RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

23, జులై 2023, ఆదివారం

అందాలరాశి నీ అందచందాలు చూసి | Andala Rasi | Song Lyrics | Andala Rasi (1980)

అందాలరాశి నీ అందచందాలు చూసి



చిత్రం :  అందాల రాశి (1980)

సంగీతం :  రమేశ్ నాయుడు

గీతరచయిత :  వేటూరి

నేపథ్య గానం :  బాలు, శైలజ 




పల్లవి :


అందాలరాశి... నీ అందచందాలు చూసి

ఎన్నో గ్రంథాలు రాసి... 

తరించేనులే ప్రేయశి... ప్రేయశి


అందాలరాశి... నీ అందచందాలు చూసి

ఎన్నో గ్రంథాలు రాసి... 

తరించేనులే ప్రేయశి... ప్రేయశి

అందాలరాశి...



చరణం 1 :


నీ రూపు హృదయాలయ దీపికా... 

నీ చూపు ఉదయోదయ తారకా

నీ రూపు హృదయాలయ దీపికా... 

నీ చూపు ఉదయోదయ తారకా


నీ పలుకుల సడికి ఉలికిపడే ఊర్వశినై ఊగనీ

నీ మేను తగిలి  మెలిక తిరిగి మేనకనై ఆడనీ


ఆ.. నీవే నా జీవన బృందావన రాధికా

నీవే యువతీ జన నవమోహన గీతికా


అందాలరాశి... నీ అందచందాలు చూసి

ఎన్నో గ్రంథాలు రాసి... 

తరించేనులే ప్రేయశి... ప్రేయశి


చరణం 2 :


నీ మాట మంత్రాక్షర మాలికా... 

నీ మనసే మమతల మరుమల్లికా

నీ మాట మంత్రాక్షర మాలికా... 

నీ మనసే మమతల మరుమల్లికా


పురివిప్పిన నీ సొగసున మణిపురినే చూడనీ

గురి తప్పని నీ అడుగులు కూచిపూడి ఆడనీ


నీవేలే శ్రీశైల శిఖరాంచల చంద్రికా

నీవే నా నవయవ్వన నందనవన భ్రమరికా


అందాలరాశి... నీ అందచందాలు చూసి

ఎన్నో గ్రంథాలు రాసి... 

తరించేనులే ప్రేయశి... ప్రేయశి


అందాలరాశి... నీ అందచందాలు చూసి

ఎన్నో గ్రంథాలు రాసి... 

తరించేనులే ప్రేయశి... ప్రేయశి

అందాలరాశి...


పాటల ధనుస్సు  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమొకో ఏమొకో చిగురు టధరమున | Emako Chigurutadharamuna | Song Lyrics | Annamayya (1997)

ఏమొకో ఏమొకో చిగురు టధరమున చిత్రం : అన్నమయ్య (1997) సంగీతం : ఎం ఎం కీరవాణి  రచన : అన్నమాచార్య  గానం : బాలు,  సాకి : గోవిందా నిశ్చలాలందా  మందా...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు