RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

9, అక్టోబర్ 2025, గురువారం

ఆకాశమా నీవెక్కడ | Akasama Neevekkada | Song Lyrics | Vande Matharam (1985)

ఆకాశమా నీవెక్కడ



చిత్రం :  వందేమాతరం (1985)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత : సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం : బాలు, జానకి 


పల్లవి :


ఆకాశమా నీవెక్కడ.. 

అవని పైనున్న నేనెక్కడా

ఆకాశమా నీవెక్కడ.. 

అవని పైనున్న నేనెక్కడా


ఏ రెక్కలతో ఎగిసి వచ్చినా...

ఏ రెక్కలతో ఎగిసి వచ్చినా.. 

నిలువగలన నీపక్కన


ఆకాశమా నీవెక్కడ.. 

అవని పైనున్న నేనెక్కడా 


చరణం 1 :


నీలాల గగనాల ఓ జాబిలి.. 

నిను నిరుపేద ముంగిట నిలిపేదెలా?

నీలాల గగనాల ఓ జాబిలి..  

నిను నిరుపేద ముంగిట నిలిపేదెలా?

ముళ్ళున్న రాలున్న నా దారిలో 

నీ చల్లని పాదాలు సాగేదెలా?

నీ మనసన్నది నా మది విన్నది.. 

నిలిచి పోయింది ఒక ప్రశ్నలా

నిలిచి పోయింది ఒక ప్రశ్నలా..


ఆకాశమా... లేదక్కడ ...

ఆకాశమా లేదక్కడ... 

అది నిలిచి ఉంది నీపక్కన

వేల తారకలు తనలో వున్నా.. 

వేల తారకలు తనలో వున్నా 

నేలపైనే తన మక్కువ

ఆకాశమా లేదక్కడ...  

అది నిలిచి ఉంది నీపక్కన 


చరణం 2 :


వెలలేని నీ మనసు కోవెలలో 

నను తల దాచుకోని చిరు వెలుగునై

వెలలేని నీ మనసు కోవెలలో 

నను తల దాచుకోని చిరు వెలుగునై

వెను తిరిగి చూడని నీ నడకలో 

నన్ను కడదాక రాని నీ అడుగునై

మన సహజీవనం వెలిగించాలి 

నీ సమత కాంతులు ప్రతి దిక్కున

సమత కాంతులు ప్రతి దిక్కున


ఆకాశమా నీవెక్కడ.. 

అది నిలిచి వుంది నాపక్కన

వేల తారకలు తనలో వున్నా.. 

వేల తారకలు తనలో వున్నా..

నేలపైనే తన మక్కువ... 

ఈ నేలపైనే తన మక్కువ


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చక్కని చుక్క సరసకు రావే | Chakkani Chukka | Song Lyrics | Iddaru Mitrulu (1961)

చక్కని చుక్క సరసకు రావే చిత్రం: ఇద్దరు మిత్రులు (1961) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: ఆరుద్ర నేపధ్య గానం: పి. బి. శ్రీనివాస్, సుశీల పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు