RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

27, జులై 2025, ఆదివారం

మధురాతి మధురం మన ప్రేమ | Madhurati Madhuram | Song Lyrics | Jeevitha Chakram (1971)

మధురాతి మధురం మన ప్రేమ మధువు



చిత్రం: జీవిత చక్రం (1971) 

సంగీతం: శంకర్ జైకిషన్ 

గీతరచయిత: ఆరుద్ర 

నేపధ్య గానం: ఘంటసాల, శారద 


పల్లవి: 


మధురాతి మధురం మన ప్రేమ మధువు 

మది నిండలేదు .. తమి తీరలేదు 

మధురాతి మధురం మన ప్రేమ మధువు 

మది నిండునోయి .. తమి చేరునోయి 


చరణం 1: 


నిను వీణ చేసి .. కొనగోట మీటి .. 

అనురాగ గీతాలే .. పలికించనా 

ఆ పాటలోని .. భావాలు నీవై .. 

నీలోని వలపు .. నాలోన నిలుపు 


మధురాతి మధురం మన ప్రేమ మధువు 

మది నిండలేదు .. తమి తీరలేదు 

మధురాతి మధురం మన ప్రేమ మధువు 

మది నిండునోయి .. తమి చేరునోయి 


చరణం 2: 


చిరు కోర్కెలేవో ..చిగురించ సాగే .. 

ఎదలోన ఆశా ... ఊరించ సాగే 

నీ ఆశలెన్ని .. విరబూయగానే .. 

పూమాల చేసి .. మెడలోన వేతు 


మధురాతి మధురం మన ప్రేమ మధువు 

మది నిండలేదు .. తమి తీరలేదు 

మధురాతి మధురం మన ప్రేమ మధువు 

మది నిండునోయి .. తమి చేరునోయి 


చరణం 3: 


నా గుడిలోనా .. గుడి కట్టినానూ 

గుడిలోన దేవతలా .. నివసించవా 

గుడిలోన ఉన్నా .. ఏద మీద ఉన్నా .. 

నీ దేవి .. నీ కొరకే .. జీవించునులే ..


మధురాతి మధురం మన ప్రేమ మధువు 

మది నిండలేదు .. తమి తీరలేదు 

మధురాతి మధురం మన ప్రేమ మధువు 

మది నిండునోయి .. తమి చేరునోయి 


- పాటల ధనుస్సు 


సువ్వీ సువ్వీ చూడే ఓలమ్మీ | Suvvi Suvvi Chude Olammi | Song Lyrics | Jeevitha Chakram (1971)

సువ్వీ సువ్వీ చూడే ఓలమ్మీ



చిత్రం :  జీవిత చక్రం (1971)

సంగీతం :  శంకర్ జైకిషన్

గీతరచయిత :  ఆరుద్ర

నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి :


హేయ్ పిల్లా.. ఎక్కడికెళ్తున్నావ్? 

హోయ్ హోయ్.. ఏమిటీ?

సువ్వీ సువ్వీ..  సువ్వీ సువ్వీ..

చూడే ఓలమ్మీ నువ్వే కావాలమ్మీ.. 

హోయ్ హోయ్ !

సువ్వీ సువ్వీ.. సువ్వీ సువ్వీ.. 

చూడే ఓలమ్మీ నువ్వే కావాలమ్మీ..


సువ్వీ సువ్వీ..  సువ్వీ సువ్వీ.. 

చూడర చిన్నోడా నువ్వే కావాలిరా.. 

హాయ్

సువ్వీ సువ్వీ..  సువ్వీ సువ్వీ.. 

చూడర చిన్నోడా నువ్వే కావాలిరా.. 

హోయ్ హోయ్


చరణం 1 :


ఊగే కొమ్మల్లోన నీవే సాగే మబ్బుల్లోన 

నీవే ఎగిరే గువ్వల్లోన నీవే

అదిరే గుండెల్లోన నీవే..   

అరెరే కింద మీదా నీవే..  ఆ..ఆ....


సువ్వీ సువ్వీ.. సువ్వీ సువ్వీ.. 

చూడర చిన్నోడా నువ్వే కావాలిరా..  

అహ...

సువ్వీ సువ్వీ.. సువ్వీ సువ్వీ.. 

చూడే ఓలమ్మీ నువ్వే కావాలమ్మీ


చరణం 2 :


అసలే నా వయసూ లేత.. 

ఆపై చలిగాలి కోత

అందుకే రాశాడు ఆ తాత..  

ఇద్దరం కలుసుకునే రాత

ఇక పై మన బ్రతుకే మోత..  ఆ... ఆ.....


యెహ్.. సువ్వీ సువ్వీ.. సువ్వీ సువ్వీ.. 

చూడే ఓలమ్మీ నువ్వే కావాలమ్మీ..

సువ్వీ సువ్వీ..  సువ్వీ సువ్వీ.. 

చూడర చిన్నోడా నువ్వే కావాలిరా..  

అహ...


చరణం 3 :


నీవే అనార్కలివైతే...  

నేనే సలీంబాబు నౌతా

నీవే షాజహానువైతే ... 

నేనే ముంతాజునౌతా...

నీకో తాజ్ మహల్ కడతా


సువ్వీ సువ్వీ.. సువ్వీ సువ్వీ.. 

చూడే ఓలమ్మీ నువ్వే కావాలమ్మీ..

సువ్వీ సువ్వీ.. సువ్వీ సువ్వీ.. 

చూడర చిన్నోడా నువ్వే కావాలిరా.. 

అహ...


సువ్వీ సువ్వీ.. సువ్వీ సువ్వీ.. 

చూడే ఓలమ్మీ నువ్వే కావాలమ్మీ..

సువ్వీ సువ్వీ..  సువ్వీ సువ్వీ.. 

చూడర చిన్నోడా నువ్వే కావాలిరా.. 

అహ...


యెహ్ అమ్మి వెళ్ళిపోతున్నావా...  

మళ్ళి వస్తావా.. ఆహా...


- పాటల ధనుస్సు 


21, జులై 2025, సోమవారం

విన్నపాలు వినవలె వింతవింతలు | Vinnapalu Vinavale Vithavintalu | Song Lyrics | Annamayya (1997)

విన్నపాలు వినవలె వింతవింతలు



చిత్రం : అన్నమయ్య (1997)

సంగీతం : ఎం ఎం కీరవాణి 

రచన : అన్నమాచార్య సంకీర్తన 

గానం : ఎస్.పి.బాలు, శ్రీలేఖ, రేణుక 


పల్లవి :


విన్నపాలు వినవలె వింతవింతలు

విన్నపాలు వినవలె వింతవింతలు

పన్నాగపు దోమతెర పైకెత్తవేలయ్య


విన్నపాలు వినవలె వింతవింతలు

పన్నాగపు దోమతెర పైకెత్తవేలయ్య

విన్నపాలు వినవలె వింతవింతలు


చరణం 1:


కంటి శుక్రవారము గడియాలేడింట

అంటి అలమేలుమంగా 

అండనుండే స్వామిని

కంటి శుక్రవారము గడియాలేడింట

అంటి అలమేలుమంగా 

అండనుండే స్వామిని కంటి


చరణం 2:


పిడికిటి తలంబ్రాల పెండ్లి కూతురు

కొంత పెడమరిలి నవ్వినీ పెండ్లి కూతురు

పిడికిటి తలంబ్రాల పెండ్లి కూతురు

కొంత పెడమరిలి నవ్వినీ పెండ్లి కూతురు


చరణం 3:


పేరుగల జవరాలి పెండ్లి కూతురు

పెద్ద పేరులా ముత్యాలమేడా పెండ్లి కూతురు

పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు

పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు

విభు పేరు ఉచ్చ సిగ్గుపడి పెండ్లి కూతురు


చరణం 4:


అలరా చంచలమైన ఆత్మలందుండ 

నీ అలవాటు చేసేని ఉయ్యాల

అలరా చంచలమైన ఆత్మలందుండ 

నీ అలవాటు చేసేని ఉయ్యాల

పలుమారు ఉచ్వాస పవనమందుండ 

నీ భావంబు తెలిపిని ఉయ్యాల

పలుమారు ఉచ్వాస పవనమందుండ 

నీ భావంబు తెలిపిని ఉయ్యాల


ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల

ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల


- పాటల ధనుస్సు 


18, జులై 2025, శుక్రవారం

కంటి చూపు చెపుతోంది | Kantichupu chebuthondi | Song Lyrics | Jeevitha Chakram (1971)

కంటి చూపు చెపుతోంది



చిత్రం :  జీవిత చక్రం (1971)

సంగీతం :  శంకర్ జైకిషన్

గీతరచయిత :  ఆరుద్ర

నేపధ్య గానం : శారద


పల్లవి :


కంటిచూపు చెపుతోంది.. 

కొంటెనవ్వు చెపుతోంది

మూగమనసులో మాట.. ఓ రాజా

కంటిచూపు చెపుతోంది..  

కొంటెనవ్వు చెపుతోంది

మూగమనసులో మాట.. ఓ రాజా


ఆశలూ.. దాచకూ... 

ఆశలూ.. దాచకూ


కంటి చూపు చెపుతోంది.. 

కొంటెనవ్వు చెపుతోంది

మూగమనసులో మాట.. ఓ రాజా

ఓ.....  రాజా


చరణం 1 :


ఆడపిల్లా పూల తీగె.. 

ఒక్కలాగె చక్కనైనవి

ఆడపిల్లా పూల తీగె.. 

ఒక్కలాగె చక్కనైనవి

ఆడపిల్లా.. పూలతీగే ఒక్కలాగే..  

అండ కోరుకుంటాయి.. ఓ.. 


అందమైన జవరాలు 

పొందుకోరి వచ్చింది 

ఎందుకలా చూస్తావు.. ఓ రాజా?

స్నేహమూ చేయవా?.. 

స్నేహమూ చేయవా?.. 


కంటి చూపు చెపుతోంది.. 

కొంటెనవ్వు చెపుతోంది

మూగమనసులో మాట.. ఓ రాజా

ఓ.....  రాజా


చరణం 2 :


కొమ్మమీద గోరువంక 

రామచిలుక జోడు కూడె

కొమ్మమీద గోరువంక 

రామచిలుక జోడు కూడె

కొమ్మమీద గోరువంక రామచిలుక 

ముద్దుపెట్టుకున్నాయి.. ఓయ్


మెత్తనైన మనసు నాది 

కొత్త చిగురు వేసింది

మత్తులోన మునిగింది.. ఓ రాజా..

మైకమూ పెంచుకో.. 

మైకమూ పెంచుకో


కంటి చూపు చెపుతోంది.. 

కొంటెనవ్వు చెపుతోంది

మూగమనసులో మాట.. ఓ రాజా

ఓ.....  రాజా


- పాటల ధనుస్సు 


14, జులై 2025, సోమవారం

సుడిగాలిలోన దీపం | Sudigalilona Deepam | Song Lyrics | Jeevitha Chakram (1971)

సుడిగాలిలోన దీపం



చిత్రం :  జీవిత చక్రం (1971)

సంగీతం :  శంకర్ జైకిషన్

గీతరచయిత :  ఆరుద్ర

నేపధ్య గానం : ఘంటసాల 


పల్లవి :


సుడిగాలిలోన దీపం.. 

కడవరకు వెలుగునా

సుడిగాలిలోన దీపం..

కడవరకు వెలుగునా

సుడిగాలిలోన దీపం..  


చరణం 1 :


లోకాన పన్నీరు జల్లేవులే.. 

నీకేమొ కన్నీరు మిగిలిందిలే

పెరవారి గాయాలు మాన్చేవులే.. 

నీలోన పెనుగాయ మాయేనులే

నీలోన పెనుగాయ మాయేనులే

అణగారిపోవు ఆశ.. 

నీవల్లనే  ఫలించె 


సుడిగాలిలోన దీపం.. 

కడవరకు వెలుగునా..

సుడిగాలిలోన దీపం.. 


చరణం 2 :


ఒక కన్ను నవ్వేటి వేళలో.. 

ఒక కన్ను చమరించసాగునా?

ఒకచోట రాగాలు వికసించునా.. 

ఒక చోట హృదయాలు 

ద్రవియించునా ?

ఒకచోట హృదయాలు 

ద్రవియించునా?


ఎనలేని ప్రాణదానం.. 

ఎద బాధ తీర్చునా?..  

సుడిగాలిలోన దీపం.. 

కడవరకు వెలుగునా

సుడిగాలిలోన దీపం


- పాటల ధనుస్సు 


13, జులై 2025, ఆదివారం

జ్యోతిలక్ష్మి చీరకట్టింది | Jyothilakshmi Cheerakattindi | Song Lyrics | Sardar Paparayudu (1980)

జ్యోతిలక్ష్మి చీరకట్టింది



చిత్రం :  సర్దార్ పాపారాయుడు (1980)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  దాసరి నారాయణరావు 

నేపధ్య గానం :  ఎస్. జానకి 


పల్లవి :


నమస్కారమండి... ఆయ్.. అవునండి

అయ్యబాబోయ్... ఆ ఈలలెందుకండి.. వ

చ్చేశానుగా

మొన్నీ మధ్య మా బావగారబ్బాయి 

పెళ్ళికి బెజవాడ ఎల్లానండి

"వాయించరా సచ్చినోడా ఊపు కావాలి"

ఇల్లంటే ఇరుగ్గా ఉంటానని 

మనోరమ ఓటేల్ కెళ్ళానండి

రూము కావాలి అన్నాను...

డబలా? సింగలా? అన్నాడు.. 

డబలే అన్నాను

ఏసియా? నాన్ ఏ.సి.యా? అన్నాడు... 

ఏ.సి.యే అన్నాను

పేరు అన్నాడు... "జ్యోతిలక్ష్మి" అన్నాను


అనగానే గబుక్కున చూశాడు.. 

గుట్టుక్కున నవ్వాడు...

గబుక్కున చూశాడు.. గుట్టుక్కున నవ్వాడు..

అతుక్కున లేచాడు.. పుటుక్కున విరిచాడు

అతుక్కున లేచాడు.. పుటుక్కున విరిచాడు 


గుర్కా రామ్ సింగ్.. 

ఆపరేటర్ అజిత్సింగ్

కిళ్ళీకొట్టు కిషన్ సింగ్.. 

పేపర్ స్టాల్ ధారాసింగ్

ఒగుర్చుకుంటూ వచ్చారు.. 

ఆయాసంతో అరిచారు

ఒగుర్చుకుంటూ వచ్చారు.. 

ఆయాసంతో అరిచారు

ఏమని అరిచారో తెలుసా ....


జ్యోతిలక్ష్మి చీరకట్టింది.. 

పాపం చీరకే సిగ్గేసింది...

జ్యోతిలక్ష్మి చీరకట్టింది.. 

పాపం చీరకే సిగ్గేసింది...

అయ్యో... బొట్టుకే భయమేసింది.. 

ఊరంతా హోరెత్తింది...


బొట్టుకే భయమేసింది.. 

ఊరంతా హోరెత్తింది...


అని చెప్పి గోల గోల చేసి...

చివరికి రూము నెంబరు 

నూట పదకొండు ఇచ్చాడు

తీరా తలుపు తెరిచి చూస్తే ..


చరణం 1 :


మంచం పక్కన పగిలిన... 

గాజు ముక్కలు...

మంచం క్రింద నలిగిన... 

మల్లెమొగ్గలు

మంచం మీద మిగిలిన... 

ఆకువక్కలు

మంచం మీద చాటున వొలికిన... 

పాల చుక్కలు.. పాల చుక్కలు...

కంగారు పడి ఏమిటా అని అడిగాను


ఎవరో కొత్తగా పెళ్ళి చేసుకున్న 

దంపతులు...

మూడు నిద్దర్లు చేసి వెళ్ళారన్నారు...

ఆ నిద్దర్లు నాకెప్పుడా అని...

ఆ మంచం మీదే పడుకున్నాను..

పడుకోగానే...


ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ మని ఫోన్... 

డర్ డర్ డర్ మని బెల్లు

ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ మని ఫోన్... 

డర్ డర్ డర్ మని బెల్లు


ధన్ ధన్ ధన్ మని తలుపు.. 

ధన్ ధన్ ధన్ మని తలుపు

రా రా రా రమ్మని పిలుపు... 

రా రా రా రమ్మని పిలుపు

ఏమిటా అని తలుపు తీశాను...

తియ్యగానే...


ఫస్టుఫ్లోరు పాపయ్య.. 

రెండో ఫ్లోరు రంగయ్య

ఆయ్.. మూడోఫ్లోరు ముత్తయ్య.. 

లిఫ్ట్ బాయ్ లింగయ్య

ఒగుర్చుకుంటూ వచ్చారు.. 

ఆయాసంతో అరిచారు...

ఒగుర్చుకుంటూ వచ్చారు.. 

ఆయాసంతో అరిచారు...

ఏమని?


జ్యోతిలక్ష్మి చీరకట్టింది.. 

పాపం చీరకే సిగ్గేసింది...

జ్యోతిలక్ష్మి చీరకట్టింది.. 

పాపం చీరకే సిగ్గేసింది...

అయ్యో.. బొట్టుకే భయమేసింది.. 

ఊరంతా హోరెత్తింది..

బొట్టుకే భయమేసింది.. 

ఊరంతా హోరెత్తింది...


చరణం 2 :


ఆ తరువాత ఎలాగూ 

మా ఇంటికి వెళ్ళిపోయాను

తీరా ఇంటికి వెళితే...

గుమ్మానికి మామిడి తోరణాలు...

ఇళ్ళంతా మనుషుల... తిరనాళ్ళు

గదిలో కొత్తవి ఆభరణాలు... 

గదిలో కొత్తవి ఆభరణాలు

చూసి.. చూడని.. నవ్వుల బాణాలు...


కంగారు పడిపోయి అండి... 

ఏమిటా అని అడిగాను

ఎవరో నన్ను పెళ్ళి చేసుకోవడానికి 

పెళ్ళి చూపులకు ఒచ్చానన్నారు...

అతను చూస్తాడు త్వరగా రమ్మని.. 

నన్ను ముస్తాబు చేసి కూర్చోబెట్టారు


కూర్చో గానే ...

పెళ్ళికొడుకు తమ్ముడు... 

తమ్ముడుగారి తండ్రి

హెయ్... తండ్రిగారి తాత... 

ఆ తాతగారి మనవడు


అరుచుకుంటూ లేచారు.. 

విరుచుకుంటూ అరిచారు

అరుచుకుంటూ లేచారు.. 

విరుచుకుంటూ అరిచారు

ఏమనో తెలుసా?


జ్యోతిలక్ష్మి చీరకట్టింది.. 

పాపం చీరకే సిగ్గేసింది

అయ్యో... జ్యోతిలక్ష్మి చీరకట్టింది... 

పాపం చీరకే సిగ్గేసింది

అయ్యో... బొట్టుకే భయమేసింది... 

ఊరంతా హోరెత్తింది..

బొట్టుకే భయమేసింది.. 

ఊరంతా హోరెత్తింది...


అని కోపంగా ఎళ్ళిపోయారు...

ఆ అందరి కోసం అలా ఉండమంటారా...

ఇలా చీరకట్టుకోమంటారా...


- పాటల ధనుస్సు 


10, జులై 2025, గురువారం

శేషశైలావాస శ్రీ వే౦కటేశా | Sheshasailavasa Sri Venkatesha | Song Lyrics | Sri Venkateswara Mahatyam (1960)

శేషశైలావాస శ్రీ వే౦కటేశా



చిత్రం :  శ్రీ వే౦కటేశ్వర మహత్య౦ (1960)

సంగీతం :  పెండ్యాల

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  ఘంటసాల   


పల్లవి :


శేషశైలావాస శ్రీ వే౦కటేశా.. 

శయని౦చు మా అయ్య 

శ్రీ చిద్విలాసా..

శేషశైలావాస శ్రీ వే౦కటేశా.. 

శయని౦చు మా అయ్య 

శ్రీ చిద్విలాసా 


చరణం 1 :


శ్రీదేవి వ౦కకు 

చిలిపిగా చూడకు

అలమేలు మ౦గకు 

అలుక రానీయకు

శ్రీదేవి వ౦కకు 

చిలిపిగా చూడకు

అలమేలు మ౦గకు 

అలుక రానీయకు


ముద్దు సతులీద్దరిని 

ఇరువైపులా జేర్చి

ముద్దు సతులీద్దరిని 

ఇరువైపులా జేర్చి

మురిపి౦చి లాలి౦చి 

ముచ్చటల తేల్చి


శేషశైలావాస శ్రీ వే౦కటేశా...


చరణం 2 :


పట్టుపానుపు పైన 

పవళి౦చర స్వామి

పట్టుపానుపు పైన 

పవళి౦చర స్వామి

భక్తుల౦దరు నిన్ను 

ప్రస్తుతి౦చి పాడ


చిరు నగవులొలుకుచూ 

నిదురి౦చు నీ మోము

చిరు నగవులొలుకుచూ 

నిదురి౦చు నీ మోము

కరువు తీరా కా౦చి 

తరియి౦తుము మేము


శేషశైలావాస శ్రీ వే౦కటేశా..

శయని౦చు మా అయ్య 

శ్రీ చిద్విలాసా


- పాటల ధనుస్సు 


మంచమేసి దుప్పటేసి | Manchamesi Duppatesi | Song Lyrics | Kondaveeti Raja (1986)

మంచమేసి దుప్పటేసి



చిత్రం : కొండవీటి రాజా (1986)

సంగీతం : చక్రవర్తి

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : బాలు, జానకి 


పల్లవి :


తననం తననం తననం తననం... 

తననం తననం తా

తననం తననం తననం తననం... 

తననం తననం తా

మంచమేసి దుప్పటేసి 

మల్లెపూలు జల్లాను రారా రారా.. 

తనన తననం

చిన్నచీర కట్టాను 

సన్నజాజు లెట్టాను రారా రారా.. 

తనన తననం


దిండు ఎంత మెత్తనో 

మంచ మెంత గట్టిదో

చుక్కలోంక చూసుకుంటూ 

లెక్కబెట్టుకుందాము రారా


ఆకలేసి దప్పికేసి 

అందమంటూ వచ్చాను రావే రావే... 

తనన తననం... 

ఆకులోన సున్నవేసి 

పోకచెక్కలిస్తాను రావే రావే... 

తనన తననం


పండు ఎంత తీయనో 

పాలు ఎంత చిక్కనో

సోకులోంక చూసుకుంటూ 

సొమ్మసిల్లిపోదాము రావే


చరణం 1 :


నిన్ను చూడకుంటే 

నాకు పిచ్చిగుంటది...

తనన తననం..

నిన్ను చూస్తే వయసు 

నన్ను మెచ్చుకుంటది ...

తనన తననం...


కౌగిలింత కోరలేక అలిసిపోతిని

రాతిరంత కునుకులేక రగిలిపోతిని

కసి కసి ఈడు కమ్ముకొస్తే ... 

కంటిని రెప్పే కాటు వేస్తే

ఎట్టా ఆగను చలిలో విరులు ... 

ఎట్టా అడగను అసలు కొసరు

సాగాలి ... నీ జోరు


ఆకలేసి దప్పికేసి 

అన్నమంటూ వచ్చాను రావే రావే

మంచమేసి దుప్పటేసి 

మల్లెపూలు జల్లాను రారా.. రారా


చరణం 2 :


పెరుగుతున్న సోకుమీద 

మీగడున్నది... తనన తననం...

పెదవి తాకి ముద్దులాగ 

మారుతున్నది... తనన తననం..


చీకటింట చిట్టిగుండె 

కొట్టుకున్నది

వాలుకంట వలపుమంట 

అంటుకున్నది


జళ్ళో పువ్వు జావళి పాడే ....

ఒళ్ళో ఒళ్ళో ఒత్తిడి సాగే

ఎంత తీరినా ఎదలో సొదలే ...

వింతవింతగా జరిగే కతలే

మోగాలి....  తొలితాళం 


మంచమేసి దుప్పటేసి 

మల్లెపూలు జల్లాను రారా రారా.. 

తనన తననం..

ఆకులోన సున్నవేసి 

పోకచెక్కలిస్తాను రావే రావే.. 

తనన తననం..


దిండు ఎంత మెత్తనో 

మంచమెంత గట్టిదో

సోకులోంక చూసుకుంటూ 

సొమ్మసిల్లిపోదాము రావే


తననం తననం తననం తననం... 

తననం తననం తా

తననం తననం తననం తననం... 

తననం తననం తా


- పాటల ధనుస్సు 


నా కోక బాగుందా | Naakoka Bagunda | Song Lyrics | Kondaveeti Raja (1986)

నా కోక బాగుందా



చిత్రం : కొండవీటి రాజా (1986)

సంగీతం : చక్రవర్తి

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : బాలు, సుశీల 


పల్లవి :


నా కోక బాగుందా...  

హోయ్..హోయ్..హోయ్

నా రైక బాగుందా... 

హోయ్..హోయ్..హోయ్

నా కోక బాగుందా.. 

నా రైక బాగుందా

కోకారైకా కలిసిన వంటి 

సోకు బాగుందా


నీ కోక నచ్చింది... 

హోయ్..హోయ్..హోయ్

నీ రైక నచ్చింది... ఆ.. ఆ.. ఆ

నీ కోక నచ్చింది... 

నీ రైక నచ్చింది

కోకా రైకా కలవని చోట  

సోకు నచ్చింది


నా కోక బాగుందా.. 

నా రైక బాగుందా


చరణం 1 :


చెయ్యెస్తే చెదిరే కోకా... 

కన్నేస్తే బిగిసే రైకా

ఆ పైన ఏమౌతుందో అంటుకోకా... 


నీ సోకే నెయ్యని కోకా... 

నీ సిగ్గే తొడగని రైకా

ముద్దంటా మూటలు కట్టి 

దాచుకోకా


ఈ ప్రేమ తందనాలలో... ఓ.. ఓ..

ఈ జంట బంధనాలలో... ఓ.. ఓ..

చుట్టాలై చూపు చూపు... 

చుక్కాడే రేపు మాపు

మాపట్లో మావిడి పిందె ఇవ్వమాకా


డరిడారిడరిడా... లాలాలలాలాలా

కోకా రైకా కలవని చోట  

సోకు నచ్చింది


చరణం 2 :


ఇరుకుల్లో నీ వయ్యారాం... 

నడకల్లో జడకోలాటం

చాన్నాల్లీ ఆరాటాలు పెంచుకోకా


కళ్ళల్లో కసి ఉబలాటం... 

కవ్వించే నీ చెలగాటం

ఈ చాటు పేరంటాలు ఆడుకోకా


నీ తీపి సోయగాలలో.. 

నీ వంతు కానీదేమిటో

వాటెస్తా వొళ్ళు వొళ్ళు.. 

వేసేస్తే మూడే ముళ్లు

కౌగిట్లో గుప్పెడు మనసు 

గుంజుకుంటా


నా కోక బాగుందా...  

హోయ్..హోయ్..హోయ్

నా రైక బాగుందా... 

హోయ్..హోయ్..హోయ్

నా కోక బాగుందా.. 

నా రైక బాగుందా

కోకారైకా కలిసిన వంటి 

సోకు బాగుందా


నీ కోక నచ్చింది... 

హోయ్..హోయ్..హోయ్

నీ రైక నచ్చింది... ఆ.. ఆ.. ఆ

నీ కోక నచ్చింది... 

నీ రైక నచ్చింది

కోకా రైకా కలవని చోట  

సోకు నచ్చింది


నా కోక బాగుందా.. 

నా రైక బాగుందా


- పాటల ధనుస్సు 


చమకు చమకు చాం చుట్టుకో | Chamaku Chamaku Cham | Song Lyrics | Kondaveeti Donga (1990)

చమకు చమకు చాం చుట్టుకో 



చిత్రం: కొండవీటి దొంగ (1990)

సంగీతం: ఇళయరాజా

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: బాలు, చిత్ర


పల్లవి:


చిక్ చిక్ చిక్ చిక్... చిక్ చిక్

అరె చమకు చమకు చాం 

చుట్టుకో చుట్టుకో 

చాన్సు దొరికెరో హొయ్య

జనకు జనకు చాం 

పట్టుకో పట్టుకో 

చంపె దరువులే వెయ్య


హొయ్యారే హొయ్య హొయ్య 

హొయ్ వయ్యారం సయ్యందయ్యా

హొయ్యారే హొయ్య హొయ్య 

హొయ్ అయ్యారే తస్సాదియ్యా


చాం చాం చకచాం చకచాం చాం 

త్వరగా ఇచ్చేయ్ నీ లంచం

చాం చాం చకచాం చకచాం చాం 

చొరవే చేసెయ్ మరి కొంచెం


అరె చమకు చమకు చాం 

చుట్టుకో చుట్టుకో 

చాన్సు దొరికెరో హొయ్య

హే.. చనకు చనకు చాం 

పట్టుకో పట్టుకో 

చంపె దరువులే వెయ్య


చరణం 1:


నాగ స్వరములా లాగిందయ్యా 

తీగ సొగసు చూడయ్యా

కాగు పొగరుతో రేగిందయ్యా 

కోడె పడగ కాటెయ్యా

మైకం పుట్టే రాగం వింటూ 

సాగేదెట్టాగయ్యా

మంత్రం వేస్తే కస్సు బుస్సు 

ఇట్టే ఆగాలయ్యా

బంధం వేస్తావా అల్లే అందంతో

పందెం వేస్తావా తుళ్ళే పంతంతో

అరె కైపే రేపే కాటే వేస్తా ఖరారుగా

కథ ముదరగ..


అరె చమకు చమకు చాం 

చుట్టుకో చుట్టుకో 

చాన్సు దొరికెరో హొయ్య

హే.. చనకు చనకు చాం 

పట్టుకో పట్టుకో 

చంపె దరువులే వెయ్య


చరణం 2:


అగ్గి జల్లులా కురిసే వయసే 

నెగ్గలేకపోతున్నా

ఈత ముల్లులా యదలో దిగెరో 

జాతి వన్నెదీ జాణ

అంతో ఇంతో సాయం చెయ్య 

చెయ్యందియ్యాలయ్యా

తియ్యని గాయం మాయం చేసే 

మార్గం చూడాలమ్మా

రాజీకొస్తాలే కాగే కౌగిళ్ళో

రాజ్యం ఇస్తాలే నీకే నా ఒళ్ళో

ఇక రేపోమాపో ఆపే 

ఊపే హుషారుగా

పదపదమని..


అరె చమకు చమకు చాం 

చుట్టుకో చుట్టుకో 

చాన్సు దొరికెరో హొయ్య

జనకు జనకు చాం 

పట్టుకో పట్టుకో 

చంపె దరువులే వెయ్య


హొయ్యారే హొయ్య హొయ్య 

హొయ్ వయ్యారం సయ్యందయ్యా

హొయ్యారే హొయ్య హొయ్య 

హొయ్ అయ్యారే తస్సాదియ్యా

అరె చమకు చమకు చాం 

చుట్టుకో చుట్టుకో 

చాన్సు దొరికెరో హొయ్య

హే.. చనకు చనకు చాం 

పట్టుకో పట్టుకో 

చంపె దరువులే వెయ్య


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు