RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

13, అక్టోబర్ 2025, సోమవారం

మరదల పిల్ల ఎగిరిపడకు | Maradala Pilla Egiripadaku | Song Lyrics | Gandikota Rahashyam (1969)

మరదల పిల్ల ఎగిరిపడకు



చిత్రం: గండికోట రహస్యం (1969)

సంగీతం: టి.వి. రాజు

గీతరచయిత: సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం: ఘంటసాల


పల్లవి:


మరదల పిల్ల ఎగిరిపడకు.. 

గడసరి పిల్ల ఉలికిపడకు

నా గెలుపే నీ గెలుపు కాదా.. 

నా గెలుపే నీ గెలుపు కాదా


మరదల పిల్ల ఎగిరిపడకు.. 

గడసరి పిల్ల ఉలికిపడకు

నా గెలుపే నీ గెలుపు కాదా.. 

నా గెలుపే నీ గెలుపు కాదా..


చరణం 1:


మొగిలిపువ్వులా సొగసుందీ..ఈ.. 

ముట్టుకుంటే గుబులౌతుంది

మొగిలిపువ్వులా సొగసుందీ..ఈ.. 

ముట్టుకుంటే గుబులౌతుంది

కోడెత్రాచులా వయసుంది.. 

అది కోరుకుంటే దిగులౌతుంది

కోడెత్రాచులా వయసుంది.. 

అది కోరుకుంటే దిగులౌతుంది

ఆ కోపంలో భలే అందముంది.. 

ఆ కోపంలో భలే అందముంది


మరదల పిల్ల ఎగిరిపడకు.. 

గడసరి పిల్ల ఉలికిపడకు

నా గెలుపే నీ గెలుపు కాదా.. 

నా గెలుపే నీ గెలుపు కాదా..


చరణం 2:


కసురుకుంటే కవ్విస్తానూ..ఊ.. 

విసురుకుంటే ఉడికిస్తాను

కసురుకుంటే కవ్విస్తానూ..ఊ.. 

విసురుకుంటే ఉడికిస్తాను

ముక్కు తాడు తగిలిస్తాను.. 

ఆ మూడుముళ్ళు వేసేస్తాను

ముక్కు తాడు తగిలిస్తాను.. 

ఆ మూడుముళ్ళు వేసేస్తాను

ఏనాడైనా నీ వాడ నేను.. 

ఏనాడైనా నీ వాడ నేను..


మరదల పిల్ల ఎగిరిపడకు.. 

గడసరి పిల్ల ఉలికిపడకు

నా గెలుపే నీ గెలుపు కాదా.. 

నా గెలుపే నీ గెలుపు కాదా..


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చీకటిలో కారు చీకటిలో | Cheekatilo Karu Cheekatilo | Song Lyrics | Manushulu Marali (1969)

చీకటిలో కారు చీకటిలో చిత్రం : మనుషులు మారాలి (1969) సంగీతం : కె.వి. మహదేవన్ గీతరచయిత : శ్రీ శ్రీ నేపధ్య గానం : ఘంటసాల పల్లవి : చీకటిలో కారు ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు