RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

19, అక్టోబర్ 2025, ఆదివారం

చీకటి వెలుగుల రంగేళీ | Cheekati Velugula Rangeli | Song Lyrics | Vichitra Bandham (1972)

చీకటి వెలుగుల రంగేళీ



చిత్రం :  విచిత్ర బంధం (1972)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  ఘంటసాల,  సుశీల


పల్లవి :


చీకటి వెలుగుల రంగేళీ.. 

జీవితమే ఒక దీపావళి

చీకటి వెలుగుల రంగేళీ.. 

జీవితమే ఒక దీపావళి

మన జీవితమే ఒక దీపావళి..


అందాల ప్రమిదల ఆనంద జ్యోతుల

ఆశల వెలిగించు దీపాల వెల్లి


చీకటి వెలుగుల రంగేళీ.. 

జీవితమే ఒక దీపావళి

మన జీవితమే ఒక దీపావళి


చరణం 1 :


అక్కయ్య కన్నుల్లో మతాబులు.. 

ఏ చక్కన్ని బావకో జవాబులు

మాటల్లో వినిపించు చిటపటలు.. 

మాటల్లో వినిపించు చిటపటలు

ఏ మనసునో కవ్వించు గుసగుసలు..


లలలా ఆహహహా ఆ.. ఆ.. ఆ..

చీకటి వెలుగుల రంగేళీ.. 

జీవితమే ఒక దీపావళి

మన జీవితమే ఒక దీపావళి


చరణం 2 :


అల్లుళ్ళు వస్తారు అత్తవారిళ్ళకు.. 

మరదళ్ళు చేస్తారు మర్యాద వాళ్ళకు

బావా బావా పన్నీరు.. 

బావను పట్టుక తన్నేరు

బావా బావా పన్నీరు.. 

బావను పట్టుక తన్నేరు

వీధి వీధి తిప్పేరు .. 

వీసెడు గుద్దులు గుద్దేరు


అహహహహ

చీకటి వెలుగుల రంగేళీ.. 

జీవితమే ఒక దీపావళి

మన జీవితమే ఒక దీపావళి


చరణం 3 :


అమ్మాయి పుట్టింది అమాసనాడు..

అసలైన గజదొంగ అవుతుంది చూడు..

పుట్టినరోజున దొరికాడు తోడు..

పున్నమి నాటికి అవుతాడు జోడు..


అహహహా ఆహహహా ఆ.. ఆ.. ఆ..

చీకటి వెలుగుల రంగేళీ.. 

జీవితమే ఒక దీపావళి

మన జీవితమే ఒక దీపావళి


- పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చక్కని చుక్క సరసకు రావే | Chakkani Chukka | Song Lyrics | Iddaru Mitrulu (1961)

చక్కని చుక్క సరసకు రావే చిత్రం: ఇద్దరు మిత్రులు (1961) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: ఆరుద్ర నేపధ్య గానం: పి. బి. శ్రీనివాస్, సుశీల పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు