RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

17, జులై 2023, సోమవారం

రాధను నేనైతే నీ రాధను నేనైతే | Radhanu nenaithe | Song Lyrics | Inspector Bharya (1970)

రాధను నేనైతే నీ రాధను నేనైతే



చిత్రం :  ఇన్స్ పెక్టర్ భార్య  (1970)

రచన           : సి నారాయణ రెడ్డి 

సంగీతం :  కె.వి. మహదేవన్

నేపధ్య గానం :  మోహన్ రాజ్, సుశీల 



పల్లవి : 


రాధను నేనైతే... నీ రాధను నేనైతే

రాధను నేనైతే... నీ రాధను నేనైతే


నిన్ను మలచుకుంటాను.. నా మురళిగా

నిన్ను చేసుకుంటాను.. నా తరుణిగా

నిన్ను మలచుకుంటాను.. నా మురళిగా

నిన్ను చేసుకుంటాను.. నా తరుణిగా 


చరణం 1 :


తోటనిండా.. మల్లియలు 

తుంటరి పాటల తుమ్మేదలు

తోటనిండా.. మల్లియలు 

తుంటరి పాటల తుమ్మేదలు


అల్లరి తుమ్మేదల అలికిడి వినగానె

అల్లరి తుమ్మేదల అలికిడి వినగానె

మల్లెలు సవరించు పై ఎదలు


గడసరి చినవాడు తోడుగ ఉంటే 

కరగును నును సిగ్గు పరదాలు...

గడసరి చినవాడు తోడుగ ఉంటే 

కరగును నునుసిగ్గు పరదాలు...

చిలిపిగ నను నీవు చేరుకుంటే.. 

wజల జల పొంగును పరువాలు


రాధవు నీవైతే.. నా రాధవు నీవైతే

నిన్ను మలచుకుంటాను.. నా మురళిగా

నిన్ను చేసుకుంటాను.. నా తరుణిగా 


చరణం 2 :


రాధ అంటే.. ఎవ్వరదీ

మాధవు పాదాల.. పువ్వు అది

రాధ అంటే.. ఎవ్వరదీ

మాధవు పాదాల.. పువ్వు అది

అంతటి స్వామి.. చెంతగ ఉంటేనే

అంతటి స్వామి.. చెంతగ ఉంటేనే

ఆమె మనసు పూచేది


తీయగ సోకే పిల్లగాలికి.. 

పూయని పువ్వే ఉంటుందా

తీయగ సోకే పిల్లగాలికి.. 

పూయని పువ్వే ఉంటుందా

కన్నుగీటే వన్నెకానికి.. 

కరగని జవ్వని వుంటుందా


రాధను నేనైతే... నీ రాధను నేనైతే

నిన్ను మలచుకుంటాను.. నా మురళిగా

నిన్ను చేసుకుంటాను.. నా తరుణిగా


పాటల ధనుస్సు  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు