RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

30, డిసెంబర్ 2023, శనివారం

ఈ పాల వెన్నెల్లో నీ జాలి కళ్ళల్లో | Ee Pala Vennello nee jali kallallo | Song Lyrics | Lambadolla Ramadasu (1978)

ఈ పాల వెన్నెల్లో నీ జాలి కళ్ళల్లో



చిత్రం : లంబాడోళ్ల రామదాసు (1978)

సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత :  సినారె

నేపథ్య గానం :  బాలు, సుశీల



పల్లవి :


ఈ పాల వెన్నెల్లో.. నీ జాలి కళ్ళల్లో..

ఈ పాల వెన్నెల్లో.. నీ జాలి కళ్ళల్లో..

ఇద్దరూ ఉన్నారు... ఎవ్వరూ వారెవరు

ఇద్దరూ ఉన్నారు... ఎవ్వరూ వారెవరు


ఈ పాల వెన్నెల్లో... నా జాలి కళ్ళల్లో

ఈ పాల వెన్నెల్లో... నా జాలి కళ్ళల్లో

ఇద్దరూ ఒకరేలే... ఆ.. ఒక్కరూ నీవేలే..

ఇద్దరూ ఒకరేలే... ఆ.. ఒక్కరూ నీవేలే..


చరణం 1 :


చుక్కలే నిను మెచ్చీ.. పక్కనే దిగి వచ్చీ

చుక్కలే నిను మెచ్చీ.. పక్కనే దిగి వచ్చీ

మక్కువే చూపితే.. నన్ను మరచేవో

నన్ను మరచేవో


చుక్కలు వేలువున్నా.. నా చుక్కి ఒక్కతే కాదా

చుక్కలు వేలువున్నా.. నా చుక్కి ఒక్కతే కాదా

లక్షల మగువలువన్నా... నా లక్ష్య మొక్కటే కాదా...

నా లక్ష్మి ఒక్కతే కాదా...


ఈ పాల వెన్నెల్లో.. నీ జాలి కళ్ళల్లో..

ఇద్దరూ ఉన్నారు... ఎవ్వరూ వారెవరు

ఇద్దరూ ఒకరేలే... ఆ.. ఒక్కరూ నీవేలే..


చరణం 2 :


తుంటరీ చిరుగాలీ.. కొంటెగా నును చూసీ

తుంటరీ చిరుగాలీ.. కొంటెగా నును చూసీ

పైటనే కాజేస్తే... ఏమి చేస్తావో..

ఏమి చేస్తావో..


పైటే ఏమౌతుంది.. నీ చేతిలోన అదివుంటే

పైటే ఏమౌతుంది.. నీ చేతిలోన అదివుంటే

స్వర్గం దిగి వస్తుందీ.. నా సామితోడుగా వుంటే

నా రాముని... నీడ వుంటే...


ఈ పాల వెన్నెల్లో.. నీ జాలి కళ్ళల్లో..

ఇద్దరూ ఉన్నారు... ఎవ్వరూ వారెవరు

ఇద్దరూ ఒకరేలే... ఆ.. ఒక్కరూ నీవేలే..

ఆహా... హా.. ఊ.. ఊహ్.. ఊహ్మ్...


పాటల ధనుస్సు 

25, డిసెంబర్ 2023, సోమవారం

నువ్వొచ్చి దారిలో అమ్మాయి | Nuvvoche Darilo Ammayi | Song Lyrics | Chal Mohana Ranga (1978)

నువ్వొచ్చి దారిలో అమ్మాయి



చిత్రం : చల్ మోహన రంగ (1978)

సంగీతం : బి.శంకర్ (ఘజల్ శంకర్)

గీతరచయిత : సినారె

నేపథ్య గానం : బాలు, సుశీల  


పల్లవి :


నువ్వొచ్చి దారిలో అమ్మాయి... 

నే రివ్వేసి కైపెక్కి కాశాను

నువ్వొచ్చి దారిలో అమ్మాయి... 

నే రివ్వేసి కైపెక్కి కాశాను

ముద్దబంతి అద్దకాల ముద్దు లేసి... 

ఒళ్లంతా చుడతాను పగ్గమేసి

ఒళ్లంతా చుడతాను పగ్గమేసి 


రేకెత్తి పోకోయు కుర్రోడా రేగేది... 

ఎందాక చిన్నోడా

రేకెత్తి పో కోయి కుర్రోడా రేగేది... 

ఎందాకా చిన్నోడా

ఈ వేడి నిండార నిలవుండిపోవాలి...  

నూరేళ్లు కౌగిళు  నూరేసుకోవాలి


రేకెత్తి పోకోయి కుర్రోడా రేగేది... 

ఎందాకా చిన్నోడా

నువ్వొచ్చి దారిలో అమ్మాయి... 

నేరివ్వే సి కైపెక్కి కాశాను 



చరణం 1 :


గువ్వలల్లె యవ్వనాలు గుండెల మీదుంటే

ఈ కోడెగాడి కోరికేదో రంకెలు వేస్తోంటే 


కళ్లె మేసి ఆపలేని కసి మీదున్నావు

నీ కళ్లతో నా ఒళ్లంతా తెగ తడి మేస్తున్నావు 


సిరిమల్లే బుగ్గల మీద చెంగావి పెదవుల మీద

సిరిమల్లే బుగ్గల మీద చెంగావి పెదవుల మీద

మాటేసి కాటేసి మైమరిచిపోతాను

ఆ రోజు రావాలిగా... మరి నా మోజు తీరాలి గా 



రేకెత్తి పోకోయి కుర్రోడా... 

రేగేది ఎందాకా చిన్నోడా

అరెరె నువ్వొచ్చే దారిలో అమ్మాయి... 

నే రివ్వేసి కైపెక్కి కాశాను 



చరణం 2 :


పగడాల పడవల్లే నువ్వూగుతూ వస్తుంటే

ఆ జగడాల బిడియాలు సుడి పడిపోతుంటే


జడివాన వరదల్లె నను తడిపేస్తున్నావు

నీ మగసిరిని సెగ చూపి ఆరేస్తున్నావు


ఆ తెరచాప కొండల కేసి నడియేట గెడ పోటేసి

తెరచాప కొండలకేసి నడియేట గెడపోటేసి

దూరాల తీరాల దరి చూసుకుంటాను

తీగల్లె నిన్నల్లుకుంటాను... 

నీ చుట్టు మెలితిరిగివుంటాను


రేకెత్తి పోకోయి కుర్రోడా... 

రేగేది ఎందాకా చిన్నోడా

నువ్వొచ్చే దారిలో అమ్మాయి... 

నేరివ్వేసి కైపెక్కి కాశాను

లాలాలా లాలాల లాలాలా


పాటల ధనుస్సు 


22, డిసెంబర్ 2023, శుక్రవారం

గుమ్మెత్తించే ఈరేయి | Gammethinche ee reyi | Song Lyrics | Chal Mohana Ranga (1978)

గుమ్మెత్తించే ఈరేయి



చిత్రం : చల్ మోహన రంగ (1978)

సంగీతం : బి.శంకర్ (ఘజల్ శంకర్)

గీతరచయిత : దాశరధి

నేపథ్య గానం : ఎల్. ఆర్. ఈశ్వరి 


పల్లవి :


గుమ్మెత్తించే ఈ రేయి... 

అహా కోరికలెన్నో ఉన్నాయి

సిగ్గులు చెందిదమ్మాయి.. 

అహా సరసన చేరాడబ్బాయి

జత కుదరాలి కల విరియాలి... ఈ వేళా

ఇయ్యరో... ఇయ్యరా... ఇయ్యరో... ఇయ్యరో


గుమ్మెత్తించే ఈ రేయి... 

అహా కోరికలెన్నో ఉన్నాయి

సిగ్గులు చెందిదమ్మాయి.. 

అహా సరసన చేరాడబ్బాయి

జత కుదరాలి కల విరియాలి... ఈ వేళా

ఇయ్యరో... ఇయ్యరా... ఇయ్యరో... ఇయ్యరో



చరణం 1 :


లోకం నిద్దుర పోతుంటే 

లోపల సందడి అవుతుంది

లోకం నిద్దుర పోతుంటే 

లోపల సందడి అవుతుంది

మత్తెక్కించే చీకటిలో 

మనసే ఊయల ఊగింది

అందిఅందని అందాలు 

అవి ఎందరికైనా సరదాలు

ఇయ్యరో... ఇయ్యరా... ఇయ్యరో... ఇయ్యరో


చరణం 2 :


గిన్నెల నిండా మధువుంది..ఓ... 

కన్నుల నిండా కైపుంది

గిన్నెల నిండా మధువుంది... 

కన్నుల నిండా కైపుంది


బుగ్గలు ముద్దులు కోరాయి... 

పెదవులు చెంతకు చేరాయి

కౌగిలినిండా వెచ్చదనం... 

కావల్సింది కొంటెతనం


ఇయ్యరో... ఇయ్యరా... ఇయ్యరో... ఇయ్యరో


గుమ్మెత్తించే ఈ రేయి... 

అహా కోరికలెన్నో ఉన్నాయి

సిగ్గులు చెందిదమ్మాయి.. 

అహా సరసన చేరాడబ్బాయి

జత కుదరాలి కల విరియాలి... ఈ వేళా

ఇయ్యరో... ఇయ్యరా... ఇయ్యరో... ఇయ్యరో


పాటల ధనుస్సు 


ఎంత తియ్యని మాట | Entha Teeyani Maata | Song Lyrics | Chal Mohana Ranga (1978)

ఎంత తియ్యని మాట



చిత్రం : చల్ మోహన రంగ (1978)

సంగీతం : బి.శంకర్ (ఘజల్ శంకర్)

గీతరచయిత : జాలాది

నేపధ్య గానం :  సుశీల 


పల్లవి :


ఎంత తియ్యని మాట తలచుకుంటే చాలు 

పులకింతలే పూచెేరా

కొత్త కొత్త వయసు పైటంతా పాకంగా 

పురివిప్పి ఆడేనురా

ఇక ఆగలేను నేనింకా ఓలాలా ... 

ఊగింది నా మనసే వుయ్యాలా


ఎంత తియ్యని మాట తలచుకుంటే చాలు 

పులకింతలే పూచెేరా

కొత్త కొత్త వయసు పైటంతా పాకంగా 

పురివిప్పి ఆడేనురా

ఇక ఆగలేను నేనింకా ఓలాలా... 

హా ఊగింది నా మనసే వుయ్యాలా


చరణం 1 :


మనసైనవాడే వరసైనాడని 

స్వప్నాల విహరించినా

కన్నె మనసే నీకు కానుకయ్యిందని 

పువ్వు పువ్వుకు చెప్పనా

ఉన్నపాటున నిన్ను పెనవేయేనా... 

ముద్ధుల్లో మురిపాల ముంచెత్తనా

నా కొంగు చాటున నిన్ను  దాచెయ్యనా 



ఎంత తియ్యని మాట తలచుకుంటే చాలు 

పులకింతలే పూచెేరా

కొత్త కొత్త వయసు పైటంతా పాకంగా 

పురివిప్పి ఆడేనురా

ఇక ఆగలేను నేనింకా ఓలాలా... 

హా ఊగింది నా మనసే వుయ్యాలా


చరణం 2 :


ఆనాడు వద్దంటే పైపైకి వచ్చావు... 

ఈనాడు ఏమాయారా

అసలైన వగలేమో బుసకొట్టి కసిరేపె 

ఇక సైపకున్నానురా

వలపంతా రంగరించి కలబోయరా... 

చెలరేగి  స్వర్గాలు చూపించరా


ఎంత తియ్యని మాట తలచుకుంటే చాలు 

పులకింతలే పూచెేరా

కొత్త కొత్త వయసు పైటంతా పాకంగా 

పురివిప్పి ఆడేనురా

ఇక ఆగలేను నేనింకా ఓలాలా... 

హా ఊగింది నా మనసే వుయ్యాలా


పాటల ధనుస్సు 


19, డిసెంబర్ 2023, మంగళవారం

ఎన్నాళ్ళీ తలపులు | Ennallee Talapulu | Song Lyrics | Chal Mohana Ranga (1978)

ఎన్నాళ్ళీ తలపులు



చిత్రం : చల్ మోహన రంగ (1978)

సంగీతం : బి.శంకర్ (ఘజల్ శంకర్)

గీతరచయిత : సినారె

నేపధ్య గానం : బాలు, సుశీల  


పల్లవి :


ఎన్నాళ్ళీ తలపులు... 

కలల మేలుకొలుపులు

ఎగిసిపడే హృదయంలో 

ఘడియ పడని తలుపులు


ఎన్నాళ్లీ పిలుపులు.... 

మూసిన కనుకొలకులు

ఎన్నాళ్లీ పిలుపులు.... 

మూసిన కనుకొలకులు

నువు నడిచే బాటలో ... 

తీయని తొలి మలుపులు


ఎన్నాళ్ళీ తలపులు... 

ఎన్నాళ్లీ పిలుపులు


చరణం 1 :


తారకలే నీ కన్నుల తోరణాలు తీర్చేనా

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..

తారకలే నీ కన్నుల తోరణాలు తీర్చేనా

చిరునవ్వులలు వెన్నెలకే.. 

కొత్త సిగ్గు నేర్పేనా

కొత్త సిగ్గు నేర్పేనా

నిదుర రాదు... నిదుర రాదు... 

నిదుర రాదు... నిదుర రాదు...

నిను చూసిన కనులకు 


ఎన్నాళ్ళీ తలపులు... 

ఎన్నాళ్లీ పిలుపులు


చరణం 2 :



ఆమని నీ కౌగిలో... 

అలసి నిలిచి పోయేనా

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..

ఆమని నీ కౌగిలో... 

అలసి నిలిచి పోయేనా

ఏమని నా మనసు నన్నే  ...  

విసిగి వేసరించేనా

విసిగి వేసరించేనా


విడిది చేసే మధుమాసం

విడిది చేసే మధుమాసం

చల్లని నీ లే ఎదలో...

చల్లని నీ లే ఎదలో... 


ఎన్నాళ్ళీ తలపులు... ఎన్నాళ్లీ పిలుపులు

ఎన్నాళ్ళీ తలపులు... ఎన్నాళ్లీ పిలుపులు

ఎన్నాళ్ళీ తలపులు... ఎన్నాళ్లీ పిలుపులు

ఎన్నాళ్ళీ తలపులు... ఎన్నాళ్లీ పిలుపులు


పాటల ధనుస్సు 

17, డిసెంబర్ 2023, ఆదివారం

ఈ పుట్టినరోజు నీ నోములు పండిన రోజు | Ee Puttinaroju | Song Lyrics | Kanchukota (1961)

ఈ పుట్టినరోజు నీ నోములు పండిన రోజు



చిత్రం: కంచుకోట (1961)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: దాశరథి

నేపధ్య గానం: సుశీల



పల్లవి:


ఈ పుట్టినరోజు.. నీ నోములు పండిన రోజు

దివిలో భువిలో కనివిని ఎరుగని.. 

అందాలన్ని అందే రోజు


ఈ పుట్టినరోజు.. నీ నోములు పండిన రోజు

దివిలో భువిలో కనివిని ఎరుగని.. 

అందాలన్ని అందే రోజు


ఏ అందాలు..


చరణం 1:


తళతళ మెరిసే తారకలారా ఇలకే దిగిరండీ

తళతళ మెరిసే తారకలారా ఇలకే దిగిరండీ

మీలో విరిసే లేత వెలుగులు.. 

మా చెలి కన్నుల నింపండి

ఆ వెలుగులలో నా చెలి ప్రియుడు ఆనందించాలి


ఈ పుట్టినరోజు..నీ నోములు పండినరోజూ...


చరణం 2:


అలల పూల ఉయ్యాలల ఆడుకునే హంసలారా ..ఆ...ఆ

అలల పూల ఉయ్యాలల ఆడుకునే హంసలారా

మీ నడకల వయ్యారం మా చెలికే ఇవ్వరారా .. ఆ...ఆ

ఆ వయ్యారం చూసి చూసి.. ఆమె ప్రియుడు మురియాలీ


ఈ పుట్టినరోజు..నీ నోములు పండినరోజూ..


చరణం 3:


పురివిప్పి నటియించు నీలాల నెమలి

పురివిప్పి నటియించు నీలాల నెమలి

మీలోని హొయలంత చెలికియ్యరాదా..ఆ..ఆ

అందాల చెలి నాట్యమాడేటి వేళ

చెలికాని మనసెల్ల విలసిల్ల గలదు...ఆ..ఆ..ఆ..ఆ


ఈ పుట్టినరోజు.. నీ నోములు పండిన రోజు

దివిలో భువిలో కనివిని ఎరుగని.. 

అందాలన్ని అందే రోజు


ఈ పుట్టినరోజు..నీ నోములు పండిన రోజూ...


పాటల ధనుస్సు 

14, డిసెంబర్ 2023, గురువారం

ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం | Dharmakshetram Idi Kurukshetram | Song Lyrics | Kurukshetram (1977)

ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం



చిత్రం : కురుక్షేత్రం (1977)

సంగీతం : ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత : శ్రీశ్రీ

నేపథ్య గానం :  బాలు



పల్లవి :


ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం

ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం

కురుపాండవ రోషాగ్నుల రణక్షేత్రం...  

కురుపాండవ రోషాగ్నుల రణక్షేత్రం...


ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం...  

కురుపాండవ రోషాగ్నుల రణక్షేత్రం

రథగజహయపదాతిదళసరభసగమనం.. 

ప్రళయ ఘనాఘన భీషణ భాంకృతి నినదం

రథగజహయపదాతిదళసరభసగమనం.. 

ప్రళయ ఘనాఘన భీషణ భాంకృతి నినదం

ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం...  

కురుపాండవ రోషాగ్నుల రణక్షేత్రం


చరణం 1 :


కపిధ్వజాంచిత సితాశ్వరంజిత 

రథస్థితులు కృష్ణార్జునులు

కపిధ్వజాంచిత సితాశ్వరంజిత  

రథస్థితులు కృష్ణార్జునులు

విజయుడు రథీ..  గోవిందుడు సారథీ

విజయుడు రథీ..  గోవిందుడు సారథీ

ఉభయులు నరనారాయణులు....  

ఉభయులు నరనారాయణులూ


గ్రీష్మాదిత్యుడు భీష్మాచార్యుడు 

తాళపతాక  విరాజితుడు

రంగత్తుంగ మదేభనిభాంగుడు ...

రారాజు ధుర్యోధనుడు 


మానవ జీవితమే ఒక మహాభారతం

ఆ..ఆ.... ఆ..ఆ.... 

మానవ జీవితమే ఒక మహాభారతం

అది మంచి చెడుల రెంటి నడుమ నిత్యఘర్షణం

నరులుండే ఇల సకలం కురుక్షేత్రమే.. ఆ...

ఇక జరుగుతుంది అనుక్షణం ధర్మయుద్ధమే... 

ధర్మయుద్ధమే... ధర్మయుద్ధమే


ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం...  

కురుపాండవ రోషాగ్నుల రణక్షేత్రం

రథగజహయపదాతిదళసరభసగమనం 

ప్రళయ ఘనాఘన భీషణ భాంకృతి నినదం

ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం...  

కురుపాండవ రోషాగ్నుల రణక్షేత్రం


చరణం 2 :


స్థితప్రజ్ఞుడతి నిర్మలచరితుడు 

ధర్మాయుధుడు...  యుధిష్ఠిరుడు

రవితేజస్సముదీర్ణుడు కర్ణుడు 

మైత్రీబంధ వినిష్ఠితుడు

రిపుమర్ధన దోర్దాముడు భీముడు 

శపథనిబద్ధ గాధాయుధుడు

ధనురాగమ నిష్ణాతుడు ద్రోణుడు 

కదనవ్యూహ విశారదుడు



బాహుబలోదగ్రులు బడబాగ్ని శిఖావిద్యోతులు

మోహరించిరాహవమున 

తనయులు తండ్రులు తాతలు

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ...

బాహుబలోదగ్రులు బడబాగ్ని శిఖావిద్యోతులు

మోహరించిరాహవమున 

తనయులు తండ్రులు తాతలు


అనివార్యం యుద్ధం.. అనివార్యం యుద్ధం

శరసంధానమే ధర్మం...  శరసంధానమే ధర్మం

ఆధర్మ పరిక్షాంగణమే కురుక్షేత్రం... 

కురుక్షేత్రం... కురుక్షేత్రం


చరణం 3 :


ప్రళయకాలుడై విలయరుద్రుడై ద్రోణాచార్యుడు 

భయదాస్త్రమ్ముల పాండవ సేనల చండాడే

ధర్మజుడు అసత్యమాడకున్న 

గురుడస్తమించడని హరిపలికే

అదే సమయమున భీముడు చంపెను 

అశ్వత్థామాహ్వయ కరినీ..

' అశ్వత్థామః హతః  కుంజరః ' 

అనెను విధిలేక ధర్మాత్మజుడు


తనయుడే  మరణించెనను శోకభారాన 

గురుడస్త్ర శస్త్రాలు ధరణి పడవేసే

ధృష్టద్యుమ్నుని మనోభీష్టంబు నెరవేర 

గురునిపై లంఘించి శిరము ఖండించే

ద్రోణాంతమును గాంచి కౌంతేయప్రథముండు 

అంతరంగమునందు కొంత శాంతించే

కురువృద్ధ సింహము గురువృద్ధ కుంజరము 

కూలెననికురురాజు కుమిలి దురపిల్లె

ద్రోణ దుర్మరణానికశ్వత్థామ రెండవరుద్రుడై

అగ్నిముఖ నారాయణాస్త్రము నంపె పాండవసేనపై


పాటల ధనుస్సు 


13, డిసెంబర్ 2023, బుధవారం

కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ | Kolo Kolamma Galla Koke | Song Lyrics | Kondaveeti Donga (1990)

కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ



చిత్రం : కొండవీటి దొంగ (1990)

సంగీతం : ఇళయరాజా

గీతరచయిత : వేటూరి

నేపథ్య గానం : బాలు, జానకి



పల్లవి:



కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ.. 

కోరింది ఇచ్చుకోవా

చేలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా.. 

నా ముద్దు పుచ్చుకోవా

లాటుగా అందాలన్ని చాటుగా ఇస్తావా

ఘాటుగా కౌగిళ్ళు ఇచ్చి మార్చుకోమంటావా

కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ 

కోరింది ఇచ్చుకోవా

చేలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా.. 

నా ముద్దు పుచ్చుకోవా


చరణం 1:


కొండ కోనల్లో చాటుగా.. ఎత్తు పల్లాలు తెలిసేలే

కంటి కోణాలు సూటిగా.. కొంటె బాణాలు విసిరేలే

సోకినా నా ఒళ్ళు కోకలో కళ్ళు పడ్డ నీ ఒళ్ళు వదలనూ

చూపుకే సుళ్ళు తిరిగె నా ఒళ్ళు కట్టు కౌగిళ్ళు వదలకూ

కుదేశాక అందాలన్ని కుదేలైన వేళల్లో

పడేశాక వల్లో నన్నే ఒడే చాలు ప్రేమల్లో

సందె ఓ షేపు చిందే ఓ వైపు అందే నీ సోకులే

తణక్కు దిన.. 

చేలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా.. 

నా ముద్దు పుచ్చుకోవా..


కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ.. కోరింది ఇచ్చుకోవా


చరణం 2:


మెత్తగా తాకు చూపుకే.. మేలుకున్నాయి సొగసులే

కోత్తగా తాకు గాయమే.. హాయి అన్నాయి వయసులే

కుర్ర నా ఈడు గుర్రమై తన్నే గుట్టుగా గుండెలదరగా

కళ్ళతో నీకు కళ్ళెమేశాను కమ్ముకో నన్ను కుదురుగా

భరోసాల వీరా రారా... భరిస్తాను నీ సత్తా

శ్రుతేమించు శృంగారంలో... రతే నీకు మేనత్తా


ముద్దు ఆ వైపు... రుద్దు ఈ వైపు... హద్దులే లేవులే...

తణక్కు దిన

కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ.. 

కోరింది ఇచ్చుకోవా

చేలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా.. 

నా ముద్దు పుచ్చుకోవా

లాటుగా అందాలన్ని చాటుగా ఇస్తావా

ఘాటుగా కౌగిళ్ళు ఇచ్చి మార్చుకోమంటావా


కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ.. 

కోరింది ఇచ్చుకోవా

ఏయ్.. చేలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా

నా ముద్దు పుచ్చుకోవా.. ఆ.. ఆ.. ఆ..


పాటల ధనుస్సు  


10, డిసెంబర్ 2023, ఆదివారం

పుట్టినరోజు పండగే అందరికి | Puttinaroju Panduge andariki | Song Lyrics | Jeevana Tarangalu (1973)

పుట్టినరోజు పండగే అందరికి



చిత్రం : జీవన  తరంగాలు (1973),

సంగీతం : J V రాఘవులు,

రచన : C నారాయణ  రెడ్డి,

గానం : P సుశీల,


పల్లవి :

పుట్టినరోజు పండగే అందరికి

మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి

పుట్టినరోజు పండగే అందరికి

మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి

ఎందరికి ఎందరికి...


చరణం: 1

కలిమికేమి వలసినంత ఉన్నా

మనసు చెలిమి కొరకు చేయి చాచుతుంది

ఆ మనసే ఎంత పేదైదైనా

అనురాగపు సిరులు పంచుతుంది

మమత కొరకు తపియించే జీవనం

మమత కొరకు తపియించే జీవనం

దైవమందిరంలా పరమపావ నం

పుట్టినరోజు పండగే అందరికి

మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి

ఎందరికి... ఎందరికి...


చరణం: 2

పువ్వెందుకు తీగపై పుడుతుంది

జడలోనో గుడిలోనో నిలవాలని

ముత్యమేల కడలిలో పుడుతుంది

ముచ్చటైన హారంలో మెరవాలని

ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని

తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలని

తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలని

తానున్నా... లేకున్నా...

తానున్నా లేకున్నా తన పేరు మిగలాలి

పుట్టినరోజు పండగే అందరికి

మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి

ఎందరికి... ఎందరికి...


పాటల ధనుస్సు  

నీలాలు కారేనా కాలాలు మారేనా | Neelalu Marena | Song Lyrics | Mudda Mandaram (1981)

నీలాలు కారేనా కాలాలు మారేనా



చిత్రం :  ముద్దమందారం (1981)

సంగీతం :  రమేశ్ నాయుడు

గీతరచయిత : వేటూరి 

నేపధ్య గానం :  బాలు 


పల్లవి:


నీలాలు కారేనా కాలాలు మారేనా

నీ జాలి నే పంచుకోనా నీ లాలి నే పాడలేనా

జాజి పూసే వేళ జాబిల్లి వేళ

పూల డోల నేను కానా

నీలాలు కారేనా కాలాలు మారేనా

నీ జాలి నే పంచుకోనా నీ లాలి నే పాడలేనా

జాజి పూసే వేళ జాబిల్లి వేళ

పూల డోల నేను కానా


చరణం 1:


సూరీడు నెలరేడు సిరిగల దొరలే కారు లే

పూరి గుడిసెల్లో పేద మనసుల్లో వెలిగేటి దీపాలులే

ఆ నింగి ఈ నేల కొనగల సిరులే లేవులే

కలిమి లేముల్లొ కరిగే ప్రేమల్లొ నిరుపేద లోగిళ్ళులే


నీలాలు కారేనా కాలాలు మారేనా

నీ జాలి నే పంచుకోనా నీ లాలి నే పాడలేనా

జాజి పూసే వేళ జాబిల్లి వేళ

పూల డోల నేను కానా


చరణం 2:


ఈ గాలిలో తేలి వెతలను మరిచే వేళలో

కలికి వెన్నెల్లు కలల కన్నుల్లో కల పారి పోవాలి లే

ఆ తారలే తేరి తళ తళ మెరిసే రేయిలో

ఒడిలో నువ్వుంటె ఒదిగీ పోకుంటె కడతేరి పోవాలిలే..


నీలాలు కారేనా కాలాలు మారేనా

నీ జాలి నే పంచుకోనా నీ లాలి నే పాడలేనా

జాజి పూసే వేళ జాబిల్లి వేళ

పూల డోల నేను కానా


పాటల ధనుస్సు 


శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో | Shubalekha Rasukunna | Song Lyrics | Kondaveeti Donga (1990)

శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో



చిత్రం: కొండవీటి దొంగ (1990) 

సంగీతం: ఇళయరాజా 

గీతరచయిత: వేటూరి 

నేపధ్య గానం: బాలు, చిత్ర 


పల్లవి: 


శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో 

అది నీకు పంపుకున్నా అపుడే కలలో 

పుష్యమి పూవ్వుల పూజ చేస్తా 

బుగ్గన చుక్కలతో 

వత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో... 


శుభలేఖ అందుకున్నా కలయో నిజమో! 

తొలిముద్దు జాబు రాశా చెలికే ఎపుడో 

శారద మల్లెల పూల జల్లే 

వెన్నెల నవ్వులలో 

శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో... 


శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో 

తొలిముద్దు జాబు రాశా చెలికే ఎపుడో 


చరణం 1: 


చైత్రమాస మొచ్చెనేమో చిత్రమైన ప్రేమకి 

కోయిలమ్మ కూసెనేమో గొంతునిచ్చి కొమ్మకి 

మత్తుగాలి వీచెనేమో మాయదారి చూపుకి 

మల్లె మబ్బులాడెనేమో బాల నీలవేణికి 


మెచ్చి మెచ్చి చూడసాగె గుచ్చే కన్నులు 

గుచ్చి గుచ్చి కౌగిలించే నచ్చే వన్నెలు 

అంతేలే కథంతేలే అదంతేలే ... 


చరణం 2: 


హంసలేఖ పంపలేక హింసపడ్డ ప్రేమకి 

ప్రేమలేఖ రాసుకున్నా పెదవి రాని మాటతో 

రాధలాగ మూగబోయా పొన్న చెట్టు నీడలో 

వేసవల్లె వేచి ఉన్నా వేణు పూలతోటలో 


వాలు చూపు మోసుకొచ్చె ఎన్నో వార్తలు 

వొళ్ళో దాటి వెళ్ళసాగే ఎన్నో వాంఛలు 

అంతేలే కధంతేలే అదంతేలే...


పాటల ధనుస్సు 


జో... లాలి.. ఓ లాలి | Jo Laali O Laali | Song Lyrics | Mudda Mandaram (1981)

జో... లాలి.. ఓ లాలి



చిత్రం :  ముద్దమందారం (1981)

సంగీతం :  రమేశ్ నాయుడు

గీతరచయిత : వేటూరి  

నేపధ్య గానం :  బాలు 



పల్లవి : 


జో..లాలి.. ఓ లాలి..

నైనా ఒకటాయె రెండాయె ఉయ్యాల

రెండు మూడు మాసాలాయె ఉయ్యాల

జో... లాలి.. ఓ లాలి...

నైనా మూడో మాసములోన ఉయ్యాల

ముడికట్ట్లు బిగువాయె ఉయ్యాల 


చరణం 1 :


జో... లాలి.. ఓ లాలి...

నైనా మూడాయె నాలుగాయె ఉయ్యాల

నాలుగు అయిదు మాసములాయె ఉయ్యాల

జో... లాలి.. ఓ లాలి...

నైనా అయిదాయె ఆరాయె ఉయ్యాల

ఆరు ఏడు మాసాములాయె ఉయ్యాల

జో... లాలి.. ఓ లాలి...

ఏడో మాసములోన ఉయ్యాల

నైనా వేగుళ్ళు బయలెళ్ళె ఉయ్యాల 


చరణం 2 :


జో... లాలి.. ఓ లాలి...

నైనా ఏడాయె ఎనిమిదాయె ఉయ్యాల

ఎనిమిది తొమ్మిది మాసములాయె ఉయ్యాల

జో... లాలి.. ఓ లాలి...

నైనా తొమ్మిది మాసములోన ఉయ్యాల

నైనా శ్రీకృష్ణ జన్మమురా ఉయ్యాల

నైనా శ్రీకృష్ణ జన్మమురా ఉయ్యాల


పాటల ధనుస్సు 

ముద్దుకే ముద్దొచ్చే మందారం | Mudduke Muddoche Mandaram | Song Lyrics | Mudda Mandaram (1981)

ముద్దుకే ముద్దొచ్చే మందారం



చిత్రం :  ముద్దమందారం (1981)

సంగీతం :  రమేశ్ నాయుడు

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  బాలు 



పల్లవి :


మందారం... ముద్దుమందారం

మందారం... ముద్దమందారం

ముద్దుకే ముద్దొచ్చే ... 

మువ్వకే నవ్వొచ్చే


ముద్దుకే ముద్దొచ్చే మందారం

మువ్వల్లే నవ్వింది సింగారం

ముద్దమందారం ముగ్థ శృంగారం

ముద్దమందారం ముగ్థ శృంగారం


ముద్దుకే ముద్దొచ్చే మందారం

మువ్వల్లే నవ్వింది సింగారం

ముద్దమందారం ముగ్థ శృంగారం



చరణం 1 :

అడుగులా అష్టపదులా...  

నడకలా జీవనదులా

అడుగులా అష్టపదులా...  

నడకలా జీవనదులా


పరువాల పరవళ్లు...  

పరికిణీ కుచ్చిళ్లూ

విరి వాలుజడ కుచ్చుల సందళ్లు


కన్నెపిల్లా కాదు...  కలల కాణాచి

కలువ కన్నులా...  కలల దోబూచి


ముద్దుకే ముద్దొచ్చే మందారం

మువ్వల్లే నవ్వింది సింగారం

ముద్దమందారం ముగ్థ శృంగారం



చరణం 2 :


పలుకులా రా చిలకలా... 

అలకలా ప్రేమ మొలకలా

పలుకులా రా చిలకలా... 

అలకలా ప్రేమ మొలకలా


మలి సంధ్య వెలుగుల్లో నారింజ రంగుల్లో

కురిసేటి పగడాల వడగళ్లు


మల్లెపువ్వా కాదు... మరుల మారాణి

బంతిపువ్వా పసుపు తాను పారాణి



ముద్దుకే ముద్దొచ్చే మందారం

మువ్వల్లే నవ్వింది సింగారం

ముద్దమందారం ముగ్థ శృంగారం

ముద్దమందారం ముగ్థ శృంగారం


ముద్దుకే ముద్దొచ్చే మందారం

మువ్వల్లే నవ్వింది సింగారం

ముద్దమందారం ముగ్థ శృంగారం

ముద్దమందారం ముగ్థ శృంగారం


పాటల ధనుస్సు 

పాటల ధనుస్సు పాపులర్ పాట

కన్నె పిల్లవని కన్నులున్నవని | Kannepillavani Kannulunnavani | Song Lyrics | Akali Rajyam (1980)

కన్నె పిల్లవని కన్నులున్నవని చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు, జానకి  పల్ల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు