు చెయ్యాలి

సుఖాల లోతులు చూడాలి 

ఒడిలో సోలిపోవాలి

మోజులు పెరగాలి వాటిని 

చేతలు చెయ్యాలి

సుఖాల లోతులు చూడాలి 

ఒడిలో సోలిపోవాలి


అలుపు సొలుపు ఎరగని 

పరువం అంతు చూడాలి

ఎండ వాన రెండూ చూస్తూ 

పండిపోవాలి

అలుపు సొలుపు ఎరగని 

పరువం అంతు చూడాలి

ఎండ వాన రెండూ చూస్తూ 

పండిపోవాలి


ఇది... ఏడడుగుల సంబంధం 

ఏనాడో వేసిన బంధం

నిన్ను నన్ను పెనవేసిన బంధం

ఎన్నో జన్మల సంబంధం

ఎన్నెన్నో... జన్మల అనుబంధం


చరణం 3:


ఆలుమగలుగ ఆనందం 

చవి చూశాము

అనురాగం పండి 

అమ్మానాన్నలమైనాము

ఆలుమగలుగ ఆనందం 

చవి చూశాము

అనురాగం పండి 

అమ్మానాన్నలమైనాము


ఈ రోజు కోసమే ఆడది 

తపస్సు చేసేది

ఈ రోజు కోసమే ఆడది 

తపస్సు చేసేది

ఈ బోసినవ్వుకే మగాడు 

జోలలు పాడేది

ఈ బోసినవ్వుకే మగాడు 

జోలలు పాడేది


ఇది... ఏడడుగుల సంబంధం 

ఏనాడో వేసిన బంధం

నిన్ను నన్ను పెనవేసిన బంధం

ఎన్నో జన్మల సంబంధం

ఎన్నెన్నో... జన్మల అనుబంధం


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చీకటిలో కారు చీకటిలో | Cheekatilo Karu Cheekatilo | Song Lyrics | Manushulu Marali (1969)

చీకటిలో కారు చీకటిలో చిత్రం : మనుషులు మారాలి (1969) సంగీతం : కె.వి. మహదేవన్ గీతరచయిత : శ్రీ శ్రీ నేపధ్య గానం : ఘంటసాల పల్లవి : చీకటిలో కారు ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు