RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

6, జూన్ 2024, గురువారం

పాలరాతి మందిరాన పడతి బొమ్మ | Palarathi Mandirana | Song Lyrics | Nenu Manishine (1971)

పాలరాతి మందిరాన పడతి బొమ్మ  



చిత్రం : నేనూ మనిషినే  (1971)

రచన : సి నారాయణ రెడ్డి,

సంగీతం : వేదాచలం 

గానం : బాలు, సుశీల 


పల్లవి:


పాలరాతి మందిరాన 

పడతిబోమ్మ అందం

అనురాగ గీతిలోన 

అచ్చ తెలుగు అందం


పాలరాతి మందిరాన 

పడతిబోమ్మ అందం...


చరణం: 1


రతనాల కోట ఉంది 

రాచకన్నె లేదు

రంగైన తోట ఉంది 

రామచిలుక లేదు

ఆ రాచ కన్నెవు నీవై 

అలరిస్తే అందం

నా రామచిలుకవు నీవై 

నవ్వితే అందం


పాలరాతి మందిరానా 

పడతిబోమ్మ అందం...

పాలరాతి మందిరానా 

పడతిబోమ్మ అందం...


చరణం: 2


కన్నెమనసు ఏనాడూ 

సన్నజాజి తీగ...

తోడు లేని మరునాడూ.. 

వాడి పోవు కాదా

ఆ తీగకు పందిరి నీవై 

అందుకుంటే అందం...

ఆ కన్నెకు తోడుగ నిలిచి 

అల్లుకుంటే అందం...


పాలరాతి మందిరాన 

పడతిబోమ్మ అందం

అనురాగ గీతిలోన 

అచ్చ తెలుగు అందం


పాలరాతి మందిరాన 

పడతిబోమ్మ అందం...


చరణం: 3


నీ సోగకన్నుల పైనా 

బాస చేసినాను

నిండు మనసు కోవెలలోనా 

నిన్ను దాచినాను...

ఇరువురిని ఏకం చేసే 

ఈ రాగబంధం ...

ఎన్నెన్ని జన్మలకైనా 

చెరిగి పోని అందం...

చెలుని వలపు నింపుకున్న 

చెలియ బ్రతుకు అందం...

అనురాగ గీతిలోనా 

అచ్చ తెలుగు అందం..

లా.ల.లా..ల


పాలరాతి మందిరాన 

పడతిబోమ్మ అందం...


- పాటల ధనుస్సు  

మధుర భావాల సుమమాల | Madhura Bhavala Suma Mala | Song Lyrics | Jai Jawan (1970)

మధుర భావాల సుమమాల



చిత్రం : జై జవాన్ (1970)

రచన : సి నారాయణ రెడ్డి,

సంగీతం : ఎస్ రాజేశ్వరరావు 

గానం : ఘంటసాల, సుశీల 


పల్లవి:


మధుర భావాల సుమమాల 

మనసులో పూచె ఈ వేళ

పసిడి కలలేవో చివురించే 

ప్రణయ రాగాలు పలికించే

మధుర భావాల సుమమాల 

మనసులో పూచె ఈ వేళ


చరణం 1:


ఎదను అలరించు హారములో

పొదిగితిరి ఎన్ని పెన్నిధులో 

ఎదను అలరించు హారములో

పొదిగితిరి ఎన్ని పెన్నిధులో 


మరువరాని మమతలన్నీ

మెరిసిపోవాలి కన్నులలో 


మధుర భావాల సుమమాల 

మనసులో పూచె ఈ వేళ


చరణం 2:


సిరుల తులతూగు చెలి ఉన్నా

కరుణ చిలికేవు నాపైన 

సిరుల తులతూగు చెలి ఉన్నా

కరుణ చిలికేవు నాపైన 


కలిమికన్నా చెలిమి మిన్న

కలవు మణులెన్నో నీలో 


మధుర భావాల సుమమాల 

మనసులో పూచె ఈ వేళ


చరణం 3:


ఒకే పధమందు పయనించి

ఒకే గమ్యమ్ము ఆశించి 

ఒకే పధమందు పయనించి

ఒకే గమ్యమ్ము ఆశించి 


ఒకే మనసై ఒకే తనువై

ఆ ఉదయశిఖరము చేరితిమి 


మధుర భావాల సుమమాల 

మనసులో పూచె ఈ వేళ


- పాటల ధనుస్సు  

27, మే 2024, సోమవారం

కనులు మాట లాడునని | Kanulu Mataladunani | Song Lyrics | Mayani Mamatha (1970)

కనులు మాట లాడునని 



చిత్రం : మాయని మమత (1970)

రచన : సి నారాయణ రెడ్డి,

సంగీతం : అశ్వథామ,

గానం : ఘంటసాల, సుశీల 


పల్లవి:


కనులు మాటలాడునని.. ఈ...

మనసు పాట పాడునని.. ఈ...


కనులు మాటలాడునని.. 

మనసు పాట పాడునని

కవితలల్లితి ఇన్నాళ్ళు.. 

అది కనుగొన్నాను ఈనాడు


కనులు మాటలాడునని.. 

మనసు పాట పాడునని

కవితలల్లగ విన్నాను.. 

అది కనుగొన్నాను ఈనాడు


చరణం 1:


మెత్తగ సాగే మేనితీగ 

మెలికలు తిరిగితె.. ఒక అందం

ఆ... ఆ.... ఆ... ఆ...ఆ... ఆ...


మెత్తగ సాగే మేనితీగ 

మెలికలు తిరిగితె..  ఒక అందం

ఆ మేనితీగ వలపుల పందిట 

అల్లుకుంటే.. ఒక అందం

మలయానిలమున చెలి ముంగురుల 

మబ్బులూగితే.. ఒక అందం

ఆ ముంగురులే చెలికాణి మోముపై 

ముసురుకుంటే.. ఒక అందం

అదే... ముద్దులొలికే అనుబంధం...


కనులు మాటలాడునని.. 

మనసు పాట పాడునని

కవితలల్లితి ఇన్నాళ్ళు.. 

అది కనుగొన్నాను ఈనాడు


చరణం 2:


వేచిన కలువ వెన్నెల జల్లుల 

విరిసిపోతే.. మధురానందం

ఆ కలువ చెలువ నెలరాయునిలో 

కరిగిపోతే.. మహదానందం

జగములనేలే చంద్రవదనతో 

ఎగిసిపోతే.. దివ్యానందం

ఎగిసి ఎగిసి పులకించిన మనసులు 

ఏకమైతే..  రసానందం...

అదే... యుగయుగాల అనుబంధం...


- పాటల ధనుస్సు  


సెలయేటి గలగలా చిరుగాలి కిలకిల | Selayeti Gala Gala | Song Lyrics | Tulasi (1974)

సెలయేటి గలగలా చిరుగాలి కిలకిల



చిత్రం : తులసి (1974)

రచన : ఆరుద్ర,

సంగీతం : ఘంటసాల,

గానం : బాలు సుశీల 


పల్లవి : 


సెలయేటి గలగల ఆ చిరుగాలి కిలకిల ఆ

సెలయేటి గలగల చిరుగాలి కిలకిల

సిగ్గుపడే బుగ్గలతో చెలి నవ్వుల మిల మిలా

చిలిపి చిలిపి చూపులతో నీ ఊహలే తళతళా


చరణం 1:


చందమామ కన్న నీ చెలిమి చల్లన

సన్నజాజి కన్న నీ మనసు తెల్లనా

నిన్ను కౌగిలించ గుండే ఝల్లనా ఆఆ

నిన్ను కౌగిలించ గుండే ఝల్లనా 

నిలువెల్ల పులకించె మెల్లమెల్లనా


సెలయేటి గలగల ఆ చిరుగాలి కిలకిల ఆ

సెలయేటి గలగల చిరుగాలి కిలకిల

సిగ్గుపడే బుగ్గలతో చెలి నవ్వుల మిలమిలా

చిలిపి చిలిపి చూపులతో నీ ఊహలే తళతళా


చరణం 2:


పసి నిమ్మపండు కన్న నీవు పచ్చనా

ఫలియించిన మన వలపే వెచ్చవెచ్చనా

అనురాగం ఏదేదో అమరభావనా ఆ

అనురాగం ఏదేదో అమరభావనా ఆ 

అది నీవు దయచేసిన గొప్ప దీవెనా


సెలయేటి గలగల ఆ చిరుగాలి కిలకిలఆ

సెలయేటి గలగల చిరుగాలి కిలకిల

సిగ్గుపడే బుగ్గలతో చెలి నవ్వుల మిలమిలా

చిలిపి చిలిపి చూపులతో నీ ఊహలే తళతలా


- పాటల ధనుస్సు  


25, మే 2024, శనివారం

వేషము మార్చెను భాషను మార్చెను | Veshamu Marchenu | Song Lyrics | Gundamma Katha (1962)

వేషము మార్చెను భాషను మార్చెను



చిత్రం : గుండమ్మ కథ (1962)

సంగీతం : ఘంటసాల,

గీతరచయిత : పింగళి నాగేంద్రరావు  

నేపధ్య గానం : ఘంటసాల, పి లీల 


పల్లవి:


వేషము మార్చెను... హోయ్..

భాషను మార్చెను... హోయ్..

మోసము నేర్చెనూ..ఉ..ఉ....

అసలు తానే మారెను...


అయినా మనిషి మారలేదు

ఆతని మమత తీరలేదు..

మనిషి మారలేదు

ఆతని మమత తీరలేదు..


చరణం 1:


కృరమృగమ్ముల కోరలు తీసెను

ఘోరారణ్యములాక్రమించెను

కృరమృగమ్ముల కోరలు తీసెను

ఘోరారణ్యములాక్రమించెను


హిమాలయముపై జండా పాతెను

హిమాలయముపై జండా పాతెను

ఆకాశంలో షికారు చేసెను

అయినా మనిషి మారలేదు

ఆతని కాంక్ష తీరలేదు...


చరణం 2:


పిడికిలి మించని హృదయములో

కడలిని మించిన ఆశలు దాచెను

కడలిని మించిన ఆశలు దాచెను

వేదికలెక్కెను..వాదము చేసెను..

వేదికలెక్కెను..వాదము చేసెను..

త్యాగమె మేలని బోధలు చేసెను


అయినా మనిషి మారలేదు

ఆతని బాధ తీరలేదు..


చరణం 3:


వేషమూ మార్చెను.. 

భాషనూ మార్చెను,

మోసము నేర్చెను.. 

తలలే మార్చెను...

అయినా మనిషి మారలేదు... 

ఆతని మమత తీరలేదు..


ఆ...ఆహహాహాహ ఆహాహహా...

ఓ... ఓహొహోహోహో 

ఓహోహొహో...


- పాటల ధనుస్సు 


సన్నగ వీచే చల్ల గాలికి | Sannaga veeche challa galiki | Song Lyrics | Gundamma Katha (1962)

సన్నగ వీచే చల్ల గాలికి



చిత్రం : గుండమ్మ కథ (1962)

సంగీతం : ఘంటసాల,

గీతరచయిత : పింగళి నాగేంద్రరావు  

నేపధ్య గానం : సుశీల 


పల్లవి:


సన్నగ వీచే చల్ల గాలికి

కనులు మూసినా కలలాయే

తెల్లని వెన్నెల పానుపు పై ఆ......

కలలో వింతలు కననాయే


సన్నగ వీచే చల్ల గాలికి

కనులు మూసినా కలలాయే

తెల్లని వెన్నెల పానుపు పై

ఆ కలలో వింతలు కననాయే..


అవి తలచిన ఏమో సిగ్గాయే


కనులు తెరచినా నీవాయే

నే కనులు మూసినా నీవాయే

కనులు తెరచినా నీవాయే


చరణం 1:


నిదురించిన నా హృదయమునెవరో

కదిలించిన సడి విననాయే

నిదురించిన నా హృదయమునెవరో

కదిలించిన సడి విననాయే


కలవరపడి నే కనులు తెరువ

నా కంటి పాపలో నీవాయే

ఎచట చూచినా నీవాయే


కనులు తెరచినా నీవాయే

నే కనులు మూసినా నీవాయే

కనులు తెరచినా నీవాయే


చరణం 2:


మేలుకొనిన నా మదిలో యేవో

మెల్లని పిలుపులు విననాయే

మేలుకొనిన నా మదిలో యేవో

మెల్లని పిలుపులు విననాయే


ఉలికిపాటుతో కలయ వెతక

నా హృదయ ఫలకమున నీవాయే


కనులు తెరచినా నీవాయే

నే కనులు మూసినా నీవేనాయే


- పాటల ధనుస్సు 

23, మే 2024, గురువారం

ఎంత హాయి ఈ రేయి | Entha Hayi Eereyi | Song Lyrics | Gundamma Katha (1962)

ఎంత హాయి ఈ రేయి ఎంత మధురం ఈ హాయి



చిత్రం : గుండమ్మ కథ (1962)

సంగీతం : ఘంటసాల,

గీతరచయిత : పింగళి నాగేంద్రరావు  

నేపధ్య గానం : ఘంటసాల, సుశీల 


పల్లవి :


ఎంత హాయి

ఎంత హాయి ఈ రేయి 

ఎంత మధురం ఈ హాయి

ఎంత హాయి ఈ రేయి 

ఎంత మధురం ఈ హాయి

చందమామ చల్లగా 

మత్తు మందు చల్లగా

ఆ చందమామ చల్లగా 

పన్నీటి జల్లు చల్లగా

ఎంత హాయి

ఎంత హాయి ఈ రేయి 

ఎంత మధురం ఈ హాయి

ఎంత హాయి


చరణం 1 :


ఒకరి చూపులోకరి పైన 

విరి తూపులు విసరగా

ఒకరి చూపులోకరి పైన 

విరి తావులు వీచగా

విరి తావుల పరవడిలో 

విరహమతిశయింపగా

ఆ విరి తావుల గుమగుమలో 

మేను పరవసింపగా

ఎంత హాయి

ఎంత హాయి ఈ రేయి 

ఎంత మధురం ఈ హాయి

ఎంత హాయి


చరణం 2 :


కానరాని కోయిలలు 

మనల మేలు కొలుపగా

కానరాని కోయిలలు 

మనకు జోల పాడగా

మధుర భావ లాహిరిలో 

మనము తూలి పోవగా

ఆ మధుర భావ లహరిలో 

మనము తేలి పోవగా

ఎంత హాయి


ఎంత హాయి ఈ రేయి 

ఎంత మధురం ఈ హాయి

చందమామ చల్లగా 

మత్తు మందు చల్లగా

ఎంత హాయి.. ఈ రేయి


- పాటల ధనుస్సు 

20, మే 2024, సోమవారం

కొలు కోలోయన్న కోలో నా సామి | Kolukoloyanna kolo na sami | Song Lyrics | Gundamma Katha (1962)

కొలు కోలోయన్న కోలో నా సామి



చిత్రం : గుండమ్మ కథ (1962)

సంగీతం : ఘంటసాల,

గీతరచయిత : పింగళి నాగేంద్రరావు  

నేపధ్య గానం : ఘంటసాల, సుశీల 


పల్లవి :


కొలు కోలోయన్న కోలో నా సామి

కొమ్మలిద్దరు మాంచి జోడు

కొలు కోలోయన్న కోలో నా సామి

కొమ్మలిద్దరు మాంచి జోడు

మేలు మేలోయన్న మేలో నారంగ

కొమ్మలకు వచ్చింది ఈడు

మేలు మేలోయన్న మేలో నారంగ

కొమ్మలకు వచ్చింది ఈడు

ఈ ముద్దు గుమ్మలకు చూడాలి జోడు

ఉఉఉ ఉఉఉ ఉఉఉ


కొలు కోలోయన్న కోలో నా సామి

కొమ్మలిద్దరు మాంచి జోడు

అహఆ...ఆఆఆ..ఆఆఆ..ఆఆఆ..ఆ

ఓహొహో..ఓఓఓ..ఓఓఓ..ఓఓఓ..ఓ


చరణం 1 :


బాల బాలోయన్న బాలో చిన్నమ్మి

అందాల గారాల బాల

బాల బాలోయన్న బాలో చిన్నమ్మి

అందాల గారాల బాల

ఓఓఓ


బేలొ బేలోయన్న బేలో పెద్దమ్మి

చిలుకలా కులికేను చాలా

బేలొ బేలోయన్న

దిద్దినకదిన దిద్దినకదిన దిద్దినకదిన దిన్


హేయ్.బేలొ బేలోయన్న బేలో పెద్దమ్మి

చిలుకలా కులికేను చాలా

ఈ బేల పలికితే ముత్యాలురాల

ఉఉఉ ఉఉఉ ఉఉఉ

కొలు కోలోయన్న కోలో నా సామి

కొమ్మలిద్దరు మాంచి జోడు

అహఆ...ఆఆఆ..ఆఆఆ..ఆఆఆ..ఆ

ఓహొహో..ఓఓఓ..ఓఓఓ..ఓఓఓ..ఓ


చరణం 2 :


ముక్కుపైనుంటాది కోపం చిట్టెమ్మ

మనసేమో మంచీది పాపం

ముక్కుపైనుంటాది కోపం చిట్టెమ్మ

మనసేమో మంచీది పాపం

ఓఓఓ


ఇంటికి వెలుగైన దీపం బుల్లెమ్మా

కంట చూసిన పోవు తాపం....

ఇంటికి వెలుగైన దీపం బుల్లెమ్మా

కంట చూసిన పోవు తాపం

జంటుంటే ఎందు రానీదు ఏ లోపం

ఉఉఉ ఉఉఉ ఉఉఉ


కొలు కోలోయన్న కోలో నా సామి

కొమ్మలిద్దరు మాంచి జోడు

అహఆ...ఆఆఆ..ఆఆఆ..ఆఆఆ..ఆ

ఓహొహో..ఓఓఓ..ఓఓఓ..ఓఓఓ..ఓ


- పాటల ధనుస్సు  


19, మే 2024, ఆదివారం

చూసెనులే నా కనులే చూడని వింత | Chusenule naa kanule | Song Lyrics | Nenu Manishine (1971)

చూసెనులే నా కనులే చూడని వింత 



చిత్రం : నేను మనిషినే (1971)

రచన : సి నారాయణ రెడ్డి,

సంగీతం : వేదాచలం 

గానం : బాలు సుశీల 


పల్లవి:


చూసెనులే నా కనులే చూడని వింతా

చూడగనే ఝల్లుమనే నా మనసంతా

దోచిన ఆ దొర ఎవడో కాచుకుంటిని

వేచి వేచి వీలులేక వేగిపోతిని


చూసెనులే నా కనులే చూడని వింతా

చూడగనే ఝల్లుమనే నా మనసంతా

దోచిన ఆ చూపులనే దాచుకుంటిని

వేచి వేచి వీలులేక వేగిపోతిని..


చరణం: 1


పువ్వులాగ నవ్వి నా పొంత చేరినాడు

కానరాని ముల్లు ఎదలోన నాటినాడు

పువ్వులాగ నవ్వి నా పొంత చేరినాడు

కానరాని ముల్లు ఎదలోన నాటినాడు

ముళ్ళులేని గులాబిలు ముద్దులొలుకునా

ఉరుము లేక మెరుపు లేక వాన కురియునా


చూసెనులే నా కనులే చూడని వింతా

చూడగనే ఝల్లుమనే నా మనసంతా

దోచిన ఆ చూపులనే దాచుకుంటిని

వేచి వేచి వీలులేక వేగిపోతిని..


చరణం: 2


కలల మేడలోన నను ఖైదు చేసినాడు

కాలు కదపకుండా ఒక కట్టె వేసినాడు

కలల మేడలోన నను ఖైదు చేసినాడు

కాలు కదపకుండా ఒక కట్టె వేసినాడు

కలల కన్న మధురమైన కాంక్షలుండునా

వలపులోన ఖైదుకన్న తలుపులుండునా


చూసెనులే నా కనులే చూడని వింతా

చూడగనే ఝల్లుమనే నా మనసంతా

దోచిన ఆ చూపులనే దాచుకుంటిని

వేచి వేచి వీలులేక వేగిపోతిని..


చరణం: 3


విరహమెంత బరువో నీ వింత నవ్వు తెలిపే

కలలు ఎంత చురుకో నీ కంటి ఎరుపు తెలిపే

విరహమెంత బరువో నీ వింత నవ్వు తెలిపే

కలలు ఎంత చురుకో నీ కంటి ఎరుపు తెలిపే

విరహ రాత్రి రేపు మాపు కరగకుండునా

వేచి యున్న వేగు పూలు విరియకుండునా


చూసెనులే నా కనులే చూడని వింతా

చూడగనే ఝల్లుమనే నా మనసంతా

దోచిన ఆ దొర ఎవడో కాచుకుంటిని

వేచి వేచి వీలులేక వేగిపోతిని..


- పాటల ధనుస్సు  


ప్రేమయాత్రలకు బృందావనము | Prema Yatralaku Brindavanamu | Song Lyrics | Gundamma Katha (1962)

ప్రేమయాత్రలకు బృందావనము 



చిత్రం : గుండమ్మ కథ (1962)

సంగీతం : ఘంటసాల,

గీతరచయిత : పింగళి నాగేంద్రరావు  

నేపధ్య గానం : ఘంటసాల, సుశీల 

 

పల్లవి :


ప్రేమయాత్రలకు బృందావనము 

నందనవనము యేలనో

కులుకులొలుకు చెలి చెంతనుండగా 

వేరే స్వర్గము యేలనో

కులుకులొలుకు చెలి చెంతనుండగా 

వేరే స్వర్గము యేలనో


ప్రేమయాత్రలకు బృందావనము 

నందనవనము యేలనో

తీర్థయాత్రలకు రామేశ్వరము 

కాశీప్రయాగలేలనో

ప్రేమించిన పతి ఎదుటనుండగా 

వేరే దైవము యేలనో

ప్రేమించిన పతి ఎదుటనుండగా 

వేరే దైవము యేలనో


తీర్థయాత్రలకు రామేశ్వరము 

కాశీప్రయాగలేలనో


చరణం 1 :


చెలి నగుమోమె చంద్రబింబమై 

పగలే వెన్నెల కాయగా

చెలి నగుమోమె చంద్రబింబమై 

పగలే వెన్నెల కాయగా

సఖి నెరిచూపుల చల్లదనంతో 

జగమునె ఊటీ శాయగా

సఖి నెరిచూపుల చల్లదనంతో 

జగమునె ఊటీ శాయగా


ప్రేమయాత్రలకు కొడైకెనాలు 

కాశ్మీరాలూ యేలనో


చరణం 2 :


కన్నవారినే మరువజేయుచూ 

అన్ని ముచ్చటలు తీర్చగా

కన్నవారినే మరువజేయుచూ 

అన్ని ముచ్చటలు తీర్చగా


పతి ఆదరణే సతికి మోక్షమని 

సర్వశాస్త్రములు చాటగా

పతి ఆదరణే సతికి మోక్షమని 

సర్వశాస్త్రములు చాటగా


తీర్థయాత్రలకు కైలాసాలు 

వైకుంఠాలూ యేలనో

అన్యోన్యంగా దంపతులుంటే 

భువికి స్వర్గమే దిగిరాదా


ప్రేమయాత్రలకు బృందావనము 

నందనవనము యేలనో


- పాటల ధనుస్సు  


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు