RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

28, అక్టోబర్ 2025, మంగళవారం

భారత మాతకు జేజేలు | Bharatamathaku Jejelu | Song Lyrics | Badi Panthulu (1972)

భారత మాతకు జేజేలు



చిత్రం :  బడి పంతులు (1972)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : ఘంటసాల


పల్లవి :


భారత మాతకు జేజేలు 

బంగరు భూమికి జేజేలు

భారత మాతకు జేజేలు 

బంగరు భూమికి జేజేలు

ఆసేతుహిమాచల సస్యశ్యామల 

జీవధాత్రికి జేజేలు

ఆసేతుహిమాచల సస్యశ్యామల 

జీవధాత్రికి జేజేలు

భారత మాతకు జేజేలు 

బంగరు భూమికి జేజేలు


చరణం 1 :


త్రివేణి సంగమ పవిత్రభూమి...  

నాల్గు వేదములు పుట్టిన భూమి

నాల్గు వేదములు పుట్టిన భూమి

త్రివేణి సంగమ పవిత్రభూమి...  

నాల్గు వేదములు పుట్టిన భూమి

గీతామృతమును పంచిన భూమి...  

పంచశీల బోధించిన భూమి

పంచశీల బోధించిన భూమి


భారత మాతకు జేజేలు...  

బంగరు భూమికి జేజేలు


చరణం 2 :


శాంతిదూతగా వెలసిన బాపూ... 

జాతి రత్నమై వెలిగిన నెహ్రూ

శాంతిదూతగా వెలసిన బాపూ 

జాతి రత్నమై వెలిగిన నెహ్రూ

విప్లవ వీరులు.. వీర మాతలు …

విప్లవ వీరులు... వీర మాతలు …

ముద్దుబిడ్డలై మురిసే భూమి ..


భారత మాతకు జేజేలు...  

బంగరు భూమికి జేజేలు


చరణం 3 :


సహజీవనము సమభావనము...  

సమతా వాదము వేదముగా

సమతా వాదము వేదముగా

సహజీవనము సమభావనము...  

సమతా వాదము వేదముగా

ప్రజా క్షేమము ప్రగతి మార్గము...  

లక్ష్యములైన విలక్షణ భూమి

లక్ష్యములైన విలక్షణ భూమి


భారత మాతకు జేజేలు...  

బంగరు భూమికి జేజేలు

ఆసేతు హిమాచల సస్యశ్యామల 

జీవధాత్రికి జేజేలు

భారత మాతకు జేజేలు 

బంగరు భూమికి జేజేలు


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చక్కని చుక్క సరసకు రావే | Chakkani Chukka | Song Lyrics | Iddaru Mitrulu (1961)

చక్కని చుక్క సరసకు రావే చిత్రం: ఇద్దరు మిత్రులు (1961) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: ఆరుద్ర నేపధ్య గానం: పి. బి. శ్రీనివాస్, సుశీల పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు