RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

13, అక్టోబర్ 2025, సోమవారం

నవ్వెను నాలో జాజిమల్లి | Navvenu Nalo Jajimalli | Song Lyrics | Gandikota Rahashyam (1969)

నవ్వెను నాలో జాజిమల్లి



చిత్రం: గండికోట రహస్యం (1969) 

సంగీతం: టి.వి. రాజు 

గీతరచయిత: సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం: పి సుశీల 


పల్లవి : 


అనురాగ గగనాలలోనా...

ఆగింది కన్నీటి వానా... 

మెరిసింది ఒక ఇంద్రధనువు...

విరిసింది నాలోని అణువు అణువు... 


నవ్వెను నాలో జాజిమల్లి...

పొంగెను నాలో పాలవెల్లీ 

కళ కళలాడెను నా ముంగిట 

ముత్యాల రంగవల్లీ..ఈ..ఈ.. 

నవ్వెను నాలో జాజిమల్లి...

పొంగెను నాలో పాలవెల్లీ... 


చరణం 1 : 


నా ఆశలు పులకించెనా...

నా పూజలు ఫలియించెనా... 

నా ఆశలు పులకించెనా...

నా పూజలు ఫలియించెనా 

ఆ పరమేశ్వరి తూపులు నాపై 

అమృతధారలై కురెసెనా... 

అమృతధారలై కురెసెనా... 

నవ్వెను నాలో జాజిమల్లి...

పొంగెను నాలో పాలవెల్లీ... 


చరణం 2 : 


ఈ చీకటి విడిపోవునా...ఆ..

ఎల వెన్నెల విరబూయునా...ఆ.. 

ఈ చీకటి విడిపోవునా...ఆ..

ఎల వెన్నెల విరబూయునా...ఆ.. 

నవజీవన బృందావనిలోనా 

నా స్వామి నను చేరునా... 

నా స్వామి నను చేరునా.... 


నవ్వెను నాలో జాజిమల్లి...

పొంగెను నాలో పాలవెల్లీ 

కళ కళలాడెను నా ముంగిట 

ముత్యాల రంగవల్లీ..ఈ..ఈ.. 

నవ్వెను నాలో జాజిమల్లి...

పొంగెను నాలో పాలవెల్లీ..


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చక్కని చుక్క సరసకు రావే | Chakkani Chukka | Song Lyrics | Iddaru Mitrulu (1961)

చక్కని చుక్క సరసకు రావే చిత్రం: ఇద్దరు మిత్రులు (1961) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: ఆరుద్ర నేపధ్య గానం: పి. బి. శ్రీనివాస్, సుశీల పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు