RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

14, ఫిబ్రవరి 2026, శనివారం

రావే రావే బాలా | Rave Rave Baala | Song Lyrics | kula Gotralu (1962)

 రావే రావే బాలా


చిత్రం: కులగోత్రాలు (1962)

సంగీతం: ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత: సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం: పి. బి. శ్రీనివాస్, జమునారాణి


పల్లవి:


రావే రావే బాలా ... 

హలో మై డియర్ లీల

రావే రావే బాలా...

హలో మైడియర్ లీల

ఇటురావే ఇటురావే ... 

ఐ లవ్ యు


పోవోయ్ పోవోయ్ బావా...

ఎందుకీ పెడత్రోవా

పోవోయ్ పోవోయ్ బావా...

ఎందుకీ పెడత్రోవా

ఈ పల్లెల్లో మన పల్లెల్లో

ఈ పల్లెల్లో మన పల్లెల్లో

సాగవీవేషాలూ ... 

చాలునే సరసాలు

ఇకచాల్లే...ఇక చాల్లే


చరణం 1:


టిప్పుటాపు దొరసాని ..

అప్టుడేటు అలివేణి

టిప్పుటాపు దొరసాని ..

అప్టుడేటు అలివేణి

ఈ రోజుల్లో మనఫోజుల్లో...

ఈ రోజుల్లో మనఫోజుల్లో ..

ఇది దొరలఫేషనే రాణీ


పెద్దవాళ్ళు చూస్తారు ... 

దేహశుధిచేస్తారు

" వా " ....

పెద్దవాళ్ళు చూస్తారు .. 

దేహశుధిచేస్తారు

పచ్చి పచ్చి లవ్ చూపావంటే .. 

పిచ్చాస్పత్రిలో వేస్తారు

" నో...నో.... "


పచ్చి పచ్చి లవ్ చూపావంటే 

పిచ్చాస్పత్రిలో వేస్తారు

ఈ పల్లెల్లో మన పల్లెల్లో

ఈ పల్లెల్లో మన పల్లెల్లో

సాగవీవేషాలూ ... 

చాలు నీ సరదాలు

ఇకచాల్లే..." ఐ లవ్ యు " ..


రావే రావే బాలా ... 

హలో మై డియర్ లీల

రావే రావే బాలా...

హలో మైడియర్ లీల

ఇటురావే ఇటురావే ... 

ఐ లవ్ యు


చరణం 2:


తప్పేమున్నది మేడం ..

నాతో షికారు రావడం

ఇక్కడ పుట్టినవాళ్ళం ..

ఎందుకు మనకీ మేళం

ఈ పల్లెల్లో మన పల్లెల్లో...

ఈ పల్లెల్లో మనపల్లెల్లో...

సాగవీవేషాలూ... 

చాలునీ సరదాలు

ఇక చాల్లే..." ఐ లవ్ యు "


రావే రావే బాలా...

పోవోయ్ పోవోయ్ బావా

రావే రావే బాలా...

పోవోయ్ పోవోయ్ బావా

లవ్ యు.....ఇక చాల్లే..


- పాటల ధనుస్సు 


చెలికాడు నిన్నే రమ్మని పిలువ | Chelikadu Ninne Rammani | Song Lyrics | Kula Gotralu (1962)

చెలికాడు నిన్నే రమ్మని పిలువ


చిత్రం: కులగోత్రాలు (1962)

సంగీతం: ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత: సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం: ఘంటసాల, సుశీల


పల్లవి:


చెలికాడు నిన్నే రమ్మని పిలువ

చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా..


ప్రియురాలి మదిలో ఏముందో 

తెలుసుకోలేవా

నన్నే తెలుపమంటావా..


చెలికాడు నిన్నే రమ్మని పిలువా

చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా..


చరణం 1:


నీ నవ్వులో ఏపువ్వులో 

పన్నీరు చిలికాయీ...

నీ నవ్వులో ఏపువ్వులో 

పన్నీరు చిలికాయీ


కిరణాలలోనేగా సరోజం 

కిలకిల నవ్వేదీ

కిరణాలలోనేగా సరోజం 

కిలకిల నవ్వేదీ


అహహా ...అహా ఒహోహో ....

అహహా ఒహో ......అ ఆ


చరణం 2:


నీ అందమే శ్రీగంధమై 

నా డెందమలరించే

నీ రూపె దీపమ్మై ప్రియా 

నా చూపుల వెలిగించే


అహహా ... అహా ఒహోహో .....

అహహా ఒహో.......అ ఆ ...


చరణం 3:


నీ తోడుగా నడయాడగా 

ఇంకేమి కావాలీ

మధురానురాగాలే ఫలించే 

తరుణం రావాలీ


అహహా...అహా ఒహోహో....

హహా ఒహో...అ ఆ . .


- పాటల ధనుస్సు


అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే | Ayyayyo Chetilo Dabbulu | Song Lyrics | Kula Gotralu (1962)

అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే



చిత్రం : కులగోత్రాలు (1962)

సంగీతం : ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత : కొసరాజు

నేపధ్య గానం : పిఠాపురం, మాధవపెద్ది సత్యం


పల్లవి :


అయ్యయ్యో ... 

చేతిలో డబ్బులు పోయెనే

అయయ్యో ... 

జేబులు ఖాళీ ఆయెనే

అయ్యయ్యో...  

చేతిలో డబ్బులు పోయెనే

అయయ్యో ... 

జేబులు ఖాళీ ఆయెనే


ఉన్నది కాస్తా ఊడింది... 

సర్వ మంగళం పాడింది

ఉన్నది కాస్తా ఊడింది... 

సర్వ మంగళం పాడింది

పెళ్లాం మెళ్లో నగలతో సహా... 

తిరుక్షవరమై పోయింది


అయ్యయ్యో...  

చేతిలో డబ్బులు పోయెనే

అయయ్యో...  

జేబులు ఖాళీ ఆయెనే


చరణం 1 :


ఆ మహా మహా నలమహారాజుకే... 

తప్పలేదు భాయీ

ఓటమి తప్పలేదు భాయీ


మరి నువు చెప్పలేదు భాయీ... 

అది నా తప్పుగాదు భాయీ

తెలివి తక్కువగ... 

చీట్ల పేకలో దెబ్బ తింటివోయీ

బాబూ నిబ్బరించవోయీ


అయ్యయ్యో...  

చేతిలో డబ్బులు పోయెనే

అయయ్యో...  

జేబులు ఖాళీ ఆయెనే


చరణం 2 :


నిలువు దోపిడీ దేవుడికిచ్చిన 

ఫలితం దక్కేది

ఎంతో పుణ్యం దక్కేది... 

గోవిందా గోవిందా

నిలువు దోపిడీ దేవుడికిచ్చిన 

ఫలితం దక్కేది

ఎంతో పుణ్యం దక్కేది... 

చక్కెర పొంగలి చిక్కేది


ఎలక్షన్లలో ఖర్చుపెడితే... 

ఎం.ఎల్.ఏ దక్కేది

మనకు అంతటి లక్కేదీ


అయ్యయ్యో...  

చేతిలో డబ్బులు పోయెనే

అయయ్యో...  

జేబులు ఖాళీ ఆయెనే


చరణం 3 :


గెలుపూ ఓటమి దైవాధీనం...

చెయ్యి తిరగవచ్చు... 

మళ్ళీ ఆడి గెల్వవచ్చు

ఇంకా పెట్టుబడెవడిచ్చు... 

ఇల్లు కుదవ చేర్చవచ్చు

ఛాన్సు తగిలితే ఈ దెబ్బతో... 

మన కరువు తీరవచ్చు

పోతే...  అనుభవమ్ము వచ్చు

చివరకు జోలె కట్టవచ్చు


అయ్యయ్యో...  

చేతిలో డబ్బులు పోయెనే

అయయ్యో...  

జేబులు ఖాళీ ఆయెనే


- పాటల ధనుస్సు 


11, ఫిబ్రవరి 2026, బుధవారం

శ్రీరామ నామాలు శతకోటి | Srirama Namalu Sathakoti | Song Lyrics | Meena (1973)

శ్రీరామ నామాలు శతకోటి


చిత్రం :  మీనా (1973)

సంగీతం :  రమేశ్ నాయుడు

గీతరచయిత :  ఆరుద్ర

నేపధ్య గానం :  పి.సుశీల 


పల్లవి:


ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ .....


శ్రీరామ నామాలు శతకోటి...

ఒక్కొక్క పేరు బహుతీపి... 

బహుతీపి

శ్రీరామ నామాలు శతకోటి .....


చరణం 1:


తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు...

దశరధరామయ్య స్థవనీయుడు...

తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు...

దశరధరామయ్య స్థవనీయుడు..

కడుమేటి విలు విరిచి కలికిని చేపట్టు... 

కళ్యాణరామయ్య కమనీయుడు..... 

కమనీయుడు...


శ్రీరామ నామాలు శతకోటి .....

ఒక్కొక్క పేరు బహుతీపి ..... 

బహుతీపి

శ్రీరామ నామాలు శతకోటి .....


చరణం 2:


సుదతి జానకి తోడ శుభ సరసమాడేటి...

సుందరరామయ్య సుకుమారుడు

సుదతి జానకి తోడ శుభ సరసమాడేటి...

సుందరరామయ్య సుకుమారుడు

కోతిమూకలతో ..... ఆ.. ఆ... ఆ...

కోతిమూకలతో లంకపై దండెత్తు...

కోదండరామయ్య రణధీరుడు...

రణధీరుడు


శ్రీరామ నామాలు శతకోటి .....

ఒక్కొక్క పేరు బహుతీపి ..... 

బహుతీపి

శ్రీరామ నామాలు శతకోటి .....


చరణం 3:


పవమానసుతుడు పాదాలు పట్టగా...

పట్టాభిరామయ్య పరంధాముడు.....

పవమానసుతుడు పాదాలు పట్టగా...

పట్టాభిరామయ్య పరంధాముడు

అవనిలో సేవించు ఆశ్రితుల పాలించు...

అచ్యుతరామయ్య అఖిలాత్ముడు..... 

అఖిలాత్ముడు..


శ్రీరామ నామాలు శతకోటి .....

ఒక్కొక్క పేరు బహుతీపి ..... 

బహుతీపి

శ్రీరామ నామాలు శతకోటి


- పాటల ధనుస్సు 


6, ఫిబ్రవరి 2026, శుక్రవారం

జింజింతరారే జింజింతారారే | Jim Jim Tarare | Song Lyrics | Anubandham (1984)

జింజింతరారే జింజింతారారే 


చిత్రం :  అనుబంధం (1984)

సంగీతం  :  చక్రవర్తి

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం  :  సుశీల,  బాలు    


పల్లవి :


జింజింతరారే... జింజింతారారే

చలిగాలీ సాయంత్రం... 

చెలరేగే సంగీతం

పొద్దువాలె వేళాయే... 

ముద్దుగుమ్మ రావే

ఇద్దరున్న కౌగిట్లో... 

ముద్దు తీర్చిపోవే


నీలో చూశా సిగ్గుపడ్డ పరువాలు

నాలో చూడూ దగ్గరైన ప్రాణాలు 


జింజింతరారే... జింజింతారారే

చలిగాలీ చలగాటం... 

చెలరేగే ఉబలాటం

సందెపొద్దు వేళాయే... 

చందమామ రావే

చీకటైన పొదరింట్లో... 

దీపమెట్టిపోవే


నన్నే తాకే అగ్గిపూలబాణాలు

నాకే సోకే కొంటేచూపు కోణాలూ


చరణం 1 :


పూల వానల్లో నవ్వుల నావల్లే

నావంక వస్తుంటే... 

నాజూకు చూస్తుంటే

వెచ్చని వెలుగుల్లో... 

నచ్చిన వయసల్లే

వాటేసుకొంటుంటే... 

వైనాలు చూస్తుంటే


సూరీడేమో కొండలు దాటే... 

నా యీడేమో పొంగులు దాటే

నీ ముద్దు తాంబూలమిచ్చుకో... 

ఎర్రంగ వలపే పండించుకో

తూనీగల్లే తూలిపోయే నడుమివ్వు... 

నిన్నేచేరే నిన్నలేని నడకివ్వు


జింజింతరారే...జింజింతారారే


చరణం 2 :


కొండ కోనల్లో... ఎండ వానల్లో

మురిపాల పందిట్లో... 

ముద్దాడుకొంటుంటే

వేసవి చూపుల్తో... 

రాసిన జాబుల్తో

అందాల పందిట్లో... 

నిన్నల్లుకొంటుంటే


అల్లరికళ్ళు ఆరాతీసే... 

దూరాలన్ని చేరువ చేసే

ఒడి చేరి పరువాలు పంచుకో... 

బిడియాల గడపింక దాటుకో


నింగి నేలా తోంగి చూసే సాక్షాలూ

నీకూ నాకూ పెళ్ళిచేసే చుట్టాలు


జింజింతరారే... జింజింతారారే

చలిగాలీ చలగాటం... 

చెలరేగే ఉబలాటం

పొద్దువాలె వేళాయే... 

ముద్దుగుమ్మ రావే

సందెపొద్దువేళాయే... 

చందమామ రావే


నీలో చూశా సిగ్గుపడ్డ పరువాలు

నన్నే తాకే అగ్గిపుల్లబాణాలు

జింజింతరారే...జింజింతారారే


- పాటల ధనుస్సు 


ఆ నాటి ఆ స్నేహమానందగీతం | Aanati Aa Snehamaananda Geetham | Song Lyrics | Anubandham (1984)

ఆ నాటి ఆ స్నేహమానందగీతం


చిత్రం :  అనుబంధం (1984)

సంగీతం  :  చక్రవర్తి

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం  :  బాలు    


పల్లవి :


ఆ నాటి ఆ స్నేహమానందగీతం

ఆ జ్ఞాపకాలన్నీ మధురాతిమధురం

ఈనాడు ఆ హాయి లేదేల నేస్తం

ఆ రోజులు మున్ముందిక రావేమిరా


హహ లేదురా... ఆ సుఖం

రాదురా ఆ గతం...  

ఏమిటో జీవితం


ఒరెయ్ ఫూల్! గుర్తుందిరా

గోడలు దూకిన రోజులు... 

మోకాలికి తగిలిన దెబ్బలు

చీకట్లో పిల్లనుకుని... 

ఒరెయ్ ఒరెయ్ ఒరెయ్

పక్కనే పెళ్ళికావల్సిన 

పిల్లలున్నార్రా

నేర్చుకుంటార్రా హహహ


చరణం 1 :


నేనూ మారలేదు... 

నువ్వూ మారలేదు

కాలం మారిపోతే... 

నేరం మనదేమికాదు

ఈ నేల ఆ నింగి ఆలాగే ఉన్నా

ఈ గాలిమోస్తుంది మనగాథలెన్నో

నెమరేసుకుందాము...  

ఆ రోజులు

భ్రమలాగ ఉంటాయి... 

ఆ లీలలు

ఆ మనసులు ఆ మమతలు 

ఏమాయెరా


ఒరెయ్ రాస్కెల్! జ్ఞాపకముందిరా

కాలేజిలో... క్లాసురూములో

ఓ పాపమీద..

నువ్వు పేపరుబాల్ కొడితే

ఆ పాప ఎడమకాలి చెప్పుతో..

ఒరెయ్ ఒరెయ్ ..

ఒరెయ్ స్క్రౌండ్రర్

ఊరుకోరా పిల్లలు వింటారు

వింటే వింటార్రా...

పిల్లల పిల్లలకు పిట్టకథగా 

చెప్పుకుంటారు అంతే

హహహహ..


ఆ నాటి ఆ స్నేహమానందగీతం

ఆ జ్ఞాపకాలన్నీ మధురాతిమధురం

ఈనాడు ఆ హాయి లేదేల నేస్తం

ఆ రోజులు మున్ముందిక రావేమిరా


చరణం 2 :


మనసే ఇచ్చినాను... 

మరణం తెచ్చినాను

చితిలో చూసినాను... 

చిచ్చైమండినాను

నా గుండె మంటింక... 

ఆరేదికాదు

నేనుండి తనువెళ్ళి... 

బ్రతుకింకలేదు

తన శాపమే నాకు... 

తగిలిందిరా రేయ్

పసిపాపలే లేని... 

ఇల్లాయెరా

ఈ కన్నుల కన్నీటికి... 

తుదియేదిరా


ఒరెయ్ ఒరెయ్ ఏమిట్రా 

పసిపిల్లాడిలా

ఛి ఛీ.. ఊర్కో

ఈ కన్నీళ్ళకు తుదియెక్కడరా

కర్చీఫ్‌తో తుడిచెయ్యడమేరా

హహ హహాహ..


ఆ నాటి ఆ స్నేహమానందగీతం

ఆ జ్ఞాపకాలన్నీ మధురాతిమధురం


హహ రియల్లీ దోజ్ డేస్ 

ఆర్ మార్వలస్

కరెక్ట్ రా హహహాహహ

లాలాలలాలా లాలాలలాలా


- పాటల ధనుస్సు 


ప్రతిరేయి రావాలా తొలిరేయి కావాలా | Pratireyi Ravala | Song Lyrics | Anubandham (1984)

ప్రతిరేయి రావాలా తొలిరేయి కావాలా 


చిత్రం :  అనుబంధం (1984)

సంగీతం  :  చక్రవర్తి

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం  :  సుశీల,  బాలు  


పల్లవి :


ఆహా..ఆ హా ఆ ఆ హా..మ్మ్

ఆహా హా అహ ఆహాహా..


ప్రతిరేయి రావాలా.. 

ఆ.. ఆ.. ఆ.. ఆ

తొలిరేయి కావాలా.. 

ఆ.. ఆ.. ఆ.. ఆ

సన్నజాజి పొదరింట... 

సన్నసన్నని వెన్నెలంట

మనమీద వాలాలా... 

మల్లెలై పోవాలా

మనమీద వాలాలా... 

మల్లెలై పోవాలా


ప్రతిరేయి రావాలా.. 

ఆ.. ఆ.. ఆ.. ఆ

తొలిరేయి కావాలా.. 

ఆ.. ఆ.. ఆ.. ఆ

అలిగేటీ పడకింట... 

అల్లుకొన్న వెన్నెలంట

మనమీద వాలాలా... 

మల్లెలై పోవాలా

మనమీద వాలాలా... 

మల్లెలై పోవాలా


చరణం 1 :


అలిగే అందాలు చూసి 

కవ్వించనా

తొలిగే బేధాలు చూసి 

నవ్వించనా


మనసు పడుచైనా మీకు 

మతి చెప్పెనా

మతి మీతోపాటు పోయి 

శృతి చెప్పనా


మళ్ళీ తొలిరేయి 

మొగ్గు చూపించనా

మళ్ళీ తొలినాటి 

సిగ్గు మొలిపించనా


చిలిపి శ్రీవారికింత 

వలపాయెనా

చిలిపి శ్రీవారికింత 

వలపాయెనా

మళ్ళీ శ్రీమతి మీద 

మనసాయెనా.. హాహా


ప్రతిరేయి రావాలా.. 

ఆ.. ఆ.. ఆ.. ఆ

తొలిరేయి కావాలా.. 

ఆ.. ఆ.. ఆ.. ఆ

సన్నజాజి పొదరింట... 

సన్న సన్నని వెన్నెలంట

మనమీద వాలాలా... 

మల్లెలై పోవాలా

మనమీద వాలాలా... 

మల్లెలై పోవాలా


చరణం 2 :


ఇన్నాళ్ళు లేని వయసు 

ఇపుడొచ్చెనా

ఇంట్లో ఇల్లాలు నేడు 

గురుతొచ్చెనా


మనసే కొన్నాళ్ళ పాటు 

నిదరోయినా

మనసై నీ ఒడిలోకి 

నేను చేరనా


మళ్ళీ విరజాజిపూలు 

నేడు విచ్చెనా 

తల్లో ఈనాడు వలపు 

పూలుపూచెనా


నన్నె ఇన్నాళ్ళు నే 

మరిచిపోయినా

నన్నె ఇన్నాళ్ళు నే 

మరిచిపోయినా

మళ్ళీ  నీ కోసమే 

మేలుకొన్నా... హా..హాహా


ప్రతిరేయి రావాలా.. 

ఆ.. ఆ.. ఆ.. ఆ

తొలిరేయి కావాలా.. 

ఆ.. ఆ.. ఆ.. ఆ


అలిగేటీ పడకింట... 

అల్లుకొన్న వెన్నెలంట

మనమీద వాలాలా... 

మల్లెలై పోవాలా

మనమీద వాలాలా... 

మల్లెలై పోవాలా


- పాటల ధనుస్సు 


2, ఫిబ్రవరి 2026, సోమవారం

పాపాయి నవ్వాలి పండగే రావాలి | Papayi Navvali Pandage Ravali | Song Lyrics | Manushulu Marali (1969)

పాపాయి నవ్వాలి పండగే రావాలి 



చిత్రం : మనుషులు మారాలి (1969)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం : బాలు, సుశీల


పల్లవి:


పాపాయి నవ్వాలి... పండగే రావాలి... 

మా ఇంట కురవాలి... పన్నీరు

పాపాయి నవ్వాలి..పండగే రావాలి... 

మా ఇంట కురవాలి... పన్నీరు...


పాపాయి నవ్వినా... 

పండగే వచ్చినా... 

పేదల కన్నుల కన్నీరే..

పాపాయి నవ్వినా... 

పండగే వచ్చినా... 

పేదల కన్నుల కన్నీరే

నిరు పేదల కన్నుల కన్నీరే ..


పాపాయి నవ్వాలి... 

పండగే రావాలి... 

మా ఇంట కురవాలి... పన్నీరు


చరణం 1:


కార్తీకమాసాన... ఆకాశ మార్గాన... 

కనువిందు చేసేను జాబిల్లి

కార్తీకమాసాన... ఆకాశ మార్గాన... 

కనువిందు చేసేను జాబిల్లి


ఆషాఢమాసాన... మేఘాల చెరలోన 

అల్లాడిపోయెను జాబిల్లి

ఆషాఢమాసాన... మేఘాల చెరలోన 

అల్లాడిపోయెను జాబిల్లి

అల్లాడి పోయెను జాబిల్లి


నిద్దురపో... నిద్దురపో 

ముద్దుల పాపా నిద్దురపో...

నిద్దురపో...  నిద్దురపో 

ముద్దుల పాపా నిద్దురపో...


పాపాయి నవ్వాలి... 

పండగే రావాలి... 

మా ఇంట కురవాలి... పన్నీరు


చరణం 2:


వైశాఖమాసాన... భూదేవి సిగలోన... 

మరుమల్లెచెండౌను జాబిల్లి

శ్రావణమాసాన... జడివాన ఒడిలోన... 

కన్నీటి కడవౌను జాబిల్లి

కన్నీటి కడవౌను జాబిల్లి


నిద్దురపో... నిద్దురపో 

ముద్దుల పాపా నిద్దురపో...

నిద్దురపో... నిద్దురపో 

ముద్దుల పాపా నిద్దురపో...


పాపాయి నవ్వాలి ... పండగే రావాలి... 

మా ఇంట కురవాలి... పన్నీరు..

పాపాయి నవ్వాలి ... పండగే రావాలి... 

మా ఇంట కురవాలి... పన్నీరు...


- పాటల ధనుస్సు 


31, జనవరి 2026, శనివారం

చీకటిలో కారు చీకటిలో | Cheekatilo Karu Cheekatilo | Song Lyrics | Manushulu Marali (1969)

చీకటిలో కారు చీకటిలో


చిత్రం : మనుషులు మారాలి (1969)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : శ్రీ శ్రీ

నేపధ్య గానం : ఘంటసాల


పల్లవి :


చీకటిలో కారు చీకటిలో... 

కాలమనే కడలిలో

శోకమనే పడవలో... 

ఏ దరికో.. ఏ దెసకో


చీకటిలో కారు చీకటిలో... 

కాలమనే కడలిలో

శోకమనే పడవలో... 

ఏ దరికో.. ఏ దెసకో


చరణం 1 :


మనసున పెంచిన 

మమతలు పోయే

మమతలు పంచిన 

మనిషే పోయే


మనసున పెంచిన 

మమతలు పోయే

మమతలు పంచిన 

మనిషే పోయే


మనిషేలేని మౌనములోనా

మనుగడ చీకటి 

మయమైపోయే

లేరెవరూ... నీకెవరూ


చీకటిలో కారు చీకటిలో... 

కాలమనే కడలిలో

శోకమనే పడవలో... 

ఏ దరికో.. ఏ దెసకో


చరణం 2 :


జాలరి వలలో చేపావు నీవే

గానుగ మరలో చేరుకువు నీవే


జాలరి వలలో చేపావు నీవే

గానుగ మరలో చేరుకువు నీవే


జాలే లేని లోకంలోన

దారిలేని మనిషివి నీవే

లేరెవరూ.. నీకెవరూ..


చీకటిలో కారు చీకటిలో... 

కాలమనే కడలిలో

శోకమనే పడవలో... 

ఏ దరికో.. ఏ దెసకో


- పాటల ధనుస్సు 



తూరుపు సింధూరపు మందారపు | Toorupu Sindhurapu | Song Lyrics | Manushulu Marali (1969)

తూరుపు సింధూరపు మందారపు 


చిత్రం :  మనుషులు మారాలి (1969)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  శ్రీశ్రీ

నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి:


తూరుపు సింధూరపు 

మందారపు వన్నెలలో

ఉదయరాగం.. హృదయగానం... 

ఉదయరాగం.. హృదయగానం

తూరుపు సింధూరపు 

మందారపు వన్నెలలో

ఉదయరాగం.. హృదయగానం...

ఉదయరాగం.. హృదయగానం

మరల మరల ప్రతియేడు 

మధుర మధురగీతం...

జన్మదిన వినోదం

మరల మరల ప్రతియేడు 

మధుర మధుర గీతం..

జన్మదిన వినోదం


తూరుపు సింధూరపు 

మందారపు వన్నెలలో

ఉదయరాగం.. హృదయగానం...

ఉదయరాగం.. హృదయగానం...


చరణం 1:


వేల వేల వత్సరాలకేళిలో...

మానవుడుదయించిన 

శుభవేళలో..ఓ..

వేల వేల వత్సరాలకేళిలో...

మానవుడుదయించిన 

శుభవేళలో..ఓ..

వీచే మలయమారుతాలు ...

పుడమి పలికె స్వాగతాలు

మాలికలై తారకలే...

మలిచెకాంతి తోరణాలు..

ఓ..ఓ...హోయ్


తూరుపు సింధూరపు 

మందారపు వన్నెలలో

ఉదయరాగం.. హృదయగానం...

ఉదయరాగం.. హృదయగానం...


చరణం 2:


వలపులోన పులకరించు 

కన్నులతో ...

చెలిమి చేరి పలకరించు 

మగవారు

మనసులోన పరిమళించు 

వెన్నెలతో...

ప్రియుని చూచి పరవశించే 

ప్రియురాలు

జీవితమే స్నేహమయం... 

ఈ జగమే ప్రేమమయం.. 

ప్రేమంటే ఒక భోగం

కాదు కాదు అది త్యాగం ..

ఓ..ఓ...హోయ్..


తూరుపు సింధూరపు 

మందారపు వన్నెలలో

ఉదయరాగం.. హృదయగానం...

ఉదయరాగం.. హృదయగానం...


- పాటల ధనుస్సు 



పాటల ధనుస్సు పాపులర్ పాట

నీ కోకకింత కులుకెందుకు | Nee Kokakintha Kuluku | Song Lyrics | Donga Mogudu (1987)

నీ కోకకింత కులుకెందుకు  చిత్రం :  దొంగ మొగుడు (1987) సంగీతం :  చక్రవర్తి గీతరచయిత :  వేటూరి నేపధ్య గానం :  బాలు, జానకి పల్లవి : ఓయ్..  నీ కో...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు