RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

21, జులై 2023, శుక్రవారం

ఆడించదా వయసు పాడించదా | Adinchada vayasu | Song Lyrics | Andala Rasi (1980)

ఆడించదా వయసు పాడించదా



చిత్రం :  అందాల రాశి (1980)

సంగీతం :  రమేశ్ నాయుడు

గీతరచయిత :  వేటూరి

నేపథ్య గానం :  బాలు  



పల్లవి :


ఆడించదా వయసు పాడించదా... 

చూడముచ్చటగా సొగసు ఊరించదా

ఆడించదా వయసు పాడించదా... 

చూడముచ్చటగా సొగసు ఊరించదా

ఆడించదా వయసు పాడించదా



చరణం 1 :


చురుకు చురుకు ఆడపిల్ల చూపులు... 

ఉరకలెయ్యి కోడెగాడి కోర్కెలు

చురుకు చురుకు ఆడపిల్ల చూపులు... 

ఉరకలెయ్యి కోడెగాడి కోర్కెలు


రెండిటికి బంధమేసి ఇద్దరినీ ఒకటి చేసి

ముద్దొచ్చే పండుగలో మురిపించదా...

హాయి కురిపించదా... మేను మరపించదా



ఆడించదా వయసు పాడించదా... 

చూడముచ్చటగా సొగసు ఊరించదా

ఆడించదా వయసు పాడించదా... 

చూడముచ్చటగా సొగసు ఊరించదా

ఆడించదా వయసు పాడించదా 



చరణం 2 :



రమణిలోన ఉంటుందొక రాధా... 

మమత ఉన్న మనిషే మాధవుడు

రమణిలోన ఉంటుందొక రాధా... 

మమత ఉన్న మనిషే మాధవుడు


ఈడుజోడు కుదిరితే తోడునీడ కుదిరితే...

వేడుకగా ప్రేమగీతి పలికించదా

తనివి ఒలికించదా... బ్రతుకు పులకించదా


ఆడించదా వయసు పాడించదా... 

చూడముచ్చటగా సొగసు ఊరించదా

ఆడించదా వయసు పాడించదా... 

చూడముచ్చటగా సొగసు ఊరించదా

ఆడించదా వయసు పాడించదా


పాటల ధనుస్సు 


20, జులై 2023, గురువారం

కన్నయ్యా నల్లని కన్నయ్యా | Kannayya Nallani Kannayya | Song Lyrics | Nadee Adajanme (1965)

కన్నయ్యా నల్లని కన్నయ్యా



చిత్రం : నాదీ ఆడజన్మే (1965) 

సంగీతం : టి.వి. రాజు 

గీతరచయిత : ఆర్.సుదర్శనం

నేపధ్య గానం : సుశీల 


పల్లవి: 


కన్నయ్యా..ఆ.. నల్లని కన్నయ్యా..ఆ.. 

నిన్ను కనలేని కనులుండునా 

కన్నయ్యా..ఆ.. నల్లని కన్నయ్యా..ఆ.. 

నిన్ను కనలేని కనులుండునా 

నిన్ను ప్రేమింతురే.. నిన్ను పూజింతురే 

నన్ను గనినంత నిందింతురే 


కన్నయ్యా..ఆ.. నల్లని కన్నయ్యా..ఆ.. 

నిన్ను కనలేని కనులుండునా 

నిన్ను ప్రేమింతురే.. నిన్ను పూజింతురే 

నన్ను గనినంత నిందింతురే 

కన్నయ్యా..ఆ.. నల్లని కన్నయ్యా..ఆ.. 

నిన్ను కనలేని కనులుండునా..ఆ.. 


చరణం 1: 


గుణమెంత లేనింట పడవైతువా.. 

నన్ను వెలివేయువారికే బలిచేతువా 

గుణమెంత లేనింట పడవైతువా.. 

నన్ను వెలివేయువారికే బలిచేతువా 

సిరి జూచుకుని నన్ను మరిచావయా.. 

సిరి జూచుకుని నన్ను మరిచావయా.. 

మంచి గుడి చూచుకొని నీవు మురిసేవయా 


కన్నయ్యా..ఆ.. నల్లని కన్నయ్యా..ఆ.. 

నిన్ను కనలేని కనులుండునా 


చరణం 2: 


బంగారు మనసునే ఒసగినావు.. 

అందు అందాల గుణమునే పొదిగినావు 

బంగారు మనసునే ఒసగినావు.. 

అందు అందాల గుణమునే పొదిగినావు 


మోముపై నలుపునే పులిమినావు.. 

మోముపై నలుపునే పులిమినావు.. 

ఇట్లు నన్నేల బ్రతికించదలచినావు 


కన్నయ్యా..ఆ.. నల్లని కన్నయ్యా..ఆ.. 

నిన్ను కనలేని కనులుండునా 

నిన్ను ప్రేమింతురే.. నిన్ను పూజింతురే 

నన్ను గనినంత నిందింతురే 

కన్నయ్యా..ఆ.. నల్లని కన్నయ్యా..ఆ.. 

నిన్ను కనలేని కనులుండునా


పాటల ధనుస్సు  


19, జులై 2023, బుధవారం

చిన్నారి పొన్నారి పువ్వు | Chinnari Ponnari Puvvu | Song Lyrics | Nadee Adajanme (1965)

చిన్నారి పొన్నారి పువ్వు



చిత్రం: నాదీ ఆడజన్మే (1965)

సంగీతం: ఆర్. సుదర్శన్

గీతరచయిత: దాశరథి

నేపధ్య గానం: ఘంటసాల, సుశీల


పల్లవి:


చిన్నారి పొన్నారి పువ్వు

విరబూసి విరబూసి నవ్వు

మన ఇంటి పొదరింటి పువ్వూ

నిను చూసి నను చూసి నవ్వూ


చిన్నారి పొన్నారి పువ్వు

విరబూసి విరబూసి నవ్వు

మన ఇంటి పొదరింటి పువ్వూ

నిను చూసి నను చూసి నవ్వూ


చరణం 1:


ఆహ హా..ఊహు హూ..

ల.ల.ల.ల.ల.ల.లా.లా.

ల.ల.ల.ల.ల.ల.లా.లా.


హృదయాన కదలాడు బాబూ

రేపు ఉయ్యాల జంపాలలూగూ


హృదయాన కదలాడు బాబూ

రేపు ఉయ్యాల జంపాలలూగూ


పసివాడు పలికేటి మాటా

ముత్యాల రతనాల మూటా


చిన్నారి పొన్నారి పువ్వు

విరబూసి విరబూసి నవ్వు

మన ఇంటి పొదరింటి పువ్వూ

నిను చూసి నను చూసి నవ్వూ


చరణం 2:


ఆహ హా..ఊహు హూ..

ల.ల.ల.ల.ల.ల.లా.లా.

ల.ల.ల.ల.ల.ల.లా.లా.


ఒడిలోన పవళించు వేళా

నేను పాడేను ఒక జోల పాటా


ఒడిలోన పవళించు వేళా

నేను పాడేను ఒక జోల పాటా


కనుమూసి నిదురించు బాబూ

కలలందు జోగాడగలడు


చిన్నారి పొన్నారి పువ్వు

విరబూసి విరబూసి నవ్వు

మన ఇంటి పొదరింటి పువ్వూ

నిను చూసి నను చూసి నవ్వూ


పాటల ధనుస్సు 


17, జులై 2023, సోమవారం

రాధను నేనైతే నీ రాధను నేనైతే | Radhanu nenaithe | Song Lyrics | Inspector Bharya (1970)

రాధను నేనైతే నీ రాధను నేనైతే



చిత్రం :  ఇన్స్ పెక్టర్ భార్య  (1970)

రచన           : సి నారాయణ రెడ్డి 

సంగీతం :  కె.వి. మహదేవన్

నేపధ్య గానం :  మోహన్ రాజ్, సుశీల 



పల్లవి : 


రాధను నేనైతే... నీ రాధను నేనైతే

రాధను నేనైతే... నీ రాధను నేనైతే


నిన్ను మలచుకుంటాను.. నా మురళిగా

నిన్ను చేసుకుంటాను.. నా తరుణిగా

నిన్ను మలచుకుంటాను.. నా మురళిగా

నిన్ను చేసుకుంటాను.. నా తరుణిగా 


చరణం 1 :


తోటనిండా.. మల్లియలు 

తుంటరి పాటల తుమ్మేదలు

తోటనిండా.. మల్లియలు 

తుంటరి పాటల తుమ్మేదలు


అల్లరి తుమ్మేదల అలికిడి వినగానె

అల్లరి తుమ్మేదల అలికిడి వినగానె

మల్లెలు సవరించు పై ఎదలు


గడసరి చినవాడు తోడుగ ఉంటే 

కరగును నును సిగ్గు పరదాలు...

గడసరి చినవాడు తోడుగ ఉంటే 

కరగును నునుసిగ్గు పరదాలు...

చిలిపిగ నను నీవు చేరుకుంటే.. 

wజల జల పొంగును పరువాలు


రాధవు నీవైతే.. నా రాధవు నీవైతే

నిన్ను మలచుకుంటాను.. నా మురళిగా

నిన్ను చేసుకుంటాను.. నా తరుణిగా 


చరణం 2 :


రాధ అంటే.. ఎవ్వరదీ

మాధవు పాదాల.. పువ్వు అది

రాధ అంటే.. ఎవ్వరదీ

మాధవు పాదాల.. పువ్వు అది

అంతటి స్వామి.. చెంతగ ఉంటేనే

అంతటి స్వామి.. చెంతగ ఉంటేనే

ఆమె మనసు పూచేది


తీయగ సోకే పిల్లగాలికి.. 

పూయని పువ్వే ఉంటుందా

తీయగ సోకే పిల్లగాలికి.. 

పూయని పువ్వే ఉంటుందా

కన్నుగీటే వన్నెకానికి.. 

కరగని జవ్వని వుంటుందా


రాధను నేనైతే... నీ రాధను నేనైతే

నిన్ను మలచుకుంటాను.. నా మురళిగా

నిన్ను చేసుకుంటాను.. నా తరుణిగా


పాటల ధనుస్సు  


సామజవరగమనా | Samajavaragamana | Song Lyrics | Sankarabharanam (1980)

సామజవరగమనా



చిత్రం :  శంకరాభరణం (1980)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత : త్యాగయ్య, వేటూరి

నేపథ్య గానం :  బాలు, జానకి 


పల్లవి:


సామజవరగమనా..

సామజవరగమనా సాధుహృత్ సారసాబ్జపాల

కాలాతీత విఖ్యాత.. 

సామజవరగమనా సాధుహృత్ సారసాబ్జపాల

కాలాతీత విఖ్యాత.. సామజవరగమన..



సామనిగమజ సుధా...

సామనిగమజ సుధామయ గాన విచక్షణ గుణశీల

దయాలవాల మాం పాలయ..

సామనిగమజ సుధామయ గాన విచక్షణ గుణశీల

దయాలవాల మాం పాలయ..


సామజవరగమనా...


చరణం 1:


ఆమని కోయిలా.. 

ఇలా నా జీవనవేణువులూదగా

ఆమని కోయిలా.. 

ఇలా నా జీవనవేణువులూదగా

మధురలాలసల మధుప లాలనల

మధురలాలసల మధుప లాలనల 

పెదవిలోని మధువులాను

వ్రతము పూని జతకు చేరగా...


నిసా దనీ మదా గమా

సమమగ గదదమ మనినిద సనిదమ దనిసా దనిసా

గదదమ మనినిద దససని గపనిద నిసగ నిసగ

సమగమ గససని నిగసగ సనినిద దనినిద 

మదదని గమదని సనిదమగస



సామజవరగమనా సాధుహృత్ సారసాబ్జపాల

కాలాతీత విఖ్యాత.. సామజవరగమన



చరణం 2:


వేసవి రేయిలా.. 

ఇలా నా ఎదలో మల్లెలు చల్లగా

వేసవి రేయిలా.. 

ఇలా నా ఎదలో మల్లెలు చల్లగా

మదిని కోరికలు మదన గీతికలు

మదిని కోరికలు మదన గీతికలు

పరువమంత విరుల  పాన్పు పరచి నిన్ను

పలుకరించగా... 


ఊ..ఆ...గమా గమదమ గమా

గమనిద మదా మదనిస దనినినిని

మద నినినిని

గమదదదద మదనినిని

గమద సాసా సానీ సాగా

సగమగ గమదని గమదని

మదనిస మదనిస దనిసగమా....ఆ.. ఆ..


పాటల ధనుస్సు  


16, జులై 2023, ఆదివారం

దొరకునా ఇటువంటి సేవ | Dorakuna ituvanti seva | Song Lyrics | Sankarabharanam (1980)

దొరకునా ఇటువంటి సేవ



చిత్రం :  శంకరాభరణం (1980)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  వేటూరి

నేపథ్య గానం :  బాలు, వాణీజయరాం 



పల్లవి :


దొరకునా... దొరకునా... దొరకునా...

దొరకునా ఇటువంటి సేవ...

దొరకునా ఇటువంటి సేవ...

నీ పద రాజీవముల చేరు నిర్వాణ 

సోపాన మధిరోహణము సేయు త్రోవ


దొరకునా ఇటువంటి సేవ...

నీ పద రాజీవముల చేరు నిర్వాణ 

సోపాన మధిరోహణము సేయు త్రోవ

దొరకునా ఇటువంటి సేవ...


చరణం 1 :


రాగాలనంతాలు.. నీ వేయి రూపాలు..

భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు

రాగాలనంతాలు.. నీ వేయి రూపాలు

భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు



నాదాత్మకుడవై... నాలోన చెలగి

నా ప్రాణదీపమై నాలోన వెలిగే

ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ...

నాదాత్మకుడవై... నాలోన చెలగి

నా ప్రాణదీపమై.. నాలోన వెలిగే

నిన్ను కొల్చు వేళ దేవాదిదేవా...

దేవాదిదేవా... ఆ... 


దొరకునా ఇటువంటి సేవ...

నీ పద రాజీవముల చేరు నిర్వాణ 

సోపాన మధిరోహణము సేయు త్రోవ

దొరకునా ఇటువంటి సేవ...


చరణం 2 :


ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు

స్పందించు నవనాడులే వీణాగానాలు

నడలూ ఎదలోని సడులే మృదంగాలు


ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు

స్పందించు నవనాడులే వీణాగానాలు

నడలూ ఎదలోని సడులే మృదంగాలు



నాలోని జీవమై... నాకున్న దైవమై

వెలుగొందువేళ... మహానుభావా

మహానుభావా....


దొరకునా....  సేవ...

నీ పద రాజీవముల చేరు నిర్వాణ 

సోపాన మధిరోహణము సేయు త్రోవ

దొరకునా ఇటువంటి సేవ... 

దొరకునా ఇటువంటి సేవ...


పాటల ధనుస్సు 


15, జులై 2023, శనివారం

బ్రోచేవారెవరురా | Brochevarevarura | Song Lyrics | Sankarabharanam (1980)

బ్రోచేవారెవరురా



చిత్రం :  శంకరాభరణం (1980)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  మైసూర్ వాసుదేవాచార్య

నేపథ్య గానం :  బాలు, వాణీజయరాం 



పల్లవి :


బ్రోచేవారెవరురా నిను విన... నిను విన...

రఘువరా... రఘువరా...

నను బ్రోచేవారెవరురా నిను విన రఘువరా...


నీ చరణాం భుజములు నే

నీ చరణాం భుజములు నే

విడజాల కరుణాలవాల

బ్రోచేవారెవరురా... ఆ... ఆ 


చరణం 1 :


ఓ చతురా!ననాది వందిత.. నీకు పరాకేలనయ్యా

ఓ చతురా! ననాది వందిత.. నీకు పరాకేలనయ్యా

ఓ చతురా! ననాది వందిత.. నీకు పరాకేలనయ్యా


నీ చరితము పొగడలేని నా చింత తీర్చి 

వరములీచ్చి వేగమే..

నీ చరితము పొగడలేని నా చింత తీర్చి 

వరములీచ్చి వేగమే..


స సనిదపద నిస నినిదదపమ

పాదమ గా మా పదాని సనిదపమ నీదాపమా

గమపద మగరిస సమా గమపద మాపదని

ససరిని నినిసదా దదనిపాద మపదని

సనిదప మగమనిదని పద మా పదనీ

సమా గరిస రిసానిదప సానిదపమ గామపదని

బ్రోచేవారెవరురా... ఆ ఆ



చరణం 2 :


సీతాపతే నాపై నీకభిమానము లేదా

సీతాపతే నాపై నీకభిమానము లేదా

వాతాత్మజార్చిత పాద నా మొరలను వినరాదా

భాసురముగ కరిరాజును బ్రోచిన 

వాసుదేవుడవు నీవు కదా

భాసురముగ కరిరాజును బ్రోచిన 

వాసుదేవుడవు నీవు కదా

భాసురముగ కరిరాజును బ్రోచిన 

వాసుదేవుడవు నీవు కదా

నా పాతకమెల్ల పోగొట్టి గట్టిగ నా... 

చేయి పట్టి విడువక


స సనిదపద నిస నినిదదపమా

పాదమా గా మా పాదాని సనిదపమ నీదపమ

గమపద మగరిస సమా గమపద మాపదని

ససరిని నినిసదా దదనిపాద మపదని

సనిదప మగమనిదని పద మా పదనీ

సమా గరిస రిసానిదప సానిదపమా గామపదని

బ్రోచేవారెవరురా ఆ ఆ...


పాటల ధనుస్సు  





14, జులై 2023, శుక్రవారం

రాగం తానం పల్లవి | Ragam Tanam Pallavi | Song Lyrics | Sankarabharanam (1980)

రాగం తానం పల్లవి



చిత్రం :  శంకరాభరణం (1980)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  వేటూరి

నేపథ్య గానం :  బాలు  



పల్లవి :


రాగం తానం పల్లవి..రాగం తానం పల్లవి

నా మదిలోనె కదలాడి కడతేరమన్నవి

రాగం తానం పల్లవి..రాగం తానం పల్లవి

నా మదిలోనె కదలాడి కడతేరమన్నవి


రాగం తానం పల్లవి 



చరణం 1 :


నాద వర్తులై వేద మూర్తులై..

నాద వర్తులై వేద మూర్తులై

రాగ కీర్తులై త్రిమూర్తులై

రాగం తానం పల్లవి



చరణం 2 :


కృష్ణా తరంగాల సారంగ రాగాలు

కృష్ణలీలా తరింగిణీ భక్తి గీతాలు

కృష్ణా తరంగాల సారంగ రాగాలు

కృష్ణలీలా తరింగిణీ భక్తి గీతాలు


సస్యకేదారాల స్వరస గాంధారాలు

సస్యకేదారాల స్వరస గాంధారాలు


సరసహృదయ క్షేత్ర విమల గాంధర్వాలు

సరసహృదయ క్షేత్ర విమల గాంధర్వాలు

క్షీర సాగర శయన దేవ గాంధారిలో..

ఆ..ఆ..ఆ..ఆ.

క్షీర సాగర శయన దేవ గాంధారిలో

నీ పద కీర్తన సేయగ ప మా ప ద ని

రాగం తానం పల్లవి


చరణం 3 :


శ్రుతిలయలే జననీ జనకులు కాగా

భావాల రాగాల తాళాల తేలి

శ్రుతిలయలే జననీ జనకులు కాగా

భావాల రాగాల తాళాల తేలి


శ్రీ చరణ మందార మధుపమ్మునై వాలి

శ్రీ చరణ మందార మధుపమ్మునై వాలి

నిర్మల నిర్వాణ మధుధారలే గ్రోలి

నిర్మల నిర్వాణ మధుధారలే గ్రోలి

భరతాభినయవేద ఆ ఆ... ఆ...

ఆ.. ఆ.. ఆ.. అ

భరతాభినయవేద వ్రత దీక్షబూని


కైలాస సదన కాంభోజి రాగాన

కైలాస సదన కాంభోజి రాగాన

నీ పద నర్తన సేయగ ప దా ని

రాగం తానం పల్లవి


పాటల ధనుస్సు  


13, జులై 2023, గురువారం

ఓంకార నాదానుసంధానమౌగానమే | Omkaranadanu | Song Lyrics | Sankarabharanam (1980)

ఓంకార నాదానుసంధానమౌగానమే



చిత్రం :  శంకరాభరణం (1980)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  వేటూరి

నేపథ్య గానం :  బాలు, జానకి  



పల్లవి :


ఓం... ఓం...

ఓంకార నాదాను సంధానమౌగానమే.. 

శంకరాభరణము

ఓంకార నాదాను సంధానమౌగానమే.. 

శంకరాభరణము

శంకరా భరణము...


శంకర గళ నిగళము ... శ్రీహరి పద కమలమూ

శంకర గళ నిగళము... శ్రీహరి పద కమలమూ

రాగరత్న మాలికా తరళమూ.. శంకరాభరణమూ... 



చరణం 1 :


శారద వీణా..... ఆ.....

శారద వీణా రాగ చంద్రికా.. పులకిత శారద రాత్రము..

శారద వీనా రాగ చంద్రికా.. పులకిత శారద రాత్రము..

నారద నీరద మహతీనినాద గమకిత శ్రావణ గీతము

నారద నీరద మహతీనినాద గమకిత శ్రావణ గీతము


రసికులకనురాగమై.. రసగంగలో తానమై...

రసికులకనురాగమై.. రసగంగలో తానమై

పల్లవించు సామవేద మంత్రము.... 

శంకరాభరణమూ

శంకరా భరణమూ... 


చరణం 2 :


అద్వైత సిద్ధికి.. అమరత్వ లబ్ధికి... 

గానమె సొపానము....

అద్వైత సిద్ధికి.. అమరత్వ లబ్ధికి.. 

గానమె సొపానము....


సత్వ సాధనకు.. సత్య శోధనకు.. 

సంగీతమే ప్రాణమూ

సత్వ సాధనకు.. సత్య శోధనకు ..

సంగీతమే ప్రాణమూ


త్యాగరాజ హృదయమై.. 

రాగరాజ నిలయమై..

త్యాగరాజ హృదయమై.. 

రాగరాజ నిలయమై..

ముక్తినొసగు భక్తి యోగ మార్గము.. 

మృతియెలేని సుధాలాప స్వర్గము

శంకరాభరణమూ..


ఓంకార నాదానుసంధానమౌగానమే 

శంకరాభరణమూ 



చరణం 3 :


పాదాని... శంకరాభరణము

పమగరి గమపదని.. శంకరాభరణము


సరిసా నిదప నిసరి దపమ గరిగ పమగ పమద 

పనిద సనిగరి శంకరాభరణము

ఆహా


దపా దమా మాపాదపా... మాపాదపా

దపా దమా మదపామగా... మదపామగా

గమమదదనినిరి మదదనినిరిరిగ

నిరిరిగగమమద సరిరిససనినిదదప.. 

శంకరాభరణమూ....


రీససాస రిరిసాస రీసాస సరిసరీస రిసరీసరీసనిద నీ నీ నీ

దాదనీని దదనీని దానీని దనిద దనిద దని దగరిసానిదప

దా దా ద

గరిగా మమగా

గరిగా మమగా

గరి గమపగా మపద మదపమ గరిసరి సరిగసరీ

గరి మగపమదప

మగపమదప నిదపమదప నిదసనిదప నిదసనిరిస

గరీసా గరిసనిదరీసా రిసనిదపసా గరిసనిద నిసనిదప

సనిదపమ నీసాని

నిసనిదపనీదా సనిదపమపా రిసనిదప 

సరిదపమ గమమగరి

గమదా

నిసనిపద మపా నిసనిదప నీ దపమగరి రిసనిదప

మగరిసరిసని... శంకరాభరణము

శంకరాభరణమూ...


పాటల ధనుస్సు  


12, జులై 2023, బుధవారం

శంకరా నాదశరీరా పరా | Sankara Naadasareerapara | Song Lyrics | Sankarabharanam (1980)

శంకరా... నాదశరీరా పరా



చిత్రం :  శంకరాభరణం (1980)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  వేటూరి

నేపథ్య గానం :  బాలు 



పల్లవి :


శంకరా... నాదశరీరా పరా...

వేదవిహారా హరా.. జీవేశ్వరా

శంకరా... నాదశరీరా పరా...

వేదవిహారా హరా జీవేశ్వరా

శంకరా... 



చరణం 1 :


ప్రాణము నీవని గానమె నీదని.. 

ప్రాణమె గానమనీ...

మౌన విచక్షణ.. గాన విలక్షణ.. 

రాగమె యోగమనీ...

ప్రాణము నీవని గానమె నీదని.. 

ప్రాణమె గానమనీ...

మౌన విచక్షణ.. గాన విలక్షణ.. 

రాగమె యోగమనీ...


నాదోపాసన చేసిన వాడను.. 

నీ వాడను నేనైతే

నాదోపాసన చేసిన వాడను.. 

నీ వాడను నేనైతే


ధిక్కరీంద్రజిత హిమగిరీంద్రసితకంధరా 

నీలకంధరా

క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్ణిద్ర గానమిది 

అవధించ రా...

విని తరించరా ...



శంకరా... నాదశరీరా పరా...

వేదవిహారా హరా జీవేశ్వరా

శంకరా... 


చరణం 2 :


మెరిసే మెరుపులు మురిసే పెదవుల 

చిరుచిరు నవ్వులు కాబోలు

ఉరిమే ఉరుములు సరిసరి నటనల 

సిరిసిరి మువ్వలు కాబోలు

మెరిసే మెరుపులు మురిసే పెదవుల 

చిరుచిరు నవ్వులు కాబోలు

ఉరిమే ఉరుములు సరిసరి నటనల 

సిరిసిరి మువ్వలు కాబోలు


పరవశాన శిరసూగంగా...  

ధరకు జారెనా శివగంగా

పరవశాన శిరసూగంగా...  

ధరకు జారెనా శివగంగా


నా గానలహరి నువు మునుగంగ

ఆనందవృష్టి నే తడవంగా ఆ... ఆ... ఆ... ఆ..


శంకరా... నాదశరీరా పరా...

వేదవిహారా హరా జీవేశ్వరా

శంకరా... శంకరా... శంకరా...


పాటల ధనుస్సు  


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు