RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

28, జులై 2023, శుక్రవారం

ఒడుపున్న పిలుపు ఒదిగున్న పులుపు | Odupunna Pilupu | Song Lyrics | Siri Siri Muvva (1978)

ఒడుపున్న పిలుపు ఒదిగున్న పులుపు



చిత్రం :  సిరి సిరి మువ్వ (1978)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  బాలు, సుశీల   



పల్లవి :



ఒడుపున్న పిలుపు ఒదిగున్న పులుపు

ఒక గొంతులోనే పలికింది

అది ఏ రాగమని నన్నడిగింది

ఒడుపున్న పిలుపు ఒదిగున్న పులుపు

ఒక గొంతులోనే పలికింది

అది ఏ రాగమని నన్నడిగింది 


అది మనవూరి కోకిలమ్మా 

నిన్నడిగింది కుశలమమ్మా

అది మనవూరి కోకిలమ్మా 

నిన్నడిగింది కుశలమమ్మా


నిజమేమొ తెలుపు నీ మనసు తెలుపు

ఎగిరేను మన వూరివైపు 

అది పదిమంది కామాట తెలుపు

నిజమేమొ తెలుపు నీ మనసు తెలుపు

ఎగిరేను మన వూరివైపు 

అది పదిమంది కామాట తెలుపు


గోదారల్లే ఎన్నెట్లో గోదారల్లే 

ఎల్లువ గోదారల్లే వెన్నెట్లో గోదారల్లె

ఎదలో ఏదోమాట రొదలో ఏదో పాట

గోదారల్లే ఎన్నెట్లో గోదారల్లే ఎల్లువ గోదారల్లే 


చరణం 1 :


అలలా ఎన్నెల గువ్వా ఎగిరెగిరి పడుతుంటే

గట్టుమీన రెల్లు పువ్వా బిట్టులికి పడుతుంటే

అలలా ఎన్నెల గువ్వా ఎగిరెగిరి పడుతుంటే

గట్టుమీన రెల్లు పువ్వా బిట్టులికి పడుతుంటే


ఏటివార లంకలోనా ఏటవాలు డొంకలోనా

ఏటివార లంకలోనా ఏటవాలు డొంకలోనా

వల్లంకి పిట్టా పల్లకిలోనా 

సల్లంగ మెల్లంగ ఊగుతు ఉంటే


గోదారల్లే ఎన్నెట్లో గోదారల్లే ఎల్లువ గోదారల్లే

వెన్నెట్లో గోదారల్లె ఎదలో 

ఏదోమాట రొదలో ఏదో పాట

గోదారల్లే ఎన్నెట్లో గోదారల్లే ఎల్లువ గోదారల్లే


పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

మన భారతంలో కౌరవులు పాండవులు | Mana Bharatamlo | Song Lyrics | Jagadekaveerudu Atiloka Sundari (1990)

 మన భారతంలో కౌరవులు పాండవులు చిత్రం: జగదేకవీరుడు అతిలోకసుందరి (1990) సంగీతం: ఇళయరాజా గీతరచయిత: వేటూరి నేపధ్య గానం: బాలు పల్లవి : హే హే రపరపప...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు