RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

4, అక్టోబర్ 2025, శనివారం

ఎంత బాగుంటు౦ది | Entha Baguntundi | Song Lyrics | Naa Pere Bhagavan (1976)

ఎంత బాగుంటు౦ది

చిత్రం: నా పేరే భగవాన్ (1976)

సంగీతం: చక్రవర్తి

గీతరచయిత: సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం: బాలు, సుశీల


పల్లవి :


ఎంత బాగుంటు౦ది.. 

ఎంత బాగుంటు౦ది 


ఎంత బాగుంటు౦ది.. 

పడుచు పిల్లకెంత బాగుంటు౦ది

అరెరెరె.. ఎంత బాగుంటు౦ది.. 

పడుచు పిల్లకెంత బాగుంటు౦ది


పట్టుచీర కట్టుకుంటే.. 

ఆ చీర పట్టు తప్పుతుంటే.. 

నా సామిరంగా

పట్టుచీర కట్టుకుంటే.. 

ఆ చీర పట్టు తప్పుతుంటే

ఎంత బాగుంటు౦ది.. 

పడుచు పిల్లకెంత బాగుంటు౦ది

అబ్బబ్బబ్బ.. ఎంత బాగుంటు౦ది.. 

పడుచు పిల్లకెంత బాగుంటు౦ది


ఫైటకొంగు జారుతు౦టే... 

దాన్ని పడుచువాడు సర్దుతుంటే.. 

నా సామిరంగా

ఫైటకొంగు జారుతు౦టే... 

దాన్ని పడుచువాడు సర్దుతుంటే 


చరణం 1 :


మసక మసక చీకటి పడితే.. 

ఆ చీకటిలో చినుకులు పడితే

మసక మసక చీకటి పడితే.. 

ఆ చీకటిలో చినుకులు పడితే


ఆ చీకటిలో ఎంత మైకమో.. 

ఆ చినుకులలో ఎంతటి సుఖమో

చీకటిలో ఎంత మైకమో.. 

ఆ చినుకులలో ఎంతటి సుఖమో


చిక్కుపడిన కౌగిలి.. 

చెబుతుందే ఓ చెలీ

ఎరుపేక్కిన చెక్కిలి.. 

చెబుతుందే ఓ చెలీ

తెల్లారిపోతుంటే 

తీపి గుర్తు కోస్తుంటే

బరువెక్కిన కళ్లతో 

మరు మల్లెలు చూస్తుంటే


ఎంత బాగుంటు౦ది.. 

ఎంత బాగుంటు౦ది

అరెరెరెరె.. ఎంత బాగుంటు౦ది.. 

పడుచు పిల్లకెంత బాగుంటు౦ది

పట్టుచీర కట్టుకుంటే.. 

ఆ చీర పట్టు తప్పుతుంటే.. 

నా సామిరంగా

ఫైటకొంగు జారుతు౦టే.. 

దాన్ని పడుచువాడు సర్దుతుంటే  


చరణం 2 :


పిల్లగాలి జోలపాడితే.. 

ఆ జోలలోన జ్వాల రేగితే

పిల్లగాలి జోలపాడితే.. 

జోలలోన జ్వాల రేగితే


ఆ గాలిలో ఎంత మైకమో.. 

ఆ జోలలో ఎంతటి సుఖమో

గాలిలో ఎంత మైకమో.. 

ఆ జోలలో ఎంతటి సుఖమో


తడి యారని పెదవులను 

అడగాలి.. ఓ చెలీ

చెరిగిపోని చిన్నెలే 

చెబుతాయి.. ఓ చెలీ

వయసు తిరిగ బడుతుంటే.. 

వలపు ఉలికి పడుతుంటే

ఒంటిలోని అణువణువూ 

ఉయ్యాలలూగుతుం౦టే 


ఎంత బాగుంటు౦ది.. 

ఎంత బాగుంటు౦ది

ఎంత బాగుంటు౦ది.. 

పడుచు పిల్లకెంత బాగుంటు౦ది

పట్టుచీర కట్టుకుంటే.. 

ఆ చీర పట్టు తప్పుతుంటే.. 

సామిరంగా

ఫైటకొంగు జారుతు౦టే.. 

దాన్ని పడుచువాడు సర్దుతుంటే 


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చక్కని చుక్క సరసకు రావే | Chakkani Chukka | Song Lyrics | Iddaru Mitrulu (1961)

చక్కని చుక్క సరసకు రావే చిత్రం: ఇద్దరు మిత్రులు (1961) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: ఆరుద్ర నేపధ్య గానం: పి. బి. శ్రీనివాస్, సుశీల పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు