RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

14, ఫిబ్రవరి 2022, సోమవారం

నీ మాట వింటే మదిలో | Nee Mata Vinte madilo | Song Lyrics | Kumara Raja (1978)

నీ మాట వింటే మదిలో



చిత్రం: కుమారరాజా (1978) 

సంగీతం: కె.వి. మహదేవన్ 

గీతరచయిత: వేటూరి 

నేపథ్య గానం: రామకృష్ణ, సుశీల 



పల్లవి : 


నీ మాట వింటే మదిలో గుడి గంటగా పలికింది

నీ జంట ఒంటరి ఎదలో చలిమంటగా రగిలింది

ఇది జోడు వీణల రాగం.. హృదయాల కుసుమ పరాగం

ఇది జోడు వీణల రాగం.. హృదయాల కుసుమ పరాగం



చరణం 1 :


కలలెన్ని నే కన్నానో.. నాకున్న కన్నులు రెండైనా

అలలెన్ని చెలరేగాయో.. ఏరంటి వయసే ఒకటైన

కలలెన్ని నే కన్నానో.. నాకున్న కన్నులు రెండైనా

అలలెన్ని చెలరేగాయో.. ఏరంటి వయసే ఒకటైన 


కడలేని కడలీ మనసు.. కలిసేటి నది నీ వయసు

కలగన్న కలయిక లోనే.. కరగాలి నీవు నేను

కడలేని కడలీ మనసు.. కలిసేటి నది నీ వయసు

కలగన్న కలయిక లోనే.. కరగాలి నీవు నేను


ఇది రెండు తనువుల ప్రాణం.. ఒకటైన జీవన రాగం

ఇది రెండు తనువుల ప్రాణం.. ఒకటైన జీవన రాగం 



నీ మాట వింటే మదిలో గుడి గంటగా పలికింది

నీ జంట ఒంటరి ఎదలో చలిమంటగా రగిలింది

ఇది జోడు వీణల రాగం.. హృదయాల కుసుమ పరాగం

ఇది జోడు వీణల రాగం.. హృదయాల కుసుమ పరాగం



చరణం 2 :



నీలాల నింగిలో చుక్కా ఏనాడు చెక్కిట పొడిచేను

ఆ తారలే తలంబ్రాలై.. ఏ రోజు తలపై కురిసేను

నీలాల నింగిలో చుక్కా ఏనాడు చెక్కిట పొడిచేను

ఆ తారలే తలంబ్రాలై.. ఏ రోజు తలపై కురిసేను


తొలి పొంగు కోరికలన్నీ మన కొంగు ముడిపెడుతుంటే

ఇల దాటి.. జాబిలి దాటి.. కలవాలి నీవు నేను

తొలి పొంగు కోరికలన్నీ మన కొంగు ముడిపెడుతుంటే

ఇల దాటి.. జాబిలి దాటి.. కలవాలి నీవు నేను


ఇది కాలమాగిన సమయం.. ఏ లోకమెరుగని ప్రణయం

ఇది కాలమాగిన సమయం.. ఏ లోకమెరుగని ప్రణయం


నీ మాట వింటే మదిలో గుడి గంటగా పలికింది

నీ జంట ఒంటరి ఎదలో చలిమంటగా రగిలింది

ఇది జోడు వీణల రాగం.. హృదయాల కుసుమ పరాగం

ఇది జోడు వీణల రాగం.. హృదయాల కుసుమ పరాగం


- పాటల ధనుస్సు 

అల్లో మల్లో ఆకాశంలో | Allo Mallo Akasam lo | Song Lyrics | Atmeeyudu (1977)

అల్లో మల్లో ఆకాశంలో



చిత్రం: ఆత్మీయుడు (1977) 

సంగీతం: జె.వి. రాఘవులు 

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ 

నేపధ్య గానం: బాలు, సుశీల 


పల్లవి: 


అల్లో మల్లో..ఓ.. ఆకాశంలో..ఓ.. 

చల్లని వెన్నెల్లో.. 

ఆశలెన్నో.. ఊసులెన్నో అల్లరి కన్నుల్లో.. 

నీ అల్లరి కన్నుల్లో.. 


అల్లో మల్లో..ఓ.. ఆకాశంలో..ఓ.. 

చల్లని వెన్నెల్లో.. 

ఆకలెంతో.. దూకుడెంతో.. పోకిరి కన్నుల్లో.. 

నీ పోకిరి కన్నుల్లో.. 


చరణం 1: 


ఎర్రని సిగ్గు ఎగబాకింది నున్నని బుగ్గల్లో.. 

చిలిపి కోరికా చెడుగుడాడినది జిలిబిలి చూపుల్లో..ఓ.. 

ఎర్రని సిగ్గు ఎగబాకింది నున్నని బుగ్గల్లో.. 

చిలిపి కోరికా చెడుగుడాడినది జిలిబిలి చూపుల్లో.. 


దోబూచాడే నవ్వుల్లో.. తొందర తెలిపే పెదవుల్లో.. 

దోబూచాడే నవ్వుల్లో.. తొందర తెలిపే పెదవుల్లో.. 

తొణుకుతున్నది తొలకరి వలపు.. ముద్దుల ముడుపుల్లో..ఓ..ఓ.. 


అల్లోమల్లో..ఓ.. ఆకాశంలో..ఓ.. 

చల్లని వెన్నెల్లో.. 

ఆశలెన్నో.. ఊసులెన్నో అల్లరి కన్నుల్లో.. 

నీ అల్లరి కన్నుల్లో.. 


చరణం 2: 


తొలి హాయి చూడాలి.. తొలి రేయిలో.. 

తొలి ముద్ర వెయ్యాలి.. తొలి ముద్దులో.. 

తొలి హాయి చూడాలి.. తొలి రేయిలో.. 

తొలి ముద్ర వెయ్యాలి.. తొలి ముద్దులో.. 


మరుపొద్దు పొడవాలి.. నీ మోములో..ఓ.. 

మరుపొద్దు పొడవాలి.. నీ మోములో..ఓ.. 

మైమరచిపోవాలి.. ఆ గోములో.. ఆ గోములో.. 


అల్లోమల్లో..ఓ.. ఆకాశంలో..ఓ.. 

చల్లని వెన్నెల్లో.. 

ఆకలెంతో.. దూకుడెంతో.. పోకిరి కన్నుల్లో.. 

నీ పోకిరి కన్నుల్లో.. 


చరణం 3: 


విరబుయ్యాలి మోజుల జాజులు.. 

వెచ్చని కౌగిళ్ళో... 

ఆ వెచ్చదనాలు వెంటపడాలి.. 

ఒంటరి వేళల్లో..ఓ.. 

విరబుయ్యాలి మోజుల జాజులు.. 

వెచ్చని కౌగిళ్ళో... 

ఆ వెచ్చదనాలు వెంటపడాలి.. 

ఒంటరి వేళల్లో.. 


నలిగిన పువ్వుల గుసగుసలో.. 

నాలుగు కన్నుల అలసటలో.. 

నలిగిన పువ్వుల గుసగుసలో.. 

నాలుగు కన్నుల అలసటలో.. 

ఇద్దరి ఒద్దిగ కనిపించాలి...

పొద్దుటి వెలుగుల్లో...ఓ.. 


అల్లో మల్లో..ఓ.. ఆకాశంలో..ఓ.. 

చల్లని వెన్నెల్లో.. 

ఆశలెన్నో.. ఊసులెన్నో.. 

అల్లరి కన్నుల్లో.. 

ఆకలెంతో.. దూకుడెంతో.. 

పోకిరి కన్నుల్లో.. 

నీ అల్లరి కన్నుల్లో.. 

నీ పోకిరి కన్నుల్లో..


- పాటల ధనుస్సు 



చూశానే ఓలమ్మీ చూశానే | Chusane Olammi Chusane | Song Lyrics | Bhale Dongalu (1976)

చూశానే.. ఓలమ్మీ చూశానే



చిత్రం :  భలే దొంగలు (1976)

సంగీతం :  సత్యం

గీతరచయిత :  ఆరుద్ర

నేపధ్య గానం :  బాలు, సుశీల




పల్లవి:


చూశానే.. ఓలమ్మీ చూశానే..

వేశానే.. కన్ను వేశానే..

ఇన్నాళ్ళు నాకోసం దాచిన అందం నీలో...


చూశావా.. ఓరబ్బీ చూశావా..

వేశావా.. కన్ను వేశావా..

ఇన్నాళ్ళు నీకోసం దాచిన అందం నాలో

చూశావా.. ఓరబ్బీ చూశావా..

చూశానే.. ఓలమ్మీ చూశానే..


చరణం 1:


కసి గోలిపే నీ చూపుల తీరు.. ఊ ఊ ఊ... ఆహహా...

ఉసి గోలిపే నీ ఊపుల జోరు.. హహా...హహా

నీ కొంగైనా ఆ ఆ తగలక ముందే

నీ కొంగైనా తగలక ముందే

తేనేల వానలు కురిపించే నిను

చూశానే.. ఓలమ్మీ చూశానే..

వేశానే.. కన్ను వేశానే..


చరణం 2:


పెదవులు నీకై తడబడతుంటే.. ఏ ఏ ఏ.. హాయ్ హాయ్

కన్నులు నీకై కలగంటుంటే.. ఏ ఏ ఏ.. అరెరెరెరే

నీ కౌగిలిలో .. ఓ ఓ...  చేరకముందే. ..

నీ కౌగిలో చేరకముందే

కరిగి కరిగి నే నీరౌతుంటే... 

చూశావా.. ఓరబ్బీ చూశావా..

వేశావా.. కన్ను వేశావా...


చరణం 3:


కొంటె కోరికలు కొరికేస్తుంటే.. ఏ ఏ ఏ .. ఆహాహా

జంట కోసమై తరిమేస్తుంటే.. ఏ ఏ ఏ.. హా...

దూరాలన్నీ... ఈ ఈ... తొలిగే సమయం

దూరాలన్నీ తొలిగే సమయం

తొందరలోనే రాబోతుందని...

చూశావా.. ఓరబ్బీ చూశావా..

వేశావా.. కన్ను వేశావా..

ఇన్నాళ్ళు నా కోసం దాచిన అందం నీలో

చూశావా.. హహ చూశానే

వేశావా.. కన్ను వేశానే... ఏ... ఏ... ఏ..


- పాటల ధనుస్సు 


12, ఫిబ్రవరి 2022, శనివారం

సీతమ్మ నడిచింది రాముని వెంటా | Sethamma nadichindi | Song Lyrics | Gunavanthudu (1975)

సీతమ్మ నడిచింది రాముని వెంటా



చిత్రం :  గుణవంతుడు (1975)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  సుశీల, బాలు  



పల్లవి : 


సీతమ్మ నడిచింది రాముని వెంటా.. 

సీతమ్మ నడిచింది రాముని వెంటా

రాముడు ఉన్నాడు సీతమ్మ కంటా.. 

సీతమ్మ నడిచింది రాముని వెంటా


అడవంతా పులకరించి పూచెనంట.. 

అడవంతా పులకరించి పూచెనంట

ఆకుటిల్లె వారి ప్రణయ లోకమంట.. 

సీతమ్మ నడిచింది రాముని వెంటా 


చరణం 1 : 


కొమ్మమీద గోరువంక కులుకులాడి 

చిలక వంక కొంటెగా చూచెనంటా

కొమ్మమీద గోరువంక కులుకులాడి 

చిలక వంక కొంటెగా చూచెనంటా


పంచవటి పంచలోని పంచవర్ణ రామచిలుక 

పైట సర్దుకున్నదంటా

పంచవటి పంచలోని పంచవర్ణ రామచిలుక 

పైట సర్దుకున్నదంటా


పచ్చగడ్డి మేసేటి పసిడిలేడి మేతమాని . .  

పరుగులే తీసెనంటా

సీతమ్మ చెవిలోన రాముడేదో చెప్పగా . .  

సిగ్గుపడి పోయెనంటా 

   

సీతమ్మ నడిచింది రాముని వెంటా  



చరణం 2 :


పొదరిల్లే సవరించి..  చిగురుటాకు తలుపు మూసి..  

తీగలే ఊయలగా ఊగిరంటా

పొదరిల్లే సవరించి..  చిగురుటాకు తలుపు మూసి..  

తీగలే ఊయలగా ఊగిరంటా


ఎటుచూసినా జంటలై ఒకే వలపు పంటలై 

ఋతువులన్ని ఏకమై వచ్చెనంటా

ఎటుచూసినా జంటలై ఒకే వలపు పంటలై 

ఋతువులన్ని ఏకమై వచ్చెనంటా


వెచ్చదనం చల్లదనం పెంచెనంటా . .  

వెచ్చదనం చల్లదనం పెంచెనంటా..

వెన్నెలతో నీరెండ వియ్యమంటా            

సీతమ్మ నడిచింది రాముని వెంటా... 

రాముడు ఉన్నాడు సీతమ్మ కంటా

 అడవంతా పులకరించి పూచెనంట... 

ఆకుటిల్లె వారి ప్రణయ లోకమంట.. 

 సీతమ్మ నడిచింది రాముని వెంటా..  

సీతమ్మ నడిచింది రాముని వెంటా


- పాటల ధనుస్సు 


నేను గాక ఇంకెవరు | Nenu gaka inkevaru | Song Lyrics | Gunavanthudu (1975)

నేను గాక ఇంకెవరు



చిత్రం: గుణవంతుడు (1975)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం: బాలు, సుశీల


పల్లవి:


నేను గాక ఇంకెవరు నిను కౌగిలిలో పొదిగేది

నీవు గాక మరి ఎవరు నా కన్నులలో మెదిలేది


నేను గాక ఇంకెవరు నిను కౌగిలిలో పొదిగేది

నీవు గాక మరి ఎవరు నా కన్నులలో మెదిలేది

నేను గాక ఇంకెవరు నిను కౌగిలిలో పొదిగేది

నీవు గాక మరి ఎవరు నా కన్నులలో మెదిలేది...


చరణం 1:


నీ పెదవులపై దరహాసం నాది... నా హృదయంలో స్థిరవాసం నీది...

ఆ..ఆ..ఆ..ఆ..ఆ

నీ పెదవులపై దరహాసం నాది... నా హృదయంలో స్థిరవాసం నీది...

నీవు లేక మా మనసుకు సొగసే లేదూ...

నేను లేక నీ సొగసుకు మనసే లేదు...


నేను గాక ఇంకెవరు నిను కౌగిలిలో పొదిగేది

నీవు గాక మరి ఎవరు నా కన్నులలో మెదిలేది


చరణం 2:


నిను వేటాడే ఆశను నేను... నను వెంటాడే అందం నీవు

ఆ..ఆ...ఆ...ఆ..ఆ

నిను వేటాడే ఆశను నేను... నను వెంటాడే అందం నీవు

నీ మొత్తం నా సొంతం అయ్యింది... ఈ.. ఈ.. ఈ

నీ మొత్తం నా సొంతం అయ్యింది... ఈ.. ఈ.. ఈ

ప్రతి నిత్యం అది కొత్తగ ఉంటుంది...


నేను గాక ఇంకెవరు నిను కౌగిలిలో పొదిగేది

నీవు గాక మరి ఎవరు నా కన్నులలో మెదిలేది...


నీవు గాక మరి ఎవరు నను కౌగిలిలో పొదిగేది

నేను గాక మరి ఎవరు నీ కన్నులలో మెదిలేది..

లాలల లలలాలా.. లాలలల లలలాలా...

లాలల లలలాలా.. లాలలల లలలాలా...


- పాటల ధనుస్సు 


10, ఫిబ్రవరి 2022, గురువారం

అడగాలని ఉంది | Adagalani Undi | Song Lyrics | Chinnanati Snehitulu (1971)

అడగాలని ఉంది ఒకటడగాలని ఉంది

చిత్రం: చిన్ననాటి స్నేహితులు (1971)
సంగీతం: టి.వి. రాజు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: బాలు, సుశీల


పల్లవి:

అడగాలని ఉంది ...ఒకటడగాలని ఉంది

అడిగిన దానికి బదులిస్తే... ఇస్తే...
అందుకు బహుమానం ఒకటుంది
అడగాలని ఉంది... ఒకటడగాలని ఉంది..ఈ...ఈ...

చరణం 1 :

ఎదురుగా నిలుచుంటే...ఎంతో ముద్దుగ మెరిసేదేది?
ఎదురుగా నిలుచుంటే...ఎంతో ముద్దుగ మెరిసేదేది?
అందీ అందకుంటే..అందీ అందకుంటే
ఇంకెంతో అందం చిందేదేది?
చేప...ఉహు..చూపు.. ఆహ..
సిగ్గు...ఉహు..మొగ్గ...ఆహ..
మొగ్గ కాదు.. కన్నెపిల్ల బుగ్గా..
అడగాలని ఉంది ...ఒకటడగాలని ఉంది
అడిగిన దానికి బదులిస్తే... ఇస్తే...
అందుకు బహుమానం ఒకటుంది
అడగాలని ఉంది... ఒకటడగాలని ఉంది..ఈ...ఈ...

చరణం 2:

కొత్తగా రుచి చూస్తుంటే...మత్తుగా ఉండేదేది?
కొత్తగా రుచి చూస్తుంటే...మత్తుగా ఉండేదేది
మళ్ళీ తలచుకుంటే...మళ్ళీ తలచుకుంటే...

మరింత రుచిగా ఉండేదేది?
వెన్నా...ఉహు...జున్ను...ఉహు
తీపి ..ఉహు..ఆ పులుపు ఆహ...
పులుపు కాదూ ...తొలి వలపూ
అడగాలని ఉంది... ఒకటడగాలని ఉంది..ఈ...ఈ...

చరణం 3 :

ఎంతగా చలి వేస్తుంటే...అంతగా మనసయ్యేదేది?

ఎంతగా ... చేరదీస్తే..ఎంతగా ... చేరదీస్తే..

అంతగా మురిపించేదేది?
కుంపటి...మ్మ్ హు..
దుప్పటి..ఆహ..
గొంగలి...మ్మ్ హు..
కంబళి..ఆహ..
కంబళి కాదు...కౌగిలి
అడగాలని ఉంది అది అడగాలని ఉంది
అడగాలని ఉంది అది అడగాలని ఉంది
అడగంగానే ఇచ్చేస్తే ...అడగంగానే ఇచ్చేస్తే...
అందులో రుచి ఏముంది... అహా..హ..ఆ హ..

- పాటల ధనుస్సు 

ఎవరైనా చూశారా | Evaraina Chusara | Song Lyrics | Amma Maata (1972)

ఎవరైనా చూశారా ఏమనుకుంటారు



చిత్రం :  అమ్మ మాట (1972)
సంగీతం :  రమేశ్ నాయుడు
గీతరచయిత :  దేవులపల్లి
నేపథ్య గానం :  బాలు, సుశీల


పల్లవి:

హవ్వా...
ఎవరైనా చూశారా... 

ఏమనుకుంటారు..ఊ..ఊ..
ఎవరైనా చూశారా... 

ఏమనుకుంటారు..ఊ..ఊ..
కొత్త మురిపెం పొద్దెరగదని... 

చెప్పుకోంటారు ..

ఆపై తప్పుకుంటారు
ఎవరైనా చూశారా .... 

ఏమనుకుంటారు

చరణం 1:

ఇటు పువ్వు చూస్తుంది... 

అటు గువ్వ చూస్తుంది..ఉహు..
గుబురు గుబురుగా.... 

గుండె గుబులుగా..ఊహూ..
ఇటు పువ్వు చూస్తుంది... 

అటు గువ్వ చూస్తుంది..
గుబురు గుబురుగా.... 

గుండె గుబులుగా..
గురివింద పొద చూస్తుంది... 

గురివింద పొద చూస్తుందీ
పువ్వులాగ నవ్వుకోని... 

గువ్వలాగ రివ్వుమని
పువ్వులాగ నవ్వుకోని... 

గువ్వలాగ రివ్వుమని
ఇరువురిని ఆ పొదరిల్లు... 

పరవశించి పోమ్మందీ
అమ్మమ్మ...ఎవరైనా చూశారా...

ఏమనుకుంటారు

చరణం 2:

అటు పొద్దు వాలుతుంది... 

మన ముద్దు తీరకుంది..ఉహు..
అటు పొద్దు వాలుతుంది... 

మన ముద్దు తీరకుంది..
కోయని పిలిచే కోరిక లెరిగి... 

నన్నందుకోని పోరాదా..ఊహూ...
..నన్నందుకోని పోరాదా
నీ నడుమున చేయివేసి... 

నిలువెల్లా పెనవేసి
నీ నడుమున చేయివేసి... 

నిలువెల్లా పెనవేసి
నీలాల మబ్బుల్లోకి ... 

నిన్నెత్తుకు పోతానే..హోయ్యా
ఎవరైనా చూశారా...

ఏమనుకుంటారు
కొత్త మురిపెం పొద్దెరుగదని...

చెప్పుకుంటారు ...

ఆపై తప్పుకుంటారు


- పాటల ధనుస్సు 

9, ఫిబ్రవరి 2022, బుధవారం

చింతపువ్వు ఎరుపు చిలకముక్కు ఎరుపు | Chintha puvvu erupu | Song Lyrics | Inti Gowravam (1970)

 చింతపువ్వు ఎరుపు.. చిలకముక్కు ఎరుపు


చిత్రం : ఇంటిగౌరవం (1970)
సంగీతం :  కోదండపాణి
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : బాలు, సుశీల


పల్లవి :

రాణి..
చింతపువ్వు ఎరుపు.. చిలకముక్కు ఎరుపు
చింతపువ్వు ఎరుపు.. చిలకముక్కు ఎరుపు
చేయి చేయి కలుపు.. లేత వలపు తెలుపు..
రాణి.. ఈ.. ఈ.. ఈ.. రాణి

మల్లెమొగ్గ తెలుపు.. మంచి మనసు తెలుపు
మల్లెమొగ్గ తెలుపు.. మంచి మనసు తెలుపు
చేయి చేయి కలుపు.. నిండు వలపు నిలుపు
రాజా.. ఓ.. రాజా...

చరణం 1 :

అబ్బ.. ఊరించు పెదవులు ఎరుపు.. 

అవి నాలోన ఆశలు రేపు
అబ్బ.. ఊరించు పెదవులు ఎరుపు.. 

అవి నాలోన ఆశలు రేపు
ఆగాలి పెళ్ళైన వరకు.. 

ఆపైన తమదే గెలుపు
వలచే వేళా.. తొలగేవేలా?
వలచే వేళా.. తొలగేవేలా?
ఈ ఎడమోము.. పెడమోము రుచి చూడు పులుపు 

మల్లెమొగ్గ తెలుపు.. మంచి మనసు తెలుపు
చేయి చేయి కలుపు.. లేత వలపు తెలుపు..
రాణి.. ఈ.. ఈ.. ఈ.. రాణి

చరణం 2 :

అబ్బ...  నీ చేయి చిదిమిన చోట... 

అయ్యో నా బుగ్గ కందేను చూడు
అబ్బ...  నీ చేయి చిదిమిన చోట... 

అయ్యో నా బుగ్గ కందేను చూడు
నీ నవ్వు వెలిగిన పూటా .. 

నా మేను పొంగేను చూడు
నీలో నాలో... ఒకటే ఆశా...
నీలో నాలో... ఒకటే ఆశా...
అది పండేను మురిపాలు నిండెను రేపు

మల్లెమొగ్గ తెలుపు.. మంచి మనసు తెలుపు
మల్లెమొగ్గ తెలుపు.. మంచి మనసు తెలుపు
చేయి చేయి కలుపు.. లేత వలపు తెలుపు..
రాణి.. ఈ.. ఈ.. ఈ.. రాణి


- పాటల ధనుస్సు 

దేవీ క్షేమమా | Devi Kshemama | Song Lyrics | Santhi Nilayam (1972)

 దేవీ క్షేమమా



చిత్రం : శాంతి నిలయం (1972)

సంగీతం : ఎస్. పి. కోదండపాణి

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : వసంత, బాలు 


పల్లవి :


దేవీ క్షేమమా.. దేవరవారూ క్షేమమా

దేవీ క్షేమమా..  దేవరవారూ క్షేమమా


తమ కడగంటి చూపే కరువైనాదీ..

తమ కరుణా కటాక్షమే అరుదైనాదీ.. 

దేవీ క్షేమమా..   



చరణం 1 :


నులి సిగ్గుల లేబుగ్గలు ఎలాగున్నవీ?

నులి వెచ్చని తొలి ముద్దులు పంపమన్నవీ


అల్లరల్లరీ కళ్ళు చల్లగా వున్నవా?

అల్లరల్లరీ కళ్ళు చల్లగా వున్నవా?


తెల్లవార్లు నిదుర రాక ఎర్రబారుతున్నవీ..  

దేవీ క్షేమమా..  



చరణం 2 :


జడలోన మల్లెపూలు ఇమడకున్నవి

జత లేక పట్టుపరుపు కుదరకున్నది


తలగడతో చెప్పుకునే కబురులే మిగిలినవి

తలగడతో చెప్పుకునే కబురులే మిగిలినవి


అవి కూడ నలిగిపోయి జాలివేస్తున్నది..  

దేవీ క్షేమమా.. 



చరణం 3 :


నీ బడిలో చదవాలి క్రొత్త క్రొత్త చదువులూ

నేనపుడు అడగాలి చిలిపి చిలిపి ప్రశ్నలూ


నీ పెదవులపై వ్రాయాలి నీవుమెచ్చు జవాబులూ

పెదవులపై వ్రాయాలి నీవుమెచ్చు జవాబులూ

నీ మగసిరి గెలవాలి అసలైన పరీక్షలూ 



దేవీ క్షేమమా . .  దేవరవారూ క్షేమమా . . 

దేవీ క్షేమమా . .


- పాటల ధనుస్సు 

శ్రీధర భయహర కేసరిముఖ శ్రీ లక్ష్మీ నరసింహా | శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పాట | Song Lyrics | RKSS Creations

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పాట


గీత రచన : రామకృష్ణ దువ్వు ,

స్వర కల్పన : ఎస్ వేణు మాధవ్ ,

గానం : టి కృష్ణారావు ,

రికార్డింగ్ : శ్రీ మాత డిజిటల్ రికార్డింగ్, విశాఖపట్నం 


పల్లవి:

శ్రీధర భయహర కేసరిముఖ శ్రీ లక్ష్మీ నరసింహా

ఈ కొండల నడుమ కోనల నందున అంబుజ నాభా

ధరణీ తలమున దానవు త్రుంచగ

స్థంబము నుండి ప్రకటితమైన

భీకర రూపా రౌద్ర నరసింహా

ఉగ్ర నరసింహా.. మహోగ్ర నరసింహా


1 చరణం:

నింగికి నేలకు నడుమన నీవు విశ్వంభరాయ

పగటికి రేయికి సంధిగ నీవు దర్శనమిచ్చావు

రుధిరము కారే కేశములు

ఖలుని ప్రేవులే కంఠ హారములు

భీకర రూపా నరసింహా

కొలిచే వారికి ఇలపై దైవము

ఆర్తితో చేరిన అభయమొసగే

కరుణామూర్తి వైకుంఠ నిలయా

శ్రీ లక్ష్మీ నరసింహా.. శ్రీ లక్ష్మీ నరసింహా


2. చరణం:

అంబుధి జొచ్చి సోమకు ద్రుంచిన వేదరక్షకా

వరాహ రూపమున ధరణిని గాచిన గరుడ వాహనా

అనలము చిమ్మే నేత్రద్వయము

ప్రభంజనమల్లే సింహ నాదము

బ్రహ్మాండ రూపా నరసింహా

కలియుగమందు ఇడుములు తీర్చగ

తిరుమల గిరిపై కొలువున్న

ప్రహ్లాదవరదా నరసింహా

శ్రీనివాసా .. శ్రీయోగ నరసింహా..


- రామకృష్ణ దువ్వు

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు