RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

24, జులై 2023, సోమవారం

ఝుమ్మంది నాదం | Jhummandi Naadam | Song Lyrics | Siri Siri Muvva (1978)

ఝుమ్మంది నాదం



చిత్రం :  సిరి సిరి మువ్వ (1978)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  వేటూరి

నేపథ్య గానం :  బాలు, సుశీల    



పల్లవి :



ఝుమ్మంది నాదం...  సయ్యంది పాదం

తనువూగింది ఈ వేళా...  

చెలరేగింది ఒక రాసలీలా

ఝుమ్మంది నాదం...  సయ్యంది పాదం

తనువూగింది ఈ వేళా... 

చెలరేగింది ఒక రాసలీలా 


చరణం 1 :


ఎదలోని సొదలా...  ఎలదేటి రొదలా

కదిలేటి నదిలా.. కలల వరదలా

ఎదలోని సొదలా.. ఎలదేటి రొదలా

కదిలేటి నదిలా.. కలల వరదలా

చలిత లలిత పద కలిత కవిత లెగ 

సరిగమ పలికించగా

స్వర మధురిమ లొలికించగా... 

సిరిసిరి మువ్వలు పులకించగా 

ఝుమ్మంది నాదం...  సయ్యంది పాదం

తనువూగింది ఈ వేళా... 

చెలరేగింది ఒక రాసలీలా


చరణం 2 :


నటరాజ ప్రేయసి... నటనాల ఊర్వశీ

నటియించు నీవని తెలిసీ

నటరాజ ప్రేయసి... నటనాల ఊర్వశీ

నటియించు నీవని తెలిసీ

ఆకాశమై పొంగే ఆవేశం... కైలాశమే వంగే నీ కోసం 

ఝుమ్మంది నాదం...  సయ్యంది పాదం


చరణం 3 :


మెరుపుంది నాలో...  అది నీ మేని విరుపు

ఉరుముంది నాలో... అది నీ మువ్వ పిలుపు


చినుకు చినుకులో చిందు లయలతో... 

కురిసింది తొలకరి జల్లు

విరిసింది అందాల హరివిల్లు... 

ఈ పొంగులే ఏడు రంగులుగా  

ఝుమ్మంది నాదం...  సయ్యంది పాదం

తనువూగింది ఈ వేళా... 

చెలరేగింది ఒక రాసలీలా


పాటల ధనుస్సు  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు